సినిమా ఇండస్ట్రీలో బోలెడన్ని అవార్డులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. అలాంటిదే ఐఫా. తాజాగా అబుదాబిలో ఐఫా అవార్డులు-2024 వేడుక గ్రాండ్‌గా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ స్టార్ సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవి కూడా సతీమణితో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారాన్ని బాలకృష్ణ-వెంకటేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని సమంత సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్)
ఏయే విభాగాల్లో ఎవరికి అవార్డు?
ఉత్తమ సినిమా - జైలర్
ఉత్తమ నటుడు - నాని
ఉత్తమ నటుడు - విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నటి - ఐశ్వర్యరాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ దర్శకుడు - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోని)
ఉత్తమ విలన్ - షైన్ టాక్ చాకో (దసరా)
ఉత్తమ సహాయ నటుడు - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సినిమాటోగ్రాఫీ - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
ఉత్తమ సాహిత్యం - హుకుం (జైలర్)
ఉత్తమ గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ గాయని - శక్తి శ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ - అర్జున్ రాధాకృష్ణన్ (మలయాళం)
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్ (దర్శకుడు)
వుమెన్ ఆఫ్‌ది ఇయర్ - సమంత
గోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణ
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి
(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)
Comments
Please login to add a commentAdd a comment