
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై జరిగిన దాడి విషయమై ఈ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు దీని పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.
(ఇదీ చదవండి: Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ)
ఇంతకీ ఏమైంది?
ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న శ్యామ్ అనే స్టూడెంట్ ఇతడిని ర్యాగింగ్ చేసేవాడు. ఈ గొడవ కాస్త ముదిరి.. బస్సులో వెళ్లేటప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగాడు. ఇందులో భాగంగా ఆవేశానికి లోనైన శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరికేశాడు.
తన కొడుకుపై జరిగిన దాడి గురించి తెలిసిన ఆర్పీ పట్నాయక్.. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదలా ఉండగా ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేశారు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడిగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఆ మధ్య నటుడు, దర్శకుడిగానూ పలు చిత్రాలు తీశారు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment