RP Patnaik
-
కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై జరిగిన దాడి విషయమై ఈ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు దీని పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ)ఇంతకీ ఏమైంది?ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న శ్యామ్ అనే స్టూడెంట్ ఇతడిని ర్యాగింగ్ చేసేవాడు. ఈ గొడవ కాస్త ముదిరి.. బస్సులో వెళ్లేటప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగాడు. ఇందులో భాగంగా ఆవేశానికి లోనైన శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరికేశాడు.తన కొడుకుపై జరిగిన దాడి గురించి తెలిసిన ఆర్పీ పట్నాయక్.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదలా ఉండగా ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేశారు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడిగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఆ మధ్య నటుడు, దర్శకుడిగానూ పలు చిత్రాలు తీశారు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ) -
మంచు లక్ష్మి 'ఆదిపర్వం' పాటలపై సంగీత దర్శకుల ప్రశంసలు
'ఆదిపర్వం' ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) ఐదు భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా పాటల్ని అన్విక ఆడియో ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపోతే దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం: యంగ్ హీరో
ఇటీవలే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈనెల 8న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో విశ్వక్ అఘోరా పాత్రలో కనిపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఓ ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయాన్ని లాంచ్ చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు ధన్యవాదాలు తెలిపారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'ఈ వేడుకలో భాగం కావడం గర్వంగా వుంది. భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంఛ్ చేయడం నా అదృష్టం. కేవలం పాడ్ కాస్ట్‌లా వినొచ్చేమో అనుకున్నా. కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంను చాలా చక్కగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది' అని అన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'ఈ కార్యాన్ని భగవంతుడే నా చేత చేయించాడు. నేను కేవలం నిమిత్తమాత్రుడినే. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమైయ్యేలా ఉంటుంది. వారి అనుమతితోనే రికార్డ్ చేశాను. ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ గారికి ధన్యవాదాలు. జానకీరామ్ అద్భుతమైన విజువల్స్ చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. మొత్తం మన పురాణాలన్నింటిని తన బొమ్మలతో ప్రపంచానికి చెప్పే మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారాయన. నా వంతుగా సపోర్ట్ చేస్తూ లక్ష రూపాయిలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ కోసం మౌళి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. యూత్‌ని దృష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇది. అందుకే అతిథిగా యంగ్ హీరో విశ్వక్‌ను పిలిచాం. దేవుడు కల్పించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు. దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ...'భగవద్గీత ఆర్పీ పట్నాయక్ తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఇది చాలా బాగుంది. చిరకాలం నిలిచిపోయే ప్రాజెక్ట్' అని అన్నారు. ఈ వేడుకలో జేకే భార్గవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆర్పీ పట్నాయక్ ట్రిగ్గర్ షార్ట్ ఫిలిం
-
ఓటు మన బాధ్యత
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ఫ్లిక్ నైన్ స్టూడియోస్‌పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేసి, సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. ‘‘మన దేశంలో కుల, మత, ప్రాంతీయ అభిప్రాయ బేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ‘‘మందుకు, నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా?’, ‘ఓటు అనేది హక్కు కాదు.. మన బాధ్యత’’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. హృతిక్ శౌర్య మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్‌తో పాటు చాలా ముఖ్యమైన కథతో ‘ఓటు’ రూపొందింది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తన్వి నేగి. నటుడు గోపరాజు రమణ మాట్లా్లడారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
అహింస కొత్తగా ఉంటుంది
‘‘అహింస’ కథ చాలా కొత్తగా ఉంటుంది.. కథ కొత్తగా ఉన్నప్పుడు పాట సహజంగానే కొత్తగా వినిపిస్తుంది. ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారుసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. అభిరామ్, గీతికా తివారి జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ– ‘‘అహింస సిద్ధాంతం నమ్మే ఓ అబ్బాయిని పరిస్థితులు ఎలా కృష్ణతత్వంవైపు లాగాయనేది ఈ చిత్రకథ. నా దర్శకత్వంలో ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. ఎన్నికల నేపథ్యంలో ఓ కథ రెడీ చేశాను. నిర్మాతలు దొరికితే ఏడాదికి 4 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా. వెబ్ సిరీస్ కోసం రెండు కథలు రాశాను’’ అన్నారు. -
పేద పిల్లలకు అండగా తెలుగు పీపుల్ ఫౌండేషన్
తెలుగు పీపుల్ ఫౌండేషన్ సంస్థ పిల్లల చదువు కోసం ప్రతి ఏడాది ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సంస్థ చదువును కొనసాగించాలనే అభిరుచి ఉన్న తెలుగు విద్యార్థుల కోసం అండగా నిలబడుతుంది. గత ఏడాది విద్యార్థులకు స్కాలర్ షిప్ రూపంలో రూ. 2 కోట్ల డబ్బును పంచినట్లు తెలుగు పీపుల్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఏడాది తెలుగు పీపుల్ ఫౌండేషన్ 13వ వార్షికోత్సవాన్ని డిసెంబర్ 11న జరపనున్నట్లు తెలిపింది. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రచార కర్తగా ఆర్.పీ పట్నాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేయగలరు తెలుగు పీపుల్ ఫౌండేషన్ పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును పేద పిల్లల చదువు కోసం వియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. -
సైదాబాద్ ఘటనపై స్పందించిన ఆర్పీ, రూ. 50 వేలు రివార్డు ప్రకటన
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టించడంలో పోలీసులకు సహకరిద్దాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఇక మంచు మనోజ్ సోమవారం బాధిత బాలిక కటుంబాన్ని పరామర్శించగా.. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరో నాని నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదంటూ ట్వీట్ చేశారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సైతం సైదాబాద్ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. చదవండి: సైదాబాద్ హత్యాచార ఘటన: బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు ఆర్పీ పోస్టు చేస్తూ.. ‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు. View this post on Instagram A post shared by Rp Patnaik (@rp.patnaik) -
కన్స్ట్రక్షన్ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు. నిన్న సాయంత్రం ఆయన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆర్పీ ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా సాయిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలగా ఆయనపై మోటరు యాక్ట్ కింద నిర్లక్ష్యంగా బైక్ నడిపినందుకు కేసు ఫైల్ చేశారు. దీనిపై ఆర్పీ పట్నాయక్ స్పందిస్తూ... యాక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్స్ట్రక్షన్ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలన్నారు. చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్‌పై కేసు నమోదు ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారని తన అభిప్రాయం అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడం వల్లే బైక్ స్కిడ్ అయ్యి కిందపడిపోయినట్లు మాదాపూర్ ఏసీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా దుర్గం చెరువు వంతెనపై నుంచి ఐకియా వైపు తన స్పోర్ట్స్ బైక్‌పై నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాయి తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్ -
ఈ కథ వినగానే అలా అనిపించింది: పి. సునీల్‌కుమార్ రెడ్డి
రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హనీ ట్రాప్’. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వీవీ వామనరావు నిర్మించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె విడుదల చేశారు. పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వామనరావుగారు ‘హనీ ట్రాప్’ కథ చెప్పగానే సినిమాకి కావాల్సిన వాణిజ్య అంశాలున్నాయనిపించింది. ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు. ఎందరో జీవితాలను దగ్గరగా చూసి, అందులోంచి కథలు రాస్తుంటారు. ఆయన రాసిన నాటకాలకు నంది ఆవార్డులు వచ్చాయి. సీరియల్స్ జనాదరణ పొందాయి. అలాంటి వ్యక్తి అందించిన కథతో సినిమా తీయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ నేను రాసిన స్క్రీన్ ప్లే బాగుందని దర్శకులు ప్రోత్సహించారు. ‘హనీ ట్రాప్’ ప్రివ్యూ చూసినవాళ్లంతా చాలా బాగుందన్నారు’’ అన్నారు వీవీ వామనరావు. రచయిత యెక్కలి రవీంద్ర బాబు, నటుడు శివ కార్తీక్, శ్రీలక్ష్మీ ఫిలింస్ బాపిరాజు పాల్గొన్నారు. -
దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీకోసం తేజ మ్యూజిక్ సిట్టింగ్స్
టాలీవుడ్ ప్రమముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై ‘జెమిని’ కిరణ్ నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్, గేయ రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఆర్.పి.పట్నాయక్-తేజ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. మనసుకు హత్తుకునే సాహిత్యానికి ప్రసిద్ది చెందిన స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. ఈ ముగ్గురి కలయికలో అభిరామ్ ఫస్ట్ మూవీ తప్పకుండా మ్యూజికల్ బొనాంజగా ఉండబోతుంది. -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’
టాలీవుడ్లో యువ నటుడు ఉదయ్ కిరణ్ది ఒక ప్రత్యేకమైన శకం. కెరీర్లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించి.. ‘హ్యాట్రిక్ హీరో’ ట్యాగ్‌ను తన ముందర చేర్చుకున్నాడు. యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రోజుల్లో కెరీర్ డౌన్ ఫాలోతోనే కొనసాగి.. చివరికి ఉదయ్ కిరణ్ జీవితం విషాదంగా ముగిసింది. అయితే ఏ హీరోకైనా కెరీర్లో ఫస్ట్ మూవీ ప్రత్యేకం. అలాగే ఉదయ్‌కు కూడా ‘చిత్రం’ ఉంది. ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... వెబ్‌డెస్క్: ‘చిత్రం.. ది పిక్చర్’ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. కొత్త-పాత ఆర్టిస్టులు, కొత్త టెక్నిషియన్ల కలయికతో రూపుదిద్దుకుంది చిత్రం. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్ అందించిన ఆడియో సాంగ్స్‌తో సగం హిట్ సాధించగా, తేజ యూత్‌ఫుల్ సబ్జెక్ట్ ప్రజంటేషన్‌తో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్‌కు ఈ మూవీ ఒక పాథ్‌ను ఏర్పరిచింది. ఫ్రెండ్ నుంచి.. నిజానికి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్ తేజ. ఈ విషయాన్ని స్వయంగా తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉదయ్ కిరణ్ ముందుగా ఫ్రెండ్స్‌లో ఓ క్యారెక్టర్. హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గడంతో.. ఉదయ్‌ను హీరోగా ముందుకు తెచ్చాడు తేజ. అయితే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో.. ఉదయ్‌ను మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్‌కే సెట్ చేశారు. అయితే షూటింగ్‌కి సరిగ్గా ముందురోజే మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకుని.. తేజ ఉదయ్ కిరణ్‌నే హీరోగా ఫైనలైజ్ చేశాడు తేజ. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్ తడబడడంతో.. పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడట తేజ. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తనకు(తేజ) కావాల్సినట్లుగా యాక్ట్ చేయడం, ‘చిత్రం’ సూపర్ హిట్ కావడం జరిగిపోయానని తేజ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. సబ్జెక్ట్ కొత్తదే, అయినా.. మిడిల్ క్లాస్ కుర్రాడు రమణ(ఉదయ్ కిరణ్), ఫారిన్ రిటర్ని జానకీ(రీమాసేన్).. ఈ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాథే ‘చిత్రం’ థీమ్. టీనేజీ వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ఇందులో చూపించాడు తేజ. పనిలో పనిగా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, అందమైన పాటలు అందించాడు. అయితే కొద్దిపాటి అడల్ట్ థీమ్ ఉండడం, టీనేజీలో గర్భం, పైగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఈ మూవీ రావడంతో క్రిటిక్స్ కొద్దిపాటి విమర్శలు చేశారు. కానీ, యూత్ థియేటర్లకు పోటెత్తడంతో 42 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బంపర్ సక్సెస్ సాధించింది. అప్పటికి ఇరవై ఏళ్ల వయసున్న ఉదయ్ కిరణ్.. ఫ్లస్ టూ స్టూడెంట్ రమణ క్యారెక్టర్‌తో అలరించి చాక్లెట్ బాయ్ ట్యాగ్‌కు తొలి బీజం వేసుకున్నాడు. కన్నడలో 125రోజులు చిత్రం సినిమాను రీమా సేన్‌కు కోలీవుడ్‌లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్ చేశారు. అయితే కోలీవుడ్ వెర్షన్ కోసం మణివణ్ణన్, సెంథిల్, ఛార్లీ, మనోరమా, కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. ఇక 2001లో తెలుగు చిత్రం మూవీ కన్నడలో ‘చిత్ర’ పేరుతో రీమేక్ అయ్యింది. నాగేంద్ర ప్రసాద్, రేఖ వేదవ్యాస(ఆనందం ఫేమ్) లీడ్ రోల్లో నటించిన ఈమూవీ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుని.. థియేటర్లలో 125 రోజులు ఆడింది. చదవండి: ఇరవై ఏళ్ల తర్వాత చిత్రం.. రిపీట్ -
శ్రీవారిని దర్శించుకున్న ఆర్పీ పట్నాయక్
తిరుమల: సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా భక్తులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, సామాజిక దూరం పాటిస్తూ చాలా చక్కటి దర్శనం జరిగిందన్నారు. కరోనా నుంచి ప్రజలందరూ విముక్తి కావాలని దేవ దేవుడ్ని ప్రార్ధించినట్లు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. (శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ) హంస వాహనంపై పరమహంస తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు హంస వాహనాన్ని అధిరోహించి సర్వవిద్యా ప్రదాయని అయిన సరస్వతీదేవి రూపంలో కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టుపీతాంబరాలు ధరించారు. గుణ, అవగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతమైన హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు దర్శనమివ్వడం నయనానందకరం. శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపం నుంచి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా హంస వాహన సేవను నిర్వహించారు. ఉదయం ఐదు శిరస్సుల శేషుడి నీడలో శ్రీకృష్ణుని రూపంలో మలయప్ప స్వామివారు కనువిందు చేశారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని చిన్నశేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. నేటి వాహన సేవల వివరాలు: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరిలో స్వామివారు ఏకాంతంగా ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. -
ఆర్పీ వినూత్న ప్రయోగం `అలిషా`!
సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తన వైవిధ్యమైన సంగీతంతో ఎన్నో సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక దర్శకుడిగా కూడా రెగ్యులర్ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌ను ఎంచుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్పీ తెరకెక్కించిన చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆర్పీ పట్నాయక్. ‘అలిషా’ పేరుతో హర్రర్ థ్రిల్లర్‌గా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా ‘అలిషా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఐఎస్ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డాక్టర్ సోనాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రచనతో, దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం బాధ్యతలు కూడా ఆర్పీనే చూస్తున్నాడు. అనుష్ గోరక్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య సాల్వి, వేదాంత్ సలూజా, రిచా కల్రా, అక్షయ్ బక్చు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతోంది. ‘స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలు డాల్డీ ఎట్మాస్ సౌండ్‌తో రిలీజ్ అయినా.. ఆ సాంకేతికత కోసం తయారు చేసిన కథలు మాత్రం ఇంతవరకు మన దేశంలో రాలేదు. ఆలోటు భర్తి చేస్తూ షూటింగ్ చేస్తున్నప్పుడే డాల్బీ ఎట్మాస్ సౌండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్పీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్‌కు అత్యున్నత ప్రమాణాలు కలిగిన సౌండ్ ఎఫెక్ట్స్ తోడైతే అవుట్‌పుట్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాతో చూపించనున్నారు’అని చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. -
సంతాన నాగదేవత సన్నిధిలో ఆర్పీ పట్నాయక్
సిద్దిపేటజోన్ : ప్రముఖ సంగీత దర్శకుడు, సీని నటుడు ఆర్పీ పట్నాయక్ కోటిపడగల సంతాన నాగదేవత ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. సిద్దిపేట పట్టణ శివారులో జరిగిన ఓ వివాహ వేడుకకు తన సోదరుడు గౌతమ్ పట్నాయక్‌తో హజరయ్యాడు. ఈ సందర్భంగా నాగదేవత దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక నాగపూజ చేశారు. అనంతరం అక్కడే ఉన్న పంచముఖాంజనేయస్వామి, నవగ్రహ దేవాలయాలను సందర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ శక్తిస్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్న కోటిపడగల సంతాన నాగదేవత ఆలయ దర్శనం ఆధ్యాత్మికతతో కూడిన ఆనందాన్ని కలిగిందన్నారు. సంతాన నాగదేవత దేవాలయ విశిష్టతను తెలుసుకోని దర్శించుకోవాలని వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు దశరథం స్వామి , పూజారి శ్రీహరీలు వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ సిద్దిపేటకు వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి చెరుకోని సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. -
మంచి చెడుల మేళవింపే సినిమా
‘ఒక ప్రాంతంలో పుట్టి పెరిగిన పిల్లలపై ఆ పరిసర ప్రాంతాల ప్రభావం ఉంటుంది.. చలన చిత్రాల ప్రదర్శన ద్వారా వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం తెలుసుకునే అవకాశం ఉంటుంది.. జీవితాన్ని చిత్రీకరించి చూపగలిగేది సినిమా ఒక్కటే’ అని సినీ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అన్నారు. నగరంలోని భవాని థియేటర్లో రూరల్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన బాలల చలన చిత్రోత్సవాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ రూరల్: మంచి చెడులను మేళవించి చెప్పేదే సినిమా అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు ఆర్.పి.పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని బుధవారం వరంగల్ నగరం కాజీపేటలోని భవానీ థియేటర్లో రూరల్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వర్ధమాన నటి హిమాన్షి చౌదరి కలిసి ప్రారంభించి మాట్లాడారు. బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు తొలుత మంబాయిలో నిర్వహించారని, ఆ తర్వాత దేశంలోని ప్రముఖ పట్టణాలకు విస్తరించాయని, 1993 నుంచి హైదరాబాద్ శాశ్వత వేదికైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఈ వేడుకలు నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని, దీని వల్ల జిల్లాలోని పిల్లలు సినిమాలు చూసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో పుట్టి పెరిగిన పిల్లలపై ఆ పరిసర ప్రాంతాల ప్రభావం ఉంటుందని, చలన చిత్రాల ప్రదర్శన ద్వారా వివిధ దేశాల సంస్కృతి, జీవన విధానం పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. జీవితాన్ని చిత్రీకరించి చూపగలిగేది సినిమా ఒక్కటేనని, ప్రాంతాలు, భాషలకు అతీతంగా మంచిని పంచేదే సినిమా అని వివరించారు. సినిమాపై ఒక దురాభిప్రాయం కూడా ఉందని, చెడు చూసి అంతా చెడిపోతున్నారనే అపోహను తోసిపుచ్చారు. చెడుపై మంచి ఎలా గెలుస్తుందో చెప్చేదే సినిమా అని, మంచినే స్వీకరించాలని సూచించారు. డీఆర్వో భూక్యా హరిసింగ్ మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో 21 సినిమాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. డీఈఓ కె.నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు చెందిన 14వేల మంది విద్యార్థులకు వారం రోజుల పాటు సినిమాలు చూపిస్తామని, రోజుకు 1800 నుంచి 2వేల మందికి అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఆర్వో కిరణ్మయి, ఖాదీ విలేజ్ బోర్డు రీజినల్ మేనేజర్ సంతోష్ గీసుగొండ ఎంఈఓ.సృజన్ తేజ, భవానీ థియేటర్ యజమాని తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నఆర్.పి.పట్నాయక్ -
బాలీవుడ్‌పై దృష్టి: సంగీత దర్శకుడు
మహానంది(కర్నూలు): తెలుగు సినిమా రంగంపై కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధానిలు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 60 తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించానని, ఏడాది వరకు ఖాళీ లేదన్నారు. తెలుగులో నటించిన శీను..వాసంతి..లక్ష్మి, బ్రోకర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించిందన్నారు. అలాగే మనలో ఒకడు చిత్రంలో వేసిన పాత్రకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి మృతి చిత్రరంగానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏదో శక్తి నడిపించింది!
‘‘నా దృష్టిలో దేవుడికి మతం లేదు. దేవుణ్ణి అనుసరించే వాళ్లకు మతం ఉంటుంది. నేను హిందువు అయినా క్రీస్తుపై తీస్తున్న ఈ చిత్రానికి పాటలు స్వరపరిచే క్రమంలో ఏదో శక్తి నన్ను వెనకుండి నడిపించింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత భూమ్మీద 40 రోజులు తిరిగిన ఏసుక్రీస్తు ఏం చేశారనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘తొలి కిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ స్వరకర్త. ఇటీవల ఆడియో విడుదలైంది. ఆయన మాట్లాడుతూ – ‘‘జాన్‌బాబు, సుధాకర్‌లు క్రీస్తు మీద చిత్రమనగానే ఎక్కువ కాలం నిలబడే పాటలు చేయాలనుకున్నా. బైబిల్ పదాలతో కాకుండా వాడుక భాషలోని పదాలతో పాటలు రాయించాను. మారుమూల ప్రాంతాల నుంచి ఓ వంద ఫోనులొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి చర్చి నుంచి ‘తొలి కిరణం’ ఆడియో సీడీలు కావాలని ఫోనులొస్తున్నాయి. ముఖ్యంగా ఎస్పీబీగారు పాడిన శిలువ పాట, నేనూ, సునీత పాడిన ‘శాంతికి దూతగా..’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. నా దర్శకత్వంలో ప్రియమణి ముఖ్యతారగా కన్నడ, తెలుగు సినిమా ‘వ్యూహం’ను ఏప్రిల్ 14న విడుదల చేస్తాం. ప్రస్తుతం రెండు కథలు సిద్ధం చేశాను. వాటిలో నేను నటించను. హీరోలకు వినిపిస్తున్నా. ఓకే అయిన తర్వాత చెబుతా’’ అన్నారు. -
వివాదానికి జవాబిస్తారా?
మ్యూజిక్ డెరైక్టర్, యాక్టర్, ‘మనలో ఒకడు’ ఆర్పీ పట్నాయక్ ఈ వారం ‘బూమ్‌బూమ్’ షోలో కనిపించనున్నారు. కాంట్రవర్సీకి భయపడని ఆర్పీ ‘బూమ్‌బూమ్’లో యాంకర్ అనసూయ రేపిన కాంట్రవర్సీకి జవాబు ఇస్తారా? మాటలు కట్ చేస్తారా? అది ఆదివారం రాత్రి 9.30 గం.కు జెమిని టీవీలో చూడవచ్చని ‘జెమినీ’ ప్రతినిధి పేర్కొన్నారు. -
మీడియాతో ఢీ
‘‘సమాజంలో ఎవరైనా మా ముందు తలదించాల్సిందేననే ఓ మీడియా అధినేతతో మనలో ఒకడు, ఓ సామన్య అధ్యాపకుడు ఢీ అంటే ఢీ అంటూ తలపడితే.. ఏం జరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మనలో ఒకడు’. జగన్మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘కృష్ణమూర్తిగా ఆర్పీ, మీడియా అధినేతగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది’’ అని నిర్మాత అన్నారు. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాల సుబ్రమణ్యం. -
జేసీ బ్రదర్స్ తో ఆర్పీ
– జేసీ సోదరులకు కలిసిన సినీహీరో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తాడిపత్రి టౌన్ : ఊరు చాలా బాగుందీ.. గాయిత్రీ ఆలయంలో దసరా ఉత్సవాలు బాగా జరుపుతున్నారు.. వచ్చే ఏడాది నా ఆధ్వర్యంలో తాడిపత్రి గాయిత్రీ ఆలయంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తానని సినీహీరో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణం సంజీవనగర్‌లోని గాయిత్రీ ఆలయంలో జరుగుతున్న శరన్నరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గాయిత్రీమాతన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణంలో సాంస్కతిక కార్యక్రమాలను వారు తిలకించారు. అంతకు ముందు జేసీ ఇంటిలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలను ఆర్పీ పట్నాయక్ కలిశారు. తాడిపత్రి ఊరు చాలా బాగుంది. స్వచ్ఛభారత్‌లో దేశ స్థాయిలో రెండవ అవార్డు రావడం పత్రికల్లో చూశామని ఆర్పీ జేసీ సోదరులతో అన్నారు. నేను హీరోగా ‘మనలో ఒకడు ’ చిత్రం ఈనెల 28వ తేదీ విడుదల కానున్నదని, ఈ సినిమా అంతా జర్నలిస్టులకు సంబంధించిన సినిమా అని ఆర్పీ తెలిపారు. ఆయన వెంట సినీ రచయిత బాలజీ, టీడీపీ నాయకులు ఎస్పీ రవీంద్రారెడ్డి ఉన్నారు. -
ఆయన దర్శకత్వంలో నటించాలనుంది
‘లజ్జ’ చిత్రం హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రంలో దర్శకుడు నరసింహ నంది నాకు మంచి పాత్ర ఇచ్చారు’’ అని యువహీరో వరుణ్ అన్నారు. ప్రస్తుతం నరసింహ నంది దర్శకత్వంలోనే ‘బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్’తో పాటు మరో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను పాత్రికేయుల సమావేశంలో వరుణ్ చెబుతూ - ‘‘వాస్తవానికి నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి, ఆర్పీ పట్నాయక్‌గారు ‘మనలో ఒక్కడు’లో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈలోపు ‘లజ్జ’ విడుదల కావడం, మంచి గుర్తింపు రావడం జరిగింది. ‘బుడ్డారెడ్డిపల్లె బ్రేకింగ్ న్యూస్’లో నాది చాలా మంచి పాత్ర. ఇంకో చిత్రంలో కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నా. ఎప్పటికైనా త్రివిక్రమ్‌గారి దర్శకత్వంలో చేయాలన్నది నా కోరిక’’ అన్నారు. -
వంశీ గారు పాటలు చేయడమే మా అదృష్టం!
ఆ కుర్రాడు ముగ్గురు అమ్మాయిలను ప్రాణంగా ప్రేమించాడు. మరి చివరకు ఎవరిని దక్కించుకున్నాడనే కథాంశంతో లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘ఈ సినిమా సూపర్‌హిట్ గురూ’. హెచ్.హెచ్.మహదేవ్, సిరిశ్రీ, పునర్ణవి భూపాలం, ఐశ్వర్య నాయకా నాయికలుగా చెందు ముద్దు దర్శకత్వంలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై పి.ఎస్.సూర్యతేజారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వంశీతో పాటు మారుతీరాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ- ‘‘ఇలాంటి టైటిల్ పెట్టాలంటే గట్స్ ఉండాలి. టైటిల్ లానే సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘వైజాగ్ సత్యానంద్ కారణంగానే ఈ సినిమా అవకాశం వచ్చింది. సీనియర్ దర్శకులు వంశీగారు ఇందులో రెండు పాటల్ని స్వరపరచడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘చెందు నన్ను సినిమా చూడమంటే, చూశా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఆసక్తికరంగా తీశారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో దర్శకులు క్రాంతిమాధవ్, చంద్రమహేశ్, కాశీవిశ్వనాథ్, దేవీప్రసాద్, నటి హేమ పాల్గొన్నారు. -
రాహ్‌గిరి జోరు.. యువత హుషారు..
-
ఏసు ప్రేమ
నేటి సమాజంలో నెలకొంటున్న సమస్యలకు ఏసు ప్రేమే పరిష్కారం అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘సంగమం’. రాజ్ ప్రధాన పాత్రలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె. జాన్‌బాబు దర్శకత్వంలో టి. సుధాకర్ నిర్మిస్తున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రస్తుతం జీసస్ పాత్ర కోసం నటుణ్ణి ఎంపిక చేస్తున్నాం. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే చిత్రం ఇది. సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలోనే జరుగుతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి. పట్నాయక్, కథ-మాటలు: టి. ప్రభుకిరణ్, కథా సహకారం: వి.ఎమ్.ఎమ్. ప్రవీణ్. -
కచేరి - ఆర్పీ పట్నాయక్
-
మళ్లి కూయవా గువ్వా!
► జగమంత కుటుంబం తనది! చక్రిదీ, నాదీ చిరకాల స్నేహం. సినిమాల్లోకి రావడాని కన్నా ముందే మా ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రాంతంలో ఒక రికార్డింగ్ స్టూడియో ఉండేది. అక్కడ మా ఇద్దరికీ తొలి పరిచయమైంది. అతను గీత రచయితగా ఉన్నప్పుడు పాటలు రాసేవాడు. మా ఇద్దరి సినిమా కెరీర్లు కూడా దాదాపు ఒకటే సమయంలో మొదలయ్యాయి. పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా చక్రికి తొలి అవకాశం వచ్చిన రోజు కూడా నాకు బాగా గుర్తే. ముందుగా నాకు ‘చిత్రం’ (2000) సినిమాతో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలైనప్పుడు దిల్సుఖ్ నగర్‌లోని గంగా థియేటర్లో మేమందరం వెళ్ళి, ‘చిత్రం’ షో చూస్తున్నాం. ఇంతలో, చక్రికి ఫోన్ వచ్చింది. పూరి జగన్నాథ్ ‘బాచి’ (2000) సినిమాకు ఛాన్స్ వచ్చింది. అంతే! ‘జగనన్న నుంచి ఫోన్ వచ్చింది. నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. వెళ్ళి కలవాలి’ అంటూ సినిమా సగంలోనే వెళ్ళాడు. అలా అతని సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. తెలుగు సినీ సంగీతంలో మా ఇద్దరి కెరీర్లూ సమాంతరంగా సాగాయి. పోటాపోటీగా సినిమాలు చేశాం. అయితే, ఒకరి అవకాశాలను మరొకరు చేజిక్కించుకోవడం లాంటి అవాంఛనీయ ధోరణి ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు మంచి సంగీతంతో, మంచి పాటలతో ఆకట్టుకోవాలని ప్రయత్నించేవాళ్ళం. పైగా, మా ఇద్దరికీ వ్యక్తిగతంగా, భావోద్వేగపరంగా చాలా మంచి అనుబంధం ఉండేది. నన్ను అన్నయ్యగా భావిస్తే, తను నాకు తమ్ముడనుకొనేవాణ్ణి. పైగా, 2000 ప్రాంతంలో మా ఇద్దరి లక్ష్యం ఒకటే - సినీ సంగీత పరిశ్రమను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడేలా చేయాలని! అందుకోసం వీలైనంత కృషి చేశాం. ఇక్కడ వీలైనంత ఎక్కువమంది గాయనీ గాయకులనూ, సంగీత కళాకారులనూ పరిచయం చేశాం. స్థానికులకు అవకాశాలిచ్చాం. పైగా, రవివర్మ, కౌసల్య, ఉష లాంటి చాలా మంది యువ గాయనీ గాయకులు మా ఇద్దరి సంగీతంలో రెగ్యులర్‌గా పాటలు పాడేవారు. సంగీతం అందించాలంటూ తన దగ్గరకు వచ్చినవాళ్ళను అతను ఎప్పుడూ నొప్పించేవాడు కాదు. ‘నాకు పని వచ్చింది. అది బాగా చేయాలి’ అన్నదే అతని దృష్టి అంతా! అందుకే, సినిమాలతో నిత్యం బిజీగా ఉండేవాడు. అచిరకాలంలోనే 90 పైచిలుకు సినిమాలు పూర్తి చేయగలిగాడు. సంగీతపరంగా చక్రి బాణీల్లో అరబిక్ సంగీత స్పర్శ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ ప్రభావం ఉండేది. అందుకనే, అతను అంత మాస్ బాణీలు, బీట్ పాటలు ఇచ్చేవాడు. అదే సమయంలో చక్కటి శ్రావ్యమైన పాటలూ కూర్చాడు. ‘ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’ చిత్రంలో అతను కూర్చిన మెలొడీ పాటలు ఆల్‌టైమ్ హిట్. కెరీర్లో జోరు కాస్తంత తగ్గినప్పుడల్లా మళ్ళీ ఒక సూపర్‌హిట్ సినిమా ఆల్బమ్‌తో ముందుకు దూసుకొచ్చేవాడు. చక్రి చాలా బోళామనిషి. గోరంత పొగిడినా, కొండంత సంతోషించే మనిషి. ఎప్పుడూ ఎవరి గురించీ చెడు మాట్లాడేవాడు కాదు. చక్రిలో అది నాకు బాగా నచ్చేది. చక్రి ఎన్నో పాటలు కూర్చినా, ఈ క్షణంలో చక్రి పాట అంటే నాకు గుర్తొస్తున్నది మాత్రం - ‘చక్రం’ చిత్రంలోని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది!’ దానికి కారణం లేకపోలేదు. చక్రికి ఎప్పుడూ చుట్టూరా జనం ఉండాలి... ఎంతమంది వచ్చినా, అందరికీ భోజనం పెట్టాలి. అదీ అతని స్నేహశీలత. ఇవాళ అంతమంది స్నేహితుల్ని సంపాదించుకొని, అందరినీ వదిలేసి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. చక్రి సినీ, వ్యక్తిగత జీవితం నుంచి అందరం నేర్చుకోవాల్సింది కూడా ఒకటుంది. ఎంత పని ఉన్నా... చేయండి. కానీ, దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. వేళకు తిండి తినండి. వేళాపాళా లేకుండా తినడం, అర్ధరాత్రి దాకా పనిచేసి, తెల్లవారు జామున ఎప్పుడో నాలుగింటికి తినడం లాంటి పనులు చేయకండి. ఆ జాగ్రత్తలు పాటించి ఉంటే, నలభై ఏళ్ళూ నిండీ నిండకుండానే చక్రి మనకు దూరమయ్యేవాడు కాదు. చక్రి మా ఇంట్లో సభ్యుడి లాంటివాడు. ఆ సభ్యుడు ఇవాళ లేడు. అది తీరని బాధ! - ఆర్.పి. పట్నాయక్ (సినీ సంగీత దర్శకుడు, చక్రికి చిరకాల స్నేహితుడు) -
ప్రియమణి, ఆర్పిల అదృష్టపరీక్ష!
టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్‌లో తనమార్క్ చూపించిన తర్వాత నటుడిగా మారారు. వెండితెరపై తన అభిరుచి చూపేందుకు డైరెక్టర్‌గా కూడా మారాడు. కొన్ని సంవత్సరాల క్రితం యూత్‌ని ఎవరిని కదిపినా తమ అభిమాన సంగీత దర్శకుడు ఆర్పి అని చెప్పేవారు. ఆ తరువాత ఆర్పి పట్నాయక్ దర్శకుడిగా, నటుడిగా రాణించడానికి చాలా ప్రయత్నించాడు. మల్టీపుల్ టాలెంటెడ్ ఆర్పి నటించిన బ్రోకర్ లాంటి సినిమాలు విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు తెచ్చి పెట్టాయి కాని కాసులు కురిపించ లేదు. దాంతో విసిగి పోయిన ఆర్పి తన అదృష్టాన్ని శాండిల్‌వుడ్‌లో పరీక్షించుకోవడానికి సిద్ద పడుతున్నాడు. కన్నడంలో ఆర్పీ 30 సినిమాలకు స్వరాలందించారు. కన్నడ ప్రేక్షకులకు నచ్చే రీతిలో కథను రూపొందించారు. 'వ్యూహ' పేరుతో నిర్మించే ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నారు. నటిస్తున్నారు. ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌లోను, అటు కోలీవుడ్లోను అవకాశాలు లేని హీరోయిన్ ప్రియమణిని 'వ్యూహ'లో పోలీసు ఆఫీసర్‌గా చూపించబోతున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నా ఆ భామకు అదృష్టం కలిసిరాలేదు. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును అందుకున్నా ఆర్పీకి పెద్దగా అవకాశాలు లేవు. అటువంటి ఈ ఇద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కన్నడంలో చేస్తున్నఈ ప్రయోగం విజయవంతం అయితే, ఈ ఇద్దరికీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. ** -
చీకటికి చురక
మెరిసే తారల రూపం.. కురిసే వెన్నెల దీపం.. ఆ కళ్లకు శూన్యం. చిరుదివ్వెల్లా వెలగాల్సిన ఆ కనులకు తిమిరంతో సమరం తప్ప మరొకటి తెలియుదు. ఊహల్లోనూ చీకటితో సావాసం చేసే సాహసగాళ్లు వాళ్లు. ఉదయించు భాను బింబాన్ని చూడలేకున్నా.. ఆ లేత కిరణాలు వారి హృదయూలను తాకుతాయి. పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంతను చూడలేకపోయినా.. అందాలు అలుముకున్న అవని సొగసులకు ఆ మనసులు స్పందిస్తాయి. అంతేనా చుట్టుపక్కల చూడలేని ఈ చిన్నవాళ్లు.. సవూజంలో కొట్టే కుళ్లు కంపు పసిగడతారు. ఆ కుళ్లును కడిగేసే శక్తి వూకుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. చీకటి ముసురుకున్న ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. వారి మనోనేత్రం మాత్రం బంగారు కలలు కంటున్నాయి. అంధకారం అలుముకున్న సమాజంలో జ్ఞానజ్యోతులు వెలిగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాయి. దేవుడిచ్చిన చీకట్లలో మగ్గిపోకుండా.. ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటున్న చీకటి దివ్వెలను స్టార్ రిపోర్టర్‌గా సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పలకరించారు. వారి మనసులోని భావాలను మన ముందుంచారు.. ఆర్పీ పట్నాయక్: హలో.. హాయ్ ఐయామ్ ఆర్పీ పట్నాయక్ చిన్నారులు: హాయ్...సార్! థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆర్పీ: నేను వచ్చింది మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి మాత్రమే కాదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. అవినాష్: వావ్.. థ్యాంక్యు వెరీ మచ్ సార్ ఆర్పీ: ఒకే.. మీకు స్కూల్లో ఏం నచ్చుతుంది? చేతన: ఎడ్యుకేషన్ మల్లికార్జున్: కంప్యూటర్ ల్యాబ్ జయ: ఫ్రీడమ్.. ముఖ్యంగా మాకేసి జాలిగా చూడకుండా మామూలు పిల్లల్ని చూసినట్టే చూస్తారు. ఆర్పీ: మీరు మామూలు పిల్లలు కాదని ఎవరన్నారు? సరస్వతి: ఎవరూ అనరు సార్. ఇంటికెవరైనా బంధువులొస్తే ముందు మా గురించే అడుగుతారు? మమ్మల్నే పలకరిస్తారు. వాళ్లున్నంత సేపు టాపిక్ మేమే. గాయత్రి: మా గురించి జాలిగా మాట్లాడుకోవడం.. లేదంటే తక్కువగా చూడ్డం వంటి సందర్భాల్లో చాలా బాధేస్తుంది. ఆర్పీ: అంటే వారి ఉద్దేశం.. కళ్లున్నవారే జీవితంలో ఎదగడం, సెటిలవ్వడం కష్టమనుకునే రోజులు కదా. అంధులంటే మరింత ఇబ్బందిగా ఉంటుందని! శివారెడ్డి : అలాగనుకుంటే కళ్లు లేనివారి గురించి కాదు జాలి పడాల్సింది. ఆసరా లేనివారి గురించి. నిరుపేద పిల్లల గురించి ఆలోచించమనండి. చేతనైతే వారికి సాయం చేయమని చెప్పండి. విష్ణు: సార్ పట్టుదల, ఆత్మవిశ్వాసం లేనివారి గురించి కూడా జాలి చూమమని చెప్పండి. ఆర్పీ: మీరు చెప్పింది నిజం. సరే.. ఆ టాపిక్ వదిలేయండి. మీరన్నట్టు లక్ష్యం, పట్టుదల ఉన్నవాడికి అవయవలోపం చాలా చిన్న విషయం. నెక్ట్స్.. మీ చదువంతా బ్రెయిలీ లిపితోనేనా? చేతన: దాంతోపాటు మాకు ‘స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్’ ఉంది. దాన్నే ఎక్కువగా వాడతాం. ఆర్పీ: ఓహ్.. కంప్యూటర్ని ఎక్కువగా ఉపయోగిస్తారా? గాయత్రి: అవును సార్! మేం టైప్ చేస్తుంటే అది స్పెల్లింగ్ పలుకుతుంది. తరగతి గదిలో సౌండ్రీడింగ్ బుక్స్ ఉంటాయి. ఉమాశంకర్: వియ్ హ్యావ్ ఐపాడ్స్. అందులో ప్రతి బుక్ నాలుగైదు వాల్యూమ్స్‌లో ఉంటుంది. ఆర్పీ: ఇంతకీ మీరు ఎందుకు చదువుకుంటున్నారు? అవినాష్: అదేం ప్రశ్న సార్.. ఓకే! సమాధానం చెప్పాలి కదా.. ఓ మంచి పౌరుడిగా తయారవ్వాలని. గాయత్రి: జ్ఞానం సంపాదించడానికి కళ్లు అవసరం లేదు సార్. కానీ నలుగురిలో గొప్పగా బతకాలంటే తప్పనిసరిగా చదువు కావాలి కదా సార్. ఇక మా అందరికీ మా సీనియర్సే ఆదర్శం. వారు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు. ముఖ్యంగా చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్న రాజశేఖరన్నయ్యలాంటివారన్నమాట. ఆర్పీ: వెరీ గుడ్.. ఇక మీ హాబీస్ ఏంటి? ఉమాశంకర్: పాటలు వింటాం సార్. నేనొక్కడ్నే కాదు, మా అందరికీ పాటలు వినడం అంటే చాలా ఇష్టం. ఆర్పీ: ఎలాంటి పాటల్ని ఇష్టపడతారు? చేతన: మెలొడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. గాయిత్రి: ఎమోషనల్ సాంగ్స్.. ముఖ్యంగా రిలేషన్షిప్స్ని తెలిపే లిరిక్స్‌ని ఎక్కువగా ఇష్టడతాం. ఆర్పీ: ఓ.. మీకు సినిమా నాలెడ్జ్ చాలా ఉంది. నచ్చిన సినిమా ఏంటి? శివారెడ్డి: ప్రేమించు.. సినిమా సార్. చాలా సినిమాలు చూశాం. కానీ ఆ సినిమా మాటలు వింటుంటే.. అంధురాలిగా ఓ యువతి సాధించిన విజయం మా గుండెల్లో బోలెడంత బలాన్ని నింపింది. జయ: మీరు ‘శీను వాసంతి లక్ష్మి’ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ వేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సార్. అలా అంధుడిగా నటించినపుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆర్పీ: మీ లైఫ్‌ని చాలా దగ్గరగా చూశాను. కళ్లు కనిపించకుండా అర నిమిషం కూడా ఉండలేని మామూలువారికి మీరు నిత్యం ఆదర్శవంతులే అనిపించింది. శివారెడ్డి: ఆ సినిమాలోని వానా...వానా పాట మీ నోట వినాలనుంది సార్. ఆర్పీ(పాట పాడాక): బావుందా? చేతన: చాలా బాగుంది సార్. థాంక్యూ సో మచ్. ఆర్పీ: ఇంకా ఏమంటే మీకిష్టం. నవనీత: నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మల్లికార్జున్: అవును సార్. నాక్కూడా.. టూవీలర్‌పై షికారు కొట్టడం అంటే చాలా ఇష్టం. ఆర్పీ: అవునా.. మరి యాక్సిడెంట్స్ అయిపోతాయి కదా! మల్లికార్జున్: కళ్లున్నవారు మాత్రం వాటిని ఉపయోగిస్తున్నారా సార్. మొన్నీమధ్య మెదక్ జిల్లా వూసారుుపేటలో యాక్సిడెంట్ జరిగిన స్కూల్ బస్ డ్రైవర్‌కి కళ్లు ఉన్నట్టా! లేనట్టా! ఉమాశంకర్: యస్.. అతను సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేశారని పిల్లలు చెప్పారు. ఎంత అన్యాయం సార్. చాలామంది సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఆ క్షణాన అంధులతో సమానమే కదా సార్. అవినాష్: అంధులకు డ్రైవింగ్ నేర్పడానికి విదేశాల్లో ప్రత్యేక శిక్షణ సంస్థలున్నాయి. వాటిలో ట్రైనింగ్ తీసుకుంటే మేం కూడా ధైర్యంగా బండి ఎక్కొచ్చు. ఆర్పీ: తప్పకుండా.. కొన్ని రకాల టెక్నాలజీలు కళ్లున్నవారిని అంధుల్ని చేస్తుంటే, మరికొన్ని మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంతకూ మీ ఇంట్లోవారు మిమ్మల్నెలా ట్రీట్ చేస్తారు? శివారెడ్డి: మా పేరెంట్స్ మాకు ఏ విషయంలోనూ తక్కువ చేయరు. దానికితోడు మా దేవ్నార్ స్కూల్ టీచర్ల గెడైన్స్ సాయంతో మమ్మల్ని అన్నిరంగాల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. సుశాంత్: అవును సార్. మేం ఆటలు, పాటలతో పాటు అప్పుడప్పుడు నాటికలు వేస్తుంటాం. నాటకాలప్పుడు మా శివారెడ్డి పెద్ద పెద్ద డైలాగ్స్‌తో అదరగొట్టేస్తాడు. ఆర్పీ: ఓకే లాస్ట్ క్వశ్చన్. మీ గోల్స్ ఏంటి? ఉమాశంకర్: ఐఏఎస్ అవ్వాలని ఉంది మల్లికార్జున్: నాక్కూడా.... ఆర్పీ: ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? చేతన: సమాజం చాలా మారాలి సార్. వారికి అవసరమైతే అయ్యో.. అంధులంటూ జాలి చూపిస్తుంది. లేదంటే గుడ్డివాడికి కూడా.. అంటూ చిన్న చూపు చూస్తుంది. వేదికలెక్కి మా గురించి గొప్పగా మాట్లాడతారు. వీధుల్లోకి వస్తే రోడ్డు దాటించడానికి కూడా సాయపడరు. ఆర్పీ: నా మాట కూడా అదేనమ్మా! అంధులపై జాలి చూపనక్కర్లేదు. మిమ్మల్ని అలా వదిలేస్తే చాలు.. అద్భుతాలు చేసి చూపెట్టగలరు. చాలా విషయాల్లో మా ‘కళ్లు’ తెరిపించగలరు. విష్ యు ఆల్ ది బెస్ట్! ఆర్పీ: మంచి పొజిషన్‌కు చేరాక ఏం చేస్తారు? ఉమాశంకర్: అంధుల పట్ల, అనాథల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నవారి కళ్లు తెరిపిస్తాం. ఆర్పీ: ఓ.. మీరు చెప్పేది కాకినాడలో జరిగిన సంఘటన గురించా.కొట్టినవారు కూడా అంధులే కదా మల్లికార్జున్: అందుకే మాకు కోపం వచ్చింది సార్. కళ్లున్నవాడు కొడితే.. అంధుడి బాధ వాడికేం తెలుస్తుందని క్షమించేస్తాం. అంధులు పడే బాధ తెలిసి కూడా పశువుల్లా ప్రవర్తించారు కదా సార్. ప్రెజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: సృజన్ -
చూపున్న పాట
-
ఐదు సినిమాలతో బిజీ
అటు దర్శకునిగా, ఇటు సంగీత దర్శకునిగా ఫుల్ బిజీగా ఉన్నారు ఆర్పీ పట్నాయక్. ప్రస్తుతం ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. అందులో దర్శకునిగా 4 ప్రాజెక్టులు కాగా, సంగీత దర్శకునిగా ఒక సినిమా చేస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో డెరైక్ట్ చేసిన ‘తులసీదళం’ ఎన్నికల తర్వాత విడుదల కానుంది. కన్నడంలో ప్రియమణితో చేస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. అంతా కొత్తవారితో తెలుగులో తీస్తున్న ‘సరదా’ సినిమా రెండో షెడ్యూలు త్వరలోనే మొదలు కానుంది. అలాగే ఆర్పీ ఎప్పటినుంచో తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న మ్యూజికల్ ఫిల్మ్‌కి శ్రీకారం చుట్టారు. ఇందులో 8 పాటలుంటాయి. ప్రస్తుతం సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఆర్పీ స్వరాలందించిన ‘ప్రభంజనం’ త్వరలోనే విడుదల కానుంది. నేడు ఆర్పీ పుట్టినరోజు. ఈ ఏడాది ఇంకా బిజీ అవుతానని నమ్మకంగా చెప్పారాయన. -
ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో...
‘పరుత్తి వీరన్’ అనే తమిళ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం గెలుచుకున్న ఘనత ప్రియమణిది. అయితే ఆ తర్వాత ఆమెను ఎందుకనో అన్నీ గ్లామర్ పాత్రలే వరించాయి. అడపాతడపా నాయికా ప్రాధాన్య సినిమాలు చేసినా ప్రియమణికి కలిసి రాలేదు. ఆ అసంతృప్తిలో ఉన్న ప్రియమణికి ఆర్పీ పట్నాయక్ చెప్పిన కథ విపరీతంగా నచ్చేసింది. తన కెరీర్‌కి కచ్చితంగా ఊతమిచ్చే సినిమా కావడంతో వెంటనే కాల్షీట్లు ఇచ్చేశారు. ఈ సినిమా కన్నడంలో రూపొందుతోంది. తెలుగులో ‘బ్రోకర్’, ‘ఫ్రెండ్స్ బుక్’, ‘తులసీదళం’ లాంటి సినిమాలు డెరైక్ట్ చేసిన ఆర్పీకి ఇదే తొలి కన్నడ చిత్రం. కన్నడంలో 30 సినిమాలకు స్వరాలందించిన ఆర్పీకి అక్కడ బాగా పాపులార్టీ ఉంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియమణి పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ జరుగుతోంది. ఈ బుధవారం నుంచి ప్రియమణి షూటింగ్‌లోకి ఎంటర్ కాబోతున్నారు. మార్చికల్లా షూటింగ్ పూర్తి కానుంది. ఇందులో ముగ్గురు హీరోలు నటిస్తున్నారు. ఎన్.శేషగిరిరావు సమర్పణలో వినోద్, శరవణ నిర్మిస్తున్న ఈ చిత్రం తామిద్దరికీ బ్రేక్ ఇస్తుందని ప్రియమణి, ఆర్పీ ఆకాంక్షిస్తున్నారు. -
'ఉదయ్ చాలా పెద్ద తప్పు చేశాడని పిస్తోంది'
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ చనిపోయాడంటే నమ్మడం చాల కష్టంగా ఉందని సంగీ దర్శకుడు, నటుడు, దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. పెళ్లి తర్వాత ఆయన జీవితం ఎలా ఉందనేది తనకు తెలియదన్నారు. ఆయనకు చాలా మంది అభిమానులున్నారని తెలిపారు. అభిమానులు తనకు ఫోన్ చేసి ఉదయ్ కిరణ్ గురించి అడుగుతుంటారని చెప్పారు. ఆత్మహత్య చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాడని పిస్తోందని అభిప్రాయపడ్డారు. తనకున్న అభిమానులకు అన్యాయం చేశాడని ఆర్మీ పట్నాయక్ అన్నారు. ఒక్క క్షణం ఆలోంచివుంటే ఉదయ్ కిరణ్ బతికివుంచేవాడని నటుడు దువ్వాసి మోహన్ పేర్కొన్నారు. -
ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ
‘‘అమెరికాలో ‘అమీష్ కమ్యూనిటీ’ అని ఒకటుంది. వాళ్లు... మనుషులు కనిపెట్టిన కరెంట్, వాహనాల్లాంటివి వాడరు. ప్రకృతి సిద్ధమైనవాటినే వినియోగిస్తారు. ఈ తెగ నేపథ్యంలో చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తెలుగులో తన ప్రతిభ చాటుకున్న ఆర్పీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమీ. ఈ చిత్రం ద్వారా ఆయన హాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. టీపీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రసాద్ కూనిశెట్టి, రమేష్ నూతి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ‘వీఓడి’ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా విడుదల చేయనున్నారు. అంటే... థియేటర్లలో కాకుండా ఇంటర్నెట్ ద్వారా విడుదల చేస్తారు. అదే రోజున ఈ చిత్రం డీవీడీ కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఆర్పీ చెబుతూ -‘‘ఇది ఇండియన్ ఇంగ్లిష్ మూవీ కాదు. కంప్లీట్ హాలీవుడ్ మూవీ. ఇలా పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రం చేసిన తొలి తెలుగువాళ్లం మేమే’’ అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ కూనిశెట్టి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రనిర్మాణానికి రెండేళ్లు పట్టింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ షీన్బర్గ్ ఈ చిత్రం నచ్చి, మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. తెలుగులో విడుదల చేయమని చాలామంది కోరుతున్నారు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాం’’ అని చెప్పారు.