ఐదు సినిమాలతో బిజీ | RP Patnaik Five movies Projects in telugu and Kannada | Sakshi
Sakshi News home page

ఐదు సినిమాలతో బిజీ

Published Mon, Mar 10 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

ఐదు సినిమాలతో బిజీ

ఐదు సినిమాలతో బిజీ

 అటు దర్శకునిగా, ఇటు సంగీత దర్శకునిగా ఫుల్ బిజీగా ఉన్నారు ఆర్పీ పట్నాయక్. ప్రస్తుతం ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. అందులో దర్శకునిగా 4 ప్రాజెక్టులు కాగా, సంగీత దర్శకునిగా ఒక సినిమా చేస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో డెరైక్ట్ చేసిన ‘తులసీదళం’ ఎన్నికల తర్వాత విడుదల కానుంది. కన్నడంలో ప్రియమణితో చేస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. అంతా కొత్తవారితో తెలుగులో తీస్తున్న ‘సరదా’ సినిమా రెండో షెడ్యూలు త్వరలోనే మొదలు కానుంది. అలాగే ఆర్పీ ఎప్పటినుంచో తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న మ్యూజికల్ ఫిల్మ్‌కి శ్రీకారం చుట్టారు. ఇందులో 8 పాటలుంటాయి. ప్రస్తుతం సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఆర్పీ స్వరాలందించిన ‘ప్రభంజనం’ త్వరలోనే  విడుదల కానుంది. నేడు ఆర్పీ పుట్టినరోజు. ఈ ఏడాది ఇంకా బిజీ అవుతానని నమ్మకంగా చెప్పారాయన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement