ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో...
ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో...
Published Mon, Feb 17 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
‘పరుత్తి వీరన్’ అనే తమిళ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం గెలుచుకున్న ఘనత ప్రియమణిది. అయితే ఆ తర్వాత ఆమెను ఎందుకనో అన్నీ గ్లామర్ పాత్రలే వరించాయి. అడపాతడపా నాయికా ప్రాధాన్య సినిమాలు చేసినా ప్రియమణికి కలిసి రాలేదు. ఆ అసంతృప్తిలో ఉన్న ప్రియమణికి ఆర్పీ పట్నాయక్ చెప్పిన కథ విపరీతంగా నచ్చేసింది. తన కెరీర్‌కి కచ్చితంగా ఊతమిచ్చే సినిమా కావడంతో వెంటనే కాల్షీట్లు ఇచ్చేశారు. ఈ సినిమా కన్నడంలో రూపొందుతోంది. తెలుగులో ‘బ్రోకర్’, ‘ఫ్రెండ్స్ బుక్’, ‘తులసీదళం’ లాంటి సినిమాలు డెరైక్ట్ చేసిన ఆర్పీకి ఇదే తొలి కన్నడ చిత్రం.
కన్నడంలో 30 సినిమాలకు స్వరాలందించిన ఆర్పీకి అక్కడ బాగా పాపులార్టీ ఉంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియమణి పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ జరుగుతోంది. ఈ బుధవారం నుంచి ప్రియమణి షూటింగ్‌లోకి ఎంటర్ కాబోతున్నారు. మార్చికల్లా షూటింగ్ పూర్తి కానుంది. ఇందులో ముగ్గురు హీరోలు నటిస్తున్నారు. ఎన్.శేషగిరిరావు సమర్పణలో వినోద్, శరవణ నిర్మిస్తున్న ఈ చిత్రం తామిద్దరికీ బ్రేక్ ఇస్తుందని ప్రియమణి, ఆర్పీ ఆకాంక్షిస్తున్నారు.
Advertisement
Advertisement