ఆయన దర్శకత్వంలో నటించాలనుంది | That he was acting under the direction -The young hero Varun | Sakshi
Sakshi News home page

ఆయన దర్శకత్వంలో నటించాలనుంది

Published Sun, Apr 3 2016 10:54 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

ఆయన దర్శకత్వంలో  నటించాలనుంది

ఆయన దర్శకత్వంలో నటించాలనుంది

‘లజ్జ’ చిత్రం హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రంలో దర్శకుడు నరసింహ నంది నాకు మంచి పాత్ర ఇచ్చారు’’ అని యువహీరో వరుణ్ అన్నారు. ప్రస్తుతం నరసింహ నంది దర్శకత్వంలోనే ‘బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్’తో పాటు మరో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను పాత్రికేయుల సమావేశంలో వరుణ్ చెబుతూ - ‘‘వాస్తవానికి నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి, ఆర్పీ పట్నాయక్‌గారు ‘మనలో ఒక్కడు’లో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈలోపు ‘లజ్జ’ విడుదల కావడం, మంచి గుర్తింపు రావడం జరిగింది.

‘బుడ్డారెడ్డిపల్లె బ్రేకింగ్ న్యూస్’లో నాది చాలా మంచి పాత్ర. ఇంకో చిత్రంలో కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నా. ఎప్పటికైనా త్రివిక్రమ్‌గారి దర్శకత్వంలో చేయాలన్నది నా కోరిక’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement