అస్కార్‌ బరిలో ఇండియన్‌ షార్ట్‌ ఫిలిం | Sunflowers Were the First Ones to Know Short Film Qualifies For Oscar 2025 | Sakshi
Sakshi News home page

అస్కార్‌ బరిలో ఇండియన్‌ షార్ట్‌ ఫిలిం

Published Tue, Nov 5 2024 3:22 PM | Last Updated on Tue, Nov 5 2024 3:34 PM

Sunflowers Were the First Ones to Know Short Film Qualifies For Oscar 2025

‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ అనే ఇండియన్‌ షార్ట్‌ ఫిలిం 2025 ఆస్కార్‌కు అర్హత సాధించింది. చిదానంద S నాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్‌ రేసుకు అర్హత దక్కించుకుందని తాజాగా చిత్ర నిర్మాత తెలిపారు. పలు హాలీవుడ్‌ చిత్రాలతో పోటీ పడిన ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లైవ్‌ యాక్షన్‌ విభాగంలో తమకు అవకాశం దక్కినట్లు నిర్మాత పేర్కొన్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌ విభాగంలో ఈ చిత్రం అవార్డ్‌ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్‌ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు. ఓ వృద్ధురాలి కోడిని కొందరు దొంగలించడంతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాగైనా సరే దానిని కనుగొని ఆ కోడిని తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెపడే తపనను ఇందులో దర్శకుడు చూపారు. ఇప్పటికే కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సత్తా చాటిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ చిత్రం.. ఆస్కార్‌ అవార్డ్‌ కూడా దక్కించుకుంటుందని ఆశిస్తున్నారు.

మైసూర్‌కు చెందిన నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే MBBS పూర్తి చేసిన ఆయన సినిమా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమా ఆస్కార్‌కు అర్హత సాధించడంతో తన సొంత ఊరు అయిన శివమొగ్గలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే  భారత్‌ నుంచి  'లాపతా లేడీస్‌' అస్కార్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమిర్‌ఖాన్‌ మాజీ సతీమణి కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement