భారత టాలెంట్‌ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి | SS Rajamouli Appreciates The Cannes Film Festival Award Winners and Nominees From India | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది: రాజమౌళి

Published Fri, May 24 2024 5:08 PM | Last Updated on Fri, May 24 2024 5:19 PM

SS Rajamouli Appreciates The Cannes Film Festival Award Winners and Nominees From India

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి వారిపై ప్రశంసలు కురిపించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌-2024లో బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్‌గా ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో' చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

రాజమౌళి తన ట్వీట్‌లో రాస్తూ..'భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతోంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా లా  సినీఫ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు' అంటూ పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఈ షార్ట్‌ ఫిల్మ్ తీసిన చిదానంద నాయక్‌ను ట్యాగ్‌ చేశారు.

కాగా.. చిదానంద తెరకెక్కించిన సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో షార్ట్‌ ఫిల్మ్ కేన్స్‌లో అరుదైన ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచింది. 16 నిమిషాలు ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడీ షార్ట్‌ ఫిల్మ్ హాలీవుడ్‌తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement