
టాప్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli)పై ఆయన సన్నిహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇద్దరూ ఒకమ్మాయినే ప్రేమించగా రాజమౌళి కోసం తన ప్రేమను త్యాగం చేశానన్నాడు. అతడి కోసం 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నానని.. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సినిమాగా తీస్తానన్నానో అప్పటి నుంచి తనను టార్చర్ పెట్టడం ప్రారంభించాడని ఆరోపించాడు. రాజమౌళి వల్ల తన ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయాడు.
ఫ్రెండ్ అయితే చెవిలో చెప్పాలి!
ఈ ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రాజమౌళి స్టార్ డైరెక్టర్.. ఇప్పుడొచ్చి ఇదంతా చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా ఫ్రెండ్ అనుకుంటే వెళ్లి చెవిలో చెప్పాలి. అయినా ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఎందుకంటే.. ఎప్పుడో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ చేశాం. రాజమౌళి కోసం ప్రేమ త్యాగం చేసి అతడి దగ్గరే అనుచరుడిగా పని చేశానన్నాడు. సడన్‌గా ఇలా మాట్లాడుతున్నాడంటే.. డబ్బు దగ్గర సమస్య వచ్చిందా?
(చదవండి: డ్రాగన్ సక్సెస్.. టాలీవుడ్ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!)
పిచ్చిపిచ్చి నాటకాలా?
ఆయన చేసిన అభియోగాలకు ఏదైనా సాక్ష్యం ఉందా? నేను రాజమౌళికి సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి బెదిరిస్తే పోలీసు దగ్గరకు వెళ్లొచ్చు. కానీ ఇలా బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు.. కానీ 34 ఏళ్లుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడటం తప్పు. ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు పుట్టి, మనవళ్లు కూడా ఉండొచ్చు. ముసలాడివయ్యాక ఇప్పుడు లవ్‌స్టోరీ గుర్తొచ్చి బయటపెడతావా? పిచ్చిపిచ్చి నాటకాలా? అమ్మాయితో ఆడుకుంటారా? ఏమైనా ఉంటే మీరిద్దరూ చూసుకోండి..
రోడ్డుమీద పడి కొట్టుకోండి..
అమ్మాయి మనోభావాలు దెబ్బతినేవిధంగా, ఆమెకు ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడటం తప్పు. మీరిద్దరూ మాట్లాడుకోండి, తిట్టుకోండి, అవసరమైతే రోడ్డుపై కొట్టుకోండి.. కానీ అమ్మాయిని రోడ్డు మీదకు లాగడం కరెక్ట్ కాదు. ఆయన నిజంగా ఆమెను ప్రేమించి ఉంటే తనను ఇబ్బందిపెట్టడం శ్రేయస్కరం కాదు. ఆమెకు నానమ్మ వయసొచ్చాక ఈ విషయాలు చెప్తారా? ఏంటిది? ఇవన్నీ పిచ్చిపిచ్చి వేషాలు అని నట్టికుమార్ మండిపడ్డాడు.
చదవండి: ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్..: శివరాజ్‌కుమార్