Natti kumar
-
ఎంతమంది అడ్డుపడినా ఆ రోజే సినిమా విడుదల చేస్తాం: కోన వెంకట్
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఇండస్ట్రీకి చెందిన నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశాడు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మించడమే అని తెలుస్తోంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ సంయుక్తంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను నిర్మించారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్‌కు నట్టి కుమార్ రాసిన లేఖపై కోన వెంకట్ ఇలా స్పందించారు. ' గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాం. కానీ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు. సినిమా విషయంలో ఆయనకు రూల్స్ తెలుసుకుని ఆ లేఖ రాసి ఉంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఆ నిర్మాత లేఖ రాస్తే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగేది కాదు. ఎలక్షన్స్‌కు సినిమాలకు దయచేసి ముడిపెట్టొద్దు. సినిమా అనేది ఒక పార్టీకి,కులానికి,మతానికి చెందినది కాదు. ఈ సినిమా కోసం కొన్ని వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు పనిచేశారు. దయచేసి సినిమాను రాజకీయం చేయకండి. ఎప్రిల్ 11న ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుంది. సినిమాను ఆపేందుకు ఎవరు అడ్డుపడినా.. ఎంతమంది అడ్డుపడినా.. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా అనుకున్న రోజే సినిమా విడుదల అయి తీరుతుంది. అని ఆయన తెలిపారు. ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో కూడా అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైలర్‌కు ఎప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని అగ్ర హీరోలు, నిర్మాతలు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీలకు, గూండాలకి అవార్డ్స్ ఇస్తున్నారని అశ్వనీదత్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక అవార్డ్స్‌కు విలువ పోయిందన్నారు. ప్రభుత్వం ముందు ఇండస్ట్రీని తాకట్టు పెట్టింది ఇండస్ట్రీ పెద్దలేనని ఆరోపించారు. ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే వాళ్లు అప్పుడు అమరావతిలో భూములు తీసుకుంది వాస్తవం కాదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పును.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి? చేయడని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అవార్డ్స్ గురించి అడిగే దమ్ముందా? అని నిలదీశారు. (ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్) ప్రత్యేక విమానాల్లో వెళ్లి అమరావతిలో ఇండస్ట్రీని తాకట్టుపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీ కోసం కాకుండా రాజకీయాల కోసం మాట్లాడడం సరైంది కాదని హితవు పలికారు. పార్టీలకతీతంగా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్డీసీ ఛైర్మన్ ఇండస్ట్రీ పెద్దల్ని కలిసి మాట్లాడాలని సూచించారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. ' ల్యాండ్స్ తీసుకున్న సినీ పెద్దలు స్టూడియోలు ఎందుకు నిర్మించట్లేదు.? స్టూడియోలు ఏర్పాటు చేస్తే ఉద్యోగావకాశాలు లభిస్తాయి కదా. తెలంగాణలో 2014లో రూ.20 వేలు రెంట్ ఉంటే... ఇప్పుడు లక్షన్నర ఉంది. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తా అని మాత్రమే అంటోంది. కానీ చిన్న సినిమాలకి చేస్తోంది ఏమి లేదు.' అని అన్నారు. చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. '2014 నుంచి చిన్న సినిమా చచ్చిపోయింది. రెండు రాష్ట్రాలలో 2014 నుంచి స్టూడియోల నిర్మాణానికి ఎవరికి అనుమతులు లేవు. చిన్న, పెద్ద అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ. పెద్దల్ని కలవలేక పోతున్నాం. అందుకే మీడియా ముందుకు వచ్చాను. దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి ఎంతో చేశారు. కానీ ఆయన చనిపోయాక ఎవరు పట్టించుకోవడం లేదు. రెండు ప్రభుత్వాలు దాసరి కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. దాసరి విజ్ఞాన పార్క్ పెట్టాలని కోరుతున్నా. ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.' అని అన్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!) -
ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత
టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీని ఒక్కరే తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అఖిల్ ఏజెంట్ మూవీకి థియేటర్లు ఇవ్వకుండా.. తమిళ మూవీకి కేటాయిస్తారా అని ప్రశ్నించారు. హీరోలను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నట్టి కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు, ఎత్తుగడలు ఉన్నాయి. వాటిని అధిగమించడం అఖిల్ వల్ల అవుతుందా? అక్కినేని కుటుంబం వల్ల అవుతుందా? అక్కినేని కుటుంబం చాలా సైలెంట్. ఒక హీరోను తొక్కడానికి ఒక అగ్ర నిర్మాత థియేటర్లను బ్లాక్ చేశారు. ఏజెంట్ రిలీజ్ రోజే పొన్నియన్ సెల్వన్ 2 కూడా రిలీజ్ అయింది. మణిరత్నం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ మాకు తెలుగు సినిమా గొప్ప. ఏజెంట్ మూవీకి నిన్నటి దాకా డిస్ట్రిబ్యూటర్లు కూడా దొరకని పరిస్థితి ఉంది.' అని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 'మోనోపాలి అనేది కరెక్ట్ కాదు. ఏజెంట్‌కు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. మీకే ఇలా జరిగితే మాలాంటి వారి పరిస్థితేంటి? తెలంగాణలో ఇప్పటికే చిన్న సినిమాలను చంపేశారు. మార్కెట్ మొత్తం పడిపోతోంది. దసరాకు కలెక్షన్స్ వచ్చాయి అంటున్నారు. మరి డబ్బులు ఎవరికెళ్లాయి. ప్రొడ్యూసర్‌కు, కొన్నవారికి ఇంకా డబ్బులు రావాలి. నిజమైన నిర్మాతలకు, బయ్యర్లకు డబ్బులు ఎందుకు రావడం లేదు. తెలుగు, తమిళం కంటే మనం తెలుగుకే ప్రాధాన్యత ఇవ్వాలి. వైజాగ్ అంతటా పొన్నియిన్ సెల్వన్-2 ఆడుతోంది. అక్కడ థియేటర్లు మొత్తం బ్లాక్ చేశారు. గతిలేని పరిస్థితుల్లో ఎగ్జిబ్యూటర్లు ఆ సినిమా వేయాల్సి వస్తోంది. మోనోపాలి వల్ల ఇండస్ట్రీ నాశనమవుతోంది. దీనిపై చర్చించాలి' అన్నారు నట్టి కుమార్. -
అవార్డు సభలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత కూడా లేరు:నట్టి కుమార్
-
ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య లేకుండా సన్మానమా? సిగ్గుచేటు: నట్టి కుమార్
ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు నిర్మాత నట్టి కుమార్. ఆస్కార్ గ్రహీతలను అంత అర్జెంటుగా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు. 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత నట్టి కుమార్. 'తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అందరూ గర్వించదగ్గ విషయం. కానీ ఆస్కార్ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. నిన్న జరిగిన ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు? ఆస్కార్ సాధించినవాళ్లను అంత అర్జెంట్‌గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారు? నిన్న జరిగిన ఈవెంట్ గురించి చాలామందికి సమాచారమే అందలేదు. సన్మానం చేయాలి. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఈసీ అప్రూవల్ లేకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి రూ.25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ తెలంగాణలో చిన్న సినిమాలకు ఏం చేయట్లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు ఐదో షో కావాలని అడుగుతున్నాం. దీనిపై ఇంతవరకు స్పందించనేలేదు. తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ ఇక్కడ 32%, ఆంధ్రప్రదేశ్‌లో 62% లాభాలు వస్తున్నాయి. అయినా చాలా కంపెనీలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఏపీ, తెలంగాణ అంటూ ఎలాంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం' అన్నారు నట్టి కుమార్. -
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు.. దామోదర ప్రసాద్ ఘన విజయం
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందాడు. కార్యదర్శకులు ప్రసన్న కుమార్(378), వైవీఎస్ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు. ఈసీ మెంబర్స్‌గా గెలుపొందింది వీరే.. దిల్ రాజు (470 ఓట్లు) దానయ్య- 421 రవి కిషోర్ - 419 యలమంచిలి రవి- 416 పద్మిని- 413 బెక్కం వేణుగోపాల్- 406 సురేందర్ రెడ్డి- 396 గోపీనాథ్ ఆచంట- 353 మధుసూదన్ రెడ్డి- 347 కేశవరావు- 323 శ్రీనివాద్ వజ్జ- 306 అభిషేక్ అగర్వాల్-- 297 కృష్ణ తోట- 293 రామకృష్ణ గౌడ్- 286 కిషోర్ పూసలు- 285 అందరం కలిసి కట్టుగా పని చేస్తాం: సీ.కల్యాణ్ నిర్మాతల మండలి ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయని నిర్మాత సీ. కళ్యాణ్ అన్నారు. ఇకపై అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. ప్రొడ్యూసర్ గిల్డ్‌ని కూడా నిర్మాతల మండలిలో కలపాలని ఆయన కోరారు. ఇద్దరు చీడ పురుగుల వల్ల సిస్టమ్ చెడిపోయిందని, అది అందరూ గుర్తించి వారిని ఓడగొట్టారని అన్నారు. -
ఇదీ దాసరి చరిత్రకు శ్రీకారం – నట్టి కుమార్
‘‘సినీ పరిశ్రమ నిలబడటానికి దాసరి నారాయణరావు లాంటి పెద్దలు ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన సినీ ప్రయాణంతో ‘ఇదీ దాసరి చరిత్ర’ పేరుతో సినిమా తీస్తా. మే 4న దాసరిగారి జయంతిన ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాత నట్టి కుమార్. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుకొచ్చి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. దాసరిగారు కూడా నిర్మాతల మండలిలోని సభ్యులకు మెడిక్లెయిమ్ పాలసీని వర్తింపజేశారు. అయితే కొందరు సినీ పెద్దలు వాటికి తిలోదకాలు ఇచ్చే స్థితికి వచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సినీ రంగానికి దాసరిగారు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విగ్రహం పెట్టాలి.. అలాగే ఫిలింనగర్లో, ఆయన పుట్టిన పాలకొల్లులో దాసరిగారి పేరుతో పార్కులు నిర్మించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృషిచేయాలి. ఏపీలో కూడా షూటింగ్‌లు జరగాల్సిన అవసరం ఉంది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ ఇండస్ట్రీలోని అందర్నీ కలుపుకుని ముందుకువెళ్లాలి. గిల్డ్‌లోని కొందరు పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల గురించి ఆలోచించరు. అందుకే త్వరలో జరిగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వారిని ఎన్నుకోకుండా జాగ్రత్తపడాలి’’ అన్నారు. -
కేసీఆర్ బయోపిక్ తీస్తా : రామ్ గోపాల్ వర్మ
పదేళ్లకు ఒకసారి యూత్ జనరేషన్ మారుతుంది. అందుకే రీ రిలీజ్ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోంది’’ అని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. నితిన్, ప్రియాంక కొఠారి జంటగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అడవి’. విశాఖ టాకీస్‌పై నట్టి కువర్ నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘తరం మారుతున్న ప్రతీసారి గతంలో వచ్చిన కొన్ని సినిమాలు చూడాలని మారుతున్న యూత్ కోరుకుంటుంటారు. ‘అడవి’లో ఫారెస్ట్ ఫొటోగ్రఫీ, సాంగ్స్, సౌండ్ వంటివి హైలైట్‌గా ఉంటాయి. గతంలో నేను తీసిన పలు హిట్ సినిమాలను ఆయా నిర్మాతలతో మాట్లాడి రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. కేసీఆర్‌గారి బÄñæపిక్ చేసే ఆలోచన ఉంది’’ అన్నారు. నట్టి కుమార్ మాట్లాడుతూ– ‘‘అడవి’ సినిమాను దాదాపు వంద థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నాం. అలాగే ప్రభాస్ ‘రెబల్’ను ఈ నెల 15న, 22న ‘వర్షం’ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నాను. రామ్‌గోపాల్ వర్మగారు, నేను పాతికేళ్లుగా మంచి స్నేహితులం. కొద్దికాలం క్రితం మా మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు సమసి పోయాయి. మా కాంబినేషన్లో మళ్లీ సినిమాలు చేస్తాం’’ అన్నారు. -
ధనుష్-శ్రుతి హాసన్ ‘త్రి’ రీ రిలీజ్.. నిర్మాత నట్టి ఏమన్నారంటే
‘‘థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనడం కరెక్ట్ కాదు. సినిమా టికెట్ ధరలు తగ్గించడంతో పాటు మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా వస్తారు. ఇటీవల విడుదలైన కొత్త చిత్రాలతో పాటు అగ్రహీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు (పోకిరి, జల్సా) రీ రిలీజ్ అయినా ఆదరించారు’’ అని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ధనుష్, శ్రుతీహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు నట్టి కుమార్. కాగా ఈ సినిమాని నేడు రీ రిలీజ్ చేస్తున్నారాయన. అదే విధంగా నేడు నట్టి కుమార్ 50వ పుట్టినరోజు. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘త్రీ’ చిత్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ విడుదల చేస్తున్నాం. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఫుల్ అయ్యాయి. ఇక ఇటీవల కొందరు నిర్మాతలు ఏకాభిప్రాయంతో బంద్‌కు పిలుపునివ్వడం వల్ల చిన్న నిర్మాతలు, కార్మికులు, పెద్ద నిర్మాతలు సైతం నష్టపోయారు. ఈ బంద్ ఎందుకు చేశారో అర్థం కాలేదు. త్వరలో మీడియా రంగంలోనికి అడుగు పెట్టనున్నాను. నట్టీస్ ప్యూర్ విలేజ్ ప్రొడక్టుల పేరిట హోల్‌సేల్, రీటైల్ వ్యాపారం ప్రారంభిస్తున్నాను. సినిమా కార్మికులకు అండగా నిలబడేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో పోటీ చేస్తాను’’ అన్నారు. చదవండి: ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే.. -
ఆర్జీవీ సినిమాలేవి రిలీజ్ కాకుండా చూస్తా : నట్టి కుమార్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. ఆయన సినిమాలేవి విడుదల కాకుండా చేస్తామని హెచ్చరించాడు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి ఎంటర్టైన్మెంట్కు చెందిన క్రాంతి, కరుణలపై ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా తాజాగా నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. (చదవండి: నా సంతకం ఫోర్జరీ చేశారు.. పోలీసులకు రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. ఫోర్జరీ చేశారంటూ తన పిల్లలపై ఆర్జీవీ తప్పుడు కేసులు పెట్టాడని ఆరోపించాడు. డబ్బులు బాగానే తీసుకున్నాడని.. ఇవ్వమని అడిగితే ఫేక్ అంటున్నాడని మండిపడ్డారు. తనతో పాటు చాలా మందిని ఆర్జీవీ మోసం చేశాడని ఆరోపించారు. అప్పులు ఇచ్చిన వాళ్లంతా ఒకటయ్యామని, ఇక ఆర్జీవీ పని అయిపోయిందని హెచ్చరించాడు. ఆయన సినిమాలేవి విడుదల కాకుండా చేస్తామన్నారు. వర్మ పేరు మీద సినిమా వస్తే.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అయినా సరే స్టే తీసుకుంటానమి చెప్పారు. నిర్మాతలెవరు ఆయనతో సినిమా చేయొద్దని కోరారు. -
నా సంతకం ఫోర్జరీ చేశారు.. పోలీసులకు రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, నట్టి కరుణలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా ఇష్టం’సినిమాకు సంబంధించిన లెటర్ రేట్‌పై నట్టి ఎంటర్టైన్మెంట్కు చెందిన క్రాంతి, కరుణలు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. \ ‘ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్(తెలుగులో ‘మా ఇష్టం’) చిత్రాన్ని ఆపడానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఈ పోర్జరీ కేసుకు సంబంధించిన వివరాలను చెప్పి..పంజాగుట్ట పోలీసు స్టేషన్లో వారిపై రిటన్ కంప్లైంట్ ఇచ్చాను’ అని ఆర్జీవీ చెప్పారు. -
రామ్ గోపాల్ వర్మపై నిర్మాత చీటింగ్ కేసు, వివరణ ఇచ్చిన ఆర్జీవీ
RGV Respond On Natti Kumar Cheating Case: నిర్మాత నట్టి కుమార్ తనపై పెట్టిన కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అంతేకాదు తన సినిమా నా ఇష్టం వాయిదా వేసేందుకు నట్టి కుమార్ కారణం కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు. కాగా గురువారం ఆర్జీవీపై నట్టి కుమార్ చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్జీవీ వివరణ ఇస్తూ ట్విటర్లో వీడియో రిలీజ్ చేశాడు. ‘నట్టి కుమార్ నోటీసులకు నా అడ్వకేట్ సమాధానం ఇస్తాడు. ఇక నాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసు. ప్రెస్మీట్లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్‌లో ఏం లేదని అనుకుంటున్నా. చదవండి: బర్త్‌డే నాడు ఆర్జీవీకి షాకిచ్చిన నిర్మాత గతంలో చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు మీద ఇలాంటి ఆరోపణలే చేశాడు.. ఇప్పుడు నామీద.. ఇలా తన లైఫ్ అంత ప్రెస్మీట్లే ఉంటాయి’ అంటూ ఆర్జీవీ మండిపడ్డాడు. అంతేకాదు ‘ఇప్పుడు తన కొడుకు, కూతురితో సినిమా చేస్తే ప్రమోషన్ చేయలేదనో.. రావల్సిన కమీషన్ రాలేదని ఇండస్ట్రీలో కొందరిని ఆయన దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన తాజా చిత్రం నా ఇషం వాయిదాపై కూడా ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. ‘నా ఇష్టం సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్ కారణం కాదు. దానికి వేరే కారణం ఉంది. లెస్బియన్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం వల్ల చాలా థియేటర్లు మా చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేశాం’ అని చెప్పాడు. Maa Ishtam postponement reason pic.twitter.com/FUylG5n5Wd — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022 ‘అంతేకాని నా సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్ కారణంగా కాదు. కాబట్టి నట్టి కుమార్‌ను పెద్దగా పట్టించుకోవాలనుకోవడం లేదు. ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అందుకే ఇకపై ఆయన గురించి ఎక్కడ మాట్లాడేందుకు సిద్ధంగా లేను. చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనేది నా న్యాయవాది చూసుకుంటారు’ అని ఆర్జీవీ వివరించాడు. కాగా ఆర్జీవీ తనకు రూ. 5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని నిర్మాత నట్టికుమార్ ఏప్రిల్ 7న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధల్ని వర్మ తుంగలో తొక్కినట్లు ఆరోపించాడు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆర్జీవీ తెరకెక్కించిన మా ఇష్టం చిత్రాన్ని ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. DANGEROUS film postponement reason pic.twitter.com/lk4Mz3Z7z0 — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022 -
బర్త్‌డే నాడు ఆర్జీవీకి షాకిచ్చిన నిర్మాత
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు ఊహించని షాక్ తగిలింది. గురువారం బర్త్‌డే సందర్భంగా అందరూ ఆయనకు విషెస్ చెబుతుంటే, నిర్మాత నట్టికుమార్ మాత్రం ఆర్జీవీపై కేసు వేసి ఆయనకే షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్లితే.. వర్మ నుంచి వస్తోన్న బోల్డ్ మూవీ `డేంజరస్ తెలుగులో `మా ఇష్టం` పేరుతో శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఇప్పటికే కొన్ని థియేటర్స్ నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ తనకు రూ. 5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని నిర్మాత నట్టికుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధల్ని వర్మ తుంగలో తొక్కినట్లు ఆరోపించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆర్జీవీ తెరకెక్కించిన మా ఇష్టం చిత్రాన్ని ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
హీరో పేరు వర్మ, కానీ సినిమాకు ఆర్జీవీకి సంబంధం లేదు
నట్టి కుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి హీరోగా నటించిన చిత్రం ‘వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. నట్టి క్రాంతి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హీరోగా నా తొలి సినిమాకి మా నాన్నే (నట్టి కుమార్) దర్శకుడు కావడం నా అదృష్టం. టైటిల్ ‘వర్మ’ కాబట్టి రామ్‌గోపాల్ వర్మ గురించి అనుకుంటారు. కానీ వర్మకు సంబంధమే లేదు. సినిమాలో హీరో పేరు వర్మ. సైకోలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేది కథ. థ్రిల్లర్ మూవీ. చివరి అరగంటపాటు భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ‘చట్టం, టెంపర్’ సినిమాల క్లైమాక్స్‌కు ప్రేక్షకులు ఎలా చప్పట్లు కొట్టారో ‘వర్మ’కి కూడా అలా చప్పట్లు కొడతారనే నమ్మకం ఉంది. హీరోగానే కాదు.. మంచి పాత్రలొస్తే బయటి చిత్రాల్లోనూ నటిస్తాను. అన్నీ కలిసి వస్తే దర్శకత్వం కూడా చేస్తాను. నేను నిర్మించిన ‘డియర్ జాను’ (డి.జె.) సినిమా కూడా ఈ నెల 28న రిలీజ్ కానుంది’’ అన్నారు. -
నకిలీ లేఖలతో కోర్టును ఆశ్రయించారు
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం తెచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ నకిలీ లేఖలు పెట్టినవారిపై వెంటనే విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ విజ్ఞప్తి చేశా రు. గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవో 35 రద్దు కోరు తూ విశాఖపట్నం జిల్లా చోడవరానికి చెందిన పూసర్ల బాబ్జీ ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్టు చె ప్పారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్లు జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ నకిలీ లేఖల ను సృష్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు. అంగీకారం తీసుకోకుండా తన థియేటర్ పేరిట నకిలీ లేఖలు సృష్టించాడని తెలి పారు. ఈ లేఖల విషయాన్ని విశాఖపట్నం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అక్కడి జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం ప్రాంతాల ఎగ్జిబిటర్స్ సైతం బాబ్జీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని అన్నారు. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. లెసెన్స్‌లు, ఫైర్ ఇతర అనుమతులు రెన్యువల్‌కు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలకు నెల రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు. తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలంతా వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు. వీరు టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారే తప్ప చిన్న నిర్మాతల గురించి పట్టించుకోవడంలేదని అన్నారు. చిన్న సినిమాల కోసం 5వ షోకు అనుమతించాలని కోరారు. తెలంగాణలో టికెట్ రేట్లను తగ్గించకపోతే తన చిన్న సినిమాలను అక్కడ రిలీజ్ చేయలేనని అన్నారు. లైసెన్స్‌ల పునరుద్ధరణకు అనుమతిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు రాష్ట్రంలో ఇటీవల మూసివేసిన కొన్ని థియేటర్ల పునఃప్రారంభం, లైసెన్స్‌ల పునరుద్ధరణకు అనుమతిస్తూ ప్రభుత్వం నెల రోజుల గడువు ఇవ్వడంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియచేసింది. -
టికెట్ రేట్ల పెంపుతో చిన్న సినిమాలకు అన్యాయం: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచడం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రముఖ దర్శక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ల రేట్లు అధికంగా పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో చిన్న నిర్మాతలను నిరాశ పరిచింది. చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక షోకి అనుమతివ్వాలని కోరుతున్నా ఆ ఊసే లేదు. మల్టీప్లెక్స్‌లలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 ప్రకారం సీటింగ్ కెపాసిటీలో 10 శాతం కేటాయించి, టికెట్ల రేట్లను పేదవాడి కోసం కనిష్టంగా రూ.50గా నిర్ణయించాలి. కానీ అలాంటి నిబంధనలు జీవోలో లేనే లేవు. తెలంగాణలోని థియేటర్లు ఏషియన్ సునీల్, ‘దిల్’రాజు చేతుల్లోనే ఉన్నాయి. టికెట్ ధరల పెంపుతో వాళ్లిద్దరికి మాత్రమే మేలు జరుగుతోంది. చిన్న సినిమాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా’అని నట్టి కుమార్ తెలిపారు. చదవండి: ఈసారి లవర్స్ డేను ముందుగా సెలబ్రేట్ చేసుకుంటారు: తమన్ చదవండి: Manchu Lakshmi: దానికోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటున్న మంచు లక్ష్మి -
సినీ నిర్మాత వినతిపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో–35 అమలు కోరుతూ సినీ నిర్మాత నట్టి కుమార్ ఇచ్చిన వినతి పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సినిమాస్ రెగ్యులేషన్స్ చట్టం 1995లోని సెక్షన్ 9, 10, 11లను అనుసరించి ఆయన వినతిపై నిర్ణయం తీసుకోవాలంది. న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మునిసిపాలిటీలు, నగరాలు, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది. అయితే, జీవోకు విరుద్ధంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తున్నారని, ఇదే రీతిలో విశాఖపట్నంలోని శ్రీలక్ష్మి థియేటర్ యాజమాన్యం అధిక ధరకు టికెట్లు అమ్ముతోందంటూ నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 35 అమలు కోసం తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. -
‘ఆన్లైన్ టికెట్ విధానం మంచిదే’
‘‘ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆన్లైన్ టికెట్ విధానం వల్ల సినిమా వసూళ్ల విషయంలో మరింత పారదర్శకత వస్తుంది. కానీ ఈ విధానంపై ప్రభుత్వం మరింత అధ్యయనం చేసి లోపాలు ఉండకుండా చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత నట్టి కుమార్. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నట్టి కుమార్ మాట్లాడుతూ – ‘‘పోసాని కృష్ణమురళి ఇంటిపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. అలాగే పోసాని మాట్లాడిన తీరు కూడా కరెక్ట్ కాదు. ఇక గత నెల 20న ఏపీ మంత్రి పేర్ని నానీతో కొంతమంది ఇండస్ట్రీ విషయాలను చర్చించారు. ఈ సమావేశానికి వెళ్లొచ్చిన వారు పవన్ కల్యాణ్‌కు సరైన రీతిలో వివరించలేదు. అందుకే ఆ తర్వాత పవన్ మాట్లాడిన మాటలు (‘రిపబ్లిక్’ వేడుకలో) వివాదమయ్యాయని భావిస్తున్నాను. అయితే సినీ రంగం గురించి మాట్లాడేటప్పుడు పవన్ వాస్తవిక విషయాలను తెలుసుకుని మాట్లాడితే బాగుండేది’’అని అన్నారు. ఇదిలా ఉంటే... శుక్రవారం ఉదయం నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసులు పవన్ కల్యాణ్‌ని ఆయన నివాసంలో కలిశారు. చిత్రపరిశ్రమకు సంధించిన సమస్యల గురించి సహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయని తెలిసింది. -
పరిశ్రమకు చంద్రబాబు ఏం చేశారో?
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిగారు, ఇప్పటి సీయం వైఎస్ జగన్మోహన్రెడ్డిగారు చిత్రపరిశ్రమకు అన్నీ ఇచ్చారు. కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. మరి.. చంద్రబాబుగారు ఇండస్ట్రీకి ఏం చేశారో వాళ్లు చెప్పాలి?’’ అని దర్శక–నిర్మాత నట్టి కుమార్ అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పంచుకున్న విషయాలు.. ► ‘ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వస్తున్నది పాతిక కోట్లు మాత్రమే. నేను ఇంకో పాతిక కోట్లు ఇస్తా. ఇండస్ట్రీని ఎలా అభివృద్ధి చేద్దామో చెప్పి చేయించుకోండి’ అని ఓ సందర్భంలో రాజశేఖర రెడ్డిగారు అన్నారు. అప్పట్లో ఇండస్ట్రీ కోసం విశాఖపట్నంలో 326 ఎకరాలు కేటాయించి, స్డూడియోలు, ఇతర సౌకర్యాలకు అనుగుణంగా మార్చుకోమన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ స్థలాలను వేరే కంపెనీలకు ఇచ్చింది. అది జగన్మోహన్ రెడ్డిగారు క్యాన్సిల్ చేశారు. ఆ స్థలం అలాగే ఉంది. ఇండస్ట్రీకి ఆంధ్రా నుంచే 65 శాతం ఆదాయం వస్తోంది. అలాంటప్పుడు ట్యాక్స్ కట్టి అక్కడి ప్రభుత్వానికి మేలు జరిగేలా అక్కడ కూడా షూటింగ్‌లు జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ► షూటింగ్‌ల కోసం ఏపీలో సింగిల్ విండో విధానం అమలులో ఉంది. అలాంటప్పుడు ఆంధ్రాలో ఎందుకు షూటింగ్‌లు చేయరు? జగన్ గారు అపాయింట్మెంట్ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అది తప్పు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. జగన్ గారిని అడిగితే వీలైనంత త్వరగా స్పందిస్తారు. ► ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35 చిన్న నిర్మాతల పాలిట ఓ వరం. ఈ జీవోను ఉపసంహరించుకోకూడదని కోరడానికి చిన్న నిర్మాతల తరఫున సీయం గారి అపాయింట్మెంట్ కోరాను. కానీ, ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్న ఓ వర్గం వారు ఈ జీవో విషయంలో ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకుని వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ► జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చిరంజీవిగారు చిన్న నిర్మాతల సమస్యలను కూడా ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన సినిమాలకు మంచి షేర్స్ వస్తున్నాయి. అయినా కొందరు పెద్ద సినిమాలను విడుదల చేయకుండా వేరే ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ► చిన్న, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా టిక్కెట్ ధరలను పెంచేస్తున్నారు. ప్రేక్షకుల సొమ్మును హీరో హీరోయిన్లకు పారితోషికం రూపంలో ఇస్తున్నారు. ఓ ఐదుగురు పెద్ద టెక్నీషియన్స్‌ను, హీరోలను, హీరోయిన్లను మనం పెంచుతున్నాం. -
‘దెయ్యంతో సహజీవనం’.. ఓ అమ్మాయి పగ
బాగా చదువుకొని బంగారు పతకం సాధించిన ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారిపై ఆ అమ్మాయి ఎలా పగ తీర్చుకుంది? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘డీఎస్‌జె’ (దెయ్యంతో సహజీవనం). నిర్మాత నట్టికుమార్ దర్శకత్వం వహించగా, ఆయన కుమార్తె కరుణ లీడ్ రోల్లో నటించారు. నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రంలోని తొలి పాట నేడు విడుదలవుతోంది. ‘‘మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నట్టి క్రాంతి. ‘‘కరోనా సమయంలోనూ యూనిట్ అంతా భయపడకుండా మాకు సహకరించడం వల్ల ఈ సినిమాని త్వరగా పూర్తి చేశాం’’ అన్నారు నట్టికుమార్. చదవండి: కరోనా నివారణ నిధికి రూ.కోటి విరాళం -
'వకీల్‌సాబ్'కు వ్యతిరేకంగా చేసిన జీవో కాదు
సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకూ, చిన్న నిర్మాతలకూ మేలు చేసేలా ఉందని అన్నారు దర్శక – నిర్మాత నట్టి కుమార్. ఈ విషయంపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35 జారీ చేసింది. టిక్కెట్ల రేట్ల సవరణకు సంబంధించి కొత్త జీవో పాస్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఫిల్మ్ ఛాంబర్ తరఫున మేము అడుగుతూ వచ్చాం. ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమాల నిర్మాతలకు ఉద్దేశించి ఇప్పుడు జీవోను పాస్ చేశారు. ‘వకీల్‌సాబ్’ సినిమా 9న రిలీజ్ అయితే, ఆ జీవో 8న పాస్ అయ్యింది. ‘వకీల్‌సాబ్’కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్ చేశారంటూ ప్రచారం సాగింది. అది వాస్తవం కాదు. నిజానికి, ఇలాంటి జీవో కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి చాలా సార్లు సంప్రదించాం. ‘వకీల్‌సాబ్’ టికెట్ రేట్లలో తేడాల వల్లే బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి. అంతేకానీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ షోలను రద్దు చేసిందనేది అవాస్తవం. నిర్మాత డి. సురేశ్‌బాబు మీటింగులు పెట్టి, థియేటర్స్ బంద్ అంటున్నారని తెలిసింది. ‘వకీల్‌సాబ్’ నడిచేవరకు థియేటర్లు ఉంచి, తరువాత బంద్ చేస్తారట. ఈ నెల 16న నా సినిమా (‘ఆర్జీవీ దెయ్యం’) విడుదల ఉంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కోర్టుకు వెళతాను. థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తుంటే, వారి లైసెన్సులను రద్దు చేయాలి’’ అన్నారు. ‘‘కరోనా సమయంలోని మూడు నెలల ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల ఛార్జీలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అలాగే, టిక్కెట్ రేట్ల అడ్డగోలు పెంపును అడ్డుకుంటూ, సామాన్యుడికి ప్రభుత్వం మేలు చేసింది’’ అన్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ జె.వి. మోహన్ గౌడ్. -
అందుకే రాజీనామా చేస్తున్నా
తెలుగు ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రటరీ పదవికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి దర్శక–నిర్మాత నట్టి కుమార్ శనివారం రాజీనామా చేశారు. ‘‘చిన్న నిర్మాతల సినిమాలను విడుదల చేయనీకుండా కొంతమంది అడ్డుకుంటు న్నారు.. దానికి నిరసనగానే రాజీనామా చేశా. ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలు విడుదల కావు కాబట్టి ఐదుగురు పెద్ద వ్యక్తులు థియేటర్లని మార్చి వరకూ ఓపెన్ చేయకూడదని అనుకుంటున్నారు. థియేటర్స్‌ని నడిపించకపోతే థియేటర్ లీజ్ ఓనర్స్ అయిన నిర్మాతల ఇంటి ముందు ధర్నా చేస్తా’’ అన్నారు నట్టి కుమార్. -
నాన్నతో సినిమా చేయడం హ్యాపీ
దర్శక–నిర్మాత నట్టి కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘డి.ఎస్.జె’ (దెయ్యంతో సహజీవనం). ఈ సినిమా ద్వారా నట్టి కుమార్ కుమార్తె కరుణ కథానాయికగా, కుమారుడు క్రాంతి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘నా దర్శకత్వంలో నా కూతురు కరుణ హీరోయిన్గా, నా కుమారుడు క్రాంతి నిర్మాతగా చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు నట్టి కుమార్. ‘‘నాన్న డైరెక్షన్లో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు నట్టి కరుణ. -
ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’
-
‘ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: సినిమాను సినిమా లాగా మాత్రమే చూడాలని ‘దిశ.. ఎన్కౌంటర్’ చిత్ర నిర్మాత నట్టి కుమార్ అన్నారు. చట్టాలకు లోబడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఎవరి మనోభావాలను కించపరచే విధంగా సినిమా తీయడం లేదని చెప్పారు. దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా సెన్సార్ బోర్డును కేంద్రప్రభుత్వం ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నట్టికుమార్ స్పందించారు. దిశ బయోపిక్‌ని తీయడం లేదని, మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు మళ్లీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. (చదవండి: ట్విటర్ వేదికగా ట్రైలర్ విడుదల చేసిన ఆర్జీవీ) దిశ తల్లిదండ్రులు తమను సంప్రదించలేదని చెప్పారు. నవంబర్ 26న ‘దిశ.. ఎన్ కౌంటర్’ సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. సెన్సార్ బోర్డు ఇంకా మాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని నట్టికుమార్ వెల్లడించారు. దిశ కమిషన్‌కు సంబంధించిన విషయాలను సినిమాలో ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా ఈ చిత్రంలో చూపించామమని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా నిడివి గంటా 50 నిముషాలు ఉంటుందని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో పోకిరీలు పెట్టే కామెంట్స్‌పై స్పందించలేమని అన్నారు. సైబర్ నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నట్టికుమార్ కోరారు. దిశ చిత్రంపై పూర్తి వివరాలను వర్మ త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. (చదవండి: ‘దిశ’ ఘటనపై వర్మ సినిమా ఆపండి)