
ఎన్నికల వేల వైఎస్సార్‌సీపీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. 1981 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నట్టి కుమార్, ఆంధ్రప్రదేశ్‌లో టీపీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందం నచ్చకే కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టుగా తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటు వేయకపోతే పసుపు కుంకాలు పోతాయి అనటం సరైందికాదు. ఆయన నీచంగా మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. జగన్‌మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్, కేఏ పాల్‌లను వాడుకుంటున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాబోది వైఎస్ జగనే అన్నారు.
(చదవండి : ‘రిజల్ట్ చూసి మీ గుండెలు పగిలిపోతాయి’)
పవన్ కల్యాణ్ తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారన్న వ్యాఖ్యలపై కూడా నట్టి కుమార్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కు ఎవరు చెప్పారో తెలియదు గాని తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అనవసరంగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కల్యాణ్‌కు సూచించారు.
చిరంజీవి కాపులను ఓన్ చేసుకొని దెబ్బతిన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే కులాలకు అతీతంగా ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇచ్చారన్నారు. చంద్రబాబు.. ఇప్పుడు కట్టుబట్టలతో అమరావతి వచ్చాము అంటున్నారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాలు.. రాజమండ్రి, వైజాగ్, అమలాపురం, యానాంను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.