
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందాడు.
కార్యదర్శకులు ప్రసన్న కుమార్(378), వైవీఎస్ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు.
ఈసీ మెంబర్స్‌గా గెలుపొందింది వీరే..
- దిల్ రాజు (470 ఓట్లు)
- దానయ్య- 421
- రవి కిషోర్ - 419
- యలమంచిలి రవి- 416
- పద్మిని- 413
- బెక్కం వేణుగోపాల్- 406
- సురేందర్ రెడ్డి- 396
- గోపీనాథ్ ఆచంట- 353
- మధుసూదన్ రెడ్డి- 347
- కేశవరావు- 323
- శ్రీనివాద్ వజ్జ- 306
- అభిషేక్ అగర్వాల్-- 297
- కృష్ణ తోట- 293
- రామకృష్ణ గౌడ్- 286
- కిషోర్ పూసలు- 285
అందరం కలిసి కట్టుగా పని చేస్తాం: సీ.కల్యాణ్
నిర్మాతల మండలి ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయని నిర్మాత సీ. కళ్యాణ్ అన్నారు. ఇకపై అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. ప్రొడ్యూసర్ గిల్డ్‌ని కూడా నిర్మాతల మండలిలో కలపాలని ఆయన కోరారు. ఇద్దరు చీడ పురుగుల వల్ల సిస్టమ్ చెడిపోయిందని, అది అందరూ గుర్తించి వారిని ఓడగొట్టారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment