ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు.. దామోదర ప్రసాద్ ఘన విజయం
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందాడు.
కార్యదర్శకులు ప్రసన్న కుమార్(378), వైవీఎస్ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు.
ఈసీ మెంబర్స్‌గా గెలుపొందింది వీరే..
దిల్ రాజు (470 ఓట్లు)
దానయ్య- 421
రవి కిషోర్ - 419
యలమంచిలి రవి- 416
పద్మిని- 413
బెక్కం వేణుగోపాల్- 406
సురేందర్ రెడ్డి- 396
గోపీనాథ్ ఆచంట- 353
మధుసూదన్ రెడ్డి- 347
కేశవరావు- 323
శ్రీనివాద్ వజ్జ- 306
అభిషేక్ అగర్వాల్-- 297
కృష్ణ తోట- 293
రామకృష్ణ గౌడ్- 286
కిషోర్ పూసలు- 285
అందరం కలిసి కట్టుగా పని చేస్తాం: సీ.కల్యాణ్
నిర్మాతల మండలి ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయని నిర్మాత సీ. కళ్యాణ్ అన్నారు. ఇకపై అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. ప్రొడ్యూసర్ గిల్డ్‌ని కూడా నిర్మాతల మండలిలో కలపాలని ఆయన కోరారు. ఇద్దరు చీడ పురుగుల వల్ల సిస్టమ్ చెడిపోయిందని, అది అందరూ గుర్తించి వారిని ఓడగొట్టారని అన్నారు.