Telugu Film Producers Council
-
సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
చాలా రంగాల్లో లైగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. కొందరు ధైర్యం చేసి కంప్లైంట్స్ ఇస్తున్నారు. మరికొందరు ఎవరికీ చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళలపై గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న హింసపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రిటైర్డ్ నాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఏం చెప్పారంటే?కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ రిలీజైన వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. పూనమ్ కౌర్ తనకు అన్యాయం జరిగిందని ట్విటర్లో చెప్పితే ఎలా? లిఖిత పూర్వకంగా తనపై జరిగిన హింసని చెబితేనే కదా? జానీ మాస్టర్‌కి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌ని ఈ లైంగిక వేధింపుల కేసు విచారణ ముగిసే వరకు ఇవ్వకూడదని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రికి డిమాండ్ చేస్తున్నాం.షూటింగ్స్ జరిగే ప్రదేశాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఇలాంటి వేధింపులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఓ చట్టం తీసుకురావాలి. వానిటీ వెహికల్ తదితర సౌకర్యాల్ని తమిళనాడు లాగా నిర్మాతలు వెంటనే రద్దు చేయలి. ఈ లైంగి వేధింపుల కేసు తేలే వరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు. -
గద్దర్ అవార్డ్స్.. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్!
త్వరలోనే గద్దర్ అవార్డ్స్ పై విధి విధానాలను రూపొందించి సీఎం రేవంత్ గారికి అందచేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది.గద్దర్ అవార్డ్స్ పేరిట ప్రతి సంవత్సరం అవార్డ్స్ ప్రకటించడం పట్ల ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడంపై చర్చించడం జరిగిందని తెలిపారు. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను (ఎఫ్డీసీ) కోరినట్లు పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ఒక కమిటీని నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని లేఖ విడుదల చేశారు.కాగా.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తే.. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి స్పందన రాలేదని ముఖ్యమంత్రి మాట్లాడారు. దీంతో ఈ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. TFPC & TFCC thanking Telangana Chief Minister @revanth_anumula for Prestigious Gaddar Awards #GaddarAwards pic.twitter.com/y3LJg8IKlE— Telugu Film Producers Council (@tfpcin) July 31, 2024 -
ప్రొడ్యూసర్ కౌన్సిల ఎన్నికల్లో దిల్ రాజు హవా..
-
నేను అనుకున్నదే ఎన్నికల్లో జరిగింది: దిల్ రాజు
నిర్మాతల మండలి ఎన్నికలు ఏకగ్రీవం చేయాలనుకున్నామని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అన్నారు. నిర్మాతల మండలికి ప్రతి రెండేళ్లకొకసారి ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కానీ నాలుగేళ్లుగా ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ సారి అత్యధిక మెజార్టీతో నన్ను ఈసీ మెంబర్‌గా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అందరూ నన్ను వివాదాస్పద వ్యక్తిగా చూసినా.. నా మెజార్టీ చూస్తే ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతోందన్నారు,. దిల్ రాజు మాట్లాడుతూ.. ' నిర్మాతల మండలి ఎన్నికలు ఏకగ్రీవానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉండాలని కోరుకున్నా. ఇప్పుడు అదే జరిగింది. మేమందరం కలసి పని చెస్తాం.' అని అన్నారు. కాగా.. ఇవాళ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందాడు. కార్యదర్శకులు ప్రసన్న కుమార్(378), వైవీఎస్ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్‌గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు. -
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు (ఫొటోలు)
-
తెలుగు నిర్మాత మండలి అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్
-
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు.. దామోదర ప్రసాద్ ఘన విజయం
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందాడు. కార్యదర్శకులు ప్రసన్న కుమార్(378), వైవీఎస్ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు. ఈసీ మెంబర్స్‌గా గెలుపొందింది వీరే.. దిల్ రాజు (470 ఓట్లు) దానయ్య- 421 రవి కిషోర్ - 419 యలమంచిలి రవి- 416 పద్మిని- 413 బెక్కం వేణుగోపాల్- 406 సురేందర్ రెడ్డి- 396 గోపీనాథ్ ఆచంట- 353 మధుసూదన్ రెడ్డి- 347 కేశవరావు- 323 శ్రీనివాద్ వజ్జ- 306 అభిషేక్ అగర్వాల్-- 297 కృష్ణ తోట- 293 రామకృష్ణ గౌడ్- 286 కిషోర్ పూసలు- 285 అందరం కలిసి కట్టుగా పని చేస్తాం: సీ.కల్యాణ్ నిర్మాతల మండలి ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయని నిర్మాత సీ. కళ్యాణ్ అన్నారు. ఇకపై అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. ప్రొడ్యూసర్ గిల్డ్‌ని కూడా నిర్మాతల మండలిలో కలపాలని ఆయన కోరారు. ఇద్దరు చీడ పురుగుల వల్ల సిస్టమ్ చెడిపోయిందని, అది అందరూ గుర్తించి వారిని ఓడగొట్టారని అన్నారు. -
ముగిసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఈ ఎన్నికలు జరిగాయి. నిర్మాత మండలిలో మొత్తం 1134 మంది ఉండగా.. 678 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో దిల్ రాజు, సి కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి, మైత్రి రవి కిరణ్, స్రవంతి రవి కిషోర్, ఠాగూర్ మధు సునీల్ కుమార్ రెడ్డి, నాగబాబు, అశ్వినిదత్, తదితరులు ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమినీ గణేష్‌లు ఉన్నారు. దామోదర ప్రసాద్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు ప్రకటించగా.. జెమినీ కిరణ్‌కు సీ.కల్యాణ్ కల్యాణ్ మద్దతు తెలిపారు. ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో దామోదర ప్రసాద్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ పేరుతో జెమినీ కిరణ్ బరిలోకి దిగారు. -
ప్రారంభమైన తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల పోలింగ్
-
ఆయనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం.. సి.కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. టీఎఫ్‌పీసీ (TFPC) కమిటీపై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారని ఆరోపించారు. మా సభ్యుల్లో కె.సురేష్ బాబుని మూడేళ్లు, యలమంచిలి రవిచంద్‌ను జీవిత కాలం బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదని ఆయన అన్నారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఎప్పుడు అలాగే ఉండాలనేదే మా కోరిక అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో కల్యాణ్ మాట్లాడారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కల్యాణ్ వెల్లడించారు. కొందరు నిర్మాతలు ఛాంబర్ దగ్గర టెంట్‌వేసి సమస్యలపై పోరాడుతున్నట్లు ప్రకటించి లేనిపోని అపనిందలు వేశారని అన్నారు. నిర్మాతలమండలికి ఎలక్షన్లు జరపడం లేదంటూ కామెంట్లు చేశారు. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని.. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవచ్చన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'టీఎఫ్‌పీసీ కమిటీపై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్గనైజేషన్‌కి ఎవరు చెడ్డ పేరు తేవాలని చూసిన ఊరుకోం. ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు. మా కౌన్సిల్లో ప్రస్తుతం రూ.9 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. ఇంత అమౌంట్ పోగవ్వడానికి కారణం దాసరి నారాయణ రావు గారే. మా సభ్యులలో కె సురేశ్ కుమార్ మూడేళ్లు మాత్రమే సస్పెండ్ చేశాం. యలమంచిలి రవి కుమార్‌ను జీవిత కాలం బహిష్కరిస్తున్నాం. ఇకమీద తెలుగు చలనచిత్ర మండలికి ఆయనకి శాశ్వతంగా ఎలాంటి సంబంధం ఉండదు. 40 ఏళ్ల ఈ సంస్థలో ఇలా ఎవరూ చేయలేదు. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకోవచ్చు.' అని అన్నారు. ఫిబ్రవరి 19న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్: కల్యాణ్ వచ్చేనెలలో తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ ఉంటాయని సి.కల్యాణ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 19న ఓటింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌తో పాటు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఎలక్షన్స్ కోసం ఒక పది మంది సభ్యులు టెంట్లు వేశారని కల్యాణ్ ఆరోపించారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఒకసారి ఒక పదవిలో ఉంటే మళ్లీ పోటీ చేయనని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు. ఫిబ్రవరి 1 నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్ ఒకరు ఒక్క పోస్ట్‌కు మాత్రమే పోటీ చేయాలి 13వ తేదీ వరకు నామినేషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఎన్నికల అధికారిగా కె.దుర్గ ప్రసాద్ అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్ ప్రభుత్వాలను కోరతాం: కల్యాణ్ సినిమా పరిశ్రమపై ప్రభుత్వాల తీరును గురించి ప్రస్తావించారు సి కల్యాణ్. ఆంధ్రాకి సినిమా పరిశ్రమ వెళ్తుందని నేను అనుకోవట్లేదన్నారు. కొందరు పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారని సి.కల్యాణ్ అన్నారు. అవి ఏవి కూడా టీఎఫ్పీసీలో భాగం కాదన్నారు. నంది అవార్డులు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రలో నంది అవార్డులు, తెలంగాణలో సింహా అవార్డులు త్వరగా ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో మా ఫిలిం ఇండస్ట్రీ తరుపున అవార్డులను మేమే ఇస్తామని కల్యాణ్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ఫండ్ వివరాలు వెల్లడించిన కల్యాణ్ ఇక కౌన్సిల్ ఫండ్ గురించి మాట్లాడుతూ.. ' మా కౌన్సిల్ లో ప్రస్తుతం రూ.9 కోట్ల ఫండ్ ఉంది. ఇంత అమౌంట్ రావడానికి దాసరి నారాయణ రావు గారే. మాకు తిరుపతిలో ఒక బిల్డింగ్ ఉంది. మూవీ టవర్స్‌లో రెండు కోట్ల 40 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది 10 కోట్లకు చేరింది. డిసెంబర్ 31వ తేదీ వరకు అకౌంట్స్ అన్ని ఈసీలో పాస్ అయినవే అని అన్నారు. వాటితో ఎలాంటి సంబంధం లేదు అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్న సౌత్ ఇండియా ఫిలింఛాంబర్ .. దానికి అనుబంధంగా తెలుగు చలన చిత్ర మండలి, ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఉన్నాయని తెలిపారు. అంతే కానీ ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఆంధ్ర ఫిల్మ్ ఫెడరేషన్ వంటి సంస్థలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారు. అవి ఏవి కూడా మా సంస్థలో భాగం కాదని కల్యాణ్ స్పష్టం చేశారు. -
తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత సురేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు
గత కొంతకాలంగా టాలీవుడ్లో తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయం చిన్న వివాదం జరుగుతుంది. సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా నిర్మాతల మండలి నిర్ణయంపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సంక్రాంతి సీజన్లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు. ‘తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడట్లేదు. చెన్నైలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లోకల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారు. సినిమా బాలేకుంటే తరువాతి రోజే తీసేస్తారు. ఇదొక బిజినెస్ అంతే. ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో విడుదలయి విజయం సాధిస్తున్నాయి. -
టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం
అనువాద చిత్రాల వివాదం ముదిరేలా కనబడుతోంది. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించే విషయమై, ఇతర సమస్యల గురించి చర్చలు జరపడానికి ఆ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిందనే టాక్ వినిపించింది. అయితే ‘వారిసు’ తమిళ సినిమా కాబట్టి షూటింగ్ ఆపలేదని ‘దిల్’ రాజు పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ‘వారిసు’ తమిళ సినిమాయే అనే ముద్ర పడిపోయింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారిసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా సంక్రాంతి సందర్భంగానే నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ సంక్రాంతి రిలీజ్‌కే ముస్తాబు అయ్యింది. వీటితో పాటు తమిళంలో అజిత్ ‘తునివు’ కూడా సంక్రాంతి రిలీజ్‌కే రెడీ అవుతోంది. దాంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల థియేటర్ల సంఖ్య గురించిన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారని టాక్. ఒకవేళ తెలుగులో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా కోలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్‌లో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే పని కాదని ‘తోడేలు’ ఈవెంట్లో అల్లు అరవింద్ పేర్కొన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాల రిలీజ్‌లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్‌లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరుతూ లేఖ రాశాం’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. సంక్రాంతికి మొదట ఆ చిత్రాలకే ..!
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లకు లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ సినిమాల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో వెల్లడించింది. 2017లో జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అత్యవసర మీటింగ్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సంక్రాంతి, దసరా పండుగలకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసింది. ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు దిల్‌రాజు 2019లో ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. టాలీవుడ్ చిత్రాలు ఉండగా.. డబ్బింగ్ చిత్రాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారని గతంలో దిల్ రాజు ప్రశ్నించారు. అందువల్లే ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు తప్పకుండా పాటించాలని లేఖలో వివరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల మండలి లేఖలో ప్రస్తావించింది. సంక్రాతి, దసరా పండుగల సమయంలో తెలుగు సినిమాలకు మొదటి ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్‌ను కోరింది. Telugu Film Producers Council Press Note.#TFPC #PRESSNOTE pic.twitter.com/uu9oqqc0uc — Telugu Film Producers Council (@tfpcin) November 13, 2022 -
సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి కీలక ప్రకటన
సినీ కార్మికుల వేతనాల పెంపుకు చలన చిత్ర నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫలిం ఫెడరేషన్ సంయుక్తంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చాయి. ఇక ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ తాజా వేతనాల పెంపు సవరణ అనేది 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మతల మండలి స్పష్టం చేసింది. కాగా ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp — Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022 చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి -
టాలీవుడ్ హబ్‌ను ఏర్పాటు చేయాలి: విజయేంద్ర ప్రసాద్
‘‘తెలుగులో ‘టాలీవుడ్ హబ్’ ఏర్పాటు చేయాలి. దీని కోసం దక్షిణ భారత చిత్రనిర్మాతలు, దర్శకులు తదితరులను ఆహ్వానించాలి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్, ఇతర సినిమా అసోసియేషన్స్ సహకారంతో హైదరాబాద్‌లో సభ నిర్వహించాలి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీగారిని ఆహ్వానించాలి’’ అన్నారు రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్. గురువారం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యాలతయానికి వెళ్లిన విజయేంద్ర ప్రసాద్‌ను నిర్మాతల మండలి తరఫున ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల సత్కరించారు. -
ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో ‘మా’ కీలక భేటీ.. ‘అవసరమైతే స్ట్రయిక్ తప్పదు’
‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం దిశగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) సమస్యల గురించి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్లతో చర్చలు జరిపారు. బుధవారం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సభ్యులు సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ హాజరయ్యారు. ఇటు నిర్మాతలు ‘దిల్’ రాజు, మైత్రీ నవీన్, నాగవంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్, నటి-దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటీనటుల పారితోషికాలు, ‘మా’ సభ్యత్వం వంటి అంశాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలిసింది. నూతన నటీనటులను సినిమాల్లోకి తీసుకోవాలంటే వాళ్లు కచ్చితంగా ‘మా’లో అసోసియేట్ లేదా లైఫ్ మెంబర్షిప్ అయినా ఉండాలని, వేరే భాషల నటులను ఇక్కడి సినిమాలకు తీసుకుంటే వాళ్లకు కూడా ‘మా’లో మెంబర్షిప్ ఉండాలనే నిర్ణయాలను ‘మా’ ప్రతిపాదించిందట. ఓటీటీల్లో నటించే ఆర్టిస్టులకూ ‘మా’లో సభ్యత్వం ఉండాలనే అంశాన్ని కూడా చర్చించారట. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు వందమంది సీనియర్ నటీనటుల పేర్లు సూచించి, వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలను ‘మా’ కోరినట్లు తెలిసింది. షూటింగ్ బంద్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలోపు ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులనే తీసుకోవాలన్నట్లుగా నిర్మాతలు నిర్ణయించుకోవాలని కూడా ‘మా’ కోరిందని భోగట్టా. అలా కాని పక్షంలో ‘మా’నే స్ట్రైక్‌కు పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. -
షూటింగ్ ఆపితే ఊరుకునేది లేదు: టియఫ్‌సీసీ చైర్మన్ ఆర్.కె.గౌడ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్స్ ఆపితే ఊరుకోబోమని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ (ఆర్.కె. గౌడ్) హెచ్చరించారు. షూటింగ్స్ నిలివేత అంశంపై మాట్లాడేందుకు శనివారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ.. స్వార్థం కోసమే ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ నిలిపివేస్తుందని ఆరోపించారు. ‘తెలంగాణలో 50 మంది వరకు నిర్మాతలున్నారు. చాలా మంది చిత్రీకరణ చేస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ అని గిల్డ్ నిర్మాతలు అంటున్నారు. ఎందుకు ఆపాలి? ఇదంతా వారి స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప చిత్ర పరిశ్రమకు ఉపయోగపడేది కాదు. చిత్ర పరిశ్రమ నలుగురిది కాదు.. అందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. బంద్ ప్రకటిస్తే వర్కర్స్కు ఇబ్బంది అవుతుంది. గిల్డ్ నిర్మాతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరికునేది లేదు. టికెట్ ధరలు పెంచుకుంది వారే.. ఇప్పుడు ధియేటర్ లకు ప్రేక్షకుల రావటం లేదని ఎడ్చేది వారే. ఆర్టిస్ట్ లకు రెమ్యూనిరేషన్ లు పెంచింది కూడా గిల్డ్ నిర్మాతలే. ఇంకొకరు ఎదగొద్దు అనేలా గిల్డ్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. గిల్డ్ నిర్మాతలే ఓటీటీలకు తమ సినిమాలను ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇవన్ని తప్పులు వారు చేసి..ఇప్పుడు షూటింగ్ బంద్ అంటే ఎలా? బంద్ చేస్తే ఊరుకునేదే లేదు’అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆర్.కె. గౌడ్ హెచ్చరించారు. టికెట్ రేట్లు తగ్గించి, పర్సంటేజ్ విధానం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ... కొంత మంది సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాతగా ఎదిగినవారే. నేను కూడా చాలా చిత్రాలు నిర్మించాను. కానీ సరైన థియేటర్స్ దొరక్క ఎంతో నష్టపోయాను. షూటింగ్స్ బంద్ చేయడానికి మీకు అధికారం లేదు. సామాన్యుడు ప్రస్తుతం సినిమా చూడాలంటే భయపడుతున్నాడు. కారణం టికెట్ల రేట్లు, తినుబండారాల రేట్లు పెంచడం. ముందు వీటిని తగ్గించండి. అంతే కానీ షూటింగ్స్ నిలిపేస్తే వచ్చేది ఏం లేదు. ఎవరైనా తమ షూటింగ్స్ ఆపారని మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రభుత్వం సపోర్ట్ తో వారిని ఎదుర్కొంటాం` అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రటరి సాగర్, హీరో సురేష్ బాబు, చెన్నారెడ్డి, కిషోర్, సతీష్, రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ
టాలీవుడ్ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో బడ్జెట్ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్, టికెట్ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్ వ్యయం, హీరోల రెమ్యునరేషన్ అంశాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు తాత్కాలికంగా షూటింగ్ నిలివేస్తున్నట్లు నిన్న నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. చదవండి: Tollywood: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం, కొత్త నిబంధనలివే! దీంతో షూటింగ్ దశలో ఉన్న పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఇదే ఇదే అంశంపై పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. నీ సందర్భంగా స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో కూడా ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యుసర్స్ గిల్డ్ తెలిపింది. షూటింగ్ సంక్షోభంపై నిర్మాతల గిల్డ్‌కు చిరంజీవి లేఖ రాసినట్లు సమాచారం అందింది. ఇక దీనిపై ఈ రోజు మధ్యాహ్నం నిర్మాతలు భేటీకి సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. చదవండి: ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ -
ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్‌లకు తాత్కాలిక బ్రేక్
-
షూటింగ్స్ బంద్.. ఎఫెక్ట్ అయ్యే పెద్ద సినిమాలివే!
టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్ కానున్నాయంటూ కొన్నిరోజులుగా ఊరిస్తున్న ఊహాగానాలు నిజమే అయ్యాయి. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ పడనుంది. దీంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. అటు ఓటీటీ రిలీజ్‌పైనా కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రొడ్యూసర్స్ గిల్డ్. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లో రిలీజైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తేల్చి చెప్పింది. మామూలు బడ్జెట్‌తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే ఆరు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల ఓటీటీ రిలీజ్ అంశంపై ఫెడరేషన్తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామంది. షూటింగ్స్ బంద్‌తో ఎఫెక్ట్ అయ్యే పెద్ద సినిమాలివే.. ► బాబీ - చిరంజీవి సినిమా ► గాడ్ ఫాదర్ ► మెహర్ రమేశ్- చిరంజీవి ► గోపీచంద్ మలినేని- బాలకృష్ణ (NBK107) ► హరిహర వీరమల్లు ► శంకర్- రామ్‌చరణ్ (RC15) ► వంశీ పైడిపల్లి- విజయ్ ► ఖుషీ ► యశోద ► ఏజెంట్ ఇవి కాకుండా పుష్ప2, భవదీయుడు భగత్ సింగ్, త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్లో ఓ మూవీ, కొరటాల శివ- తారక్ కాంబినేషన్లోని భారీ చిత్రాలు సెట్స్‌కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా తాజా నిర్ణయంతో వాటికి ఆదిలోనే ఆటంకం ఏర్పడినట్లయింది. చదవండి: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్! -
ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్!
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా బంద్ చేయాలని భావిస్తోంది. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానించింది. అలాగే ఓటీటీ రిలీజ్‌లపైనా పలు నిర్ణయాలు తీసుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను పది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించింది. పరిమిత బడ్జెట్లో తీసిన చిత్రాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని చెప్పింది. అలాగే రూ.6 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించిన సినిమాల ఓటీటీ రిలీజ్ విషయంపై ఫెడరేషన్తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఓటీటీలో కొత్త సినిమాలు, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాలపై సుమారు గంటపాటు చర్చించిన అనంతరం.. సినిమా ప్రదర్శన కోసం చెల్లించే వీపీఎఫ్ ఛార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణ థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 రూపాయలు ఉండేలా ప్రతిపాదనలు ముందు పెట్టింది. మల్టీఫ్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేసింది. ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని సూచించింది. ఫిలిం చాంబర్ నిర్ణయించిన రేట్ కార్డ్ నే షూటింగ్ ప్రదేశాల్లో నిర్మాతలు అమలు చేయాలని ఆదేశించింది. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థను తొలగించాలని మండిపడింది. నిర్ణీత సమయానికల్లా నటీనటులు షూటింగ్స్‌కు హాజరయ్యేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. నిర్దేశించిన సమయానికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని తెలిపింది. నటీనటుల సహాయకులకు వసతులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పారితోషకంలో కోత విధించాల్సిందేనని పేర్కొంది. చదవండి: రణ్వీర్ సింగ్‌ను అనుకరించిన నటుడు, నిజంగానే అంత సాహసం చేశాడా? హోంటూర్ వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల -
షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
-
ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉంది: సి కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నిర్మాతల మండలి సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లతో ఫిలిం చాంబర్లో నిర్మాతల మండలి భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కాగా, షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. తమ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనేది అవాస్తవమన్నారు. ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో కొత్త సినిమాలు వంటి అంశాలు నిర్మాతల మండలి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఓటీటీ, వీపీఎఫ్ చార్జెస్, టిక్కెట్ ధరలు, నిర్వహణ వ్యయం వంటి అంశాలపై ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సి. కళ్యాణ్ , సునీల్ నారంగ్ , స్రవంతి రవికిశోర్, సుప్రియ, దర్శకుడు తేజ, వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. భేటీకి ముందు తెలుగు ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్ రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటీటీల వల్ల థియేటర్లు, డిస్ట్రీబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పెద్ద సినిమాలను 8 వారాలు, చిన్న సినిమాలు 4 వారాల తర్వాతే ఓటీటీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 14 ఏళ్ల నుంచి అమలవుతున్న డిజిటల్ ఛార్జీలను యధాతథంగా కొనసాగించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్ల విక్రయం జరపాలన్నారు. రెంటల్ విధానంలో మార్పులు చేసి ఆక్యుపెన్సీలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ జూమ్ మీటింగ్ తమ డిమాండ్లను తెలియజేస్తామన్నారు. -
షూటింగ్స్ బంద్‌పై వీడని సస్పెన్స్!
టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్ కానున్నాయంటూ గతకొన్నిరోజులుగా వార్తలు ఊరిస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా దీనిపై నిర్మాత సి.కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్‌లు బంద్ చేయాలా? లేదా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలను యథాతథంగా కొనసాగనిచ్చి కొత్త సినిమాలు మాత్రం షూటింగ్ మొదలు పెట్టకుండా ఆపాలా? అన్న విషయాలపై చర్చిస్తున్నామన్నాడు. అలాగే ప్రేక్షకులకు టికెట్ రేట్లను అందుబాటులోకి తేవడం, ఓటీటీలపై చర్చించామని తెలిపాడు. ఈ నెల 23న అన్ని విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యాక ఫిలిం చాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు. బుధవారం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టికెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, అభిషేక్ నామా, వైవీఎస్ చౌదరి, యలమంచిలి రవి తదితరులు హాజరయ్యారు. చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! దుమ్ము లేపుతున్న లైగర్, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలంతే -
టాలీవుడ్ నిర్మాతల మండలి భేటీ.. కీలకాంశాలపై చర్చ!
Telugu Film Producers Council Meeting: రేపు (గురువారం) తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం కానుంది. హైదరాబాద్ ఫిలీం ఛాంబర్లో నిర్వహించే ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్‌లో కౌన్సిల్ సభ్యులందరు హాజరు కావాలని నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టికెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాలపై నిర్వహించే చర్చలు ప్రారంభదశలోనే ఉన్నట్లు ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం (జులై 21) తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. చదవండి:👇 షూటింగ్స్ బంద్‌పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక