లొకేషన్లు ఫ్రీగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు | Telugu Film Producers Council Request AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

లొకేషన్లు ఫ్రీగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు

Published Thu, May 28 2020 12:19 AM | Last Updated on Thu, May 28 2020 12:19 AM

Telugu Film Producers Council Request AP CM YS Jagan - Sakshi

ఆంధ్ర ప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని, స్టూడియోలు, ల్యాబ్స్‌ నిర్మాణానికి స్థలాలు, ఇండస్ట్రీ వర్గానికి హౌసింగ్‌కు అవసరమైన స్థలాలను కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఏపీ సీయం జగన్‌మోహన్‌ రెడ్డిని కోరుతూ ఓ లేఖ రాసింది.

నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వడ్లపట్ల మోహన్‌ బుధవారం ఈ లేఖను  ఏపీ టెలివిజన్‌ మరియు చిత్ర పరిశ్రమాభివృధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.విజయ్‌కుమార్‌ రెడ్డికి, విజయ్‌చందర్‌కు అందించారు. ఏపీలో షూటింగ్‌ చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్టు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్‌కి ఈ లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. చైన్నై నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలను నిర్మించుకోవడానికి ఉదారంగా స్థలాలు కేటాయించారని ఈ లేఖలో ప్రస్తావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement