
తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన స్టూడియోలు, నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు కావల్సిన మౌలిక సదుపాయాలు మరియు గృహనిర్మాణాల కోసం భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల్ని అభ్యర్థించటం జరిగిందని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సకాలంలో స్పందించి తమ ప్రభుత్వంలోని ఆయా శాఖాధికారులకు తదుపరి చర్యల నిమిత్తం పంపించటం జరిగిందని తెలియచేస్తూ, నిర్మాతల మండలికి లెటర్‌ను పంపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా ప్రతిపాదనలకు స్పందించినందుకు సీయం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని గురువారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది నిర్మాతల మండలి. తమ అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ‘మా’ నటుడు, నిర్మాత విజయ్‌చందర్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment