Land allocation
-
TS: కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాలు.. జీవో జారీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ , బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్ 55లో పేర్కొంది. కిందటి నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు. -
ఇదీ భూ కబ్జానే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులాలవారీగా భూములు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కుల సంఘాలకు భూములు ఇవ్వడాన్ని కూడా కబ్జాగానే పరిగణించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 47పై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులకు విరుద్ధంగా జీవో ఉందని చెప్పింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి ఉంటే వెంటనే ఆపాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వం గతంలో చేసిన ఇలాంటి భూ కేటాయింపును కూడా రద్దు చేశామంటూ సాయి సింధు ఫౌండేషన్‌అంశాన్ని ప్రస్తావించింది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని అణగారిన వర్గాలకు భూమి ఇస్తే అర్థం చేసుకోవచ్చు గానీ.. ఆర్థికంగా బలంగా ఉన్న కులాలకు ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వమే కులాలను పెంచి పోషించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్న న్యాయస్థానం.. హైటెక్ రాష్ట్రం తెలంగాణలో ఇదేం పద్ధతని తీవ్ర వాఖ్యలు చేసింది. కుల సంఘాల పేరిట రాజధాని నడిబొడ్డున అత్యంత విలువైన భూములను కేటాయించడం అసంబద్ధమైన విధానమంటూ తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్‌కు కుల సంఘ భవనాల నిర్మాణం కోసం 5 ఎకరాల చొప్పున హైటెక్ సిటీ సమీపంలో అత్యంత విలువైన భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కౌంటర్‌కు అనుమతి... ఈ పిటిషన్లో ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేస్తామని గత విచారణ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. వెలమ అసోసియేషన్‌కు మాత్రం రెండు వారాలు సమయం ఇస్తున్నామంది. కమ్మ సంఘం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోవిడ్ కాలంలో తమకు నోటీసు అందలేదని, భూ కేటాయింపుపై విచారణ సాగుతున్న విషయం ప్రచార మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. ఈ క్రమంలో తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అంగీకరించింది. కాగా, తమకు కేటాయించిన భూముల కబ్జా అయ్యే అవకాశం ఉందని, చుట్టూ ప్రహరీ కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కుల సంఘాల తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఈ భూ కేటాయింపే ఓ కబ్జా అని వ్యాఖ్యానించింది. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన పేద విద్యార్థులకు ఆశ్రయం కోసం హాస్టళ్లను నిర్మించేందుకు భూమి కేటాయించడంలో అర్థం ఉంది కానీ.. ఇలా కుల సంఘాలకు కేటాయింపును సమర్ధించలేమని పేర్కొంది. అసలు ఆ కుల సంఘాలు ఆయా కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. -
వైఎస్సార్సీపీ ఆఫీసుకు.. రెండెకరాలిస్తే తప్పేంటి?
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయ నిర్మాణం నిమిత్తం రెండెకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ–360లో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. శాసనసభలో 50 శాతం సీట్లు సాధించిన పార్టీకి నాలుగెకరాల వరకు స్థలం కేటాయించేందుకు వీలు కల్పిస్తూ 2016లోనే జీఓ జారీ అయిందని గుర్తుచేసింది. ఇప్పుడు వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని కేవలం రెండెకరాలు మాత్రమేనని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఇందులో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించేందుకు కూడా వీల్లేదని.. ఎందుకంటే భూ కేటాయింపు ప్రధాన జీఓ జారీ అయినప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో లేదని తెలిపింది. ఒకవేళ అభ్యంతరం ఉంటే, 2016లో జారీ అయిన జీఓ–340ను సవాలు చేసుకోవాలని స్పష్టంచేసింది. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో బిత్తరపోయిన పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేయాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరించి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మచిలీపట్నంలో పార్టీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండెకరాల స్థలం కేటాయిస్తూ గత ఏడాది మేలో జారీచేసిన జీఓ–360ని సవాలుచేస్తూ మచిలీపట్నానికి చెందిన వ్యాపారి బురకా శ్రీబాలాజీ కరుణశ్రీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అంచ పాండురంగారావు వాదనలు వినిపిస్తూ.. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్ఓ) ప్రకారం రాజకీయ పార్టీలకు భూమి ఇవ్వడానికి వీల్లేదన్నారు. కేవలం పాఠశాలలు, రహదారులు, సత్రాలు, ఆసుపత్రులు తదితరాలకు మాత్రమే ఇవ్వడానికి వీలుందన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు? ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. అసలు పిటిషనర్ ఎవరని, ఏ ప్రయోజనాలు ఆశించి ఈ వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాల్లేవని, కేవలం ప్రజా ప్రయోజనాలు ఆశించే ఈ వ్యాజ్యం దాఖలు చేశామని పాండురంగారావు చెప్పారు. రాజకీయ పార్టీలకు భూ కేటాయింపులను ఏ ప్రాతిపదికన చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. 2016లో జీఓ–340 జారీ అయిందంటూ పాండురంగారావు దానిని చూపారు. దానిని పరిశీలించిన ధర్మాసనం, ఈ జీఓలో శాసనసభలో 50 శాతం సీట్లు సాధించిన పార్టీకి నాలుగెకరాల వరకు కేటాయించవచ్చని ఉందని.. ఇక్కడ ప్రభుత్వం కేవలం రెండెకరాలు మాత్రమే కేటాయించిందని తెలిపింది. అంతేకాక.. భూ కేటాయింపులపై ప్రభుత్వానికి దురుద్దేశాలు కూడా ఆపాదించలేరని, ఎందుకంటే జీఓ–340 ఈ ప్రభుత్వ హయాంలో జారీకాలేదని, అప్పుడు అధికారంలో వేరే పార్టీ ఉందని తెలిపింది. వైఎస్సార్సీపీకి చేసిన భూ కేటాయింపుపై అభ్యంతరం ఉంటే, జీఓ–340ను సవాలు చేసుకోవాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ వ్యాజ్యంపై ఏం చేయమంటారని ధర్మాసనం ప్రశ్నించగా, విచారణను వాయిదా వేయాలని పాండురంగారావు కోరగా.. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. -
కోర్టు హాల్ నుంచి వెళ్లిపోండి.. సీజేఐనే బెదిరిస్తున్నారా?
న్యూఢిల్లీ: న్యాయవాదుల చాంబర్ల కోసం సుప్రీంకోర్టు ప్రాంగణంలోని కొంత స్థలం కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట సంబంధిత కేసు విషయమై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తన వాదనలు వినిపించారు. ‘ అప్పూ ఘర్ స్థలం ఎస్‌ఈబీఏ పిటిషన్ కారణంగానే సుప్రీంకోర్టు చేతికొచ్చింది. కానీ అందులో కేవలం ఒక్క బ్లాక్ మాత్రమే ఎస్‌ఈబీఏ, బార్‌కు కేటాయించారు. సంబంధిత కేసు ఆరునెలలైనా విచారణకు నోచుకోవట్లేదు’ అని వికాస్ గట్టిగా మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహంగా.. ‘ ‘సీజేఐనే బెదిరిస్తున్నారా ? ఇలాగేనా ప్రవర్తించేది ? కోర్టు హాల్ నుంచి వెళ్లిపోండి. మార్చి 17న విచారిస్తాం’ అని సీజేఐ ఆగ్రహంగా మాట్లాడారు. 2000 మార్చి 29వ తేదీ నుంచి ఇక్కడే ఉన్నాను. 22 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నా. ఎప్పుడూ ఇలా ఎవరితో ఇంతగా ఇబ్బంది పడలేదు’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
ఏపీ: జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్‌కు భూములు కేటాయింపు
-
ఏపీ: జిందాల్ స్టీల్ కంపెనీకి భూములు కేటాయింపు
సాక్షి, అమరావతి: జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 860 ఎకరాల భూములు కేటాయించింది. నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం మొమిడిలో ఈ భూములు కేటాయించింది. మొత్తం 7,500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరగనుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 2,500 మంది, పరోక్షంగా 15వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ క్రమంలో ఏపీఐఐసీకి(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) భూముల కేటాయింపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన స్టూడియోలు, నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు కావల్సిన మౌలిక సదుపాయాలు మరియు గృహనిర్మాణాల కోసం భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల్ని అభ్యర్థించటం జరిగిందని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సకాలంలో స్పందించి తమ ప్రభుత్వంలోని ఆయా శాఖాధికారులకు తదుపరి చర్యల నిమిత్తం పంపించటం జరిగిందని తెలియచేస్తూ, నిర్మాతల మండలికి లెటర్‌ను పంపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా ప్రతిపాదనలకు స్పందించినందుకు సీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని గురువారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది నిర్మాతల మండలి. తమ అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ‘మా’ నటుడు, నిర్మాత విజయ్‌చందర్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. -
‘అక్కినేని’కి రూ.5 వేలకు ఎకరా చొప్పున ఇచ్చారు
సాక్షి, హైదరాబాద్: సినీ స్టూడియోలకు నామమాత్రపు ధరకే ప్రభుత్వాలు గతంలో కూడా భూమిని కేటాయించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మంత్రిమండలి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే దర్శకుడు శంకర్‌కు భూ కేటాయింపుపై ఆమోదం తెలిపిందని పేర్కొంది. సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు రూ.5 లక్షల చొప్పున మోకిల్లలో 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఇటీవల ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు. దర్శకుడు శంకర్ వెనుకబడిన నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన బడుగు వర్గాలకు చెందిన వ్యక్తని, సినీ పరిశ్రమలో ఆయనకు 36 ఏళ్ల అనుభవం ఉందని తెలిపారు. రూ.50 కోట్లతో ప్రపంచ స్థాయి స్టూడియో నిర్మిస్తానని, తనకు రాయితీ పద్ధతిలో భూమి కేటాయించాలని శంకర్ ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకున్నారని వివరిం చారు. స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో శంకర్‌కు భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఫార్సు చేసిందన్నారు. ‘‘అక్కినేని నాగేశ్వర్రావుకు అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం 1975లో రూ.5 వేల చొప్పున 22 ఎకరాలను కేటాయించింది. పద్మాలయ స్టూడియో కోసం 1983లో రూ.8,500 చొప్పున 9.5 ఎకరాలను కేటాయించింది’’అని అరవింద్‌కుమార్ తెలిపారు. 1984లో సురేశ్ ప్రొడక్షన్‌కు నామమాత్రపు ధరకే అప్పటి ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. 1984లో దర్శకుడు రాఘవేందర్రావు, చక్రవర్తి, కృష్ణమోహన్‌కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు. శంకర్‌కు నార్సింగి, శంకర్పల్లి రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి అభివృద్ధి చేయని భూమి కేటాయించాం. అక్కడ మార్కెట్ విలువ ఎకరా రూ.20 లక్షలుగా ఉంది. సినీపరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను కేటాయించింది. ఇందులో కోసం శంకర్ రూ.4.4 కోట్లు డిపాజిట్ చేశారు. స్టూడియో నిర్మాణంతో 100 మంది శాశ్వత, 200 మంది తాత్కాలిక కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు, మరో వెయ్యి మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు’’అని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. -
శిఖం భూములనెలా కేటాయించారు?
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికులకు చెరువు శిఖం భూములను ఎలా కేటాయిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి మాజీ సైనికులెందుకు ఇబ్బందులు పడాలని నిలదీసింది. దేశ సరిహద్దుల్లో సైనికులు లేకపోతే మనకు రక్షణ ఎక్కడుందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మండిపడింది. తదుపరి విచారణలోగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని గురువారం ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణ రెడ్డికి వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కుమ్మర్‌పల్లి గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 55లో నాలుగు ఎకరాల భూమిని 2010 మే 12న కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాస్ పుస్తకాన్ని ఇచ్చినా భూమిని మాత్రం అప్పగించలేదు. తనకు భూమిని అప్పగించాలని పలుమార్లు కోరినా స్పందించలేదు. అయితే భూమిని కేటాయించి మూడేళ్లయినా సాగు చేయడం లేదు కాబట్టి కేటాయింపులను రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామంటూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ లక్ష్మీనారాయణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా రెవెన్యూ అధికారుల తీరును తప్పుబడుతూ వెంటనే భూమిని అప్పగించాలని 2017 డిసెంబర్లో ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. లక్ష్మీనారాయణ రెడ్డికి కేటాయించినవి శిఖం భూములని, వాటిని అసైన్మెంట్ కింద ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. శిఖం భూములని తెలిసినా ఎలా కేటాయించారని, భూమిని అప్పగించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఐదేళ్లు ఎందుకు కాలయాపన చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. శిఖం భూమిని అప్పగించే అవకాశం లేకపోతే వెంటనే ప్రత్యామ్నాయ భూమిని అప్పగించాలని, ఈ విషయాన్ని 11న తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
డైరెక్టర్ శంకర్‌కు భూమి, హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు ఎన్.శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేంటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరిగింది. శంకర్‌పల్లిలోని మోకిల్లాలో దర్శకుడు శంకర్‌కు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, కారు చౌకగా భూమిని కేటాయించారని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో రూ.50 కోట్లతో స్టూడియో నిర్మించనున్నట్టు శంకర్ ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. స్టూడియో ద్వారా 300 మందికి ఉపాధికి లభిస్తుందని పేర్కొన్నారు. (‘దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదు’) అయితే, ప్రభుత్వం కేటాయించిన భూమి ధర ఎంత ఉంటుందని హైకోర్టు ప్రశ్నించగా.. మార్కెట్ విలువ ప్రకారం రూ.2.50 కోట్లు ఉంటుందని హెచ్ఎండీఏ పేర్కొంది. మరి రూ.2.50 కోట్ల భూమిని ఏ ప్రతిపదికన రూ.5లక్షలకు ఎకరా చొప్పున కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్వారంటైన్లో ఉన్న నేపథ్యంలో కొంత గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించగా.. తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. (ఏవిధంగా సమర్థించుకుంటారు..? ) -
సెజ్ కోసం భూములిస్తే తాకట్టుపెట్టారు
సాక్షి, అమరావతి: బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు నిమిత్తం 2009లో కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు, కోట మండలాల్లో వేల ఎకరాల భూములు కేటాయించామని, ఆ సంస్థ ఆ భూములను తాకట్టుపెట్టి రూ.1,935 కోట్ల మేర రుణం తీసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకుందని ఏపీఐఐసీ హైకోర్టుకు నివేదించింది. పదేళ్ల క్రితం భూములు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంది. సెజ్ కింద భూములు పొందిన శ్రీసిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, అక్కడ వేల మంది ఉపాధి పొందుతున్నారని వివరించింది. కాని 4,731 ఎకరాల భూములు పొందిన కేఐపీఎల్ మాత్రం, ఐదంతస్తుల భవనం తప్ప ఏమీ కట్టనందున భూ కేటాయింపులను రద్దు చేశామని తెలిపింది. భూ కేటాయింపుల రద్దును సవాల్ చేస్తూ కేఐపీఎల్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వారం రోజుల పాటు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏపీఐఐసీ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. అక్టోబర్ 25న ఇచ్చిన యథాతథస్థితి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోర్టును అభ్యర్దించింది. -
ప్రధానిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపుపై వారు ప్రధానంగా ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో పార్టీ కార్యలయం నిర్మించడానికి భూమి కేటాయింపు అంశంపై మోదీతో చర్చించినట్టు తెలిపారు. ఉభయసభల్లో కలిపి 17మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారని.. చట్ట ప్రకారం తమకు 1000 చదరపు గజాల స్థలం వస్తుందన్నారు. అర్బన్ డెవలప్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 1000 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. -
అమరావతిలో కార్వీకి చౌకగా భూమి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌కు ప్రభుత్వం కారుచౌకగా భూమిని కేటాయించింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు నెలకొల్పేందుకు రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్‌కు 175 ఎకరాలను కేటాయించడంతోపాటు గ్రాంట్ రూపంలో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ఎక్స్‌ట్రాన్ సర్వర్స్ సంస్థకు పెట్టుబడికి మించి 121 శాతం రాయితీలు ఇవ్వడంతోపాటు 5.64 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం వేర్వేరుగా మూడు జీవోలు జారీ చేశారు. భూకేటాయింపులోనే రూ.58.29 కోట్ల లాభం అమరావతిలో మెగా ఐటీ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేస్తామని, 16.42 ఎకరాలను ఎకరం రూ.55 లక్షల చొప్పున కేటాయించాలని కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒక్కో ఉద్యోగం కల్పనకు రూ.50 వేల చొప్పన రాయితీ ఇవ్వాలని పేర్కొంది. రాజధానిలో ఎకరం ధర రూ.4.1 కోట్ల దాకా ఉన్నందున 16.42 ఎకరాల ధర రూ.67.32 కోట్లు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, కార్వీ సంస్థ కోరినట్లు ఎకరం రూ.55 లక్షల చొప్పున ధరకే కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయించింది. దీంతో రూ.67.32 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.9.03 కోట్లకే కార్వీకి దక్కనుంది. అంటే ఆ సంస్థకు భూకేటాయింపులోనే రూ.58.29 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. అలాగే ఉద్యోగాలు ఇస్తున్నందుకు గాను రాయితీగా రూ.60.1 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు కార్వీ సంస్థ రూ.390 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రోలిఫిక్ సంస్థకు రూ.50 కోట్ల గ్రాంట్ తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు రియలన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎకరం రూ.20 లక్షల చొప్పున 175 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ రూ.127.43 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి అదనంగా ప్రభుత్వం రూ.50 కోట్ల మేర గ్రాంట్‌గా మంజూరు చేయనుంది. 3,750 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రోలిఫిక్ సంస్థ పేర్కొంది. పెట్టుబడికి మించి రాయితీలు తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ఎక్స్‌ట్రాన్ సర్వర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 5.64 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 900 మందికి ఉపాధి కల్పిస్తామని ఈ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ పెట్టే పెట్టుబడికి మించి 121.7 శాతం రాయితీలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్స్‌ట్రాన్ సంస్థ పెట్టే పెట్టుబడి రూ.359.7 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల విలువ రూ.437.85 కోట్లు కావడం గమనార్హం. ఏపీ ఐటీ విధానం ప్రకారం.. పెట్టుబడిలో 30 శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. తిరుపతి సమీపంలో ఎకరం భూమి విలువ రూ.56 లక్షలు కాగా, ఎక్స్‌ట్రాన్‌కు ఎకరం రూ.25 లక్షల చొప్పున 5.64 ఎకరాలు కేటాయించారు. ఒక్కో ఉద్యోగ కల్పనకు రూ.10 వేల చొప్పున రాయితీ ఇస్తామని, ఐదేళ్లపాటు 25 శాతం మేర విద్యుత్ సబ్సిడీ ఇస్తామని, ఐదేళ్లపాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఇస్తామని, వ్యాట్, జీఎస్టీతోపాటు ఫిక్స్డ్ కేపిటల్ పెట్టుబడిని 100 శాతం రీయింబర్స్మెంట్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. -
తీర్చేసుకో ‘ఎన్నికల’ రుణం!
సాక్షి, అమరావతి: పరిశ్రమల ఏర్పాటు ముసుగులో రూ.కోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలుగు తమ్ముళ్లకు పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆర్థిక స్తోమత ఏమాత్రం లేని కంపెనీలకు విలువైన భూములను కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికల్లో అధికార పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్న కర్నూలు జిల్లా టీడీపీ నేత మిద్దె శాంతి రాముడికి చెందిన కంపెనీలకు ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టింది. అంతేకాదు విచ్చలవిడిగా రాయితీలను సైతం ప్రకటించింది. రూ.53 కోట్ల విలువైన 250 ఎకరాల భూములను శాంతిరాముడి కంపెనీలకు కేవలం రూ.5 కోట్లకే కట్టబెట్టారంటే సర్కారు పెద్దలు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ధర ఎందుకు తగ్గింది? రూ.660 కోట్ల పెట్టుబడితో ఫెర్రో సిలికాన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తానని, ఇందుకోసం భూమి కేటాయించాలని కోరుతూ అధికార పార్టీ నేత శాంతి రాముడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం రూ.5,00,000 మూలధనంతో(క్యాపిటల్) 2016 డిసెంబర్ 16న ట్రెమాగ్ అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. భూమి కోసం 2017 ఏప్రిల్ 3న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) అదే నెల 21న ఆ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం కోపర్తిలోని ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో 100 ఎకరాలను ఎకరం రూ.15,01,437 చొప్పున కేటాయిస్తూ 2017 అక్టోబర్ 14న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం మొత్తం సొమ్మును రూ.90 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంది. అడ్వాన్స్‌గా కేవలం రూ.35 లక్షలు చెల్లించిన ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీ మిగిలిన రూ.3.94 కోట్లు చెల్లించలేక చేతులెత్తేసింది. దీనితో భూ కేటాయింపును రద్దు చేస్తూ ఏపీఐఐసీ 2017 డిసెంబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని కారణాల వల్ల నగదు సమకూర్చుకోలేకపోయామని, 60 రోజుల సమయం ఇస్తే పూర్తి సొమ్ము చెల్లిస్తామంటూ ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీ 2018 ఏప్రిల్ 30న ఏపీఐసీసీకి లేఖ రాసింది. దీంతో వడ్డీతో కలిపి ఎకరం భూమిని ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీకి రూ.15,98,565 చొప్పున ధరకు కేటాయించాలని సూచిస్తూ ప్రభుత్వానికి ఏపీఐసీసీ ప్రతిపాదనలను పంపింది. కానీ, దీనికి భిన్నంగా ప్రభుత్వం ఎకరం రూ.3.50 లక్షల చొప్పున మొత్తం 100 ఎకరాలను రూ.3.50 కోట్లకు ట్రెమాగ్ అల్లాయిస్‌కు కేటాయిస్తూ 2018 అక్టోబర్ 23న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఎకరం విలువ రూ.30 లక్షల దాకా పలుకుతోంది. అంటే రూ.100 ఎకరాల విలువ ఎంత లేదన్నా రూ.30 కోట్లు తగ్గదు. అన్ని వసతులు ఉండే పారిశ్రామిక పార్కులో రూ.100 ఎకరాలను కేవలం రూ.3.5 కోట్లకే కేటాయించారంటే ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శాంతిరాం కెమికల్స్దీ అదే దారి.. తొలుత చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసి, విద్యాసంస్థల వ్యాపారంలోకి ప్రవేశించిన మిద్దె శాంతిరాముడు ఇప్పుడు కెమికల్స్, అల్లాయిస్ కంపెనీ పేరిట ప్రభుత్వం వందల ఎకరాలను చేజిక్కించుకుంటున్నారు. కెమికల్స్ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ ప్రతిపాదనలు పంపిన వెంటనే ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తోంది, రాయితీలు ఇస్తోంది. శాంతిరాం కెమికల్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో శాంతిరాముడి కుటుంబ సభ్యులే తప్ప ఇతరులెవరూ లేరు. రూ.5 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్‌తో 2012లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ రూ.900 కోట్ల పెట్టుబడితో కాల్షియం కార్పొనేట్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామంటూ 2015లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి ఆమోదం తెలుపుతూ 150 ఎకరాలను కేటాయిస్తూ 2016లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎకరం కేవలం రూ.1,00,500 ధరకే కేటాయించడం గమనార్హం. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటురులో కేటాయించిన ఈ 150 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.23 కోట్ల పైమాటే. అలాంటిది కేవలం రూ.1.5 కోట్లకే శాంతిరాముడి కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. అంతేకాదు 2015–20 పారిశ్రామిక పాలసీ కింద 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, వ్యాట్, జీఎస్టీపై 100 శాతం మినహాయింపు, రూ.1.50కే యూనిట్ విద్యుత్ వంటి భారీ రాయితీలను అందించింది. భూమి కేటాయించిన మూడేళ్లలో వినియోగంలోకి తీసుకురావాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకు అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. సన్నిహితుడి కాలేజీలకు అనుమతులు శాంతిరాం కెమికల్స్, ట్రెమాగ్ అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీల పేరిట రూ.53 కోట్ల విలువైన 250 ఎకరాల భూమిని టీడీపీ నేత శాంతిరాముడు కేవలం రూ.5 కోట్లకే దక్కించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజీ, హాస్పిటల్, మెడికల్ కాలేజీలకు అనుమతులు పొందారు. తాజాగా 2018 అక్టోబర్ 5న పారామెడికల్ కాలేజీకి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఆర్థికంగా తోడ్పాటు అందించిన తన సన్నిహితుడు శాంతిరాముడుకు ‘ముఖ్య’నేత భారీ స్థాయిలో ప్రయోజనాలు చేకూర్చుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ శాంతిరాముడితో భారీగా డబ్బు ఖర్చు చేయించేందుకే అత్యంత విలువైన భూములను కారుచౌకగా ఆయనకు కట్టబెడుతున్నారని సాక్షాత్తూ టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఫ్లైఓవర్ల కోసం ఆ భూములు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రెండు ముఖ్యమైన ఫ్లైఓవర్ల నిర్మాణానికి 160 ఎకరాల రక్షణ భూములను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 210 ఎకరాల రక్షణ భూములను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని సోమవారం ఆయన ట్విట్టర్లో షేర్ చేసి, నిర్మలా సీతారామన్‌కు ట్యాగ్ చేశారు. రెండేళ్లుగా రక్షణ భూముల కేటాయింపులకు ఎదురుచూస్తున్నామన్నారు. బెంగళూరులో కేటాయించిన ప్రాతిపదికనే హైదరాబాద్‌లో సైతం రక్షణ భూములు కేటాయిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
సెటిల్మెంట్లకు వేదికగా కేబినెట్ మీటింగ్
- భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ‘మీకెంత.. మీకెంత’ అని వాటాలు పంచుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. గురువారం తాత్కాలిక రాజధానిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్‌ని.. సెటిల్మెంట్లకు వేదికగా మార్చారని విమర్శించారు. కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గడికోట విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై చర్యలు తీసుకోకుండా టీడీపీ ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాల్సిన కేబినెట్లో వారి తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోగా.. కనీసం నోట్ల రద్దుపైన కూడా చర్చే జరగలేదన్నారు. కేబినెట్లో ఆమోదం తెలిపిన 12 అంశాలలో ఏడు అంశాలు భూ కేటారుుంపులేనని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భూ కేటారుుంపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధికి అడ్డుపడ్డట్టా..? పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని గడికోట స్పష్టం చేశారు. టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తే.. అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. విశాఖలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన సదస్సుతో ఎంత వరకు పెట్టుబడులు రాబట్టారని నిలదీశారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు: రాష్ట్రంలో రైతుల కష్టాలు ఈ సర్కారుకు పట్టడం లేదని, రబీ గురించి అసలు ఆలోచించడం లేదని గడికోట మండిపడ్డారు. బ్యాంకుల నుంచి రుణాలు దొరక్క.. రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వ్యాపారుల వద్ద డబ్బు లేదని, బ్యాంకుల్లో ఖజానా ఖాళీ అరుు్యందన్నారు. ఇవి చాలవన్నట్లు మహిళల్లో కొత్త అనుమానాలు పుట్టించారని, ఉన్న బంగారాన్ని లాగేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. -
'కేబినెట్ మీటింగ్ కాదు.. సెటిల్మెంట్ మీటింగ్'
-
చంద్రబాబు నాలుగెకరాలు కొనుక్కోలేరా?
-
ఇదో అధికార కబ్జా!
-
ఇదో అధికార కబ్జా!
♦ పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం ♦ శ్రీకాకుళం, కాకినాడల్లో ఇప్పటికే విలువైన భూములు ఎన్టీఆర్ ట్రస్టుకు సంతర్పణ ♦ రాజధానితో పాటూ జిల్లా కేంద్రాల్లోనూ భూములు కొట్టేయడానికి వీలుగా ఉత్తర్వులు ♦ శాసనసభలో బలం ఆధారంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు భూములు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట! టీడీపీ కార్యాలయం ముసుగులో శ్రీకాకుళంలో రూ.30 కోట్ల విలువైన రెండెకరాలు, కాకినాడలో రూ.25 కోట్ల విలువైన రెండువేల చదరపు గజాల భూమిని ఇప్పటికే కాజేశారు. తాజాగా రాజధానితో పాటూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా అత్యంత ఖరీదైన భూములను కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాజధానిలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ కార్యాలయాల నిర్మాణానికి భూములను నామమాత్రపు ధరకు 99 ఏళ్లకు లీజులకు కేటాయించేందుకు వీలుగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకు కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తారు. కానీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే భూములు కేటాయించాలనే మెలిక పెట్టడం వెనుక టీడీపీకి భారీ ఎత్తున భూములు దోచిపెట్టడానికే అన్నది స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు శ్రీకాకుళం, కాకినాడల్లో కాజేసిన తరహాలోనే మిగతా జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఖరీదైన భూములను గుర్తించి, వాటిని కేటాయించాలని కోరుతూ ఆపార్టీ జిల్లాల అధ్యక్షుల ద్వారా ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వ్యూహాత్మకంగా ఉత్తర్వులు.. రాజకీయ పార్టీలకు రాజధాని, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎకరం లోపు భూమిని 30 ఏళ్లకు లీజు పద్ధతిలో కేటాయించేలా ఆగస్టు 31, 1987లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో నాలుగు, జిల్లా కేంద్రాల్లో రెండెకరాలకు పైగా ఉన్న అత్యంత ఖరీదైన భూములను పార్టీ కార్యాలయాల ముసుగులో కాజేయడానికి ప్రతిపాదనలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేయాలని నిర్ణయించారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భారీ ఎత్తున భూములు దక్కకుండా నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. * శాసనసభలో 50 శాతం కన్నా ఎక్కువ స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల చొప్పున కేటాయించవచ్చు. * అసెంబ్లీలో 25 శాతం నుంచి 50 శాతం లోపు స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో అరెకరం వరకూ.. జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల వరకూ కేటాయించవచ్చు. * శాసనసభలో 25 శాతం లోపు స్థానాలుగానీ.. కనీసం ఒక్క స్థానంగానీ దక్కిన పార్టీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమిని కేటాయించవచ్చు. * తొలుత 33 ఏళ్లకు లీజుకు ఇస్తారు.. ఆ తర్వాత 99 ఏళ్ల వరకూ లీజును రెన్యూవల్ చేసుకోవచ్చు. * ఏడాదికి ఎకరానికి గరిష్ఠంగా రూ.వెయ్యి చొప్పున లీజుగా చెల్లించాలి. * కేటాయించిన ఏడాదిలోగా పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. ఆ భూమిని వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించకూడదు. * ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మినహా తక్కిన విపక్ష పార్టీలకు భూములు దక్కవు. శాసనసభలో 67 మంది సభ్యుల బలం ఉన్న వైఎస్సార్సీపీకి రాజధానిలో గరిష్ఠంగా అరెకరం, జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల భూమిని మాత్రమే లీజుకు పొందే అవకాశం ఉంది. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమి కేటాయించే అవకాశం ఉంది. సంఖ్యా బలం ఆధారంగా భూములు కేటాయించడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. -
శిఖరవీరుడికిచ్చే గౌరవమిదా?
► మల్లి మస్తాన్‌బాబు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ► కుటుంబానికి వివాదాస్పద భూమి కేటాయింపు ► కోర్టుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ► అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు సంగం: జాతీయ జెండాను ప్రపంచంలోని అతి క్లిష్టమైన పర్వతాలపై రెపరెపలాడించి భారత కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్‌బాబును గుర్తించడంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిసారి తప్పులు చేస్తూనే వస్తుంది. మస్తాన్‌బాబు అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రప్రభుత్వ ప్రతిని ధులు ఆయన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీల వర్షం కురిపించారు. అంత్యక్రియల అనంతరం హామీలను వదిలేశారు. మల్లి మస్తాన్‌బాబు వర్ధంతికి సైతం రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రతినిధి హాజరుకాకపోగా జిల్లాస్థాయి అధికారులు కూడా రాలే దు. అలాగే మస్తాన్‌బాబు కుటుంబానికి ఐదెకరాల వ్యవసాయభూమి ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రుల మాటలు నీటిమూటలయ్యాయి. సంగం మండలంలోని పడమటిపాళెం సమీపంలో రెండెకరాల ఇసుక దిబ్బలను ప్రభుత్వం మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చింది. ఆ ఇసుక దిబ్బలు సైతం వివాదంలో ఉన్నా యి. వివాదాస్పద భూమిని మల్లి మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చి ఆ అమర సాహసవీరుడికి రాష్ట్రప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసింది. వివరాల్లోకెళితే పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి తర్వా త అంత్యక్రియలకు మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, శిద్దా రాఘవరావులు హాజరై ఐదు ఎకరాల భూమిని ఇస్తామని, మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని, మస్తాన్‌బాబు విగ్రహాలను సంగం, గాంధీజనసంఘంలో ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఇదేకాక మస్తాన్‌బాబు అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని సృ్మతివనంగా చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అంత్యక్రియల తర్వాత ఎవరూ ఈ హామీలను పట్టించుకోలేదు. వర్ధంతి వస్తుందని హడావుడిగా రెండెకరాల పొలాన్ని మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు ఇస్తున్నట్లు ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీరమణ గాంధీజనసంఘం సభలో ప్రకటించారు. అప్పట్లో రెండు ఎకరాలు ఇవ్వటమేంటని మల్లి సుబ్బమ్మ అధికారులను నిలదీశారు. జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లి సుబ్బమ్మకు పడమటిపాళెం గ్రామానికి చెందిన సర్వే నెం.551-1లో రెండెకరాల పొలాన్ని పట్టా రూపంలో అందజేశారు. అయితే ఈ పొలం తమకు చెందుతుందంటూ పడమటిపాళెంకు చెందిన పి శ్రీయుతమ్మ, ఆమె అత్త శ్రీనివాసమ్మలు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం మస్తాన్‌బాబు విషయంలో ప్రతిసారి నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు, మల్లి మస్తాన్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ పాపమే ఇలా చుట్టుకుంది ఆ రెండెకరాలు వివాదాస్పదం కావడానికి కారణం గతంలో రెవెన్యూ అధికారులు చేసిన పాపమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నం.551-1లో 1904లో పొలాన్ని ఇనగంటి పోలిరెడ్డి పేరున ఉంది. తదనంతరం పెన్నానదికి వచ్చిన వరదల వల్ల ఈ పొలాలు మొత్తం ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. తన భూములు ఇసుక దిబ్బలు అయ్యాయని, పనికిరాని ఇస్తిఫా భూములు కింద పోలిరెడ్డి 1936లో బ్రిటీష్ ప్రభుత్వానికి ఇచ్చి వేశారు. అప్పటినుంచి ఆ భూములు అనాధీనంగానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. భారతప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డులను చేతితో రాసే సంప్రదాయాన్ని ఆ గ్రామంలోని కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2007లో అప్పటి తహసీల్దారు ఈ భూములు శ్రీయుతమ్మ, శ్రీనివాసమ్మ పేర్లతో ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చారు. డైగ్లాట్‌లో వీరి పేరు లేక ఈనాం భూముల పేరుతో ఉండటంతో టైటిల్‌డీడ్‌ను అప్పటి కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భూములు తమవేనంటూ ఇద్దరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్లే ఇలా జరిగిందని, వెంటనే మల్లి మస్తాన్‌బాబు కుటుంబాన్ని గౌరవించి వివాదాస్పదం లేకుండా పొలాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
ధనాధన్ భూదాన్
⇒అస్మదీయులకు ‘ముందస్తు పందేరం’! ⇒నిబంధనలకు విరుద్ధంగా భూముల అప్పగింతలు ⇒నచ్చిన సంస్థలకు భూములు ఇచ్చేస్తూ జీవోలు ⇒పరిశీలించాల్సిన పనిలేదు.. ⇒కేబినెట్ నిర్ణయాలతో నిమిత్తమే లేదు.. ⇒పొజిషన్ ఇచ్చిన తర్వాత ఇక చేసేదేముంటుంది? ⇒{పజా ప్రయోజనాలు, ఉపాధి కల్పన షరతులు గాలికి ⇒సర్కారు తీరుపై అధికారుల్లోనూ అసహనం.. హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ భూమిని ఏదైనా ప్రైవేటు సంస్థకు కేటాయించాలంటే అనేక షరతులు వర్తిస్తాయి. సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ప్రజా ప్రయోజనాలు నెరవేరతాయో లేదో చూడాలి. ఉపాధి కల్పనకు ఉపకరిస్తుందో లేదో పరిశీలించాలి. సదరు సంస్థ ట్రాక్ రికార్డునూ తనిఖీ చేయాలి. ఇలా ఎన్నో అంశాలు ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకున్న తర్వాత.. ఎన్నో కార్యాలయాల అనుమతులు సంపాదించాక మంత్రివర్గం ముందుకు ఆ ప్రతిపాదన వెళుతుంది. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం భూముల కేటాయింపులో సరికొత్త సాంప్రదాయానికి తెరతీసింది. అస్మదీయ సంస్థకు అడిగినంత భూమిని ముందుగానే పందేరం చేస్తోంది. భూ కేటాయింపు నిబంధనలకు తిలోదకాలిచ్చి ‘ముందస్తు అప్పగింత’లు చేస్తోంది. ఒకసారి భూమిని స్వాధీనం చేస్తే ఇక న్యాయపరంగా దానిని వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదు. ఈ భూములకు సంబంధించి ఎలాంటి వివాదం తలెత్తినా న్యాయస్థానాలు పొజిషన్లో ఉన్నవారి పక్షం వహిస్తాయి. అన్నీ తెలిసినా ఎలాంటి పరిశీలనా లేకుండానే.. కనీసం రేటు కూడా నిర్ణయించకుండానే ప్రైవేటు సంస్థలకు విలువైన భూములను అప్పగించేస్తుండడం అధికారులను సైతం విస్మయపరుస్తోంది. అడ్డగోలుగా భూములు అప్పగిస్తూ హడావిడిగా జీవోలు జారీ అయిపోతుండడం గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగూ అనుకున్న సంస్థలకు నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయాలు చేస్తున్న రాష్ర్టప్రభుత్వం దొడ్డిదోవన భూములను అప్పగిస్తూ జీవోలు జారీ చేస్తోంది. విధానం ఇదీ... నిజానికి పరిశ్రమల ఏర్పాటుకోసం ఏదైనా ప్రైవేటు సంస్థకు భూముల్ని కేటాయించాలంటే.. అందుకు ప్రభుత్వపరంగా సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ఎవరైనా భూ కేటాయింపుకోసం సీఎంకో, మంత్రులకో విజ్ఞాపన పత్రమందిస్తే వారి కార్యాలయ అధికారులు ఫైల్ ప్రాసెస్ చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కో, జాయింట్ కలెక్టర్‌కో పంపడం రివాజు. వారు తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా ప్రతిపాదన తెప్పించుకుని రాష్ట్ర ప్రధాన భూపరిపాలన కమిషనర్(సీసీఎల్ఏ)కి పంపుతారు. సీసీఎల్ఏ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) ఆమోదించి రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శికి పంపుతుంది. ఆయన ఆమోదం తర్వాత రెవెన్యూ మంత్రికి, తదుపరి సీఎం కార్యాలయానికి, రాష్ట్ర కేబినెట్‌కు వెళుతుంది. నిబంధనలకు తిలోదకాలు.. అయితే ఈ ప్రక్రియతో నిమిత్తం లేకుండానే.. ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారికి అడిగిందే తడవుగా అడ్డగోలుగా ఆగమేఘాలపై ఏకంగా భూముల్ని ముందస్తుగా అప్పగిస్తూ ఉత్తర్వులిప్పిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఆశ్రీత పక్షపాతం చూపుతూ కావాల్సిన వారికి అడిగిందే తడవుగా భూములు స్వాధీనం చేయాలంటూ మౌఖిక ఆదేశాలిస్తున్నారు. తద్వారా నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఏదైనా సంస్థకు భూమి కేటాయించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను కాదని ముందస్తుగా స్వాధీనం చేయడం అంటే.. భూమిని ఆ సంస్థకు కేటాయించినందుకు అంగీకరించినట్టే అవుతుందని, మరలాంటప్పుడు ఏపీఎల్‌ఎంఏ, కేబినెట్ నిర్ణయాలకు విలువ ఏముంటుందని స్వయంగా అధికారులే ప్రశ్నిస్తుండడం గమనించాల్సిన అంశం. అధికారుల్లో ఆందోళన: ప్రభుత్వ శాఖలకు భూముల్ని ముందుగా అప్పగించడంలో తప్పులేదని, దీనికి పూర్తి భిన్నంగా ఎవరికి పడితే వారికి భూముల్ని ముందే స్వాధీనం చేస్తూ ఉత్తర్వులిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాభాపేక్షతో పరిశ్రమలు ఏర్పాటుచేసే ప్రైవేటు సంస్థలకు ఇలా ఇవ్వాల్సిన అత్యవసరం ఏముందని అధికారవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పెద్ద సంస్థలు ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తామనే హామీతో భూమి కోరితే సింగిల్ విండో విధానంలో త్వరితగతిన కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలేగానీ అడ్డగోలుగా ‘ముందస్తు అప్పగింతలు’ చేయరాదని అధికారులు అంటున్నారు. భూకేటాయింపులు, ముందస్తు స్వాధీనాల విషయంలో ప్రభుత్వ పెద్దలనుంచి వస్తున్న ఒత్తిళ్లపట్ల రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు. అడ్డగోలు వ్యవహారాల వల్ల భవిష్యత్తులో కేసులొస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ‘‘ప్రజాప్రయోజనాలు లేకుండా ప్రైవేటు సంస్థలకు భూముల్ని ముందుగా అప్పగించడం ఏమాత్రం సమంజసంకాదు. ఇలా ఇచ్చిన దాఖలా లు నా సర్వీసులో లేవు...’’ అని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు అన్నారు. అన్నీ అనామక సంస్థలే... చంద్రబాబు సర్కారు ముందస్తుగా భూములు అప్పగిస్తూ జీవోలు జారీ చేసిన సంస్థలన్నీ చాలా చిన్నవే. వీటివల్ల అత్యవసర ప్రజాప్రయోజనమూలేదు. ఉపాధి కల్పనా లేదు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సీపీ ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 30 ఎకరాలు స్వాధీనం చేయాలని రెవెన్యూశాఖ ఈనెల 11న జీవో 262 జారీ చేసింది. విశాఖకు సమీపంలోని కాపుల ఉప్పాడలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు స్వాధీనం చేస్తూ ప్రభుత్వం గతేడాది నవంబరు 6న జీవో 411 జారీ చేసింది. మార్కెట్ విలువ ప్రకారం 15 ఎకరాల్ని లీజుకిస్తున్నట్లు పేర్కొంది. ఆ విలువ ఎంతనేది కూడా పేర్కొనలేదు. సిలికాన్ ఆంధ్ర సంస్థకు కృష్ణా జిల్లా కూచిపూడిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అడిగిన రెండోరోజే 1.08 ఎకరాల భూమిని అప్పగిస్తూ జీవో నంబర్ 1080(నవంబర్ 4న) జారీచేసింది.ఇవన్నీ అనామక సంస్థలే.వ్యాపార ప్రయోజనాలకోసమే ఇవి భూములు కోరాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకునే కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణానికి భూమిని అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందో బాబుకే ఎరుకని అధికారులు అంటుండడం గమనార్హం. అస్మదీయ సంస్థకు 50 ఎకరాల భూదానానికి రంగం సిద్ధం అస్మదీయ సంస్థకు భూముల్ని అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వ పెద్దలు ఎంతకైనా తెగిస్తారనేందుకు ఇది మరో నిదర్శనం. రాష్ట్ర పారిశ్రామిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ నగరంలోని మధురవాడలో ప్రభుత్వ మార్కెట్ విలువల ప్రకారమే రూ.363 కోట్ల విలువ చేసే 50 ఎకరాల భూమిని కేవలం రూ.25 కోట్లకు ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ మిత్రుడికి చెందిన ఈ-సెంట్రికల్ సొల్యూషన్స్‌కు కట్టబెట్టేందుకు ఈ భూమిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర భూ పరిపాలన ప్రధానాధికారి(సీసీఎల్ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) ఎకరా 7.26 కోట్ల మార్కెట్ విలువ సిఫార్సు చేయగా కేబినెట్ దీనిని బుట్టదాఖలు చేసి ఎకరా రూ.50 లక్షలకే కేటాయించాలని తీర్మానించడం గమనార్హం. -
గిరిజన యువతకు శిక్షణ ఎన్నడో?
* రూ.మూడు కోట్లతో సామర్లకోటలో భవనాలు * నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని వైనం సామర్లకోట : రంపచోడవరం ప్రాంతానికి చెందిన గిరిజన యువతీ, యువకులకు సామర్లకోటలో ఇవ్వ తలపెట్టిన శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామర్లకోటలోని విస్తరణ శిక్షణా కేంద్రంలో సుమారు రూ. 3 కోట్లతో గిరిజన యువత శిక్షణా కేంద్రం నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం పూర్తరుునా ప్రారంభానికి నోచుకోలేదు. కాగా భవనాల నిర్మాణంపై గతంలోనే కొన్ని వివాదాలు ఉన్నాయి. అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆదేశాల మేరకు సుమారు మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని భవనాలు నిర్మించారు. భూముల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ, కమిషనర్ అనుమతి పొందవలసి ఉంది. అరుుతే అనుమతి లేకపోవడంతో భవనాలను విస్తరణ శిక్షణా కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీనిపై విస్తరణ శిక్షణా కేంద్రం అధికారులను వివరణ కోరగా గతంలో జరిగిన విషయాలపై తమకు అవగాహన లేదని చెప్పారు. కాగా రంపచోడవరం నుంచి యువతీ, యువకులు సామర్లకోట వచ్చి ఎలా శిక్షణ పొందుతారన్న సందేహమూ ఉంది. ఐటీడీఏకి నిధులు ఉన్నా అప్పట్లో స్థల సమస్య కారణంగా సామర్లకోటలో ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణా కేంద్రం భవనాలు పూర్తయినప్పటికీ శిక్షణకు అవసరమైన ఫర్నీచర్, ఇతర సదుపాయూలు ఏర్పాటు చేయలేదు. ఈ శిక్షణా కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. భవనాలు ప్రారంభమైన వెంటనే శిక్షణను కూడా ప్రారంభించవలసి ఉన్నా.. అదెప్పుడో అధికారులే చెప్పాలి. త్వరలో భవనాలు ప్రారంభిస్తాం సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రంలో నిర్మించిన గిరిజన యువత శిక్షణా కేంద్రం త్వరలో ప్రారంభం అవుతుంది. యువతకు అవసరమైన అన్ని రకాల శిక్షణలూ ఈ కేంద్రంలో ఇస్తారు. శిక్షణ సమయంలో భోజన వసతి సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పూర్తి వివరాలు రావలసి ఉంది. - కేవీఎన్ చక్రధరబాబు, ఐటీడీఏ పీఓ, రంపచోడవరం -
'60 కంపెనీలు.. 3 వేల ఉద్యోగాలు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ క్లస్టర్ కోసం 250 హెక్టార్ల భూమిని కేటాయించినట్టు ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎదురుగా అమరావతి ఇండ్రస్ట్రీయస్ అసోసియేషన్‌కు భూమిని కేటాయించినట్టు చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 60 కంపెనీలు.. 3 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ నెల 23 నుంచి కూచిపూడి, యక్షగాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. -
‘గల్లా’కు భూ నజరానా!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన, ప్రధానమైన ప్రాంతంలో ఉన్న భూమిని కారుచౌకగా ధారాదత్తం చేసింది. కడప-తిరుపతి రహదారిలోని కరకంబాడిలో దాదాపు రూ.43.38 కోట్ల విలువైన భూమిని రూ.4.88 కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్‌కు కట్టబెట్టింది. ఈ మేరకు ఎకరా రూ.22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. కరకంబాడి ప్రాంతం దాదాపుగా తిరుపతి నగరంలో కలసిపోయింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు, తిరుపతి బస్టాండుకు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్న కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైన ప్రాంతంలో కనిష్టంగా లెక్కేసుకున్నా బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్‌కు ఎకరా రూ.22.50 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. ఎన్నికల్లో చేసిన సాయానికి... రాష్ట్రం విడిపోయేవరకూ కాంగ్రెస్‌లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడు గల్లా జయదేవ్‌ను గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించడంద్వారా రాజకీయ అరంగేట్రం చేయించారు. ఆమెకు చంద్రగిరి అసెంబ్లీ టికెట్, కుమారుడికి గుంటూరు లోక్‌సభ టికెట్ ఖరారు చేసినందుకు ప్రతిగా ఎన్నికల ఖర్చులకోసం పార్టీకి ‘గల్లా’ ఇండస్ట్రీస్ గ్రూపు భారీగానే సొమ్ము ముట్టజెప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి. ‘కీలకమైన ఎన్నికల్లో పార్టీకి సాయం చేసినందుకు నజరానాగా ఇప్పుడు విలువైన భూమిని కారుచౌకగా మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం నెలన్నర రోజుల్లోనే భూకేటాయింపుల ప్రక్రియను పూర్తిచేసి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేసింది’ అని టీడీపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. కేవలం 42 రోజుల్లో... కేవలం 42 రోజుల్లోనే ఈ భూకేటాయింపుల ప్రక్రియ పూర్తవడాన్నిబట్టే ఫైలు ఎంత శరవేగంగా కదిలిందో అర్థమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న చిత్తూరు జిల్లా కలెక్టర్ మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపులకోసం ఫైలు పంపించారు. అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) దాన్ని ఆమోదించింది. అక్కడినుంచి ఆగమేఘాలపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ మంత్రి, సీఎం ఆమోదం పొందిన ఈ ఫైలు ఈ నెల 2న రాష్ట్ర మంత్రివర్గ ఎజెండాలో చేరిపోయింది. మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు రెవెన్యూశాఖ జీవో ఇచ్చింది. ‘‘భూకేటాయింపులకోసం వందలాది ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతుంటాయి. అయితే ఇది అధికారపక్షానికి చెందిన కీలక నేతకు సంబంధించింది కావడంతో రాకెట్ వేగంతో వెళ్లి కేవలం 42 రోజుల్లోనే కేబినెట్ ఆమోదం పొందింది’’ అని రెవెన్యూశాఖకు చెందిన కిందిస్థాయి అధికారి ఒకరు అన్నారు. మంత్రిగా ఉండగా సాధ్యం కాని పని.. గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విలువైన భూమిపై కన్నేశారు. పారిశ్రామిక అవసరాలు సాకుగా చూపించి దీన్ని కైవసం చేసుకోవాలని అప్పట్లోనే ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నుంచి 2009 అక్టోబర్ 22వ తేదీనే భూ కేటాయింపులకోసం ప్రతిపాదన తెప్పించుకున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న కె.రోశయ్య, తదుపరి సీఎంగా వచ్చిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ భూకేటాయింపునకు మౌఖికంగా అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన రెవెన్యూశాఖలో పక్కన పడిపోయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ కలెక్టర్ నుంచి ఈ భూమికోసం ప్రతిపాదన తెప్పించుకున్న ‘గల్లా’.. సీఎంతో మాట్లాడి ఆగమేఘాలపై ఫైలు నడిపించి ఓకే చేయించారు. -
భూమి ఇవ్వండి
ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను రీసర్వే చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. దళిత మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఆరికపాడుకు చెందిన దళిత మహిళలు ఈ రోజు స్థానిక తహసిల్దార్ కార్యలయం ఎదుట ధర్నానిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన భూములను దళితులకు పంచాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందించారు. -
ఐదు వేల ఎకరాల ‘దిల్’ భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్టింగ్స్ లిమిటెడ్(దిల్) సంస్థకు భూమి కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంస్థకు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గత ప్రభుత్వం కేటాయించిన 4,999.14 ఎకరాల భూములు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నందున ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డుకు అనుబంధంగా ఏర్పడిన దిల్‌కు పారిశ్రామికాభివృద్ధి అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఈ మేరకు భూములను కేటాయించింది. పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ భూములను దిల్ పలు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. అయితే భూములు పొందిన సంస్థలు ఏళ్లు గడిచినా నేటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో భూ కేటాయింపులను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. -
జాతీయ సంస్థలకు ‘భూగ్రహణం’!
అ ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల ఏర్పాటుపై శ్రద్ధ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న 12 సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్రం ఐఐఎంకు, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లకే భూములు కేటాయింపు ఎయిమ్స్, కస్టమ్స్ అకాడెమీలకు ఇచ్చిన భూములు వివాదాస్పదం మిగతా వాటికి భూముల ఊసెత్తని బాబు సర్కారు భూములివ్వకపోవడం వల్ల కేంద్ర నిధులూ మురిగిపోయే అవకాశం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణంగా రాష్ట్రానికి ఇప్పటికీ ప్రత్యేక హోదా రాకపోగా, ఇప్పుడు కేంద్రం ఏర్పాటు చేస్తానన్న జాతీయ సంస్థలనూ కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్రం సిద్ధ పడినా, రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల అవి కూడా చేజారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు సంస్థలకు వేలాది ఎకరాలు కట్టబెట్టడానికి సిద్ధమవుతున్న చంద్రబాబునా ప్రభుత్వం.. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మాత్రం భూములివ్వడానికి మాత్రం ఆసక్తి చూపడంలేదు. దీనివల్ల ఈ సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులు మురిగిపోవడంతోపాటు రాష్ట్ర విద్యా రంగానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఎన్నిమార్లు కోరినా భూములివ్వకుండా తాత్సారం చేస్తున్న రాని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన జాతీయ సంస్థలు వాటి ప్రణాళికలను మార్చుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 12 జాతీయ సంస్థలను ఏర్పాటు చేస్తామని ‘పునర్విభజన చట్టం’లో కేంద్రం హామీ ఇచ్చింది. అన్ని జాతీయ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని సెప్టెంబరు 4న శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, కాకినాడలో పెట్రోలియం యూనివర్సిటీ, పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడెమీ, కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), రాజధాని ప్రాంతం (గుంటూరు, విజయవాడ)లో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం) ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. వీటికి భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. గత 15 నెలల్లో మూడు సంస్థలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. విశాఖ జిల్లా గంభీరంలో ఐఐఎంకు 300 ఎకరాలు, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక, పంగపల్లి వద్ద ఐఐటీకి 460 ఎకరాలు, ఐఐఎస్ఈఆర్కు 434 ఎకరాలు కేటాయించింది. ఎయిమ్స్, కస్టమ్స్ అకాడెమీలకు భూముల కేటాయించినా, అవి వివాదాస్పదమయ్యాయి. మిగతా వాటికి భూమిని కేటాయించలేదు. ఎన్డీఆర్ఎఫ్ భూమిలో ఎయిమ్స్ ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఏర్పాటుకు గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద 172 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. అదే భూమిలో 40 ఎకరాలను ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు 2012లోనే కేటాయించారు. ఆ భూమిలో ఎన్డీఆర్ఎఫ్ భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఇక్కడ ఎయిమ్స్ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ఎయిమ్స్ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ఐడీఎం ప్రధాన కేంద్రాన్ని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. కానీ భూమిని కేటాయించకపోవడంతో అది ఢిల్లీకి తరలిపోతోం ది. క్యాంపస్‌ను విజయవాడలో నెలకొల్పాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద కస్టమ్స్ అకాడెమీకి 140 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. అదే భూమిని అంతకు ముందే బీఈఎల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)కు కూడా కేటాయించారు. దాంతో రెండు సంస్థలూ అక్కడ భవనాల నిర్మాణం చేపట్టలేని దుస్థితి నెలకొంది. ఎన్ఐటీని తొలుత ఏలూరులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరకు తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పింది. దీనికి భూమిని కేటాయించలేదు. గిరిజన, పెట్రోలియం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐఐటీలకూ భూమి కేటాయింపులను కనీసం పట్టించుకోలేదు. అనంతపురం జేఎన్టీయూలో సెంట్రల్ యూనివర్శిటీ తరగతులను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, మౌలిక సదుపాయాలు లేక తరగతులు ప్రారంభం కావడం సందిగ్ధమే. మురిగిపోతున్న నిధులు : ప్రభుత్వం భూములు కేటాయించకపోవడంతో కేంద్రం జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కేటాయిం చిన నిధులు కూడా మురిగిపోతున్నాయి. ఐఐ టీ ఏర్పాటుకు 2014-15 బడ్జెట్లో కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. భూములు ఇవ్వకపోవడంతో ఆ నిధులు మురిగిపోయా యి. 2015-16 బడ్జెట్లో ఐఐటీకి రూ.40 కో ట్లు, ఎన్ఐటీకి రూ.40 కోట్లు, ఐఐఎంకు రూ. 40 కోట్లు, ఐఐఎస్ఈఆర్కు రూ.40 కోట్లు, ఐఐఐటీకి రూ.45 కోట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.75 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి, సెంట్రల్ యూనివర్శిటికీ రూ.కోటి, పెట్రోలియం వర్సిటీకి రూ. కోటి కేంద్రం కేటాయించింది. ఎన్ఐడీఎం హుళక్కే! న్యూఢిల్లీ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం) రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ప్రాంతీయ కేంద్రంతో సరిపుచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా రాష్ట్రానికి ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని తాజాగా సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. -
ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూములు ఇవ్వం: రైతుల తీర్మానం
గుంటూరు: ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా రాజధాని నిర్మాణానికి తాము భూములు ఇచ్చేదిలేదని మంగళగిరి రూరల్, తాడేపల్లి మండలాలలోని గ్రామాల రైతులు తీర్మానించారు. మంగళగిరి మండలంలోని నిడమర్రు, కురగల్లు, బేతపూడి, తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులతో మంగళగిరి వైఎస్ఆర్సీపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. భూములు ఇవ్వడానికి రైతులు సుముఖంగాలేరు. సింగపూర్ మంత్రులు, ప్రభుత్వ అధికారుల పర్యటనను అడ్డుకోవాలని రైతులు నిర్ణయించారు. రాజధాని కోసం మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం అని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి చెప్పారు. రైతుల కోసం అరెస్టులకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ** -
భూకేటాయింపులపై టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో దేవాలయ, వక్ఫ్, భూదాన బోర్డులకు చెందిన భూముల కేటాయింపులు, వాటి వినియోగంపై ఎప్పటికప్పుడు నివేదికలను అందించడానికి ప్రభుత్వం శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. గతంలో నిర్దిష్ట అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను ఏయే అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న అంశాన్ని పరిశీలించే ఈ టాస్క్‌ఫోర్స్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యాంకుమార్ సిన్హా చైర్మన్‌గా ఏర్పాటైంది. భూ కేటాయింపులపై భారీగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం ఈ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. భూ కేటాయింపుల సందర్భంగా ప్రభుత్వం విధానం, భూ కేటాయింపు అవసరం, మార్గదర్శకాల మేరకు భూమిని వినియోగిస్తున్నారా? చట్టానికి లోబడి ఆ భూ వినియోగం జరుగుతున్నదా? అనే అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ లోతుగా అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ విధానాలు, చట్టానికి లోబడి భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, సీసీఎల్ఏకు అందిస్తుందని తెలిపింది. ఉత్తర్వుల ప్రకారం ఈ టాస్క్ఫోర్సు విధులు, అధికారాలు, జీతభత్యాలు, సౌకర్యాలు ఇలా ఉన్నాయి.. అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన భూముల కేటాయింపులు, బదిలీ, లీజు తీసుకున్న సంస్థలు ఏయే అవసరాలకు వినియోగిస్తున్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అనుభవదారులు ఎవరు అనే అంశాలపై నిర్దిష్టమైన రికార్డులతో డేటా బేస్‌ను రూపొందించాలి. అన్ని భూ కేటాయింపుల కేసుల్లోనూ అతిక్రమణలు, ఉల్లంఘనలపై నిర్దిష్టమైన, స్పష్టమైన రికార్డులు తయారు చేయాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని జాగీర్ భూముల రికార్డులు, క్షేత్రస్థాయిలో కనిపించని భూముల జాబితా రూపొందించాలి. హైదరాబాద్ పరిసరాల్లోని దేవాలయాల, వక్ఫ్, భూదాన భూముల పరిరక్షణకోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు చేయాలి. -
శెట్టర్‌కు ఊరట
బెంగళూరు : భూ కేటాయింపుల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌కు ఊరట లభించింది. బెంగళూరు మెట్రోపాలిటన్ టాస్క్ ఫోర్స్ (బీఎంటీఎఫ్)లో శెట్టర్‌పై జరుగుతున్న విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. జగదీష్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని శ్రీగంధ కావల్లో నాలుగు ఎకరాల భూమిని సుందరేషన్ అనే వ్యక్తికి కేటాయించారు. కాగా ఈ కేటాయింపులు పూర్తిగా నియమ, నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయంపై బీఎంటీఎఫ్ విచారణను చేపట్టింది. ఈ విచారణను సవాల్ చేస్తూ జగదీష్ శెట్టర్ హైకోర్టును ఆశ్రయించారు. జగదీష్ శెట్టర్ దాఖలు చేసిన అర్జీపై వాదోపవాదాలు విన్న హైకోర్టు తమ తదుపరి ఉత్తర్వుల వరకు విచారణను నిలిపి వేయాల్సిందిగా బీఎంటీఎఫ్ను ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణను హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 4కు వాయిదా వేసింది. -
సరికొత్త ప్రజా రాజధాని
* ఏపీ కేపిటల్‌పై చంద్రబాబు * అందరి సహకారంతో ఏర్పడబోతోందన్న సీఎం * 2 నెలల్లో భూ సమీకరణని వెల్లడి * వీజీటీఎం పట్టణాల మధ్యనే కొత్త మెగాసిటీ * విజయవాడ దూరదర్శన్ ‘సప్తగిరి’ ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పరిసరాల్లో నూతన రాజధాని నగర నిర్మాణం కోసం రెండు నెలల్లోగా భూ సమీకరణ ప్రక్రియ మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, నాయకులు, రైతులందరి సహకారంతో సరికొత్త ప్రజా రాజధాని నగరం ఏర్పడబోతోందన్నారు. శనివా రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి విజయవాడ దూరదర్శన్ సప్తగిరి చానల్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. వీలైనంత త్వరగా ఒక్కో ప్రభుత్వ శాఖను ైహైదరాబాద్ నుంచి బెజవాడకు తరలించాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టే ముఖ్య కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయని తెలిపారు. అక్టోబర్ 2న బెజవాడలో ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. తమ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పట్టణాల మధ్యలో మెగా సిటీ నిర్మాణానికి సిద్ధమైందన్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే భూముల సమీకరణ ఉంటుందని, రైతులు, అధికారులు సమన్వయంతో సహకరించాలని కోరారు. రాజధాని అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రసారం చేయాలని చంద్రబాబు విజయవాడ దూరదర్శన్ కేంద్రం అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నో చానళ్లు ఉన్నప్పటికీ డీడీపైనే ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. ఆకాశవాణి కేంద్రం కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. టీవీలు సంచలనాలకు దూరంగా ఉండాలి: వెంకయ్యనాయుడు వెంకయ్య మాట్లాడుతూ.. టీవీ, మీడియా, సినిమా వంటి ప్రసార మాధ్యమాల్లో హింసను ఎక్కువగా చూపిస్తున్నారనీ, దీన్ని తగ్గించి తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. సొంత భావాలను వార్తలుగా గుప్పించి ప్రజల మీదకు వదిలే పద్ధతికి టీవీలు, పత్రికలు స్వస్తి పలకాలన్నారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని, సంగీత, సాహిత్య వినోద కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్ అభివృద్ధికి రూ.103 కోట్లను విడుదల చేస్తుందన్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పంపిన వీడియో సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. డీడీ డెరైక్టర్ జనరల్ విజయలక్ష్మీ చావ్లా దూరదర్శన్ ప్రగతిని వివరించారు. అనంతరం సీఎం వేదికపై ఏర్పాటు చేసిన రిమోట్‌ను ఆన్ చేసి సప్తగిరి చానల్ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఆల్ ఇండియా రేడియోకు అందజేయాల్సిన ఈమని శంకరశాస్త్రి వీణానాదం సీడీని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆకాశవాణికి పింగళి వెంకయ్య పేరు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ జెండా రూపశిల్పి కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య పేరు పెట్టారు. పింగళి వెంకయ్య దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుడే కాకుం డా త్రివర్ణ పతాకానికి రూపమిచ్చిన మహానుభావుడు. ఎన్టీఆర్ నా అభిమాన నటుడు: వెంకయ్య తన అభిమాన నటుడు ఎన్టీ రామారావు అని వెంకయ్యనాయుడు చెప్పారు. శనివారం విజయవాడలోని ఓ హోటల్లో వెస్టిక్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యాన జరిగిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. దేశ పౌరులకు సామాజిక స్పృహ లేదని, తనకు అవకాశమిస్తే ఆ అంశంపై వారికి పాఠాలు బోధిస్తానని చెప్పారు. తనకు చింతకాయ పచ్చడన్నా, నెల్లూరు చేపల పులుసన్నా, ఆవకాయ, గోంగూర పచ్చళ్లన్నా ఇష్టమని చెప్పారు. కార్యక్రమం పేరు కాఫీ కబుర్లు కాగా.. వెంకయ్య కాఫీ తాగకపోవడంతో లెమన్ టీ తాగుతూ నిర్వహించారు. -
‘రక్షణకు’ తొలి అడుగు
ఎస్ఆర్ పురం మండలంలో డీఆర్డీవోకు 1102.30 ఎకరాల భూమి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఆర్డీవో ఏర్పాటు అనంతపురం జిల్లా హిందూపురంలో.. కాదు చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురంలో.. కానేకాదు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో..! ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ ఈ కేంద్రం ఏర్పాటు చేసే స్థలమూ మారుతూ వస్తోంది. రక్షణ రంగంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కేంద్రం ఏర్పాటు కోసం జిల్లావాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఎస్ఆర్పురంలో డీఆర్డీవో ఏర్పాటు చేసేందుకు తొలుత 1102.30 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో డీఆర్డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) ఏర్పాటులో తొలి అడుగు పడింది. ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండలో సర్వే నంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్డీవోకు కేటాయిస్తూ బుధవారం రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ.శర్మ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం:289) జారీచేశారు. నవంబర్ 11, 2010లో అప్పటి కలెక్టర్ శేషాద్రి పంపిన ప్రతిపాదన మేరకు ఎకరాకు రూ.1.25 లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించేలా డీఆర్డీవోకు భూమిని కేటాయించారు. వివరాల్లోకి వెళితే.. దేశ రక్షణవ్యవస్థను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడంలో డీఆర్డీవోది కీలక భూమిక. ఆకాశ్, త్రిశూల్, అగ్ని వంటి క్షిపణులతోపాటూ బ్రహ్మాస్ వంటి ఖండాంతర క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది. రక్షణ రంగంలో పరిశోధనలు చేయడంతో పాటూ.. క్షిపణులను తయారుచేసి, సైన్యానికి అందించడంలో డీఆర్డీవో ప్రధానపాత్ర పోషిస్తోంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో డీఆర్డీవో కేంద్రం ఏర్పాటుచేశారు. ఆ కేంద్రానికి అనుబంధంగా విశాఖపట్నంలో మరో కేంద్రాన్ని నెలకొల్పారు. డీఆర్డీవోను మరింతగా విస్తరించి.. సైన్యానికి అవసరమైన ఆయుధాలను దేశీయంగా ఉత్పత్తిచేసేందుకు ఆ సంస్థ డెరైక్టర్ వీకే.సారస్వత్ రాష్ట్రంలో మరో కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి 2008లో ప్రభుత్వంతో కనీస అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నారు. అప్పటి సీఎం దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ సంస్థను అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటుచేసేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. రక్షణశాఖ ప్రతిపాదన మేరకు డీఆర్డీవో రూపొందించిన క్షిపణులను ప్రయోగించేందుకు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం-కనగానిపల్లె మండలాల్లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు 17,285 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. కానీ.. వైఎస్ హఠన్మరణం తర్వాత డీఆర్డీవో కేంద్రం ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత డీఆర్డీవో కేంద్రాన్ని ఎస్ఆర్పురం మండలంలో ఏర్పాటుచేయాలని రోశయ్య ప్రభుత్వం నిర్ణయించింది. రోశయ్య ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండ, చిన్నతయ్యూరు గ్రామాల పరిధిలోని 1102.30 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ శేషాద్రి గుర్తించారు. ఆ మేరకు అప్పట్లో ప్రతిపాదనలు పంపారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక డీఆర్డీవో కేంద్రాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటుచేసేలా అప్పటి రక్షణశాఖ సహాయమంత్రి ఎం.పల్లంరాజుపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో ఏర్పాటుచేసేందుకు అంగీకరించింది. కలికిరి మండలం టేకలకోన వద్ద డీఆర్డీవో కేంద్రం ఏర్పాటుకు 2600 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో అప్పటి కలెక్టర్ సాలమన్ ఆరోగ్యరాజ్ వెయ్యి ఎకరాల భూమి సేకరించారు. కానీ.. ఇప్పుడు కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎస్ఆర్పురంలోనే డీఆర్డీవో కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ఈనెల 1న మంత్రివర్గం తీర్మానించింది. ఆ మేరకు డీఆర్డీవోకు కొక్కిరాలకొండ, చిన్నతయ్యూర్లలో 1102.30 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ.శర్మ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కనీసం ఇప్పుడైనా డీఆర్డీవో కేంద్రం ఏర్పాటుచేస్తే.. జిల్లా పారిశ్రామికాభివృద్ధికి నాంది పలికినట్లవుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
భూదాన్ భూములపై నెలరోజుల్లో నివేదిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములను తనిఖీ చేసి నెలరోజుల్లో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్కే సిన్హా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ కేటాయింపు, భూదాన్, యూఎల్సీపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదాన్ యజ్ఞబోర్డుకు సంబంధించి 21,939 ఎకరాలు ఉందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇందులో 13,916 ఎకరాలు ఫిట్‌గా ఉందని, ఇందులోనుంచి 13,510 ఎకరాలు అసైన్డ్ చేయగా, 8023 ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఈ భూములు ఎవరి పరిధిలో ఉన్నాయి, ఎంత మొత్తం కేటాయించారు.. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మండలాల వారీగా రిపోర్టు తయారు చేసి నెల రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో 44వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందని, ఇందులో 10,852 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించిన ఏపీఐఐసీ, హెచ్ఎండీఏ, దిల్, రాజీవ్ స్వగృహ, హౌజింగ్ తదితర సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్విృస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. విలువైన భూములకు ప్రహరీలు జిల్లాలో విలువైన ప్రభుత్వ భూ ములున్నాయని సీసీఎల్ఏ ఎస్కే సిన్హా పేర్కొన్నారు. సుమారు రూ. 4867 కోట్ల విలువైన 853 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షిం చేందుకుగాను ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభు త్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. లీగల్ సెల్ ఏర్పాటు చేయండి : కలెక్టర్ జిల్లాలోని భూములకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులున్నాయని కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీసీఎల్ఏకు వివరించారు. వీటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక లీగల్‌సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తే సమస్యలు త్వరితంగా పరిష్కారమ వుతాయన్నారు.ఈ సమావేశంలో జేసీలు చంపాలాల్, ఎం వీరెడ్డి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ ఎన్జీవోల భూమిని తీసుకోవడం అన్యాయం: అశోక్ బాబు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆంధ్ర ప్రాంత వారిపై కక్షసాధింపు చర్యగా ఉద్యోగులు భావిస్తున్నారని అశోక్ బాబు మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయలేదనడం భావ్యం కాదన్నారు. 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్లే తాము నిర్మాణాలు చేపట్టలేకపోయామని అశోక్‌బాబు వివరణ ఇచ్చారు. 4 కోట్ల రూపాయలు లే అవుట్ ఛార్జీల కోసం, భూమి అభివృద్ధికి 5 కోట్లు ఖర్చుచేశామని అశోక్‌బాబు తెలిపారు. ఎపీఎన్జీవోలతోపాటు ఇతర సంఘాలకు ఇచ్చిన భూముల్లో కూడా చాలాభాగం నిర్మాణాలు జరగలేదని మీడియాకు అశోక్‌బాబు వెల్లడించారు. ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములే వెనక్కి తీసుకోవడం భావ్యం కాదని, సీఎం కేసీఆర్‌ను కలిసి వాస్తవాలు తెలియజేస్తామని అశోక్ బాబు అన్నారు. -
కలెక్టర్ దూకుడు
‘పెట్టుబడుల ఆకర్షణలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం. తగవుల్లేని భూముల కేటాయింపుతో పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం మా ప్రధాన కర్తవ్యం’ అని జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. గురుకుల్ ట్రస్ట్, యూఎల్సీ, సీలింగ్, అసైన్మెంట్ భూముల సర్వేలో దూకుడు ప్రదర్శిస్తూ... గతి తప్పిన సర్కారీ శాఖలను గాడిలో పెట్టే దిశగా కార్యాచరణ సిద్ధం చేసిన కలెక్టర్ శ్రీధర్ సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... -సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రాధాన్యాతాంశాల్లో మొదటిది ప్రభుత్వ భూ ముల పరిరక్షణ. తెలంగాణకు ఆయువు పట్టయిన జిల్లాలోని విలువైన భూములను కాపాడుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం. జిల్లాలోని వివిధ కేటగిరీల కింద పంపిణీ బదలాయించిన 1.50 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేస్తున్నాం. తద్వారా అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తున్నాం. వివిధ సంస్థలకు కేటాయించిన 39 వేల ఎకరాల్లో ఆయా సంస్థలు ఏ మేరకు వాడుకున్నాయనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సుమారు 13వేల ఎకరాలు ఇంకా వినియోగంలోకి రాలేదని గుర్తించాం. ఇందులో ఎంత విస్తీర్ణం వృథాగా ఉందనేది నిర్ధారించుకుంటున్నాం. అదేవిధంగా ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్‌లో భూముల సర్వే పూర్తయింది. 200 ఎకరాల్లో బహుళ అంతస్తులు, మరో 200 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు వెలిశాయి. మిగతా భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాం. ట్రస్ట్ భూమిలో వెలిసిన కట్టడాలకు ఎలాంటి అనుమతి లేదు. ఇప్పటికే కొన్నింటిని జీహెచ్ఎంసీ కూల్చేసింది. మిగతావాటి విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. గురుకుల్ ట్రస్ట్ భూములు కొనవద్దని, వ్యాపారాలు నిర్వహించకూడదని ప్రజలను చైతన్యపరుస్తూ నోటీసు బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. ‘ఎన్’ కన్వెన్షన్‌లో తమ్మిడి కుంట.. ‘ఎన్’ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3.24 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లు సర్వేలో తేలింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నాం. గురుకుల్ ట్రస్ట్ భూమిని క్రమబద్ధీకరించాలని యూఎల్సీ వద్ద 2,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూములపై కోర్టుల్లో కూడా కేసులు ఉన్నందున.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తాం. పరిశ్రమలకు లిటిగేషన్ లేని భూములు.. పరిశ్రమల స్థాపనకు మంచి వాతావరణం కల్పిస్తాం. భూ కేటాయింపులు, అనుమతులను సరళతరం చేసే దిశగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తోంది. ఐటీ, ఫార్మా రంగాలకు అనువైన మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు భూములను సమీకరిస్తున్నాం. వివిధ సంస్థలు అట్టిపెట్టుకున్న 13వేల ఎకరాల భూములేగాక వేర్వేరు చోట్ల బిట్లుబిట్లుగా ఉన్న ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా క్లియర్‌గా ఉన్న భూములను పరిశ్రమలకు కేటాయించేలా జాబితా రూపొందిస్తున్నాం. ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ తయారు చేసేలోగా ల్యాండ్ బ్యాంక్‌ను రెడీ చేసుకోవాలని నిర్ణయించాం. చేతులు మారిన అసైన్డ్ భూములు వెనక్కి.. భూమిలేని పేదలకు పంపిణీ చేసిన లక్ష ఎకరాల అసైన్డ్భూములను కూడా సర్వే చేయిస్తున్నాం. అసలైన లబ్ధిదారులుగాకుండా ఇతరులకు వీటిని విక్రయించినట్లు తేలితే ఆ భూమిని వెనక్కి తీసుకుంటాం. శివారు మండలాల్లో 2,500 ఎకరాల యూఎల్సీ భూములను కూడా రీసర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం. దళితుల సమగ్రాభివృద్ధి.. దళితుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాం. మండల ం యూనిట్‌గా ఒక బస్తీని ఎంపిక చేసి.. ఆ బస్తీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతాం. మౌలిక సదుపాయాల కల్పన, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపడతాం. దీనికోసం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను వినియోగిస్తాం. జిల్లావ్యాప్తంగా భూమిలేని 4,700 కుటుంబాల్లో తొలి విడతగా పంద్రాగస్టున కొందరికి భూ పంపిణీ చేస్తాం. ఇప్పటికే భూమి ఉన్నా.. వ్యవసాయానికి అనువుగా లేని రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు విత్తనాలు, డ్రిప్, ఇరిగేషన్ తదితర రాయితీలను వర్తింపజేయనున్నాం. పనిదొంగల భరతం పడతా.. సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తా. ప్రతి రోజూ కలెక్టరేట్ నుంచి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తా. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? లేదా అనే ది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకే ఫోన్ చేస్తా. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాల్సినతహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, పాఠశాలలు, హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగులు హాజరుపై అంచనాకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. 64 మందికి శ్రీముఖాలు విదినిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగులపై కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీరియస్ అయ్యారు. గతవారంలో వరుసగా రెండ్రోజుల పాటు కొందరు అధికారులతో సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. అనంతరం వారి నుంచి వచ్చిన నివేదికలపై సమీక్షించారు. అయితే ఇందులో చాలావరకు వసతిగృహ అధికారులు, ప్రభుత్వ వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించి తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం వహించిన 64 మందికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఇందులో 32 మంది సంక్షేమాధికారులు కాగా, మిగిలిన వారు పీహెచ్సీ వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
రాబర్డ్ వాద్రాపై ప్రతీకార చర్యలుండవు: వెంకయ్య
బెంగళూరు: రాజకీయ ప్రత్యర్ధులపై ఎన్ డీఏ ప్రభుత్వం ఎలాంటి పగసాధింపు చర్యలుండవని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్ధులైన సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలాంటి వ్యక్తులపై ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టబోమని ఆయన అన్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఎలాంటి దాడులు చేయబోమని... హర్యానా, రాజస్థాన్ లోని వివాదస్పద భూకేటాయింపులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో యూపీఏ ప్రభుత్వంలో వాద్రా కు కేటాయించిన భూకేటాయింపులపై బీజేపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
ఫైళ్ల క్లియరెన్స్‌లో సీఎం బిజీ బిజీ
సాక్షి, హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడికి అనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం ఆమోద ముద్ర వేస్తుందని తెలియడంతో సీఎం ఉదయం నుంచే ఫైళ్ల క్లియరెన్స్‌లో బిజీ అయిపోయారు. సీఎం కార్యాలయ అధికారులతో పాటు కొన్ని ప్రధాన శాఖల ఉన్నతాధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి పెండింగ్‌లో ఉన్న పలు ముఖ్యమైన ఫైళ్లను వెంటనే ఆమోదానికి పంపాల్సిందిగా కిరణ్ ఆదేశించారు. దీంతో ఉదయం నుంచే ఆయన ఫైళ్ల క్లియరెన్స్‌లో పడ్డారు. భూముల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లపై ఎడాపెడా సంతకాలను కానిచ్చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగులు భూములు, జాగీర్దార్ భూముల కేటాయింపునకు చెందిన పలు ఫైళ్లకు సీఎం ఆమోదం తెలిపారు. అలాగే పలు శాఖల్లో పోస్టింగ్‌లు, బదిలీలు కోరుకుంటున్న వారి ఫైళ్లను క్లియర్ చేశారు. తనకు కావాల్సిన వారికి సంబంధించి అన్ని రకాల ఫైళ్లను క్లియర్ చేయడంపైన ఆయన దృష్టి సారించారు. రెవెన్యూ శాఖకైతే వెంటనే సంబంధిత ఫైళ్లను సర్క్యులేట్ చేయాలంటూ ఆదేశాలు జారీ అవుతున్నాయి. అలాగే పట్టణాభివృద్ధికి చెందిన ఫైళ్లతో పాటు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలకు విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా పనులకు నిధులు ఇవ్వడం పైనా కిరణ్ దృష్టి సారించారు. సీఎం నెల రోజుల నుంచి సచివాలయానికి రావడం లేదు. దీంతో సచివాలయానికి సందర్శకుల తాకిడి కూడా గురువారం వరకు అంతంత మాత్రంగానే ఉంది. అయితే శుక్రవారం మాత్రం సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని, వీలైనంత త్వరగా పనులు చేయించేసుకోవాలనే ఆత్రుతతో సందర్శకులు, పైరవీకారులు సచివాలయంలో హడావుడి చేశారు. సీఎం కార్యాలయం చేస్తున్న హడావుడితో అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వానికి ఇక రోజులు దగ్గర పడ్డాయనే భావనకు వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు చెందిన ఫైళ్లను క్లియర్ చేయించుకోవడానికి క్యూకట్టారు.