ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూములు ఇవ్వం: రైతుల తీర్మానం | We are not Gave lands : farmers resolution | Sakshi
Sakshi News home page

ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూములు ఇవ్వం: రైతుల తీర్మానం

Published Mon, Dec 8 2014 8:02 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూములు ఇవ్వం: రైతుల తీర్మానం - Sakshi

ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూములు ఇవ్వం: రైతుల తీర్మానం

గుంటూరు: ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా రాజధాని నిర్మాణానికి తాము భూములు ఇచ్చేదిలేదని మంగళగిరి రూరల్, తాడేపల్లి  మండలాలలోని గ్రామాల రైతులు తీర్మానించారు. మంగళగిరి మండలంలోని నిడమర్రు, కురగల్లు, బేతపూడి, తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులతో మంగళగిరి వైఎస్ఆర్సీపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.

భూములు ఇవ్వడానికి రైతులు  సుముఖంగాలేరు. సింగపూర్ మంత్రులు, ప్రభుత్వ అధికారుల పర్యటనను అడ్డుకోవాలని రైతులు నిర్ణయించారు. రాజధాని కోసం మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం అని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి చెప్పారు. రైతుల కోసం అరెస్టులకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement