ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ క్లస్టర్ కోసం 250 హెక్టార్ల భూమిని కేటాయించినట్టు ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ క్లస్టర్ కోసం 250 హెక్టార్ల భూమిని కేటాయించినట్టు ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎదురుగా అమరావతి ఇండ్రస్ట్రీయస్ అసోసియేషన్‌కు భూమిని కేటాయించినట్టు చెప్పారు.
బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 60 కంపెనీలు.. 3 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ నెల 23 నుంచి కూచిపూడి, యక్షగాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.