గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని: కమిటీ స్పష్టత | AP Capital between Vijayawada and Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని: కమిటీ స్పష్టత

Published Sat, Oct 11 2014 8:27 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

పల్లె రఘునాథ రెడ్డి - Sakshi

పల్లె రఘునాథ రెడ్డి

హైదరాబాద్: ఏపి రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యేనని భూసేకరణ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భూసేకరణ కమిటీ(మంత్రి మండలి ఉపసంఘం) సమావేశం ముగిసింది.  అనంతరం కమిటీ సభ్యుడు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమావేశం వివరాలను విలేకరులకు తెలిపారు.  భూసేకరణపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 17, 18, 19 తేదీలలో విజయవాడ, గుంటూరులలో పర్యటిస్తామని చెప్పారు.

 తొలిదశలో రాజధాని కోసం 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. రైతులకు మేలు చేసే విధంగా భూ సేకరణ జరుగుతుందన్నారు. 60:40 శాతం నిష్పత్తిలో భూసేకరణ జరుగుతుందని చెప్పారు.

తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మంత్రి నారాయణను విశాఖపట్నం పంపిస్తున్నట్లు మంత్రి పల్లె తెలిపారు.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement