Vijayawada-Guntur
-
నగరాన్ని సుందరీకరించండి
నగరపాలక సంస్థ అధికారులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ విజయవాడ బ్యూరో : విజయవాడ-గుంటూరు నగరాల్లో సుందరీకరణ పనులను వెంటనే చేపట్టి సంక్రాంతి పండుగలోపు పూర్తిచేయాలని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ రెండు నగరపాలక సంస్థల అధికారులకు సూచించారు. నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఆయన శనివారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, గుంటూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై చర్చించారు. ఈ రెండు నగరాల మధ్యే రాజధాని నిర్మిస్తున్న నేపథ్యంలో వాటికి విశేషమైన ప్రాధాన్యం వచ్చిందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో రెండు నగరాలకు సాధ్యమైనంత త్వరలో రాజధాని శోభను తీసుకురావాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా రెండు నగరాల్లోని ప్రధాన రోడ్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, గ్రీనరీని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యుత్ దీపాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. రాజధాని నగరానికి వచ్చిన ప్రజలకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, వారికి రాజధానికి వచ్చిన అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేసే బాధ్యత అందరిపైనా ఉందని శ్రీకాంత్ చెప్పారు. -
హుకుం జారీచేసిన హుదూద్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి విజయవాడ-గుంటూరు ప్రాంతాలు, ముఖ్యంగాఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం అవసరం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది.వందిమాగదుల మాటలకు విలువ ఇవ్వకుండా, ప్రభుత్వం మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్నివిధాలా అనుకూలంగా, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ- వినుకొండ- బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ పాలకశక్తుల పతనానికి దారితీస్తాయి. ఆ పరిస్థితులలో విపత్తును తమకు అనుకూ లంగా మలుచుకోవాలని రాజకీయ నాయకులు తరచూ ప్రయత్నిస్తారు. ఈ తొక్కిసలాటలో పాలకులు తమ ప్రయోజనం కోసం అధికారగణంతో ఘర్షణకు దిగుతారు. - ప్రొఫెసర్ సి. రాఘవులు (డీన్ ఆఫ్ సోషల్ సెన్సైస్, రిటైర్డ్ డెరైక్టర్, విపత్తుల నివారణ అధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయం) చెన్నైలో ఇచ్చిన ప్రసంగం (1994) నుంచి. విపత్తుల తరువాత అలాంటి పరిస్థితులు తలెత్తకుం డా జాగ్రత్త పడడానికి నిపుణులు పాత, కొత్త నివేదికలలో పొందుపరిచిన సలహాలను పాటించడం పాలకులకే శ్రేయస్కరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు రెండురకాలు: ఒకటి- రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక నిర్ణయం ఒక సంక్షోభ స్థాయికి చేరుకోవడం. రెండు- విభజన జరిగిన వెనువెంటనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం ‘హుదూద్’ పెను తుపాను బారినపడటం. ఈ తుపాను నాలుగు జిల్లాలను, విశాఖ నగరం సహా పలు పట్టణాలను ఇప్పట్లో తేరుకోలేని విధంగా నష్టపరిచింది. ఈ రెండింటిలో ఒకటి మానవ కల్పితమైన వికారపు చేష్ట. ముఖ్యమంత్రి పదవుల వేటలో తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చింది. రెండవది, ప్రకృతి చేసిన విలయ తాండవం. నిజానికి పర్యావరణానికి మనిషి తలపెడుతున్న హాని కారణంగా ప్రకృతి వికటించిన ఫలితమిది. తక్షణం గుర్తించవలసిన వాస్తవం ప్రస్తుతం ఆ రెండు సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానీ కం నలిగిపోతున్నది. ప్రజలనూ, రాష్ట్రాన్నీ ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిం చాలి. విభజన తరువాత అధికారం చేపట్టిన పాలకులు దేనికోసమో ఉవ్విళ్లూరుతూ, తొందరపాటుతో విజయవా డ-గుంటూరులను కొత్త రాజధానిగా ప్రకటించారు. ఇవి జనంతో కిక్కిరిసి ఉండే నగరాలు. తీరా ప్రకటించిన తరు వాత గాని అసలు సమస్యలు తెలిసిరాలేదు. ఇలాంటి చోట రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా అనుభవానికి రావడం వెంటనే మొదలైంది. ఏదో రకంగా అధికారం చేపట్టగలిగామన్న ‘సంబడం’లో ఈ పాలకులు సమస్య ఆనుపానులను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారు. ప్రజాభిప్రాయాన్ని గాని, కొందరు చేసిన హెచ్చరికలను గాని పట్టించుకునే తీరిక వారికి లేకపోయింది. రాజధాని ఎంపిక మీద కేం ద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన సాధికారికి నివేదికలో ఏం చెప్పిందో తెలుసుకునే ఓపిక కూడా పాలకు లకు లోపించింది. ముందుగా తీసుకున్న నిర్ణయాన్నే అమ లుచేయడానికి ఒడిగట్టారు. నిగ్గుతేలిన హెచ్చరికల స్వరూపం ఈ సమస్యను అసలు శాసనసభలో చర్చకు కూడా రానీ యకుండా, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన విలువైన సల హాలను ఏకపక్షంగా తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపిన తెలుగుదేశం నిరంకుశ నిర్ణయాలకు అల వాటు పడి, ఇక్కడ శాసనసభలో విపక్షం గొంతు నొక్కే సింది. కానీ, ఆచరణ, అనుభవం ప్రకారం శివరామకృష్ణన్ చేసిన హెచ్చరికలు వాస్తవికమైనవేనని ఇప్పుడు రుజు వైంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశం మొత్తం మీద విపత్తులకు గురికావడానికి అత్యధిక అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కువ భాగం తరచూ దుర్భిక్షానికి గుర వుతోంది. ఈ పరిస్థితిలో పట్టణ ప్రాంతాలకు నీటి భద్రత సమస్యగా మారిపోతోంది. ఇక గ్రామీణ ప్రాంత ప్రజానీ కం మీద దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా ప్రాంతం తరచూ పెనుతుపానులకు గురవుతూ, ఆక స్మిక వరదల బారిన పడుతోంది. ప్రధాన నదులు ప్రవ హించే మార్గంలోనే జనావాసాలు ఉండడంతో ఈ సమస్య తప్పడం లేదు. భూకంపాలు తరచుగా రాకపోయినా, వచ్చినప్పుడు కోస్తాలోని ప్రధాన పట్టణ కేంద్రాలలో భవ నాలు కుదుపునకు గురవుతున్నాయి. ఈ తీవ్ర పరిణామా లకూ త్వరితగతిన జరుగుతున్న పట్టణ ప్రాంతాల విస్తర ణకూ సంబంధం ఉంది. వాతావరణ మార్పులు మున్ముం దు పెను తుపానులకు, వాటి విస్తరణకూ, ఫలితంగా సముద్రంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని శివరామకృష్ణన్ కమిటీ నిపుణులు పేర్కొన్నారు. అందువల్లనే ‘విజయ వాడ-గుంటూరు- మంగళగిరి- తెనాలి’, పరిసర ప్రాంతా లూ (వీజీఎంటీ) నూతన రాజధాని నిర్మాణానికి అనువై నవి కావని విస్పష్టంగా సలహా ఇచ్చింది. అందరి మాటా అదే శివరామకృష్ణన్ నివేదికలోని ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రణాళికా, భవన నిర్మాణ కేంద్రం (ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్) డెరైక్టర్ ఎన్.శ్రీధరన్ కూడా బలపరి చారు. ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోస్తాను పెను తుపానులు చుట్టుముట్టి భారీ ఎత్తున ధన, ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని (14-10-2014) పేర్కొనడం విశేషం! మొత్తం ఆంధ్ర కోస్తా అంతా పెనుతుపానులకు సంబం ధించినంత వరకు తీవ్రనష్టాలకు గురిచేసే మండలాల్లోనే విస్తరించి ఉందని నిపుణులు తాజాగా కూడా హెచ్చరిం చారు. ఈ దృష్ట్యానే శ్రీధరన్ ప్రస్తుత పట్టణాభివృద్ధి కేం ద్రాలు, తూర్పు కోస్తా ఆర్థిక లావాదేవీల నడవ (కారిడార్) సహా, ఇటు చెన్నై నుంచి అటు కోల్‌కతా వరకూ భారీ తుపానుల దెబ్బకు గురయ్యేంత సమీపంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తటస్థ మండలంలో 15 ప్రథమశ్రేణి పట్టణాలు, 15 ద్వితీయ శ్రేణి పట్టణాలు, 13 తృతీయ శ్రేణి, నాల్గవ స్థాయి పట్ట ణాలు ఉన్నాయి. హుదూద్ విలయం ముగిసిన వారం తరువాత కూడా కోస్తా ప్రాంతాలకు వాటిల్లిన కష్టనష్టాలు ఎంతటివో ఇప్పటికి స్పష్టం కాని పరిస్థితి. ప్రాణనష్టం నలుగురితో ఆగిందని మొదట్లో ఆ బాధ మధ్యనే తృప్తి పడ్డాం. రెండు రోజులకే ఆ సంఖ్య 43కి చేరుకోవడం, విశా ఖపట్టణానికి, యావత్తు ఉత్తర కోస్తా మూడు జిల్లాలకు, తూర్పు గోదావరి జిల్లాకు జరిగిన భారీ నష్టం రూ.70 వేల కోట్లని ముఖ్యమంత్రే ప్రకటించటమూ గమనార్హం! ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి ఈ పూర్వరంగంలో ఏపీ రాజధానికి విజయవాడ-గుంటూ రు ప్రాంతాలు, ముఖ్యంగా ఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది. వందిమాగదుల మాటలకే విలువ ఇవ్వకుండా, మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్ని విధాలా అనుకూలంగానూ, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ-వినుకొండ-బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుం ది. అందుకే రాజధానికి మూడు జోన్లతో పాటు, నాలుగు, ప్రాంతాలను శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదికలో అనువైన, పరిశీలనార్హమైనవిగా ప్రతిపాదించింది. వాటిలో భాగంగా దొనకొండ ప్రాంతాలను కూడా చేర్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సారవంతమైన వ్యవసాయ భూములకు ప్రసిద్ధి. అవి భారతదేశ ధాన్యాగా రాలలో విశిష్టమైనవి. కాబట్టి భూములను వ్యవసాయేతర పనులకు వినియోగించబోవటం ప్రజల ఆహార భద్రతకు చేటని కమిటీ అభిప్రా యపడింది. విజ్ఞత ప్రదర్శించాలి ఇంత వివరమైన హెచ్చరికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పాలకుల పునరాలోచించకుండా ఇంకా ‘గుళ్లో ప్రదక్షిణలు’ మాదిరిగానే విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజ ధాని నిర్మాణమంటూ మంకు పట్టు పడుతున్నారు. ఇందు కోసం భూములు ఇవ్వకపోతే ఆర్డినెన్స్ ద్వారానైనా రైతుల నుంచి గుంజుకుంటామని బెదిరింపులకు దిగడం సంస్కా రమూ కాదు, క్షంతవ్యమూ కాదు. రాజధాని ఎంపికపై కమిటీ నిపుణులు చేసిన ప్రతిపాదనలు సలహాలు మాత్ర మే, వాటిని రాష్ర్ట ప్రభుత్వం తలదాల్చవలసిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల ఇప్పటికీ మోరాయి స్తున్నారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు వచ్చిన తరు వాత కూడా తనకు ఏ నివేదికా అందలేదని సీఎం కోత కోస్తూవచ్చారు. నిజానికి పాలకులు వినమ్రతతో మెలగి రాష్ట్ర రాజధాని ఎంపిక నిర్ణయాన్ని పునరాలోచించక తప్ప ని పరిస్థితులను ‘హుదూద్’ సృష్టించింది. ఇలాంటి నిరం తర సంక్షోభం, సంకటాలకు రాష్ట్ర ప్రజలను వదిలిపెట్ట కుండా ప్రకటించిన నిర్ణయం గురించి పాలకులు పునరా లోచించడం మంచిది. నిపుణులు చేసిన హెచ్చరికలే నేడు వాస్తవంగా కళ్ల ముందు నిలిచాయని పాలకులు గుర్తించి విజ్ఞతతో మెలగాలనీ, తెలివి తెచ్చుకోవాలనీ ఆశిద్దాం. అంతేగాని ‘కరువునొక్క దాసరి’ అన్నట్టుగా ఈ పాలకుల పాలనా కాలం కరువుతో ప్రారంభమై, కరువు భారంతో సాగి, కరువు బాధతోనే ముగిసిపోకూడదు. ఏబీకే ప్రసాద్ -
గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని: కమిటీ స్పష్టత
హైదరాబాద్: ఏపి రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యేనని భూసేకరణ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భూసేకరణ కమిటీ(మంత్రి మండలి ఉపసంఘం) సమావేశం ముగిసింది. అనంతరం కమిటీ సభ్యుడు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమావేశం వివరాలను విలేకరులకు తెలిపారు. భూసేకరణపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 17, 18, 19 తేదీలలో విజయవాడ, గుంటూరులలో పర్యటిస్తామని చెప్పారు. తొలిదశలో రాజధాని కోసం 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. రైతులకు మేలు చేసే విధంగా భూ సేకరణ జరుగుతుందన్నారు. 60:40 శాతం నిష్పత్తిలో భూసేకరణ జరుగుతుందని చెప్పారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మంత్రి నారాయణను విశాఖపట్నం పంపిస్తున్నట్లు మంత్రి పల్లె తెలిపారు. ** -
భూముల ధరలకు మళ్లీ రెక్కలు
అమరావతి వైకుంఠపురంలో రాష్ట్ర అసెంబ్లీ భవనం, ధరణికోటలో సెక్రటేరియెట్, అమరావతి అగ్రి కల్చరల్ ఫారంలో వ్యవసాయ యూనివర్సిటీ, మండలానికి దగ్గరగా ఔటర్ రింగ్ రోడ్డు... ఇలా రోజుకో ప్రతిపాదన కొత్తరాజధాని తెరపైకి వస్తుండడంతో మండల పరిధిలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్నటి మొన్నటి వరకు మండల కేంద్రమైన అమరావతిలో విజయ వాడ-గుంటూరు రోడ్డులో భూముల కొనుగోళ్లు నిలిచిపోయాయి. అమరావతిని స్మార్ట్ సిటిగా అభివృద్ధి చేయాలని, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు రావటంతో తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగం పుంజుకుంది. మొన్నటి వరకు విజయవాడ-గుంటూరు రోడ్డు పక్కన ఎకరం కోటి రూపాయల ధర పలకగా, నేడు రెండు రూ. కోట్లకు పెంచారు. వాగుల పరివాహక ప్రాంతంలో వర్షాకాలంలో నీట మునిగే భూములను ఎకరా 30 నుండి 40 లక్షల రూపాయలు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై స్పష్టత రావటంతో మండల పరిధిలో వైకుం ఠపురం, పెదమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె, 14వ మై లు ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. కృష్ణానదికి రెండువైపుల రాజధాని నిర్మాణ జరగనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో అమరావతి, ధరణికోట, దిడుగు, మల్లాది, మునగోడు వంటి నది పరివాహక భూములకు డిమాండ్ పెరిగింది. అమరావతికి పక్కనే ఉన్న తుళ్లూరు, తాడికొండ మండలాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వెలువడటంతో ఈ మూడు మండలాల్లో భూములకు విపరీతంగా ధర పెరిగింది. ఇంకా ధర పెరుగుతుందనే ఉద్దేశంతో రైతులు ప్రస్తుతం భూముల అమ్మకానికి మొగ్గు చూపటం లేదు. ప్రభుత్వ భూముల గుర్తింపు.. {పభుత్వం ఆర్డివో స్థాయి అధికారిని నియమించి మండల పరిధిలో పోరంబోకు, అసైన్డ్, అటవీ, చెరువు, కుంటలకు సంబంధించిన భూములను క్షుణ్ణంగా పరిశీలించి వాటి వివరాలు సేకరించటం ప్రారంభించింది. మండలంలో ఏదో ఒక రంగానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో కొందరు ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇదిలావుం టే, లేఅవుట్ల ద్వారా వేసిన ప్లాట్ల అమ్మకాలు ఇక్కడ మందకొడిగా సాగుతు న్నాయి. నిబంధనలు పాటించని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు వెనుకాడుతున్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే రాజధాని ఏర్పాటు చేయాలి
తిరుపతి : రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని పుంగనూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. అస్మదీయులకు ప్రయోజనం చేకూర్చేందుకే చంద్రబాబు విజయవాడ-గుంటూరు మధ ్య రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారన్నారు. రాజధాని ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాలు, ఆలోచన లతో నిమిత్తం లేకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని తన అనుయాయుల చేత తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించారన్నారు. నియంతృత్వ పోకడలకు పోతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదన్నారు. రుణ మాఫీపై చంద్రబాబు దగాకోరు విధానాలను ప్రజలు గ్రహిస్తున్నారని, రైతులు, మహిళలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రకటనతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమన్నారు. లక్షా రెండు వేల కోట్ల రూపాయల రుణాలలో కేవలం 35 వేల కోట్లు మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు, ఇది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదన్నారు. అంతా మేలు చేసేసినట్లు మైండ్‌గేమ్ ఆడి ఎన్నికల హామీల నుంచి తప్పుకుని ప్రజల చూపును మళ్లించే యత్నం చేస్తున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు స్పందించేలోపు పుణ్యకాలం దాటిపోయిందని ఖరీఫ్ అదను దాటిపోవడంతో రైతులు రుణాలు మాఫీ కాక, క్రాప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ వంటివి పొందే వీలు కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్నారు. రుణాల రీషెడ్యూలింగ్‌పై ఆర్బీఐ సైతం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని బ్యాంకులు రైతులకు, డ్వాక్రా గ్రూపులకు నోటీసులు పంపి రుణ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎన్నికలు ముగిసి ఏదో విధంగా అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. -
చూసొద్దాం రండి..
పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్యాకేజీ రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 వరకు ప్రత్యేక బస్సు విజయవాడ-గుంటూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సందర్శన పర్యాటకాభివృద్ధే ధ్యేయం.. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో ఈ ప్రాంతాల్లో పర్యాటక రంగాభివృద్ధికి అధికారులు నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశపెడుతున్నారు. దీనిద్వారా రెండు జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా విజయవాడ-గుంటూరులోని ముఖ్యమైన ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రవేశపెట్టారు. ఇందుకోసం 18 సీట్ల బస్సును కూడా సిద్ధం చేశారు. ప్యాకేజీ వివరాలివీ.. ఈ బస్సు రోజూ సాయంత్రం 4 గంటలకు బందరురోడ్డులోని ఏపీటీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయల్దేరుతుంది. 4.45 మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి తీసుకెళ్తుంది. స్వామివారి దర్శనానంతరం అక్కడే ఉన్న హ్యాండ్లూమ్ బజార్‌కు చేరుకుంటుంది. అక్కడ పర్యాటకులు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు హ్యాండ్లూమ్ బజార్ నుంచి బయల్దేరి 6.30 గంటలకు హాయ్‌ల్యాండ్ చేరుకుంటుంది. రాత్రి 7.30 గంటలకు హాయ్‌ల్యాండ్ నుంచి భవానీపురంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న బరంపార్కుకు వస్తుంది. 8.15 నుంచి 9.15 గంటల వరకు కృష్ణానదిలో బోటు విహారం, బోటులోనే భోజనాలు ఏర్పాటుచేస్తారు. రాత్రి 9.30 గంటలకు తిరిగి ఏపీటీడీసీ కార్యాలయూనికి చేరుకుంటుంది. ఒక్కొక్కరికీ రూ.400 పెద్దలు ఒక్కొక్కరికీ రూ.400, చిన్నారులకైతే రూ.250 చొప్పున టికెట్ చెల్లించాలి. ప్రయాణికుల ట్రాన్స్‌పోర్టేషన్, బోటింగ్, ప్రతిచోటా ఎంట్రీ టికెట్లు, గైడ్, ఉచిత భోజనం కల్పిస్తారు. మూడురోజుల్లో 20 మంది సందర్శన నగరంలో మూడు రోజులుగా ఈ టూరిస్టు ప్యాకేజీ కొనసాగుతోంది. సుమారు 20 మంది పర్యాటకులు దీనిని వినియోగించుకున్నారు. కొన్ని మార్పులు చేస్తే ఉపయుక్తమే.. టూర్ ప్యాకేజీ అంతా బాగానే ఉన్నా.. కొన్ని లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నారుు. రోజూ సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రాత్రి 9.30 గంటలకు తిరిగివచ్చే విధంగా టూర్ ఏర్పాటు చేయడంపై పర్యాటకుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమయం తక్కువగా ఉన్నందున హాయ్‌ల్యాండ్, బోటు షికారు హడావుడిగా చేయూల్సి వస్తోందంటున్నారు. కనీసం ఆదివారం, సెలవు రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేలా ప్యాకేజీలో మార్పులు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. అలాగే, మంగళగిరి కొండపై ఉన్న పానకాలస్వామి దేవాలయ సందర్శనకు మరింత సమయం కేటాయిస్తే పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, సాయంత్రం కొద్దిసేపు భవానీద్వీపంలోనూ విహరించే సౌకర్యం కల్పిస్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని వారు సలహా ఇస్తున్నారు. ప్రచారం అవసరం ఏపీటీడీసీ అధికారులు ప్యాకేజీ ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంటే సరిపోదు. దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు మార్కెటింగ్ సిబ్బందిని ఏర్పాటుచేస్తే మంచిది. ఇలా.. 18 సీట్ల బస్సు పూర్తిగా నిండేలా అధికారులు ప్రయత్నిస్తే ఏపీటీడీసీకి ఆదాయం రావడమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్యాకేజీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. -
సమస్యకు సామరస్య పరిష్కారం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్న నే పథ్యంలో వాటి పరిష్కారానికి గుంటూరు నగరంలో ఉచిత న్యాయాధికార సంస్థ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ సెంటరు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు కానున్నదనే ప్రచారం జరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనూహ్యంగా ఊపందుకుంది. ఇతర జిల్లాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్తుల క్రయవిక్రయాలు నిత్యం జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చదరపు గజం రూ.రెండు వేలు పలకని స్థలాల ధరలు రూ. పదివేలకు పెరిగాయి. దీంతో ఈ రంగానికి అన్ని వర్గాలు చేరువయ్యాయి. ప్రతీ గ్రామంలో కనీసం పది మంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా అవతారమెత్తి ఆస్తుల క్రయ విక్రయాలను జరుపుతున్నారు. వీరికితోడు రాజకీయ నేతల ముఖ్య అనుచరులు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఈ వ్యాపారంలోకి ప్రవేశించడంతో అక్రమాలూ పెరిగాయి. ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు విక్రయించడం, విలువైన స్థలాలను కబ్జా చేయడం సర్వసాధారణమైంది. రిటైర్డ్ ఉన్నతాధికారుల స్థలాలను కూడా కబ్జా చేసే స్థాయికి ఈ అక్రమార్కులు పెరిగారు. 90 శాతం ఫిర్యాదులు భూములకు సంబంధించినవే.. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం స్థలాల కబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్ ప్రకారం నగదు చెల్లింపులు జరగడం లేదనేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఫిర్యాదులను స్వీకరించి బాధితుల నుంచి వివరాలు సేకరించడానికే పోలీసులకు సమయం సరిపోవడం లేదు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కేసులు పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బంది, సమయం కూడా పోలీస్‌శాఖకు లేదు. వీటిలో జోక్యం చేసుకుంటే సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం పెరుగుతుందనే ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉండటంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రి లిటిగేషన్ సెంటరు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు. అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఈ రంగంలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికే ఒక అవగాహనకు రావడంతోపాటు స్పెషల్ బ్రాంచ్ ద్వారా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ రంగానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టపరంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఉచిత న్యాయాధికార సంస్థ ఏర్పాటు ఆవశ్యకతను జిల్లా యంత్రాంగానికి వివరించనున్నారు. -
'విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని'
హైదరాబాద్ : విజయవాడ-గుంటూరు మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని ఆపార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అందువల్లే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆయన గురువారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోని రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని మోదుగుల పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపటం ఆర్డినెన్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారని మోదుగల అన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని ఆయన తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకరం చేయనున్న విషయం తెలిసిందే. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక నిర్మించనున్నారు. జూన్ 8వ తేదీ ఉదయం 11.35 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురువారం తన నివాసంలో గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై ఆయన వారితో చర్చలు జరిపారు. -
ఆశల మోసులు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు మహర్దశ పట్టనుందనే ఆశలు రేకెత్తుతున్నాయి. కనీస సౌకర్యాలు కరువై.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన జిల్లాలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకోనుంది. గుంటూరు-విజయవాడ నగ రాల మధ్య కొత్త రాజధాని ఏర్పాట వుతుందనే వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు మన జిల్లావైపు చూస్తున్నారు. అప్పుడే చిన్నాచితక సాఫ్ట్వేర్ కంపెనీలు వెలుస్తున్నాయి. రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయనే ఆశతో ఇతర జిల్లాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్తులు అమ్ముకుని ఎన్నో ఏళ్ల క్రితం వెళ్లిపోయిన వారు సొంత గ్రామా లకు తిరిగొచ్చి భూములు, ఇళ్లు కొనే ఆలోచనతో ఉన్నారు. భూముల ధరలకు రెక్కలు నిన్నమొన్నటి వరకూ తిరోగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కొత్త రాజధాని పేరు చెప్పుకుని పురోగమనం బాట పట్టింది. జిల్లాలో సాగునీరు అందక అరకొర దిగుబడిని ఇచ్చే పంట చేలు సైతం రహదారుల పక్కన ఉన్నకారణంగా కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. కొత్త రాజధానికి కనీసం 80 కిలోమీటర్ల వరకూ అభివృద్ధి చెం దుతుందనే ఊహాగానాలతో అంతే దూరంలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. ఏలూరు నగర శివారులో గజం స్థలం రూ.7వేల నుంచి రూ.15వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నాన్ లే-అవుట్ స్థలాలు గజం రూ.4వేలు, లే-అవుట్ స్థలాలు గజం రూ.5వేలు పైబడి ఉన్నాయి. వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గరిష్టంగా ఎకరం రూ.20 లక్షలు వరకూ ఉంది. పొలంలోకి రహదారి, సాగునీటి సౌకర్యం ఉంటే ఆ ధర మరింత భారీగా ఉం టోంది. లే-అవుట్, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే భూములైతే ఎకరా నికి రూ.కోటి పైగా చెల్లించాల్సిందే. అభివృద్ధిపై కోటి ఆశలు రాజధాని సమీపంలో ఉంటే పశ్చిమ గోదావరి అభివృద్ధిలో దూసుకుపోతుందని స్థానికులు ఆశపడుతున్నారు. విజయవాడ-గుండుగొలను మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించేందుకు ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. మరికొన్ని రహదారుల విస్తరణతో పాటు ఎనిమిది లేన్ల రోడ్లు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాన్ని పునరుద్ధరి స్తారనే ఆశలు చిగురిస్తున్నాయి. రైల్వే లో సైతం పెనుమార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కొత్త రైళ్లు వేయటంతోపాటు, ఫాస్ట్ ట్రైన్స్ రానున్నాయి. జిల్లాలో ఏకైక నగరమైన ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళితే మౌలిక సదుపాయా ల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తి చూపుతున్న పారిశ్రామిక వేత్తలు ఇప్పటివరకూ హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన పరిశ్రమలు, సాఫ్ట్వేర్ సంస్థలు పశ్చిమగోదావరి జిల్లావైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఏలూరు నగరంలో చిన్నాచితకా కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. కృష్ణా, గోదావరి జలాలు, రెండు జాతీ య రహదారులు, కావాల్సినన్ని అట వీ, వ్యవసాయ భూములతోపాటు సముద్రం, రైల్వే, విమాన సదుపాయాలు అందుబాటులో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పారిశ్రామిక వర్గాలు భూముల కొనుగోలుపై దృష్టి సారించాయి. -
రాజధానిగా విజయవాడ-గుంటూరు సరిపోతుంది
హైదరాబాద్: సీమాంధ్రకు రాజధానిగా విజయవాడ-గుంటూరు సరిపోతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ రైతు నాయకుడు యలమంచిలి శివాజి చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీమాంధ్ర అసెంబ్లీ, సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. యూనివర్శిటీని ఒంగోలు పిజి సెంటర్‌కు తరలించవచ్చునని తెలిపారు. హైదరాబాద్ మాదిరిగా సీమాంధ్ర రాజధాని ఉండాలనుకోవడం సరికాదన్నారు. అన్నీ ఒకే నగరంలో ఏర్పాటు చేయడం కూడా సరికాదని చెప్పారు. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ- గుంటూరును నో ఇండస్ట్రీయల్ జోన్‌గా ప్రకటించాలని శివాజీ డిమాండ్ చేశారు.