రాజధానిగా విజయవాడ-గుంటూరు సరిపోతుంది | Vijayawada-Guntur is enough for capital:Yalamanchili Sivaji | Sakshi
Sakshi News home page

రాజధానిగా విజయవాడ-గుంటూరు సరిపోతుంది

Published Mon, Mar 3 2014 3:29 PM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

యలమంచిలి శివాజి - Sakshi

యలమంచిలి శివాజి

హైదరాబాద్: సీమాంధ్రకు రాజధానిగా విజయవాడ-గుంటూరు సరిపోతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ రైతు నాయకుడు యలమంచిలి శివాజి చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో  సీమాంధ్ర అసెంబ్లీ, సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. యూనివర్శిటీని ఒంగోలు పిజి సెంటర్కు  తరలించవచ్చునని తెలిపారు.

హైదరాబాద్ మాదిరిగా సీమాంధ్ర రాజధాని ఉండాలనుకోవడం సరికాదన్నారు. అన్నీ ఒకే నగరంలో ఏర్పాటు చేయడం కూడా సరికాదని చెప్పారు. 13 జిల్లాలను  సమానంగా అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ- గుంటూరును నో ఇండస్ట్రీయల్ జోన్గా ప్రకటించాలని శివాజీ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement