
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయ్యింది. చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సిద్ధం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.