ఐదు వేల ఎకరాల ‘దిల్’ భూములు వెనక్కి | Five thousand acres 'Dil' Lands Back | Sakshi
Sakshi News home page

ఐదు వేల ఎకరాల ‘దిల్’ భూములు వెనక్కి

Published Sun, Aug 23 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

Five thousand acres 'Dil' Lands Back

సాక్షి, హైదరాబాద్: డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్టింగ్స్ లిమిటెడ్(దిల్) సంస్థకు భూమి కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంస్థకు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గత ప్రభుత్వం కేటాయించిన 4,999.14 ఎకరాల భూములు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నందున ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

హౌసింగ్ బోర్డుకు అనుబంధంగా ఏర్పడిన దిల్‌కు పారిశ్రామికాభివృద్ధి అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఈ మేరకు భూములను కేటాయించింది. పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ భూములను దిల్ పలు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. అయితే భూములు పొందిన సంస్థలు ఏళ్లు గడిచినా నేటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో భూ కేటాయింపులను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement