
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ , బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్ 55లో పేర్కొంది.
కిందటి నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది.
కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment