సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములను తనిఖీ చేసి నెలరోజుల్లో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్‌కే సిన్హా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ కేటాయింపు, భూదాన్, యూఎల్‌సీపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదాన్ యజ్ఞబోర్డుకు సంబంధించి 21,939 ఎకరాలు ఉందని ప్రాథమికంగా గుర్తించామన్నారు.
ఇందులో 13,916 ఎకరాలు ఫిట్‌గా ఉందని, ఇందులోనుంచి 13,510 ఎకరాలు అసైన్డ్ చేయగా, 8023 ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఈ భూములు ఎవరి పరిధిలో ఉన్నాయి, ఎంత మొత్తం కేటాయించారు.. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మండలాల వారీగా రిపోర్టు తయారు చేసి నెల రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో 44వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందని, ఇందులో 10,852 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించిన ఏపీఐఐసీ, హెచ్‌ఎండీఏ, దిల్, రాజీవ్ స్వగృహ, హౌజింగ్ తదితర సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్విృస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
విలువైన భూములకు ప్రహరీలు
జిల్లాలో విలువైన ప్రభుత్వ భూ ములున్నాయని సీసీఎల్‌ఏ ఎస్‌కే సిన్హా పేర్కొన్నారు. సుమారు రూ. 4867 కోట్ల విలువైన 853 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షిం చేందుకుగాను ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభు త్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
లీగల్ సెల్ ఏర్పాటు చేయండి : కలెక్టర్
జిల్లాలోని భూములకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులున్నాయని కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీసీఎల్‌ఏకు వివరించారు. వీటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక లీగల్‌సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తే సమస్యలు త్వరితంగా పరిష్కారమ వుతాయన్నారు.ఈ సమావేశంలో జేసీలు చంపాలాల్, ఎం వీరెడ్డి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
భూదాన్ భూములపై నెలరోజుల్లో నివేదిక
Published Wed, Jul 9 2014 12:05 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement