sk sinha
-
భూదాన్ భూములపై నెలరోజుల్లో నివేదిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములను తనిఖీ చేసి నెలరోజుల్లో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్కే సిన్హా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ కేటాయింపు, భూదాన్, యూఎల్సీపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదాన్ యజ్ఞబోర్డుకు సంబంధించి 21,939 ఎకరాలు ఉందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇందులో 13,916 ఎకరాలు ఫిట్‌గా ఉందని, ఇందులోనుంచి 13,510 ఎకరాలు అసైన్డ్ చేయగా, 8023 ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఈ భూములు ఎవరి పరిధిలో ఉన్నాయి, ఎంత మొత్తం కేటాయించారు.. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మండలాల వారీగా రిపోర్టు తయారు చేసి నెల రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో 44వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందని, ఇందులో 10,852 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించిన ఏపీఐఐసీ, హెచ్ఎండీఏ, దిల్, రాజీవ్ స్వగృహ, హౌజింగ్ తదితర సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్విృస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. విలువైన భూములకు ప్రహరీలు జిల్లాలో విలువైన ప్రభుత్వ భూ ములున్నాయని సీసీఎల్ఏ ఎస్కే సిన్హా పేర్కొన్నారు. సుమారు రూ. 4867 కోట్ల విలువైన 853 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షిం చేందుకుగాను ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభు త్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. లీగల్ సెల్ ఏర్పాటు చేయండి : కలెక్టర్ జిల్లాలోని భూములకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులున్నాయని కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీసీఎల్ఏకు వివరించారు. వీటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక లీగల్‌సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తే సమస్యలు త్వరితంగా పరిష్కారమ వుతాయన్నారు.ఈ సమావేశంలో జేసీలు చంపాలాల్, ఎం వీరెడ్డి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
రక్షణే లక్ష్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కొత్త ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఒకవైపు నిర్దేశిత అవసరాలకు కేటాయించిన భూములను వినియోగించుకోకుండా అట్టిపెట్టుకున్నవాటిని వెనక్కి తీసుకుంటూనే.. మరోవైపు విలువైన సర్కారు స్థలాలు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లకుండా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అసైన్డ్, సీలింగ్, యూఎల్సీ భూములు సహా వివిధ సంస్థలకు కేటాయించిన స్థలాల వివరాలను సేకరించింది. వీటిని కాపాడేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్న యంత్రాంగం... కొత్త పరిశ్రమలకు ఈ భూములను కేటాయించాలని నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాయితీలు, భూ కేటాయింపుల్లో సరళీకృత విధానాలు అవలంబిస్తే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల స్థితిగతులపై సమీక్షించేందుకు మంగళవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్.కె.సిన్హా జిల్లా కలెక్టరేట్‌కు రానున్నారు. జిల్లావ్యాప్తంగా 5.21 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, వీటిలో భూమిలేని నిరుపేదలకు సుమారు 1.76లక్షల ఎకరాలను పంపిణీ చేశారు. మరో 39వేల ఎకరాలను పారిశ్రామిక అవసరాలు, ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు, ప్రజోపయోగాలకుగాను ఏపీఐఐసీ, హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ, దిల్ తదితర సంస్థలకు బదలాయించారు. ఇలా జరిగిన భూ పందేరంలో ఎంత మేర వినియోగంలోకి వచ్చింది.. ఎంత చేతులు మారింది.. ఎంత మేర న్యాయ వివాదంలో చిక్కుకుంది.. కబ్జాలో ఉన్నదెం త.. క్లియర్‌గా ఉన్నదెంత..? తది తర అంశాలపై జిల్లా యంత్రాంగం పక్షం రోజులుగా కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఖాళీగా ఉన్న భూముల వివరాలను లెక్కగట్టింది. 10వేల ఎకరాలు క్లియర్! నగర శివార్లలో వివిధ సంస్థలకు 39వేల ఎకరాల భూమిని కేటాయించారు. దీంట్లో సుమారు 23వేల ఎకరాలు ఆయా సంస్థలు వినియోగించుకుంటున్నట్లు తాజాగా తేల్చింది. మిగతా దాంట్లో 16వేల ఎకరాలు అట్టిపెట్టుకోగా.. ఆరు వేల ఎకరాల న్యాయపరమైన చిక్కుల్లో ఉందని సర్వేలో గుర్తించింది. కాగా, తక్షణ కేటాయింపులకు అనువుగా 10,916 ఎకరాలు ఉన్నట్లు స్పష్టమైంది. ఐటీ ఆధారిత, పరిశ్రమల తాకిడికి అనుగుణంగా తొలి దశలో వీటిని కేటాయించాలని, మలి విడతలో మిగతా చోట్ల ఖాళీగా ఉన్న సర్కారు భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కేసీఆర్ సర్కారు రంగారెడ్డి జిల్లాలోని భూములపై నజర్ పెట్టడంతో అధికారులు ఇతర పనులు పక్కనపెట్టి.. వీటిని గణించే పనిలో నిమగ్నమయ్యారు. -
నేటి అర్ధరాత్రికి టీ ఉద్యోగుల జాబితా
తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు వీలైనంతవరకు ఉద్యోగులు వారి రాష్ట్రానికే తెలంగాణ జాబితాలో లేని వారు ఆంధ్ర రాష్ట్రంలో.. సోమవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగులు వారి రాష్ట్రాల్లో విధుల్లో చేరాల్సిందే లీవులో వెళ్లినా, చేరకపోయినా శాశ్వతంగా పదోన్నతి కోల్పోతారు ఇద్దరు సీఎస్ల నేతృత్వంలో సమన్వయ కమిటీ రోజూ ఇద్దరు సీఎస్‌లకు విభజన అమలు నివేదికలు హైదరాబాద్: వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర విభజన నేపథ్యంలో వీలైనంత వరకు ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించేందుకు ప్రభుత్వ ం కసరత్తు చేస్తోంది. శనివారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేయాల్సిన ఉద్యోగుల జాబితాతో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ జాబితాలో లేని ఉద్యోగులంతా సీమాంధ్ర రాష్ట్రానికి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించకుండా సెలవు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. శనివారం అర్ధరాత్రి తెలంగాణలో పనిసే ఉద్యోగుల పేర్లతో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉద్యోగులు ఆదివారం ఆ ఉత్తర్వులను చూసుకుని సోమవారం ఉదయం 10 గంటలకల్లా వారికి కేటాయించిన చోట రిపోర్ట్ చేయాలి. మిగిలిన వారు సీమాంధ్ర కార్యాలయాల్లో పనిచేయాలి. ఉద్యోగులు వారికి కేటాయించిన రాష్ట్రంలో చేరకపోయినా, సెలవుపై వెళ్లినా ఆ ఉద్యోగి పదోన్నతిని కోల్పతారు. రెండో సారి ఇచ్చిన సమయంలోగా చేరకపోతే శాశ్వతంగా పదోన్నతిని కోల్పతారని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సిన్హా శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే సమస్యల పరిష్కార కమిటీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రాష్ట్ర విభజన సంధికాలంలో ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పనులపై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం జారీ చేశారు. జూన్ 2న రెండు రాష్ట్రాలకు అన్ని రకాల అప్పగింతల బాధ్యత ప్రస్తుత విభజన కమిటీల్లో ఉన్న అధికారులు, ఆయా శాఖల అధికారులదేనని మార్గదర్శకాల్లో సీఎస్స్పష్టం చేశారు. విభజన అంశాలను రెండు రాష్ర్ట ప్రభుత్వాల తొలి మంత్రివర్గ సమావేశాల దృష్టికి తీసుకెళ్లడం, ఉమ్మడి కరెంట్ ఫైళ్లను ఇరు ప్రభుత్వాలకు అప్పగించే బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. జూన్ 2న సచివాలయంతోపాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, ఉద్యోగులందరూ ఎవరికి కేటాయించిన భవనాల్లోకి వారు కంప్యూటర్లు, ప్రింటర్లు, వాహనాలు, సెల్ఫోన్లు వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. ఫర్నీచర్, ఎయిర్ కూలర్లు, జనరేటర్లు, ల్యాండ్ ఫోన్లను ఎక్కడివక్కడే ఉంచాలని చెప్పారు. రాష్ట్ర విభజనపై సమీక్షించేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అపెక్స్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజూ విభజన అంశాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు వివరించాల్సి ఉంది. తెలంగాణకు 44 మంది ఐఏఎస్ ల కేటాయింపు న్యూఢిల్లీ: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారుల్లో 44 మందిని తాత్కాలికంగా తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నుంచి ఇది వర్తిస్తుంది. మళ్లీ ఉత్తర్వులు జారీ చేసే వరకు వీరు తెలంగాణ కేడర్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన వారు కూడా తుది కేటాయింపుల ఉత్తర్వులు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది విభాగం సంయుక్త కార్యదర్శి పి.కె.దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారి పేరు బ్యాచ్ 1. డి.లక్ష్మీ పి. భాస్కర్ 1980 2. అశ్వినీ కుమార్ పరీద 1980 3. డాక్టర్ రాజీవ్ శర్మ 1982 4. కె.ప్రదీప్ చంద్ర 1982 5. శ్యాం కుమార్సిన్హా 1982 6. వినోద్ కుమార్ అగ్రవాల్ 1983 7. బిబూ ప్రసాద్ ఆచార్య 1983 8. టి.రాధ 1983 9. వి.నాగిరెడ్డి 1984 10. జె. రేమండ్ పీటర్ 1984 11. శైలేంద్ర కుమార్ జోషి 1984 12. అజయ్ మిశ్రా 1984 13. సురేష్ చందా 1985 14. హీరాలాల్ సమారియా 1985 15. ఎస్.నర్సింగ్‌రావు 1986 16. బి.అరవిందరెడ్డి 1986 17. బి.ఆర్.మీనా 1986 18. పూనం మాలకొండయ్య 1988 19. విజయకుమార్ 1988 20. సునీల్ శర్మ 1990 21. కె.రామకృష్ణ రావు 1991 22. హర్‌ప్రీత్ సింగ్ 1991 అధికారి పేరు బ్యాచ్ 23. జయేష్ రంజన్ 1992 24. వికాస్ రాజ్ 1992 25. బి.వెంకటేశ్వర రావు 1993 26. ఎన్.శివశంకర్ 1993 27. ఎం.జగదీశ్వర్ 1993 28. బి.కిశోర్ 1993 29. సి.పార్థసారథి 1993 30. వి.ఎన్.విష్ణు 1993 31. ఆర్.వి.చంద్రవదన్ 1993 32. సవ్యసాచి ఘోష్ 1994 33. జి.డి.అరుణ 1994 34. బి.వెంకటేశం 1995 35. వి.అనిల్‌కుమార్ 1995 36. సంజయ్‌కుమార్ 1995 37. బి.మహేష్ దత్ ఎక్కా 1995 38. బి.జనార్దన్‌రెడ్డి 1996 39. ఎల్.శశిధర్ 1996 40. లవ్ అగర్వాల్ 1996 41. శైలజా రామయ్యర్ 1997 42. ఎన్.శ్రీధర్ 1997 43. ఎ.అశోక్ 1997 44. అహ్మద్ నదీం 1997 -
దేశ భద్రతకు చైనా సవాళ్లు
జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ ఎస్కే సిన్హా సాక్షి, హైదరాబాద్: భారత్‌ను అన్ని రంగాల్లో చైనా చిదిమేస్తోందని జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ ఎస్కే సిన్హా అభిప్రాయపడ్డారు. దేశంలో రాజకీయ కృతనిశ్చయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. భారత్ చుట్టూ ఉన్న వివిధ దేశాల్లో చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుందన్నారు. ఇది దేశ భద్రతకు పెనుసవాలుగా మారనుందని అభిప్రాయపడ్డారు. ప్రజ్ఞా భారతి, సోషల్ కన్సర్న్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ‘భారతదేశ భద్రత - దృక్పథం’ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడంతో నక్సలైట్లు రెచ్చిపోతున్నారన్నారు. దేశదీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా కృతనిశ్చయంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హక్కుల నేతల్ని నిర్మూలిస్తేనే.. నక్సలైట్ ఉద్యమానికి డబ్బులు అందిస్తున్న కొన్ని రాజకీయపార్టీల వల్లే ఆ ఉద్యమం కొనసాగుతోందని టి. హనుమాన్ చౌదరి అభిప్రాయపడ్డారు. నక్సలైటు ఉద్యమానికి మద్దతు బయటి నుంచి.. ప్రధానంగా మానవ హక్కుల సంఘాల నుంచి లభిస్తోందన్నారు. వరవరరావు, గద్దర్, అరుంధతీరాయ్ లాంటి వారిని అణచి వేయకుండా నక్సలైటు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.