నేటి అర్ధరాత్రికి టీ ఉద్యోగుల జాబితా | List of employees in today's midnight | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రికి టీ ఉద్యోగుల జాబితా

Published Sat, May 31 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

నేటి అర్ధరాత్రికి టీ ఉద్యోగుల జాబితా

నేటి అర్ధరాత్రికి టీ ఉద్యోగుల జాబితా

తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు
వీలైనంతవరకు ఉద్యోగులు వారి రాష్ట్రానికే
తెలంగాణ జాబితాలో లేని వారు ఆంధ్ర రాష్ట్రంలో..
సోమవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగులు వారి రాష్ట్రాల్లో విధుల్లో చేరాల్సిందే
లీవులో వెళ్లినా, చేరకపోయినా శాశ్వతంగా పదోన్నతి కోల్పోతారు
ఇద్దరు సీఎస్‌ల నేతృత్వంలో సమన్వయ కమిటీ
రోజూ ఇద్దరు సీఎస్‌లకు విభజన అమలు నివేదికలు

 
హైదరాబాద్: వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర విభజన నేపథ్యంలో వీలైనంత వరకు ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించేందుకు ప్రభుత్వ ం కసరత్తు చేస్తోంది. శనివారం అర్ధరాత్రి  తెలంగాణ రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేయాల్సిన ఉద్యోగుల జాబితాతో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ జాబితాలో లేని ఉద్యోగులంతా సీమాంధ్ర రాష్ట్రానికి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించకుండా సెలవు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. శనివారం అర్ధరాత్రి తెలంగాణలో పనిసే ఉద్యోగుల పేర్లతో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉద్యోగులు ఆదివారం ఆ ఉత్తర్వులను చూసుకుని సోమవారం ఉదయం 10 గంటలకల్లా వారికి కేటాయించిన చోట రిపోర్ట్ చేయాలి. మిగిలిన వారు సీమాంధ్ర కార్యాలయాల్లో పనిచేయాలి. ఉద్యోగులు వారికి కేటాయించిన రాష్ట్రంలో చేరకపోయినా, సెలవుపై వెళ్లినా ఆ ఉద్యోగి పదోన్నతిని కోల్పతారు. రెండో సారి ఇచ్చిన సమయంలోగా చేరకపోతే శాశ్వతంగా పదోన్నతిని కోల్పతారని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సిన్హా శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే సమస్యల పరిష్కార కమిటీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

 రాష్ట్ర విభజన సంధికాలంలో ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పనులపై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం జారీ చేశారు. జూన్ 2న రెండు రాష్ట్రాలకు అన్ని రకాల అప్పగింతల బాధ్యత ప్రస్తుత విభజన కమిటీల్లో ఉన్న అధికారులు, ఆయా శాఖల అధికారులదేనని మార్గదర్శకాల్లో సీఎస్‌స్పష్టం చేశారు. విభజన అంశాలను రెండు రాష్ర్ట ప్రభుత్వాల తొలి మంత్రివర్గ సమావేశాల దృష్టికి తీసుకెళ్లడం, ఉమ్మడి కరెంట్ ఫైళ్లను ఇరు ప్రభుత్వాలకు అప్పగించే బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. జూన్ 2న సచివాలయంతోపాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, ఉద్యోగులందరూ ఎవరికి కేటాయించిన భవనాల్లోకి వారు కంప్యూటర్లు, ప్రింటర్లు, వాహనాలు, సెల్‌ఫోన్లు వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. ఫర్నీచర్, ఎయిర్ కూలర్లు, జనరేటర్లు, ల్యాండ్ ఫోన్లను ఎక్కడివక్కడే ఉంచాలని చెప్పారు. రాష్ట్ర విభజనపై సమీక్షించేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అపెక్స్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజూ విభజన అంశాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు వివరించాల్సి ఉంది.

తెలంగాణకు 44 మంది ఐఏఎస్ ల కేటాయింపు

న్యూఢిల్లీ: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారుల్లో 44 మందిని తాత్కాలికంగా తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నుంచి ఇది వర్తిస్తుంది. మళ్లీ ఉత్తర్వులు జారీ చేసే వరకు వీరు తెలంగాణ కేడర్‌లోనే పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన వారు కూడా తుది కేటాయింపుల ఉత్తర్వులు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది విభాగం సంయుక్త కార్యదర్శి పి.కె.దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
 అధికారి పేరు    బ్యాచ్
 
1. డి.లక్ష్మీ పి. భాస్కర్    1980
 2. అశ్వినీ కుమార్ పరీద    1980
 3. డాక్టర్ రాజీవ్ శర్మ    1982
 4. కె.ప్రదీప్ చంద్ర    1982
 5. శ్యాం కుమార్‌సిన్హా    1982
 6. వినోద్ కుమార్ అగ్రవాల్    1983
 7. బిబూ ప్రసాద్ ఆచార్య    1983
 8. టి.రాధ    1983
 9. వి.నాగిరెడ్డి    1984
 10. జె. రేమండ్ పీటర్    1984
 11. శైలేంద్ర కుమార్ జోషి    1984
 12. అజయ్ మిశ్రా    1984
 13. సురేష్ చందా    1985
 14. హీరాలాల్ సమారియా    1985
 15. ఎస్.నర్సింగ్‌రావు    1986
 16. బి.అరవిందరెడ్డి    1986
 17. బి.ఆర్.మీనా    1986
 18. పూనం మాలకొండయ్య    1988
 19. విజయకుమార్    1988
 20. సునీల్ శర్మ    1990
 21. కె.రామకృష్ణ రావు    1991
 22. హర్‌ప్రీత్ సింగ్    1991
 అధికారి పేరు    బ్యాచ్
 23. జయేష్ రంజన్    1992
 24. వికాస్ రాజ్    1992
 25. బి.వెంకటేశ్వర రావు    1993
 26. ఎన్.శివశంకర్    1993
 27. ఎం.జగదీశ్వర్    1993
 28. బి.కిశోర్    1993
 29. సి.పార్థసారథి    1993
 30. వి.ఎన్.విష్ణు    1993
 31. ఆర్.వి.చంద్రవదన్    1993
 32. సవ్యసాచి ఘోష్    1994
 33. జి.డి.అరుణ    1994
 34. బి.వెంకటేశం    1995
 35. వి.అనిల్‌కుమార్    1995
 36. సంజయ్‌కుమార్    1995
 37. బి.మహేష్ దత్ ఎక్కా    1995
 38. బి.జనార్దన్‌రెడ్డి    1996
 39. ఎల్.శశిధర్    1996
 40. లవ్ అగర్వాల్    1996
 41. శైలజా రామయ్యర్    1997
 42. ఎన్.శ్రీధర్    1997
 43. ఎ.అశోక్    1997
 44. అహ్మద్ నదీం    1997
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement