
రంగారెడ్డి: జిల్లాలోని మైలర్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో పోలీసులకు,ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలువ్యాపించడంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగింది ప్లాస్టిక్ కంపెనీలో కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment