
హైదరాబాద్: హబ్సిగూడ(Habsiguda) ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారులో(Fire In Car Due) అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్నవారు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన మేరకు..
వారాసిగూడకు చెందిన నాగరాజు జనగామ నుంచి బస్సులో వచ్చిన తన భార్యా పిల్లలను ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మారుతి స్విఫ్ట్ కారులో ఎక్కించుకుని (ఏపీ 09 బీజే 2366) ఉప్పల్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాడు. వీరి కారు హబ్సిగూడ రోడ్డు నెంబర్ 6 వద్దకు రాగానే ఇంజిన్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన డ్రైవర్ నాగరాజు వెంటనే కారును రోడ్డు పక్కన నిలిపాడు. స్థానికులు, పోలీసుల సహాయంతో కారు వెనక డోర్లు ఓపెన్ చేసి భార్యా పిల్లలను కూడా బయటకు దింపారు. సమాచారం అందుకున్న మౌలాలి ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment