Habsiguda
-
హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6వ తరగతి విద్యార్థిని మృతి
సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో గురువారం విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొట్టడంతో పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.ప్రమాదంతో అప్రమత్తమైన వాహనదారులు బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.కొద్దిరోజుల క్రితంమరోవైపు హబ్సిగూడా ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది.ఆగస్ట్ 17, శనివారం ఉదయం హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థిని సాత్విక ఎప్పటిలాగే ఉదయం 7 గంటలకు ఆటోలో స్కూల్‌కు బయలుదేరింది. హబ్సిగూడ చౌరస్తాలో సిగ్నల్ పడి ఉండటంతో ఆర్టీసీ బస్సు వెనకాల ఆటోను ఆపి ఉంచాడు డ్రైవర్. ఈ క్రమంలో మితిమీరిన వేగంలో వెనక నుంచి దూసుకువచ్చిన ఓవర్ లోడ్‌తో ఉన్న టస్కర్ (18 చక్రాల లారీ) వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో స్వాతిక ప్రయాణిస్తున్న ఆటో ముందున్న ఆర్టీసీ బస్సు కిందకు చొచ్చుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎల్లయ్య తీవ్రంగా గాయపడగా..సాత్విక ప్రాణాలు కోల్పోయింది. ఇలా వరుస ప్రమాదాలతో ఉన్నత విద్యాసంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హబ్సిగుడాలో వరుస రోడ్డు ప్రమాదాలు విద్యార్థులు,వారి తల్లిదండ్రుల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. -
Habsiguda: బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో.. విద్యార్ధి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు అందులోని ఓ విద్యార్ధికి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.అయితే వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దాంతో.. అదుపుతప్పిన ఆటో బస్సు వెనకాల నుంచి ఢీకొట్టి దాని కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు. తీవ్రగాయాల పాలైన విద్యార్థినిని, ఆటో డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ పదో తరగతి విద్యార్థిని సాత్విక(15) మృతిచెందింది. తార్నాకకు చెందిన సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆటో డ్రైవర్ ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Student Dies in Uppal-Habsiguda Road AccidentA tenth class student died when a speeding truck hit the auto- rickshaw at Uppal in Secunderabad. The impact was big that the auto-rickshaw rammed into a RTC bus infront of it. Auto driver was also injured and battling for life.… pic.twitter.com/HPx4k6ZmVy— Sudhakar Udumula (@sudhakarudumula) August 17, 2024 -
అధిక లాభాలు ఆశ .. గోల్డ్ ట్రేడింగ్‌లో మోసపోయిన 500మంది బాధితులు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సుమారు 500 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. హబ్సిగూడా కేంద్రంగా నిందితుడు రాజేష్ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో కార్యకాలపాల్ని ప్రారంభించాడు. ఈ కార్యాలయంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఐదు నెలల్లో రెట్టింపు చేస్తానంటూ ప్రచారం చేశాడు. ఆ ప్రచారాన్ని నమ్మిన సుమారు 500 మంది నుంచి ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి రూ.కోటిరూపాయల వరకు వసూలు చేశాడు. ఆపై వారిని నమ్మించేందుకు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో 2 శాతం లాభాల్ని వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా రెండు నెలల పాటు వారం వారం కొంత మొత్తంలో చెల్లించాడు.దీంతో ప్రహణేశ్వరి ట్రేడర్ పేరు మారుమ్రోగింది. హబ్బిగూడ పరిసర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వందల కోట్లు వచ్చిపడ్డాయి. అదును చూసిన రాజేష్ బిచానా ఎత్తేశాడు. రాజేష్ తీరుపై అనుమానం రావడంతో పెట్టుబడి దారులు తాము మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రెండేళ్ల పాప మృతి : హైదరాబాద్
-
హైదరాబాద్: హబ్సిగూడలో అగ్నిప్రమాదం
-
HYD: అగ్ని ప్రమాదం.. అన్లిమిటెడ్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్లిమిటెడ్ షోరూంలో మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. రెండు ఫోర్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంక్‌ను పైర్ సిబ్బంది మూయించివేశారు. -
ఉరి వేసుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
-
Hyderabad: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య!
హైదరాబాద్: తార్నాకలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తార్నాకలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఒక కుటుంబంలోని నలుగురు ఈరోజు(సోమవారం) ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారిలో దంపతులు, నాలుగేళ్ల బాలిక సహా మరో మహిళ కూడా ఉన్నారు. మృతులు ప్రతాప్(34), సింధూర(32), ఆద్య(4), ప్రతాప్ తల్లిగా గుర్తించారు. తొలుత నాలుగేళ్ల చిన్నారి ఆద్యకు ఉరివేసి ఆపై కుటుంబం అంతా ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని కార్ షోరూమ్‌లో ప్రతాప్ డిజైనర్ మేనేజర్‌గా పని చేస్తుండగా, హిమయత్‌నగర్‌లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా సింధూర పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: కడియం
హబ్సిగూడ: ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, దాటవేసే ధోరణి అవలంభిస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో హబ్సిగూడలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గువ్వల బాలరాజు, ఆరూరి రమేశ్ హాజరయ్యారు. కడియం మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌర వం కోసం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్ 13న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఆ ప్రమాదం.. ఈ రవితేజను కలిచివేసింది!
హైదరాబాద్: నగరంలో ఇటీవల రోడ్డుప్రమాదాలు పెరిగిపోయాయి. మొన్నటికిమొన్న హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. నిన్న ఆదివారం కూకట్‌పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచారు. స్కూటీపై వెళుతున్న వారిని.. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదాలు చిన్నారి రవితేజను కలిచివేశాయి. అందరూ రోడ్డుప్రమాదాల పట్ల ఒకటి, రెండు నిమిషాలు అయ్యో అని బాధపడి వదిలేస్తారు. కానీ రవితేజ అలా వదిలేయలేదు. తనకు తోచినవిధంగా ఈ ప్రమాదాలకు అడ్డుకట వేయాలనుకున్నాడు. ఈ ప్రమాదాలకు రోడ్డుపై ఉన్న గుంతలు కూడా కారణమేనని అతని చిన్ని మేధస్సుకు తోచింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచిచూడకుండా తానే రంగంలోకి దిగాడు. ఒక చెక్కపెట్టేలో రాళ్లు, మట్టి తీసుకొచ్చి హబ్సిగూడ ప్రాంతంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాడు. ఆ చిన్నారి చర్య పలువురిని కదిలించింది. 'రోడ్డు మీద గుంతల కారణంగా ఇటీవల ఓ కుటుంబం బైక్ మీద నుంచి కిందపడిపోయింది. ఇలా ఎవరూ చనిపోకూడదని అనిపించింది. అందుకే రోడ్డు మీద ఉన్న గుంతలను పూడుస్తున్నాను. ఇకముందు కూడా పూడుస్తాను' అని రవితేజ ఈ సందర్భంగా అతను మీడియాకు తెలిపాడు. -
నడిరోడ్డుపై వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : పట్టపగలు నడిరోడ్డుపై ఓ వృద్ధుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని హబ్సిగూడలో శనివారం కలకలం రేపింది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి 108 సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
హైదరాబాద్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్
హైదరాబాద్: హైదరాబాద్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసే ఓ ఉద్యోగినిపై సంస్థ యజమాని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డాడు. బాధితురాలు గతనెల 25న కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రేప్ విషయం బయటకు చెపితే చంపేస్తానని ఆ ముగ్గురు యువకులు బెదిరించారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. కేసు వివరాలివీ.. హబ్సిగూడలోని ఫార్చున్ బట్టర్ ఫ్లై సిటీ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగం ఉందని తెలిసి బాధితురాలు దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ చేసిన సంస్థ యజమాని సంకు రమణ.. బాధితురాలికి ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత మాదాపూర్‌లో మరో బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, అక్కడే పని చేయాల్సి ఉంటుందని మహిళకు చెప్పాడు. దీంతో గతేడాది నవంబర్ నుంచి బాధితురాలు మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్తోంది. గతనెల 30వ తేదీన బాధితురాలిని అయ్యప్ప సొసైటీలోని ప్లాట్‌కు రమణరప్పించాడు. స్నేహితులు కిరణ్, రాజేశ్‌తో కలిసి అత్యాచారం చేశాడు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. -
హబ్సిగుడాలో దొంగల హల్చల్!
-
నల్లకలువల నజరానా!
ఓసారి ఆఫీసులో ముగ్గురు వ్యక్తులం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మూడో వ్యక్తి గది నుంచి బయటకు వెళ్లాడు. ఇద్దరమే ఉన్నాం. ‘ ఓ పొట్టాకు కుచ్‌భీ నై మాలూం (ఆ పిలగాడికి ఏమీ తెలీదు)’ అన్నాడు వెళ్లిన వ్యక్తి గురించి! ఏ పిల్లవాడికి? వెళ్లిన వాడు పిల్లవాడు కాదు కదా! నలభైల వాడే. ‘పొట్టా’ అని అన్న వ్యక్తీ దాదాపు అదే ఈడు వాడు. కాకపోతే ఒకటి రెండేళ్లు పెద్ద! తన కంటే చిన్న వాడు అతడి వయసుతో సంబంధం లేకుండా చిన్నవాడేనన్నమాట! కాలాన్ని సరళీకృతం చేసినట్లే వయసునూ హైద్రాబాదీలు సింప్లిఫై చేశారు. మహిళలు తమ సంభాషణలో సరదాగా ‘ఓ పొట్టీ క్యా (ఆ పిల్లా)’ అంటారు! ఆ అమ్మాయికి 50 సంవత్సరాలుండవచ్చు. దక్కనీ తెలుగులో కూడా ఈ వాడుక ఉంది. ‘వాడా బచ్చాగాడు’ వినే ఉంటారు. ట్రాఫిక్‌లో గమనించండి. సిగ్నల్స్ పడినప్పుడు ముందున్న వెహికల్ నడిపే వ్యక్తికి తల నెరవకపోయినా సరే, ‘చిచ్చా థోడా ఆగే చలోనా (చిన్నాయనా కొంచెం ముందుకు పోనియ్యి) అనే యువకులు మీకు తారసపడుతూనే ఉంటారు! హైద్రాబాద్‌కే ప్రత్యేకమైన యువకుల తుళ్లింత ఇది! ఓ సారి ఇంట్లో ఉన్నాను. మా శ్రీమతి ఫలానా ఆవిడ మివ్ముల్ని కలిసేందుకు డ్రాయింగ్ రూంలో వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది. పేరేమిటి అని అడిగాను. ‘ఫలానా’ అన్నది శ్రీమతి. అదేమిటి? మగపేరు కదా! వచ్చింది పురుషుడేనేమో, ఓ సారి సరిగ్గా చూసిరా అన్నాను. వెళ్లి చూసి, పేరు అడిగి మరీ తాను చెప్పింది కరెక్టే అని నిర్ధారించింది. మహిళలకు మగ పేరేమిటి? కుతూహలం కొంచెం చరిత్రను ముందుకు తెచ్చింది! రెండవ అసఫ్‌జా తన సైన్యంలో మహిళా దళం ఏర్పరచాడు. అంతఃపుర మహిళలను రక్షించేందుకు అవసరమైతే పురుషులతోనైనా తలపడేందుకు వీలుగా ‘జఫర్ ప్లటూన్ (విజయదళం)’ ఏర్పరచారు. ఈ విభాగం పేరుకు తగ్గట్లు వ్యవహరించిందని చెప్పలేం! క్రీ.శ. 1795లో నిజాం మరాఠాలపై యుద్ధానికి వెళ్లాడు. విహారానికి వెళుతున్నావుని భావించిన రాణి పట్టుబట్టి వురీ వుహిళా సైన్యంతో సురక్షితంకాని ప్రదేశానికి వెళ్లారు. రాత్రివేళ వురాఠాల కాగడాల దాడికి వుహిళా సైన్యం ఠారెత్తింది. రాణి చర్యతో అనూహ్యమైన ఓటమి చవిచూసిన నిజాం ఔరంగాబాద్ తదితర ప్రాంతాలను వురాఠాలకు అప్పగించాడు. తదనంతర కాలంలో ఆరవ నిజాం ఆఫ్రికా సైనికులను తన వ్యక్తిగత భద్రతకోసం నియమించుకున్నాడు. హైద్రాబాద్ సంస్థానానికి మిత్రుడైన వనపర్తి రాజా పర్యవేక్షణలో తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాకు చెందిన బాడీగార్డ్స్ ఉండేవారు. నిజాం కోరిక మేరకు 300 మంది టాంజానియన్స్ను పంపారు. ప్రస్తుత ఎ.సి.గార్డ్స్‌లో (ఆఫ్రికన్ కావలరీ గార్డ్స్) వారికి నివాసాలు ఏర్పాటు చేశారు. వేర్వేరు ఆఫ్రికా దేశాల నుంచి, ప్రాంతాల నుంచి, భాషా సమూహాల నుంచి వచ్చిన ఆఫ్రికన్స్ ఇక్కడ కలసిపోయారు. అబిసీనియన్ల నెలవు కాబట్టి ‘హబ్సిగూడ’ ఏర్పడింది. ఆఫ్రికా మూలాలున్న ముస్లింలను ‘సిద్ది’లు అంటారు. సిద్ది అంబర్ బజార్, సిద్దిపేట అలా ఏర్పడినవే! స్థానికులతో మమేకమై గంగా-జమునా తెహజీబ్‌కు ఉదాహరణగా నిలిచారు!. ఆఫ్రికన్ సంగీత నృత్యాలను ఇక్కడి సంస్కృతిలో మేళవించారు. నిజాం పుట్టిన రోజున రాజ్యంలోని ప్రముఖులందరూ ఆయనకు బహుమతులు ఇస్తే, నిజాం అంగరక్షకులకు బహుమతులు ఇచ్చేవారు. రాజుగారి పుట్టిన రోజున ‘ఏసీ గార్డ్స్ ఊరేగింపుగా వెళ్లిన వైభవానికి ప్రత్యక్షసాక్షులు ఇప్పటికీ ఉన్నారు. ఆఫ్రికన్ మహిళలు నిజాం అంతఃపురంలో ప్రత్యేక హోదాతో ఉండేవారు. నిజాం పిల్లలను చెంపదెబ్బ కొట్టే అధికారమూ వారికి ఉండేది. పల్లకీ హోదా ఉండేది! నిజాం మహిళా దళంలో ఇద్దరు సుప్రసిద్ధుల గురించి చరిత్రకారులు వేర్వేరు సందర్భాల్లో రాశారు. ఒకరు ‘మామా చంపా’ మరొకరు ‘మామా బరూన్’! -
చేరా ఇకలేరు
కళ్లు చెమర్చిన సాహితీ లోకం శోకసంద్రంలో ఆత్మీయులు సాక్షి, హైదరాబాద్: తెలుగు భాషా శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు ఆచార్య చేకూరి రామారావు (79) కన్నుమూశారు. గురువారం సాయంత్రం రాజధాని నగరంలోని హబ్సిగూడ వీధి నెంబర్-8లో గల తన స్వగృహంలో ధ్యానం చేస్తూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందరికీ చేరాగా సుపరిచితుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలూకా ఇల్లిందలపాడులో 1935లో జూలై 1న జన్మించారు. ఉస్మానియాలో ఎంఏ తెలుగుతో పాటు లింగ్విస్టిక్స్ ఎంఎ, పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వచన కవిత్వంలో దిట్ట అయిన చేరా వివిధ దినపత్రికల్లో అనేక వ్యాసాలు, చేరాతలు రాశారు. తెలుగు వాక్యం, వచన రచన, తెలుగులో వెలుగులు, ఇంగ్లీషు తెలుగు పత్రికా పదకోశం, ముత్యాల సరాల ముచ్చట్లు, చేరా పీఠికలు తదితర రచనలు చేసి భాషావ్యాప్తికి తనవంతు కృషి చేశారు. ఇటీవల ఆయన రచించిన ‘స్మృతికిణాంకం’కి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. రామారావుకు భార్య రంగనాయకితో పాటు విజయశేఖర్, సంధ్య, క్రిష్టఫర్ అనే ముగ్గురు సంతానం. పిల్లలు అమెరికాలో ఉండటంతో, వారి రాక కోసం భౌతికకాయాన్ని ఎల్.బి నగర్‌లోని కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు. చంద్రబాబు సంతాపం: చేరా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయనేత కె. నారాయణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ట కార్యదర్శులు కె. రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి, సీపీఐ శాసనసభాపక్ష మాజీ ఉప నేత కూనంనేని సాంబశివరావు, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ప్రముఖ జానపద పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు: జగన్ చేరా మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వాడుక భాషను కొత్త పుంతలు తొక్కించేందుకు చేరా ఎంతగానో కృషి చేశారని, తెలుగు సాహితీ విమర్శకుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. చేరా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. సాహితీ శిఖరం నేలకూలింది చేకూరి రామారావు(చేరా) మృతితో తెలంగాణ భాషా, సాహితీ శిఖరం నేలకూలిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు భాషలో ఉన్న అతికొద్ది మంది సా హితీవేత్తల్లో చేరా ప్రముఖుడని, గణనీయుడని కొనియాడారు. తెలుగు సాహితీ లోకానికి, భాషా ప్రియులకు చేరా మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఘనంగా తీజ్ ఉత్సవ్ మేళా
హైదరాబాద్: లంబాడిల తీజ్ ఉత్సవ్ మేళా ఉరేగింపు ఆదివార ఘనంగా జరిగింది. హబ్సిగూడ గాంధీ గిరిజన బస్తీ నుంచి వెలుగుట్ట వరకు జరిగిన ఉరేగింపులో యువతీయువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తోమ్మిది రోజులపాటు నిష్టంగా పెంచిన గోధుమ నారు బుట్టలను ఉరేగింపుగా బీబీనగర్ చెరువులో నిమజ్జననానికి తీసుకువెళ్లారు. సాంప్రదాయబద్దంగా జరుపుకునే ఈ ఉత్సవంలో లంబాడీలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతీయువకుల నృత్యాలు అందరినీ ఆకట్టున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, టిడిపి నాయకుడు బోబ్బల రమణారెడ్డి హాజరయ్యారు.