ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: కడియం  | Telangana: Former Deputy Chief Minister Kadiyam Srihari Comments On BJP Over SC Classification | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: కడియం 

Published Tue, Nov 30 2021 1:11 AM | Last Updated on Tue, Nov 30 2021 1:11 AM

Telangana: Former Deputy Chief Minister Kadiyam Srihari Comments On BJP Over SC Classification - Sakshi

హబ్సిగూడ: ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, దాటవేసే ధోరణి అవలంభిస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో హబ్సిగూడలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గువ్వల బాలరాజు, ఆరూరి రమేశ్‌ హాజరయ్యారు.

కడియం మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌర వం కోసం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్‌ 13న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement