vangapalli srinivas
-
జగన్‌ను చూసి నేర్చుకోండి
ముషీరాబాద్ (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సామాజిక న్యాయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం విషయంలో అక్కడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో 50 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు కేటాయించి ఔరా అనిపించుకున్నారని ప్రశంసించారు. 2019తో పోలిస్తే అత్యధికంగా బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు, మహిళలకు 19 టికెట్లు కేటాయించారని కొనియాడారు. రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి 37 కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటిస్తే 17 అగ్రకులాలకు ఇచ్చారని, 50 శాతం ఉన్న బీసీలకు కేవలం 13, 12 శాతం ఉన్న ఎస్టీలకు మూడు, 20 శాతం ఉన్న ఎస్సీలకు కేవలం ఒకే ఒక్క చైర్మన్ పదవిని ఇచ్చారని తెలిపారు. దీన్ని బట్టే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అని అర్ధమవుతోందన్నారు. ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి, 37 చైర్మన్ పోస్టులలో ఒక్కటి కూడా ఓయూ ఉద్యమకారులకు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. -
3న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమానికి తీసుకొచ్చిన దళితబంధు పథకం విధివిధానాలు ప్రకటించాలని అందుకోసం ఫిబ్రవరి 3న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దళిత సంక్షేమానికి కృషి చేస్తూ దళితబంధు పథకం తీసుకొచ్చారని, ఈ పథకం లక్ష్యం నెరవేరకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిరుపేదలకి ఈ పథకం చేరే విధంగా విధివిధానాలను ప్రకటించాలన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చందు, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తిరుమలేశ్, శ్రీకాంత్, ఓయూ అధ్యక్షుడు ఎల్.నాగరాజు పాల్గొన్నారు. -
బీఎస్పీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: ఎమ్మార్పీఎస్
మర్రిగూడ: బీఎస్పీకి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. నిత్యం దళితులపై దాడులు జరుగుతుంటే బీఎస్పీ పార్టీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి ఐక్య ఉద్య మాలు చేస్తుంటే బీఎస్పీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. ప్రజలందరూ బీజేపీని ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్, నర్సింహ, నరేందర్, శంకర్, సాలయ్య, సుదర్శన్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: కడియం
హబ్సిగూడ: ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, దాటవేసే ధోరణి అవలంభిస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో హబ్సిగూడలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గువ్వల బాలరాజు, ఆరూరి రమేశ్ హాజరయ్యారు. కడియం మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌర వం కోసం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్ 13న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మందకృష్ణ చంద్రబాబుకు తొత్తు: వంగపల్లి
ఉస్మానియా యూనివర్సిటీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన, మాదిగ జాతి అభ్యున్నతి కోసమే మలిదశ పోరాటాన్ని చేపట్టామని ఎమ్మార్పీఎస్–టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. శనివారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో “సాక్షి’తో మాట్లాడారు. 2019 నాటికి వర్గీకరణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఎస్పీ స్థాపించిన తరువాత ఎమ్మార్పీఎస్‌తో సంబంధం లేదని ప్రకటించిన మందకృష్ణ మాదిగ అది ఫలించక పోవడంతో వర్గీకరణ పేరుతో జాతిని మరోమారు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును పెట్టించి ఆమోదింపచేసిన ఘనత తమదేనని. చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్న మందకృష్ణ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును పెట్టించలేకపోయారన్నారు. 20 ఏళ్లుగా చేసిందేమీ లేదు వర్గీకరణ పేరుతో మందకృష్ణమాదిగ తన 20 ఏళ్ల ఉద్యమంలో సాధించిందేమీ లేదన్నారు. ఇటీవల తాము ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి వర్గీకరణపై ఒత్తిడి తెచ్చామన్నారు. మందకృష ఉద్యమంలో చిత్తశుద్ధిలేదని, వర్థనపేట నియోజక వర్గంలో మందకృష్ణకు డిపాజిట్ దక్కలేదన్నారు. మోకరిల్లడం ఉద్యమకారుడి లక్షణం కాదని, వెంకయ్య నాయుడుని అంబేద్కర్‌తో పోలుస్తూ కాళ్లు మొక్కి జాతిని తాకట్టు పెట్టారన్నారు. మలిదశ దండోర ఉద్యమంలో మాదిగలను మద్యానికి దూరం చేసి, విద్య, అభివృద్ధికి చేరువచేయాలనే లక్ష్యంతో ఎమ్మార్పీఎస్–టీఎస్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నేటినుంచి చైతన్య యాత్ర డప్పు, చెప్పుకు నెలకు రూ.2 వేల పింఛన్, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం కేంద్రం పై వత్తిడి పెంచేందుకు ఈ నెల 18 నుంచి 60 రోజుల పాటు మాదిగ చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కొలనుపాక నుంచి ప్రారంభమయ్యే యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందన్నారు. నవంబరు 19న హైదరాబాద్‌లో మాదిగల జన జాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.