ముషీరాబాద్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమానికి తీసుకొచ్చిన దళితబంధు పథకం విధివిధానాలు ప్రకటించాలని అందుకోసం ఫిబ్రవరి 3న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దళిత సంక్షేమానికి కృషి చేస్తూ దళితబంధు పథకం తీసుకొచ్చారని, ఈ పథకం లక్ష్యం నెరవేరకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
నిరుపేదలకి ఈ పథకం చేరే విధంగా విధివిధానాలను ప్రకటించాలన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చందు, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తిరుమలేశ్, శ్రీకాంత్, ఓయూ అధ్యక్షుడు ఎల్.నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment