హైదరాబాద్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్ | Gang-rape on the woman in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్

Published Fri, Oct 9 2015 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

Gang-rape on the woman in Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసే ఓ ఉద్యోగినిపై సంస్థ యజమాని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డాడు. బాధితురాలు గతనెల 25న కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రేప్ విషయం బయటకు చెపితే చంపేస్తానని ఆ ముగ్గురు యువకులు బెదిరించారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. కేసు వివరాలివీ.. హబ్సిగూడలోని ఫార్చున్ బట్టర్ ఫ్లై సిటీ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగం ఉందని తెలిసి బాధితురాలు దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ చేసిన సంస్థ యజమాని సంకు రమణ.. బాధితురాలికి ఉద్యోగం ఇచ్చాడు.

కొద్దిరోజుల తర్వాత మాదాపూర్‌లో మరో బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, అక్కడే పని చేయాల్సి ఉంటుందని మహిళకు చెప్పాడు. దీంతో గతేడాది నవంబర్ నుంచి బాధితురాలు మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్తోంది. గతనెల 30వ తేదీన బాధితురాలిని అయ్యప్ప సొసైటీలోని ప్లాట్‌కు రమణరప్పించాడు. స్నేహితులు కిరణ్, రాజేశ్‌తో కలిసి అత్యాచారం చేశాడు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement