ఆ ప్రమాదం.. ఈ రవితేజను కలిచివేసింది! | 12-years-old takes it upon himself to fill potholes | Sakshi
Sakshi News home page

ఆ ప్రమాదం.. ఈ రవితేజను కలిచివేసింది!

Published Mon, Jul 3 2017 10:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

ఆ ప్రమాదం.. ఈ రవితేజను కలిచివేసింది!

ఆ ప్రమాదం.. ఈ రవితేజను కలిచివేసింది!

హైదరాబాద్‌: నగరంలో ఇటీవల రోడ్డుప్రమాదాలు పెరిగిపోయాయి. మొన్నటికిమొన్న హీరో రవితేజ సోదరుడు భరత్‌ రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. నిన్న ఆదివారం కూకట్‌పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచారు. స్కూటీపై వెళుతున్న వారిని.. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదాలు చిన్నారి రవితేజను కలిచివేశాయి. అందరూ రోడ్డుప్రమాదాల పట్ల ఒకటి, రెండు నిమిషాలు అయ్యో అని బాధపడి వదిలేస్తారు. కానీ రవితేజ అలా వదిలేయలేదు.

తనకు తోచినవిధంగా ఈ ప్రమాదాలకు అడ్డుకట వేయాలనుకున్నాడు. ఈ ప్రమాదాలకు రోడ్డుపై ఉన్న గుంతలు కూడా కారణమేనని అతని చిన్ని మేధస్సుకు తోచింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచిచూడకుండా తానే రంగంలోకి దిగాడు. ఒక చెక్కపెట్టేలో రాళ్లు, మట్టి తీసుకొచ్చి హబ్సిగూడ ప్రాంతంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాడు. ఆ చిన్నారి చర్య పలువురిని కదిలించింది. 'రోడ్డు మీద గుంతల కారణంగా ఇటీవల ఓ కుటుంబం బైక్‌ మీద నుంచి కిందపడిపోయింది. ఇలా ఎవరూ చనిపోకూడదని అనిపించింది. అందుకే రోడ్డు మీద ఉన్న గుంతలను పూడుస్తున్నాను. ఇకముందు కూడా పూడుస్తాను' అని రవితేజ ఈ సందర్భంగా అతను మీడియాకు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement