Habsiguda: బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో.. విద్యార్ధి మృతి | Habsiguda Road Accident: 10th Class Student Died In Auto Bus Collision, Check Incident Details Inside | Sakshi
Sakshi News home page

Habsiguda Accident: బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో.. విద్యార్ధి మృతి

Published Sat, Aug 17 2024 12:00 PM | Last Updated on Sat, Aug 17 2024 1:36 PM

Habsiguda Road Accident: 10th Class Student Died In Auto Bus Collision

సాక్షి, హైదరాబాద్‌:  నగరంలోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు అందులోని ఓ విద్యార్ధికి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

అయితే వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దాంతో.. అదుపుతప్పిన ఆటో బస్సు వెనకాల నుంచి ఢీకొట్టి దాని కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు. తీవ్రగాయాల పాలైన విద్యార్థినిని, ఆటో డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

కాగా.. చికిత్స పొందుతూ పదో తరగతి విద్యార్థిని సాత్విక(15) మృతిచెందింది. తార్నాకకు చెందిన సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఆటో డ్రైవర్‌ ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement