సాక్షి, రంగారెడ్డి జిల్లా: శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆమనగల్ మండలం అయ్య సాగర్ సమీపంలో బస్సు-కారు ఢీకొని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికులు జేసీబీ సహాయంతో వెలికితీశారు.
Comments
Please login to add a commentAdd a comment