Srisailam - Hyderabad highway
-
3 గేట్లు ఎత్తిన అధికారలు
-
శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్..
-
శ్రీశైలంలో అద్భుతం..
-
ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆమనగల్ మండలం అయ్య సాగర్ సమీపంలో బస్సు-కారు ఢీకొని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికులు జేసీబీ సహాయంతో వెలికితీశారు. -
అడ్డగోలుగా వాడుకుని గాలికి వదిలేసాడు: శిల్పా చక్రపాణి రెడ్డి
-
3,600 ఎకరాల్లో బటర్‌ఫ్లై సిటీ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తును ముందుగా ఊహించిన వాళ్లకే విజయం దక్కుతుంది. రియల్టీ రంగం విషయానికొస్తే.. ఒక ప్రాంతం అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి, తక్కువ సమయంలో సామాన్యుల పెట్టుబడులను రెట్టింపు చేయడం అసలైన విజయం. సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీశైలం జాతీయ రహదారిలోని కడ్తాల్‌లో 3,600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ టౌన్షిప్. పదిహేనేళ్ల క్రితం బటర్‌ఫ్లై సిటీకి భూమి పూజ చేసే సమయంలో రోడ్లు, మంచినీరు, మురుగు నీటి వ్యవస్థ ఏరకమైన మౌలిక వసతులు సరిగా లేని ఆ ప్రాంతంలో... ఇప్పుడు మెరుగైన మౌలిక వసతులు, ప్రశాంతమైన వాతావరణంలో గృహాలు, స్కూల్, ఆసుపత్రి, కన్వెన్షన్ సెంటర్, పోలీస్ స్టేషన్.. ఇలా ప్రతీ ఒక్క సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీర్చిదిద్దుతుంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్. దశాబ్దన్నర క్రితం ఎకరం రూ.20 లక్షల కంటే తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఇప్పుడు రూ.2 కోట్ల పైమాటే ఉందంటే సామాన్యుల పెట్టుబడి ఎంత రెట్లు పెరిగిందో అర్థమవుతూనే ఉంది. బటర్‌ఫ్లై సిటీ: 3,600 ఎకరాల్లోని బటర్‌ఫ్లై సిటీలో 3 వేల ఎకరాలు నివాసాలకు, 600ల ఎకరాలకు వాణిజ్య కేంద్రాలకు కేటాయించామని కంపెనీ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. ఇప్పటికే 2 వేల ఎకరాలను అభివృద్ధి చేశాం. 600 విల్లాలను నిర్మించాం. ప్రస్తుతం మరొక వెయ్యి ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను చేస్తున్నాం. 10,800 ప్లాట్లుంటాయి. 200, 267, 300 గజాల విస్తీర్ణాలు. ధర గజానికి రూ.4,200 నుంచి 12 వేలు. 25 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులున్నాయి. ప్రస్తుతం 240 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ► ఈ ప్రాజెక్ట్‌లోని నివాసితుల పిల్లల కోసం సీబీఎస్ఈ పాఠశాలను నిర్మించింది. ప్రస్తుతం 4 ఎకరాల్లో ఆసుపత్రి, 3 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనుంది. 6 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి.. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ సెంటర్, స్పోర్ట్స్ అకాడమీ, విశ్వవిద్యాలయాలను నిర్మిస్తాం. వచ్చే పదేళ్లలో 80 వేల కోట్ల నెట్‌వర్త్‌ను క్రియేట్ చేయాలన్నది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా లక్ష్యం. నివాసితులకు రక్షణ కోసం సీఎస్ఆర్లో భాగంగా కోటి రూపాయల వ్యయంతో పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తుంది. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఇటీవలే భూమి పూజ చేశామని.. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. -
యువతి కిడ్నాప్; కీలక ఆధారాలు లభ్యం..!
సాక్షి హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న సోని(21) కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశంకర్‌గా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. 45 పైగా కేసుల్లో రవిశంకర్ నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. కిడ్నాప్‌నకు వాడిన కారును బళ్లారిలో నెల రోజుల క్రితం చోరీ చేసినట్లుగా తెలిసింది. కంకిపాడు, తల్లాడ, విజయవాడ, బళ్లారిలో అతనిపై కేసులున్నాయి. రవిశంకర్‌కు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలతో లింకులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం (23వ తేదీ) రాత్రి 8:50 గంటలకు పెద్ద అంబర్‌పేట టోల్గేట్ మీదుగా కిడ్నాపర్ కారు తీసుకెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా శ్రీశైలం వైపుగా ఆ కారు వెళ్లింది. కర్నూలు జిల్లాలో నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ కేసును ఛేదించేందుకు డీసీపి సన్‌ప్రీత్‌సింగ్ పర్యవేక్షణలో ఐదు బృందాలు పనిచేస్తున్నాయని ఏసీపీ గాంధీ నారాయణ తెలిపారు. కూతురురికి ఉద్యోగం ఇస్పిస్తానని నమ్మబలికిన ఓ దుండగుడు ఎలిమినేటి యాదగిరి కూతురు సోనిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. బొంగ్లూర్ గేటు వద్ద యాదగిరి టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఎవరు?..ఎందుకు?) మాయమాటలు చెప్పి.. మోసం : సోని తండ్రి నిందితుడికి సుమారు 35–40 ఏళ్ల్ల వయస్సు ఉంటుంది. శ్రీధర్ రెడ్డిగా పరిచయం చేస్తుకున్నాడు. తను ఉస్మానియాలో డాక్టర్‌ను అని, అతని తల్లిదండ్రులు హైకోర్టులో జడ్జిలని చెప్పాడు. తన సోదరుడు పోలీసు కమిషనర్ అని నమ్మబలికాడు. నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో నిందితుని మాటలు నమ్మాను. ఉదయం 7:30 గంటలకు మా టీ స్టాల్ వద్దకు వచ్చి మచ్చిక చేసుకున్నాడు. అతనితో పాటు ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళి కారును వాషింగ్ కూడా చేయించాను. పోలీసులు నా కూతురిని క్షేమంగా తీసుకురావాలను వేడుకుంటున్నా. తండ్రి అనుమానాలు.. సోని కిడ్నాప్ వ్యవహారంలో ఆమె తండ్రి యాదగిరిపై మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల కోసం యాదగిరి సోనిని అమ్మేశాడని, . పక్కా ప్లాన్‌తోనే జూలై 1న మాల్ మల్లేపల్లి నుంచి యాదగిరి బొంగుళూరుకు నివాసం మార్చినట్టు సందేహాలు వ్యక్తమతున్నాయి. కిడ్నాపర్ రవిశంకర్‌తో కలిసే యాదగిరి ఈ ప్లాన్ వేసినట్టు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ మత్తు బిస్కెట్ ఇచ్చాడనని యాదగిరి చెప్పడం అబద్దంగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు ఉండటంతో పోషణ భారమై యాదగిరి ఈ పథకం వేశాడమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
టెక్ దంపతుల ప్రాణం తీసిన వేగం
సాక్షి, దోమలపెంట (అచ్చంపేట): ఒకవైపు ఉల్లాసం.. మరోవైపు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృ తిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అమ్రాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ బద్యానాయక్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ టెక్మహేంద్రలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న దంపతులు అంజిరెడ్డి(30) తన భార్య అశ్విని(28), అదే కంపెనీలో పనిచేస్తున్న మరో నలుగురు అలీ, కిషోర్‌కుమార్‌రెడ్డి, రవికిరణ్, రూకేష్తో కలిసి శ్రీశైలం దర్శనార్థం బయలుదేరారు. దోమలపెంట అట వీ చెక్‌పోస్ట్‌కు సుమారు పది కి.మీ. దూరంలో ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి, అశ్విని అక్కడికక్కడే మృతిచెందగా.. అలీ, కిషోర్‌కుమార్‌రెడ్డి, రవికిరణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్స అనంతరం రవికిరణ్, కిషోర్కుమార్రెడ్డిల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మెరుగైన వైద్య సేవలకొరకు పెద్దాసుపత్రికి సిఫార్స్ చేసినట్లు ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో రూకేష్ క్షేమంగా బయటపడ్డారు. 10 నెలల క్రితమే వివాహం.. అంజిరెడ్డి, అశ్వినిలకు 10 నెలల క్రితమే వివాహమైనట్లు రూకేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన అంజిరెడ్డి శ్రీశైలంలో దర్శనం అనంతరం వారి స్వగ్రామానికి వెళ్లాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో దంపతులి ద్దరు ఒకేసారి మృతిచెందారని వాపోయారు. పంచనామా నిమిత్తం మృతదేహాలను అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అమ్రాబాద్ సీఐ రమేష్ కొత్వాల్, ఈగలపెంట ఎస్ఐ బద్యానాయక్, í సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. -
భగ్గుమన్న రైతులు
దళారీ వ్యవస్థతో వేరుశనగ రైతుల అవస్థలు హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో పెట్రోల్ పోసి వేరుశనగకు నిప్పంటించిన వైనం కల్వకుర్తి, న్యూస్‌లైన్ : తాము పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపుమండిన రైతులు వేరుశెనగ పంటను పోగుగా పోసి నిప్పంటించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మార్కెట్ యార్డు సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తెస్తున్నా దళారులు తమకు ధర రాకుండా చేస్తున్నారని ఆందోళనకు దిగారు. కల్వకుర్తి, వెల్దెండ్ల, వంగునూరు, చింతపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు 150 బస్తాల పంటను తెచ్చారు. ఇది 74 క్వింటాళ్లు ఉండగా దీని విలువ సుమారు రూ. రెండులక్షలకు పైబడి ఉంటుందని అంచనా. తమకు ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ దళారులు క్వింటాలు ధరను రూ.2,800 నుంచి 3,700కు మించి పెంచనివ్వడం లేదని వేరే ప్రాంతాల్లో రూ.4,200 వరకూ చెల్లిస్తున్నారని మండి పడ్డారు. ఆగ్రహంతో హైదరాబాద్ చౌరస్తాలోని శ్రీశైలం - హైదరాబాద్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. నిరసనగా పంటకు నిప్పు పెట్టారు. ఈ లోగా వర్షం రావడంతో దాన్ని రక్షించుకునేందుకు ఆందోళన విరమించి మార్కెట్‌కు తరలి వెళ్లారు. అక్కడా పంటపై కప్పేందుకు కవర్లు లేక అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మార్కెట్ కార్యాలయంపై దాడికి కూడా యత్నించారు. అయితే ఈ అంశంపై అధికారులు ఎవరూ స్పందించక పోవడం విశేషం. పోలీసులకు విషయం తెల్సి వచ్చేసరికి ఆందోళన సద్దుమణిగింది.