
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తును ముందుగా ఊహించిన వాళ్లకే విజయం దక్కుతుంది. రియల్టీ రంగం విషయానికొస్తే.. ఒక ప్రాంతం అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి, తక్కువ సమయంలో సామాన్యుల పెట్టుబడులను రెట్టింపు చేయడం అసలైన విజయం. సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది ఫార్చ్యూన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ శ్రీశైలం జాతీయ రహదారిలోని కడ్తాల్‌లో 3,600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ టౌన్‌షిప్. పదిహేనేళ్ల క్రితం బటర్‌ఫ్లై సిటీకి భూమి పూజ చేసే సమయంలో రోడ్లు, మంచినీరు, మురుగు నీటి వ్యవస్థ ఏరకమైన మౌలిక వసతులు సరిగా లేని ఆ ప్రాంతంలో... ఇప్పుడు మెరుగైన మౌలిక వసతులు, ప్రశాంతమైన వాతావరణంలో గృహాలు, స్కూల్, ఆసుపత్రి, కన్వెన్షన్ సెంటర్, పోలీస్ స్టేషన్.. ఇలా ప్రతీ ఒక్క సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీర్చిదిద్దుతుంది ఫార్చ్యూన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్. దశాబ్దన్నర క్రితం ఎకరం రూ.20 లక్షల కంటే తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఇప్పుడు రూ.2 కోట్ల పైమాటే ఉందంటే సామాన్యుల పెట్టుబడి ఎంత రెట్లు పెరిగిందో అర్థమవుతూనే ఉంది.
బటర్‌ఫ్లై సిటీ: 3,600 ఎకరాల్లోని బటర్‌ఫ్లై సిటీలో 3 వేల ఎకరాలు నివాసాలకు, 600ల ఎకరాలకు వాణిజ్య కేంద్రాలకు కేటాయించామని కంపెనీ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. ఇప్పటికే 2 వేల ఎకరాలను అభివృద్ధి చేశాం. 600 విల్లాలను నిర్మించాం. ప్రస్తుతం మరొక వెయ్యి ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను చేస్తున్నాం. 10,800 ప్లాట్లుంటాయి. 200, 267, 300 గజాల విస్తీర్ణాలు. ధర గజానికి రూ.4,200 నుంచి 12 వేలు. 25 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులున్నాయి. ప్రస్తుతం 240 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
► ఈ ప్రాజెక్ట్‌లోని నివాసితుల పిల్లల కోసం సీబీఎస్‌ఈ పాఠశాలను నిర్మించింది. ప్రస్తుతం 4 ఎకరాల్లో ఆసుపత్రి, 3 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్‌లను నిర్మించనుంది. 6 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి.. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్, స్పోర్ట్స్ అకాడమీ, విశ్వవిద్యాలయాలను నిర్మిస్తాం. వచ్చే పదేళ్లలో 80 వేల కోట్ల నెట్‌వర్త్‌ను క్రియేట్ చేయాలన్నది ఫార్చ్యూన్ ఇన్‌ఫ్రా లక్ష్యం. నివాసితులకు రక్షణ కోసం సీఎస్‌ఆర్‌లో భాగంగా కోటి రూపాయల వ్యయంతో పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తుంది. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఇటీవలే భూమి పూజ చేశామని.. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment