kadthal
-
రంగారెడ్డి: ప్రేమపేరుతో విద్యార్థినిపై లైంగికదాడి, అబార్షన్
సాక్షి, కడ్తాల్: ప్రేమపేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భం దాల్చడానికి కారకుడైన నిందితుడితో పాటు, గర్భస్రావం చేసిన ఎంబీబీఎస్ వైద్యురాలు, సహకరించిన ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కడ్తాల్ మండలంలో గిరిజన బాలికపై జరిగిన లైంగిక దాడి కేసుకు సంబంధించిన వివరాలను ఆమనగల్లు సీఐ ఉపేందర్, కడ్తాల్ ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ వెల్లడించారు. కడ్తాల్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(17) ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన వివాహితుడు సభవట్ రవీందర్(21) బాలికతో రెండేళ్లుగా పరిచయం పెంచుకున్నాడు. చదవండి: మూడేళ్ల ప్రేమ.. ఇంకొకరితో నిశ్చితార్థం జరగడంతో.. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. ఓ ఆర్ఎంపీ సాయంతో హైదరాబాద్‌లోని ఓ ఎంబీబీఎస్ డాక్టర్‌ను సంప్రదించి గర్భస్రావం చేయించాడు. ఈ సంఘటనపై విద్యారి్థని తల్లిదండ్రులు ఈనెల 25న కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ కేసు నమోదు చేశారు. బాలికను గర్భవతిని చేసిన నిందితుడు సభావట్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. గర్భస్రావం కోసం నిందితుడు ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ జంగిల్ రంజిత్ కుమార్‌ను సంప్రదించాడు. చదవండి: విడాకులు ఇవ్వట్లేదని.. ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్ అతడు బాలికను పరీక్షించి ఐదునెలల గర్భవతి అని నిర్ధారించాడు. తాను మధ్యవర్తిత్వం వహించి హైదరాబాద్‌లోని పల్లె జ్యోతి అనే ఎంబీబీఎస్ వైద్యురాలిని సంప్రదించాలని సూచించాడు. రవీందర్ బాలికను డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా ఆమె అబార్షన్ చేసింది. ఈమేరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఏ1గా సభావట్ రవీందర్, ఏ2గా ఆర్ఎంపీ జంగిల్ రంజిత్‌కుమార్, ఏ3గా ఎంబీబీఎస్ వైద్యురాలిపై కేసు నమోదు చేసి వారిని రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్ విన్యాసాలు: ‘క్రిమినల్ కేసు నమోదు’ -
ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ: 64 మందిపై కేసు
కడ్తాల్: లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. నిర్వాహకులతోపాటు మరో 64 మంది యువతీయువకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. ఇందుకు సబంధించిన వివరాలను ఆదివారం ఎస్ఐ సుందరయ్య వెల్లడించారు. ► కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో బాక్స్ ఫాంహౌస్‌లో హైదరాబాద్ నగరానికి చెందిన వరుణ్‌గౌడ్ శనివారం రాత్రి తన బర్త్‌డే వేడుకలను నిర్వహించాడు. వేడుకల్లో ఆయ న మిత్రులైన నగరానికి చెందిన 60 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. యువతీయువకులు మద్యం సేవించి డీజే సౌండ్‌తో నృత్యాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ► విశ్వసనీయ సమాచారంతో శనివారం రాత్రి 11 గంటలకు ఎస్ఓటీ సిబ్బంది, కడ్తాల్ పోలీసులు కలిసి ఫాంహౌస్‌పై దాడులు చేశారు. 47 మద్యం సీసాలతో పాటు, డీజే సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ► బర్త్‌డే వేడుకలు జరుపుకొంటున్న వరుణ్‌గౌడ్ పరారీలో ఉన్నాడని, అతడితోపాటు ఈవెంట్ నిర్వాహకులు భరత్, జీషాన్ అలీఖాన్, అన్వేష్‌తో పాటు వేడుకల్లో పాల్గొన్న 43 మంది యువకులు, 21 మంది యువతులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు తెలిపారు. చదవండి: మెసేజ్ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా.. -
3,600 ఎకరాల్లో బటర్‌ఫ్లై సిటీ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తును ముందుగా ఊహించిన వాళ్లకే విజయం దక్కుతుంది. రియల్టీ రంగం విషయానికొస్తే.. ఒక ప్రాంతం అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి, తక్కువ సమయంలో సామాన్యుల పెట్టుబడులను రెట్టింపు చేయడం అసలైన విజయం. సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీశైలం జాతీయ రహదారిలోని కడ్తాల్‌లో 3,600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ టౌన్షిప్. పదిహేనేళ్ల క్రితం బటర్‌ఫ్లై సిటీకి భూమి పూజ చేసే సమయంలో రోడ్లు, మంచినీరు, మురుగు నీటి వ్యవస్థ ఏరకమైన మౌలిక వసతులు సరిగా లేని ఆ ప్రాంతంలో... ఇప్పుడు మెరుగైన మౌలిక వసతులు, ప్రశాంతమైన వాతావరణంలో గృహాలు, స్కూల్, ఆసుపత్రి, కన్వెన్షన్ సెంటర్, పోలీస్ స్టేషన్.. ఇలా ప్రతీ ఒక్క సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీర్చిదిద్దుతుంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్. దశాబ్దన్నర క్రితం ఎకరం రూ.20 లక్షల కంటే తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఇప్పుడు రూ.2 కోట్ల పైమాటే ఉందంటే సామాన్యుల పెట్టుబడి ఎంత రెట్లు పెరిగిందో అర్థమవుతూనే ఉంది. బటర్‌ఫ్లై సిటీ: 3,600 ఎకరాల్లోని బటర్‌ఫ్లై సిటీలో 3 వేల ఎకరాలు నివాసాలకు, 600ల ఎకరాలకు వాణిజ్య కేంద్రాలకు కేటాయించామని కంపెనీ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. ఇప్పటికే 2 వేల ఎకరాలను అభివృద్ధి చేశాం. 600 విల్లాలను నిర్మించాం. ప్రస్తుతం మరొక వెయ్యి ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను చేస్తున్నాం. 10,800 ప్లాట్లుంటాయి. 200, 267, 300 గజాల విస్తీర్ణాలు. ధర గజానికి రూ.4,200 నుంచి 12 వేలు. 25 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులున్నాయి. ప్రస్తుతం 240 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ► ఈ ప్రాజెక్ట్‌లోని నివాసితుల పిల్లల కోసం సీబీఎస్ఈ పాఠశాలను నిర్మించింది. ప్రస్తుతం 4 ఎకరాల్లో ఆసుపత్రి, 3 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనుంది. 6 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి.. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ సెంటర్, స్పోర్ట్స్ అకాడమీ, విశ్వవిద్యాలయాలను నిర్మిస్తాం. వచ్చే పదేళ్లలో 80 వేల కోట్ల నెట్‌వర్త్‌ను క్రియేట్ చేయాలన్నది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా లక్ష్యం. నివాసితులకు రక్షణ కోసం సీఎస్ఆర్లో భాగంగా కోటి రూపాయల వ్యయంతో పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తుంది. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఇటీవలే భూమి పూజ చేశామని.. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. -
టవర్లెక్కిన యువకులు
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు రావిచేడ్ గ్రామంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు యువకులు సెల్‌టవర్లు ఎక్కి నిరసన తెలిపిన ఘటనలు బుధవారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తన ఇంటికి వెళ్లే దారి ఇరుకుగా ఉందని, ఈ దారిలోనే మరో వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా మెట్ల నిర్మాణం చేపట్టాడని ఆరోపిస్తూ కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన ఓర్సు లక్ష్మణ్ సెల్‌టవర్ ఎక్కి రెండుగంటల పాటు నిరసన వ్యక్తం చేశాడు. రహదారి ఇరుకు మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, మెట్ల నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి సెల్ టవర్ వద్దకు చేరుకొని సమస్యను రాతపూర్వకంగా తెలియజేయడంతో లక్ష్మణ్ సెల్ టవర్ పైనుంయి కిందకు దిగాడు. దీంతో గ్రామస్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రావిచేడ్‌లో.. సొంత అన్నకు భూమిని విక్రయిస్తే ఇంత వరకు డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని ఆరోపిస్తూ మండల పరి«ధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన రాజుగౌడ్ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ యాదయ్య పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని రాజుగౌడ్‌తో ఫోన్లో మాట్లాడినప్పటికీ టవర్ పైనుంచి దిగలేదు. సుమారు ఆరుగంటల పాటు టవర్ పైనే ఉండటంతో భూమిని కొనుగోలు చేసిన అతని అన్నను అక్కడికి రప్పించారు. భూమికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు సోదరుడు అంగీకరించడంతో పోలీసులు కిందకు దిగాలని కోరడంతో అతడు టవర్ దిగాడు. -
కారులో మంటలు
కడ్తాల్: ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ–పల్లెచెలక ఘాట్ రోడ్డులో మంగళవారం జరిగిన ఘటన వివరాలు.. చరికొండ గ్రామానికి చెందిన నీలాల మహేశ్ తన బంధువులైన బొమ్మరాజు శివ, సాయిలుతో కలిసి నగరంలోని సరూర్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 4 రోజు ల క్రితం వీరు మహేశ్ స్వగ్రామం చరికొండలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. మంగళవారం ఉదయం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంమధ్యలో చరికొండ–పల్లెచెలక ఘాట్‌రోడ్డులో కారు ఆగిపోయింది. వాహనం నడుపుతున్న నీలాల మహేశ్ దిగి ఇంజిన్ బానట్ లేపి చూడగా పొగలు కమ్ముకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహేశ్ సూచన మేరకు కారులో ఉన్న ఇద్దరు కిందికి దిగారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి కారు కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. -
అడవిలో కిలోమీటర్ దూరం నడిచిన ఎమ్మెల్సీ
కడ్తాల్ (కల్వకుర్తి): మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అడవిలో దాదాపు కిలోమీటర్ దూరం నడిచారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లికి చెందిన రైతు పుట్టి యాదయ్య పొలంలోని పాకలో కట్టేసిన లేగదూడపై ఆదివారం ఉదయం చిరుత దాడి చేసి చంపింది. అనంతరం దానిని సమీపంలోని అడవిలోకి దాదాపు కిలోమీటరు దూరం వరకు లాకెళ్లింది. లేగదూడపై చిరుత దాడి విషయం తెలుసుకున్న నారాయణరెడ్డి ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం లేగదూడను చిరుత లాక్కెళ్లిన స్థలం వరకు అడవిలో సుమారు కిలోమీటర్ దూరం రైతులతో నడుచుకుంటూ వెళ్లి లేగదూడ కళేబరాన్ని పరిశీలించారు. చిరుతను వెంటనే బంధించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్సీతోపాటు సర్పంచ్ సుగుణసాయిలు, ఎంపీటీసీ ఉమావతి తదితరులు ఉన్నారు. -
ఇంట్లో దాచుకున్న లక్షన్నర నగదు చోరీ
కడ్తాల్(కల్వకుర్తి) : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామపంచాయతీ పరిధిలోని గానుగుమార్లతండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ. 1.5లక్షలు దోచుకెళ్లారు. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం... గానుగుమార్ల తండాకు చెందిన బాణోతు శంకర్ నాయక్ బుధవారం ఉదయం యాచారం మండలం తాడిపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో గల తాటికుంట మైసమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అమ్మవారి దర్శనం అనంతరం రాత్రి 9గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకున్న శంకర్‌నాయక్ కుటుంబ సభ్యులు ఇంటి కిటికీ తలుపులు తెరిచి ఉండటం, ఇంట్లో వస్తువులు చిందరవందగా పడి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లోని డ్రెసింగ్ టేబుల్లో దాచి ఉంచిన రూ. 1.5 లక్షలు మాయం కావడంతో చోరీ జరిగిందని గుర్తించి స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం అందించాడు. గురువారం ఉదయం పోలీసులు హైదరాబాద్ నుంచి జాగిలంతో పాటు, క్లూస్‌టీం సభ్యులు వచ్చి ఇంటి పరిసరాలతో పాటు, చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితుడు శంకర్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెలిపారు. -
కన్నతల్లిని, కూతురును కడతేర్చిన కసాయి
కడ్తాల్(కల్వకుర్తి): నవ మాసాలు మోసి కనిపెంచి న తల్లితోపాటు, తన సొంత కూతురును కడతేర్చాడో ఓ వ్యక్తి. మద్యానికి బానిసై, ఉన్మాదిగా మారి ఇద్దర్నీ అతి దారుణంగా కత్తితో పొడిచి, రో కలిబండతో కొట్టి చంపిన సంఘటన కడ్తాల్ మం డల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో బుధవారం రా త్రి జరగగా.. గురువారం సాయంత్రం వెలుగుచూసింది. ఎస్హెచ్ఓ సుందరయ్య, స్థానికులు క థనం ప్రకారం.. బ్యాండు కొడుతూ జీవనం సాగిస్తున్న కడ్తాల్ మండల కేంద్రానికి సిద్దిగారి నర్సింహకు ఆరేళ్ల క్రితం శంషాబాద్ మండలం మల్లాపూర్‌కు చెందిన స్వప్నతో వివాహం జరిగింది. కాగా నర్సింహ వేధింపులు భరించలేక మూడున్నర సం వత్సరాల క్రితం స్వప్న ఒంటిపై కిరోసిన్ పోసుకు ని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కే సులో కొన్నాళ్లపాటు జైలులో ఉన్న నర్సింహ, ఏ డాది క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి బయటికొచ్చినా నర్సింహ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగుతూ పనీపాటా లే కుండా జులాయిగా తిరుగుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తల్లి సి ద్దిగారి సుక్కమ్మ(65), కూతురు శ్రావ్య(5)లతో క లిసి ఇంట్లోనే నిద్రించాడు. తల్లి, కూతురు నిద్రలో కి జారుకున్నాక ఇంట్లో ఉన్న రోకలిబండతో తల్లి, కన్న కూతురిని రోకలి బండతో కొట్టి కత్తితో కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇంటి గడి య పెట్టుకుని తలను గోడకు బాదుకోవడంతో పాటు, కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గురువారం సాయంత్రం ఇంటి గడప, తలుపు మీద రక్తపు మరకలు చూసిన స్థానికులు చూసి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఇంటి పైకప్పు పెంకులు తొలగించి ఇంట్లోకి వెళ్లి చూడగా సుక్కమ్మ, శ్రావ్యల మృతదేహలు పడి ఉన్నాయి. రక్తపు మడుగులో ఉన్న నర్సింహను అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు
కడ్తాల్(కల్వకుర్తి): నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చాడో కిరాతకుడు. తన పొలంలో పశువులు మేపిందనే నెపంతో భార్యతో కలిసి కన్నతల్లినే కొట్టిచంపాడు. కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నార్లకుంట తండాకు చెందిన బాణవత్ హన్ని – వస్య దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి, మూడో కుమారులైన రాములు, రవి హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతుండగా.. రెండో కుమారుడైన రేఖ్య భార్య పిల్లలతో కలిసి తండాలోనే తల్లిదండ్రులతో కాకుండా వేరుగా నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడైన రవికి చెందిన పొలాన్ని, పశువులను తల్లి హన్ని (65) చూసుకుంటూ ఉండేది. వాటిపై వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్‌లో ఉండే కుమారుడు రవికి పంపిస్తుండేది. శుక్రవారం ఉదయం రవికి చెందిన పశువులు రేఖ్య పొలంలో మేయడంతో రేఖ్య అతని భార్య నీలాలు హన్నిపై దాడిచేశారు. కన్నతల్లి అని చూడకుండా రేఖ్య రాయితో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. సంఘటనను గమనించిన స్థానికులు, తండా ప్రజలు రేఖ్యను మందలించి వదిలివేయగా.. హన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కడ్తాల్‌కు బయలుదేరింది. దీంతో రేఖ్య, అతని భార్య నీలా కలిసి మార్గమధ్యలో కర్కల్‌పహాడ్ సమీపంలో మరోసారి దాడిచేసి గాయపరిచారు. పిడిగుద్దులు గుద్ది, తన్ని తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు, తండా వాసులు చిన్న కుమారుడు రవికి సమాచారమిచ్చి, హన్నిని చికిత్స నిమిత్తం కడ్తాల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తల్లి హన్నిని రవి వెంట తీసుకుని ఆటోలో తండాకు వెళ్లాడు. తీవ్ర గాయాలు కావడంతో శనివారం ఉదయం హన్ని తండాలోని ఇంటి వద్ద మృతిచెందింది. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సుందరయ్యలు తండాలకు వెళ్లి వివరాలు సేకరించారు. హన్ని పెద్ద కొడుకు రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ
కడ్తాల్(కల్వకుర్తి) రంగారెడ్డి : గుర్తు తెలియని మహిళ కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాలు.. ఈ నెల 4వ తేదీన గుర్తు తెలియని మహిళ(50), మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలో అనారోగ్యంతో బాధపడుతూ పడి ఉంది. స్థానికుల సమాచారం మేరకు గుర్తు తెలియని మహిళను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ఫార్మాసిటీ భూసేకరణను అడ్డుకోవద్దు’
కడ్తాల్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం జరుగుతున్న భూసేకరణ సర్వేకు రైతులు సహకరించాలని, మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ సూచించారు. కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి, గానుగుమార్ల తండా, పోచమ్మగడ్డ తండా, పుల్లేరుబోడ్, జమ్ములాబావి తండా రైతులు భూసేకరణ సర్వేను అడ్డుకోవడంతో గురువారం వారితో జేసీ మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకునే హక్కు రైతులకు లేదని, అయితే రైతుల అంగీకారం లేకుండా ఆ భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. పట్టా భూముల జోలికి తాము వెళ్లడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం భూముల ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే భూసేకరణ సర్వే జరుపాలని డిమాండ్ చేశారు. -
ఫార్మాసిటీ సర్వే పనులు ప్రారంభం
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని అన్మాస్‌పల్లి, పుల్లేరుబోడ్ తండా పరిసరాల్లో ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ కోసం భూముల సర్వే ముమ్మరంగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ అనంతరెడ్డి పర్యవేక్షణలో రెండు బృందాలుగా ఏర్పడి అధికారులు సర్వే నంబర్ 260, 321లలో సర్వే చేపట్టారు. భూముల హద్దుల గుర్తింపునకు, సమగ్ర వివరాల సేకరణకు తాము సర్వే కొనసాగిస్తున్నట్లు వివరించారు. ముందుగా ఆయా సర్వే నంబర్లలో భూముల హద్దులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.