‘ఫార్మాసిటీ భూసేకరణను అడ్డుకోవద్దు’ | pharma city land pooling in mahabubnagar district | Sakshi
Sakshi News home page

‘ఫార్మాసిటీ భూసేకరణను అడ్డుకోవద్దు’

Published Thu, Nov 17 2016 4:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

pharma city land pooling in mahabubnagar district

కడ్తాల్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం జరుగుతున్న భూసేకరణ సర్వేకు రైతులు సహకరించాలని, మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ సూచించారు. కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి, గానుగుమార్ల తండా, పోచమ్మగడ్డ తండా, పుల్లేరుబోడ్, జమ్ములాబావి తండా రైతులు భూసేకరణ సర్వేను అడ్డుకోవడంతో గురువారం వారితో జేసీ మాట్లాడారు. తహసీల‍్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకునే హక్కు రైతులకు లేదని, అయితే రైతుల అంగీకారం లేకుండా ఆ భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. పట్టా భూముల జోలికి తాము వెళ్లడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం భూముల ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే భూసేకరణ సర్వే జరుపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement