అవకతవకలు నిజమే!
Published Fri, Oct 7 2016 3:01 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
ఫార్మాసిటీ భూసేకరణలో పొరపాట్లు
అర్హులుగా మారిన అనర్హులు
నిర్ధారించిన విచారణ అధికారి
కలెక్టర్‌కు నివేదిక అందజేత..!
ముచ్చర్ల సర్వే నంబర్ 288 (1ఎం)లో వాస్తవ ప్రకారం ఉండాల్సిన 5.33 ఎకరాల భూమికి 1982-83లో అదనంగా రెండు ఎకరాలు పెంచి సదరు పట్టాదారు విక్రరుుంచి నట్లు నిర్ధారించారు. దీంతో కబ్జాలోలేని అనర్హులకు పరిహారం అందిందని, అర్హుడైన రైతు నాగయ్యకు పరిహారం ఇవ్వాలని విచారణాధికారి నివేదిక ఇచ్చారు.
సర్వే నంబర్ 288(16)లో తమ్ముడు వద్ద సాదా కాగితంపై కొనుగోలు చేసిన వారికి అన్న భూమిలోని సర్వే నంబర్ 288(11)లో నుంచి 5 ఎకరాలకు పరిహారం అందినట్లు నిర్ధారించారు. సదరు రూ.62.50 లక్షలు పరిహారం పొందిన వారి రికార్డులపై విచారణాధికారి అనుమానాలు వ్యక్తం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలు చోటుచేసుకున్నారుు. క్షేత్రస్థారుులో భూమి లేనప్పటికీ.. పరిహార జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లు వచ్చారుు. ఈ అంశంపై వాస్తవ పట్టాదారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో కలెక్టర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఆయన.. ఫిర్యాదుపై నిజనిర్ధారణకు ప్రత్యేకంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్‌ను విచారణాధికారిగా నియమించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన పీఓ ఆర్వీఎం.. ఫార్మాసిటీ కోసం జరిగిన భూసేకరణకు సంబంధించి పట్టాదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా పొజిషన్‌లో ఉన్న పట్టాదారులు, రికార్డుల్లో ఉన్న వారి పేర్లను పరిశీలించి అర్హుల జాబితాపై స్పష్టత ఇచ్చారు. ఈమేరకు నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందజేశారు. భూసేకరణకు సంబంధించిన జాబితాలో పేర్లు తారుమారైనట్లు విచారణాధికారి నిర్ధారించినట్లు తెలిసింది. కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో పూర్తిస్థారుు వివరాల్ని పేర్కొన్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నివేదిక సారాంశమిది..
సర్వే నంబర్ 288(1టీ)లో వాస్తవంగా 5 ఎకరాలు ఉండాల్సి ఉండగా 2004-05లో 4.20 ఎకరాలను పహణీల్లో పెంచి చూపారు. అధికారులు అవార్డు జారీచేయగా రైతుల ఫిర్యాదు మేరకు వారికి పరిహారం నిలిపివేశారు. వాస్తవంగా పొజిషన్‌లో భూమి లేనట్లు తేలింది.
సర్వే నంబర్ 288(1జే)లో అసలు రైతుకు రూ.4.20 ఎకరాలు ఉంది. కాగా 288(1పీ)లో రికార్డులో లేని భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులకు 1జేలోని భూమిపై పరిహారం ఇచ్చేలా ప్రొసీడింగ్ ఇచ్చారు. దీంతో తనకు పరిహారం అందకుండా వేరే వారికి అందనుండటంతో సదరు రైతు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం పరిహారం నిలిచిపోరుుంది.
సర్వే నంబర్ 288(4)లో 5 ఎకరాల అసైన్‌డ భూమి కొన్న వారు కబ్జాలో ఉండగా వారికి కబ్జాదారుల కింద కాకుండా అసైన్‌డ కిందనే పరిహారం అందినట్లు అదనంగా చెల్లించిన మొత్తం రికవరీ చేయాలంటూ నిర్ధారించారు.
సర్వే నంబర్ 288లో ఎకరం 14 గుంటలపై కబ్జాలో ఉన్నా తనకు పరిహారం అందలేదని సదరు రైతు రాములమ్మ చేసిన పిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం ఆమె 30 గుంటల్లో సాగు చేసుకుంటుందని, అంత మేర పరిహారం ఇవ్వొచ్చని తేల్చారు.
Advertisement
Advertisement