land pooling
-
ప్రగతి పేరుతో భూసేకరణ.. పేద రైతులే టార్గెట్!
ఈమధ్య దక్షిణ కొరియాకు చెందిన షూ ఆల్స్ కంపెనీ తాము ఇక్కడ 300 కోట్లతో షూ కంపెనీ పెడతామనీ, అందుకు కావలసిన 750 ఎకరాల భూమి ఇస్తే 87 వేల మందికి ఉపాధి కల్పిస్తామనీ ప్రగల్బాలు పలికింది. తెలంగాణలో ఎకరం కోటి రూపాయలనుకున్నా 300 కోట్ల పెట్టుబడికి 750 కోట్ల విలువైన భూమి అడిగారన్నమాట. అదే విధంగా ఒక స్మార్ట్ హెల్త్ సిటీ పెట్టడానికి 5,000 ఎకరాలు కావాలని అర్జీ పెట్టింది ఇదే కంపెనీ. దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ కేవలం 5–10 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. ఇది ‘చారణా కోడికి బారణా మసాలా’ అన్నట్లు ఉంది. ఇక ఈ మధ్య ప్రగతి పేరుతో భూసేకరణ చేయడం పేద, మధ్య తరగతి రైతుల పట్ల ఉరితాడులా పరిణమించింది.భూమి ధరలు పెరగటంతో చిన్న, సన్న కారు రైతులు ధనవంతులు అయ్యే సమయానికి, ప్రభుత్వమే భూ దోపిడీకి పాల్పడి ప్రజలను దారిద్య్రంలోకి నెడుతోంది. ఉన్నోడికి రవ్వంత పోయినా కొండంత లాభం వస్తే, లేనోడు రోడ్డున పడుతున్నాడు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే పరిహారం, కనీసం గుంట ప్లాట్ కొనుక్కోవడానికి సరిపోవడం లేదు. ప్రగతి వలన భూముల విలువ పెరిగి వందల, వేల ఎకరాలు ఉన్న వారు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారు. ఒకసారి మార్కెట్ విలువ, ప్రభుత్వ పరిహారం విశ్లేషిస్తే... చౌటుప్పల్ దగ్గర ఎకరం 2 కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 10 లక్షలు; జహీరాబాద్ దగ్గర 1.5 నుండి 2 కోట్లు ఎకరానికి ధర ఉంటే 7–10 లక్షలు మాత్రమే ఇస్తోంది. ప్రభుత్వం భూస్వామిగా కాకుండా, ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టం చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) సేకరించిన భూమి ఎంత, అందులో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాటి వలన ఎంతమందికి ఉపాధి కల్గుతుంది వంటి వివరాలతో ఒక శ్వేతపత్రం (వైట్ పేపర్) విడు దల చేయాలి. కొత్తగా సేకరించే భూమి... పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల కొరకా లేదా పూర్తిగా ప్రజా అవసరాల కొరకా అనేది స్పష్టం చేయాలి. గతంలో ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చిన భూమిలో ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం తేల్చాలి. ఇప్పటికే వివిధ సంస్థలు, వ్యక్తులు లేదా ట్రస్టులకు వివిధ ఉద్దేశాలతో కేటాయించిన భూమిలో వేరే వ్యాపారాలు, సంస్థలు నెలకొన్నా యేమో చూడాలి. భూములు సేకరించే ముందు, నిర్వాసితులు అవుతున్న ప్రజల, రైతుల ప్రయోజనాలనే ముఖ్యంగా ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి. ఆ భూముల వలన వచ్చే ప్రయోజనాలలో నిర్వాసితులకు సింహభాగం దక్కాలి. ఒక ప్రాజెక్ట్ లేదా రోడ్డు వచ్చినప్పుడు పరిసర ప్రాంతాలలో భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి, నిర్వాసితులకు కూడా ఆ లాభం దక్కేలా చూడాలి.ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని మొదట ఉపయోగించిన తర్వాత, కొత్త భూ సేకరణకు శ్రీకారం చుట్టాలి. అలాగే ఒక ప్రాజెక్టులో కేవలం ఎకరం, రెండు ఎకరాల భూమి ఉన్న రైతు సర్వం కోల్పోతే వారు రోడ్డున పడతారని గమనించాలి. అదే ఎక్కువ భూమి ఉన్నవారు కొంత పోయినా, మిగతా భూమి విలువ పెరగటం వలన వారికి లాభం కలుగుతుంది. అందువల్ల భూమిని కోల్పోయేవారు ఒక్కొక్కరు ఎంతెంత శాతం భూమిని కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలి. ఆ ప్రాతిపదికన పరిహార చెల్లింపు ఉండాలి.ప్రాజెక్టులలో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం నిర్మాణ వ్యయం రూ. 6,690 కోట్లు. ఇందులో రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమి 5,500 ఎకరాలు. రైతులకు చెల్లించిన మొత్తం కేవలం రూ. 250 కోట్లు మాత్రమే. రోడ్డుకు అటు, ఇటు ఉన్న రైతుల భూముల విలువ లక్షల కోట్లకు పెరిగింది. కాంట్రాక్టర్ లాభపడ్డాడు. ప్రభుత్వం 7,300 కోట్లకు అంటే ఏడాదికి 240 కోట్లకు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై సంవత్సరానికి రూ. 550 కోట్ల రాబడి ఉంది. మున్ముందు అది ఏడాదికి రూ. 1,000 కోట్లు దాటే అవకాశం ఉంది. అదే రిజిస్ట్రేషన్ విలువ ఇచ్చి, మార్కెట్ విలువ ప్రకారం ఆ కంపెనీలో నిర్వాసితులకు షేర్ ఇచ్చి ఉంటే, వచ్చే 30 సంవత్సరాలు నిర్వాసిత రైతులకు నెలకు కొంత పరిహారం అందేది. అలానే పారిశ్రామిక వాడలు, కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు నిర్వాసిత రైతులకు భూమి మార్కెట్ విలువ ప్రకారం షేర్ ఇవ్వడం వలన వారు కూడా ఆ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది.వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంకు ఉన్న కంపెనీల దగ్గర నుండి భూమిని సేకరించి వివిధ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వడం వలన ఎవ్వరికీ నష్టం లేకుండా ప్రగతి సాగుతుంది. అలానే వారికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ లే ఔట్లలో ప్లాట్ కేటాయిస్తే న్యాయం జరుగుతుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక వెసులుబాట్లు, స్వయం ఉపాధికి లోన్లు... అవీ వడ్డీ రహిత రుణాలు అందించడం; ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత కోటా కేటాయించడం... ఇలా పలు విధాలుగా భూ నిర్వాసితులకు ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. చదవండి: మంచి పనిని కించపరుస్తారా?బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు (టీడీఆర్) లాంటివి ఇవ్వడం వలన వారికి అధికంగా ఆర్థిక సుస్థిరత కలుగుతుంది. జీహెచ్ఎమ్సీ పరిధిలో ప్రభుత్వం భూ సేకరణ చేసినప్పుడు, టీడీఆర్ ఇవ్వడం తెలిసిందే. అదే విధంగా భూ నిర్వాసిత కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువను కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా టీడీఆర్ ఇవ్వడం వలన వారికి లబ్ధి జరుగుతుంది. ఉదారణకు ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కొరకు దాదాపు 9,000 ఎకరాలు కావాలి. ప్రస్తుతం ఏరియాను బట్టి మార్కెట్ విలువ ఎకరం రూ. 50 లక్షల నుండి రూ. 3 కోట్ల వరకు ఉంది. కానీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వేల్యూ మీదనే పరిహారం చెల్లిస్తుంది. దీని వలన రైతులు, ముఖ్యంగా సర్వం కోల్పోయే చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్ట పోతారు. వారికి పరిహారమే కాకుండా, టీడీఆర్ కూడా ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది.చదవండి: కులరహిత వ్యవస్థకు తొలి అడుగుచాలా సందర్భాలలో చిన్న, సన్న కారు రైతులు, ముఖ్యంగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులే ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్నారు. వివిధ కంపెనీల పేరు మీద వేలాది ఎకరాలు ఉన్నాయి. వాటిలో పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదు. కేవలం పేద రైతులే టార్గెట్ కావడం బాధకారం. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.- డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి మాజీ ఎంపీ -
అమరావతిలో భూమాయ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నదిలో ఉన్న భూమి సాగు భూమి అవుతుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాజధాని అమరావతిలో మాత్రం కచ్చితంగా అవుతుంది. లేని భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి, భారీగా లబ్ధి పొందుతారు. గతంలోనూ టీడీపీ హయాంలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ విషయం తెలిసిపోవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే తరహా కుంభకోణం ఫైలు మరొకటి ఉన్నతస్థాయి నుంచి చకచకా కదిలి రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చింది. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలోని సర్వే నంబర్లు పేర్కొంటూ దానిని పూలింగ్‌కు తీసుకోవాలంటూ 65 మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు రావడం.. అక్కడి నుంచి సీఆర్డీఏకి వెళ్లి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం వేగంగా జరిగిపోయింది. దానిని క్లియర్ చేసేయాలంటూ ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లూ వస్తున్నాయి. అయితే, ఇంత దారుణమైన మాయ చేయలేమంటూ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిగో ఇది ఆ మాయాభూమి కథ.. ఇటీవల తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నంబర్ 1–ఎ1, 1–ఎ2 నుంచి 1–ఎ67 వరకూ ఉన్న 104.82 ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి వర్గీకరణ, భూ స్థితి, అసైన్మెంట్ జరిగిందీ లేనిదీ వెంటనే వివరాలివ్వాలంటూ సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. అందులో ఆ భూమి యజమానులుగా 65 మంది రైతుల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ కార్యాలయం లాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో, తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించింది. అయినా ఒక్క రైతూ ముందుకు రాలేదు. రెవెన్యూ అధికారులు విచారణ చేయగా.. ఆ దరఖాస్తులో ఉన్న రైతులు ఎవరూ ఆ ప్రాంతాల్లోనే లేనట్లు తేలింది. మైక్‌లో ప్రచారం చేసినా ఎవరూ రాలేదు. 19వ తేదీన ఒక్క వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అతని వద్ద కూడా ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.పూర్తిగా విచారణ చేయగా రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం కృష్ణా నదీ గర్భంలో ఉన్నట్లు తేలింది. అది నదిలో ఉన్న భూమి. రాయపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1, 1/12–2బీ2ఏ, 16–ఏ2, 16–బీ2, 71–ఏ, 15–ఏ, 15–బీ, 17–ఏ, 225–1, 72, 96లో నదీ ప్రవాహం వెళ్తుంది. వీటిలో మరికొన్ని నదిలోనే దిబ్బలుగా ఉన్నాయి. నదీ ప్రవాహంలో ఉన్న భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం.అక్రమంగా లబ్ధి పొందేందుకే..! అడంగల్‌లో ఆ సర్వే నంబర్లే లేవని, ఎవరికీ పాస్ పుస్తకాలు ఇ చ్చినట్లు కూడా లేదని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అయినా అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్లాట్ల విలువ కోట్లలో ఉండటంతో అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు వ్యక్తులు రాయపూడి నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా సృష్టించారు. ఇప్పుడు దాన్ని లాండ్ పూలింగ్‌కు తీసుకొమ్మని సీఆర్డీఏ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. అసలు రైతులు, భూమి లేకుండా తామేమీ చేయలేమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయితే వారికి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అడంగల్ లేని, పాసు పుస్తకాలు కూడా లేని భూమికి అనుమతులెలా ఇస్తామని అధికారులు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ తహసీల్దార్ ఇలానే ఇరుక్కొన్నారన్న విషయాన్ని గుర్తు చేసి, ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇదీ పాత కథ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నదీ ప్రవాహాన్ని వారి సాగు భూములుగా రికార్డులు పుట్టించి మండల రెవెన్యూ అధికారి సహకారంతో ఆడంగల్లో చేర్చారు. 20 ఎకరాల ఈ భూముల విలువ అప్పట్లోనే రూ.30 కోట్లకు పైగా ఉండేది. తొలుత 1/12–2బీ, 2ఏ, 71–ఏ సర్వే నంబర్లలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని సాగు భూములుగా, ఆ తర్వాత 16–ఏ2, 16–బీ2, 15–ఏ, 15–బీలో ఉన్న కృష్ణా నదిని ఇద్దరి పేర్లతో ఆడంగల్లో చేర్చారు. వీటిని వేరే వారికి అమ్మేసి మ్యుటేషన్ ద్వారా వేర్వేరు రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కూడా చేయించేశారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు ఆ భూములు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి, నివేదిక ఇచ్చాకే రిజి్రస్టేషన్ పూర్తవుతుంది. అయితే, అప్పటి అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవడంతో నదిని కూడా సాగు భూమిగా చూపించారు. ఈ అక్రమాన్ని సక్రమం చేసినందుకు రెవెన్యూ అధికారి కొడుకులు, కారు డ్రైవర్‌కు కొంత భూమిని పంచారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.ఆ భూములకు రైతులే లేరు సర్వే నంబర్ 1–ఎ1 నుంచి 1–ఎ67 వరకు ఉన్న భూమిలో 65 మంది రైతులు ఉన్నారని, వారి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారా లేదా వివరాలు కావాలని సీఆర్డీఏ నుంచి ఆదేశాలు మాకు వచ్చాయి. రైతులు వారి వద్ద ఉన్న వివరాలు అందచేయాలని నోటీసులు ఇచ్చి, మైక్ ప్రచారం చేసినా ఎవరు రాలేదు. అసలు వారు చెప్పిన సర్వే నంబర్లు మా రికార్డుల్లోనూ లేవు. – సుజాత, తహసీల్దార్, తుళ్లూరు -
కరకట్ట నివాసం ఎవరిది బాబూ?
(సాక్షి, అమరావతి) : ఇంతకీ కరకట్ట నివాసం ఎవరిది? చంద్రబాబుదా... లేక ప్రభుత్వానిదా? ‘‘ఆ ఇంటికి సంబంధించి అవినీతికి తావెక్కడుంది? ఎందుకంటే ఆ ఇల్లు ప్రభుత్వానిది. లింగమనేని రమేశ్ నుంచి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే భూసేకరణ ద్వారా తీసుకుని ఉండేవాళ్లం’’ అని నేరుగా చంద్రబాబే.. సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పారు. ఇక లింగమనేని కూడా... ఆ ఇల్లు పూలింగ్‌లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని, అక్కడ భారీ భవంతులు కడితే తనకెంతో సంతోషమని కూడా చెప్పారు. వీళ్ల మాటలకు వీడియో సాక్ష్యాలూ ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే... : ఆ ఇల్లు ప్రభుత్వానిది అయినపుడు ప్రభుత్వ రికార్డుల్లో ఆ సంగతి ఉండాలి కదా? ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక కూడా చంద్రబాబు అందులో ఉంటున్నారంటే... అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా? అసలు ఆ ఇల్లు ప్రభుత్వానిదన్న సంగతి ప్రభుత్వ రికార్డుల్లోనే లేదంటే ఏమనుకోవాలి? వీళ్లంతా కలిసి ఎంతటి దొంగల రాజ్యాన్ని నడిపించారో తెలియటం లేదా? ప్రభుత్వాస్తుల్ని కూడా ప్రయివేటు ఆస్తుల్లా ఎలా మార్చేసుకున్నారో తెలియటం లేదా? చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అది ప్రభుత్వ ఆస్తే అయినపుడు... : ప్రభుత్వం ఇపుడు ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణంలో భాగంగా ఆ ఇంటిని జప్తు చేస్తుంటే ఉలుకెందుకు? అదేదో చంద్రబాబు సొంత ఆస్తిలా ఫీలవుతూ... ‘ఈనాడు’ దుర్మార్గపు రాతలెందుకు? బాబును టార్గెట్ చేస్తున్నారంటూ రామోజీ శోకాలెందుకు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటూ తెలుగుదేశం డ్రామాలెందుకు? ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తుంటే వీళ్లంతా ఎందుకింత దుష్ప్రచారానికి తెగిస్తున్నారు? ఇంకెన్నాళ్లు బాబూ ఈ డ్రామాలు? నాడు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిందిదీ.. : ప్రజా వేదిక నాది కాదు. ప్రభుత్వానిది. నేనుంటున్న భవనం నాది కాదు. రమేష్ అనే డెవలపర్‌ది. నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేనొక టెనెంటే (అద్దెకుంటున్న వాడిని). ప్రెస్మీట్లో చంద్రబాబు చెప్పిందిదీ..: గ్యాస్ ఇచ్చామని ప్రతిఫలంగా ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వడమేంటి? అది గమర్నమెంట్ ఇల్లు. నేనున్నానంటే..అది గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నాను. నేను మొదటి రోజే చెప్పాను. దిస్ ప్రొపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. నువ్ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటాం. ఇస్తే ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటాం. ఇవ్వకపోతే లాండ్ అక్విజిషన్‌లో తీసుకంటాం. టెంపరరీగా నేను ఉండాలి. కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అక్కడ ఉంటున్నా. కట్టకు ఆవతల ఉండే ల్యాండ్ అంతా, కట్టడాలన్నీ పోయి టూరిజం, మిగతావన్నీ వస్తాయి. మాస్టర్ ప్లాన్‌లో కూడా నోటిఫై చేశారు. లింగమనేని రమేష్ విలేకరులతో చెప్పిందిదీ.. : ప్రభుత్వం ఆ భవనాన్ని పూలింగ్‌లో తీసుకుంది. దేశంపై భక్తితో ఇచ్చేశాను. నాకు ఆ భవనంతో ఏ రకమైన సంబంధం లేదు. -
అసైన్డ్ భూములను లాక్కోవడం లేదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ పూలింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా అసైన్డ్ భూములను లాక్కోవట్లేదని మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్ పద్దులపై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ అంశంపై ఈ మేరకు విపక్షాలు ఆరోపించగా వాటిలో వాస్తవం లేదని మంత్రి తోసిపుచ్చారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం రూ.70 లక్షల నుంచి రూ.కోటి పరిహారాన్ని రైతులకు ఇచ్చిందని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిస్తేనే తీసుకుంటున్నామని చెప్పారు. సాగుకు యోగ్యంకాని అసైన్డ్ భూములనే తీసుకుంటున్నామన్నారు. కాగా, ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఓ బీజేపీ ఎంపీ ఇటీవల ప్రధాని మోదీని కలిశారని, ఇది ఆ పార్టీ విధానామా? లేక ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమో చెప్పాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన తీరును తప్పుబట్టారు. ఒకవేళ ఈ చర్య ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమైతే ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని, లేకుంటే బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరారు. -
అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం
సాక్షి, అమరావతి: ల్యాండ్ పూలింగ్ కింద అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల అభివృద్ధికి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చర్యలు చేపట్టింది. రైతులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడ రైతులకు కేటాయించిన ప్లాట్లను 12 జోన్లుగా విభజించగా, వాటిలో జోన్–4లోని పిచ్చుకలపాలెం, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో ఉన్న ప్లాట్లలో పనులు ప్రారంభించారు. సోమవారం పిచ్చుకలపాలెం వద్ద రహదారి నిర్మాణాన్ని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్పీఎస్ ప్లాట్లను పూర్తి కమర్షియల్ విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జోన్–4లో మొత్తం 1358.42 ఎకరాల్లో 4,551 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.192.52 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులు కోరుకున్న విధంగా ప్లాట్లను తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ షేక్ అలీంబాషా, చీఫ్ ఇంజినీర్లు టి.ఆంజనేయులు, సీహెచ్ ధనుంజయ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అమరావతిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది. అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైన కృష్ణా నది కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో విస్తరిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది నివాస సముదాయాల పనులు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్ నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు చేపట్టామని వివేక్ యాదవ్ తెలిపారు. నిబంధనలకు లోబడి అమరావతి ప్రాంతంలో టౌన్‌షిప్‌లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు. రైతులకు కౌలు డబ్బును కూడా సకాలంలో చెల్లిస్తున్నట్టు వివరించారు. -
వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ రద్దు
-
రైతులకు మద్దతు.. తీన్మార్ మల్లన్న అరెస్ట్
సాక్షి, హన్మకొండ: జిల్లాలోని ఆరెపల్లిలో భూసేకరణ జీఓ 80ఏ ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన రైతుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు రైతులు, రైతు కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామసభ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన కారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు. అయితే జీఓ 80ను వ్యతిరేకంగా ఆరెపల్లిలో రైతులు పోచమ్మ ఆలయం వద్ద గ్రామ సభ నిర్వహించగా వారికి మద్దతుగా వెళ్ళితే అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసిన ఉద్యమం ఆగదని, భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ఊరు మునిగింది.. ఉపాధి పోయింది! -
అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?
‘కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ’ (కుడా) వరంగల్ నగర శివారును ఆనుకొని ఉన్న గ్రామాల్లోని రైతుల భూముల్లో గత మూడేళ్ల నుంచీ రహస్య సర్వే చేస్తోంది. మొదట్లోనే స్థానిక రైతాంగం ‘మా భూముల్లో మా అనుమతి లేకుండా సర్వే చేయడం ఏమిటి?’ అని అడ్డుకున్నారు. అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ‘కుడా’ ప్రయత్నాలను ఆదిలోనే రైతులు అడ్డుకోవ డంతో ఒక అడుగు వెనక్కి వేసి సర్వేను ఆపుతున్నాం అని అధికారులు ప్రకటించారు. వరంగల్ చుట్టూరా అవుటర్ రింగురోడ్డును ఆనుకొని పచ్చని పంట భూములు ఉన్నాయి. అక్కడి నుంచే కొత్తిమీర, పుదీనా, వంకాయ ఇతర కూర గాయలు ఉదయం 3 గంటలకే వరంగల్ మార్కెట్‌కు చేరుకుంటాయి. హన్మకొండ, వరంగల్ సిటీ ప్రజలకు 90 శాతం కూరగాయలు సిటీ శివారు గ్రామాల రైతులు తీసుకొచ్చేటివే. కూరగాయలు, మార్కెట్ వ్యాపారంపై చిన్న, సన్నకారు పేద రైతులు వేలాదిగా ఆధారపడి ఉన్నారు. ‘కుడా’ అవుటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న 27 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం 21,510 ఎకరాల భూమిని సేకరించాలని సర్వే చేసింది. ఆ తర్వాత సర్వే నంబర్లతో సహా జీవో నం. 80(ఎ) విడుదలయింది. 27 గ్రామాల్లో 2 గ్రామాల రైతుల అభిప్రాయ సేకరణ జరగలేదు. ముందుగా అసైన్డ్ భూముల సర్వే చేశారు. ఇవి పడావ్ భూములు కావు. దశాబ్దాల కాలం నుండి రైతుల వద్ద సాగులో ఉన్న భూములే. తర్వాత రైతుల పట్టా భూముల్లో సర్వే చేశారు. మొత్తంగా తమ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమి మొత్తాన్ని సేకరించారు. 27 గ్రామాల్లోని 21,510 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి వ్యాపారం చేయబోతున్నారు. అందులో నుండి భూమి ఇచ్చిన రైతుకు 1200–1400 గజాల భూమిని ప్లాట్ల రూపంలో ఇస్తారు. వ్యవ సాయ భూమి ప్లాట్ల రూపంలోకి మారడం వల్ల... భూమి రేటు రెట్టింపు అవుతుంది. కాబట్టి మొత్తం 1400 గజాల్లో రైతుకు లాభం కోట్లల్లో వస్తుందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంటే వేలాది ఎకరాల పంట భూముల్ని భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదన్న మాట! మొన్న వరంగల్, పరకాల మీటింగ్‌లలో మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు. రైతుల భూమిని రైతుల అనుమతి లేకుండా గుంజు కొని ప్రభుత్వమే రియల్ భూవ్యాపారం అధికారి కంగా చేస్తుందనేది ఇందువల్ల రూఢి అయింది. ల్యాండ్ పూలింగ్‌పై ప్రజలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ సందేహాలను తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతు భవిష్యత్ ఏమిటి? భూమిపై ఆధారపడి పంటలు పండిస్తూ బ్రతికే రైతును ప్రభుత్వమే భూమి లేని వాడిగా చేస్తోంది. కూలీగా మార్చివేస్తోంది. 21,510 ఎకరాలను ప్లాట్లుగా మార్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి... వచ్చిన ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టమయింది. (క్లిక్: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) భూ వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకొని వరంగల్ నగర అభివృద్ధి అంటే ఎలా? వరంగల్ చుట్టూ ఎత్తయిన భవనాల నిర్మాణం జరిగేతేనే అభివృద్ధా? ఇందులో బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనం దాగి ఉంది. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ల్యాండ్ పూలింగ్ వేగవంతం అవుతోంది. రైతుల ఆందోళనల ఫలితంగా ‘కుడా’ చైర్మన్ ల్యాండ్ పూలింగ్ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలో కూడా స్పష్టత లేదు. ల్యాండ్ పూలింగ్ కోసం తెచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలి. రైతాంగానికి ప్రజలందరూ అండగా నిలబడాలి. (క్లిక్: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?) - ఎల్. రాజు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వరంగల్ -
సీఆర్డీఏ నోటీసులు చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవాలంటూ సీఆర్డీఏ కమిషనర్ జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమంటూ భూ యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం విచారణ జరిపారు. సీఆర్డీఏ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేశారు. విజయవాడకు చెందిన కొండేటి గిరిధర్, ఆయన కుమారుడు అఖిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతే ప్లాట్లను రిజిస్టర్ చేయాల్సి ఉందన్నారు. ప్లాట్ బదలాయింపు హక్కుతో సహా భూ సమీకరణ యాజమాన్య ధృవీకరణ పత్రాలను భూ యజమానులకు ఇవ్వాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందన్నారు. ఈ బాధ్యతలేవీ సీఆర్డీఏ నిర్వర్తించడంలేదని తెలిపారు. -
పూలింగ్.. భారీ కుట్ర
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణలు ల్యాండ్ పూలింగ్ స్కీం (జీవో 41)ను ఓ సాధనంగా ఉపయోగించుకుని వారు లబ్ధి పొందడంతో పాటు, వారికి కావాల్సిన వారికి అయాచిత లబ్ధి చేకూర్చారని రాష్ట్ర క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) హైకోర్టుకు నివేదించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుట్ర దాగి ఉందని, ఇందులో అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. రాజధాని గ్రామాల ఒరిజినల్ రెవిన్యూ రికార్డులను శ్రీధరే మాయం చేశారని, వాటి ఆచూకీ కేవలం ఆయనకు మాత్రమే తెలుసని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఆ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్రభుత్వానికి స్వాధీనం చేసి, అత్యంత విలువైన నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారని వివరించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులు కొందరు అసైన్డ్‌దారులను బెదిరించి, భయపెట్టి కారు చౌకగా భూములు కొట్టేశారని.. వాటిని స్వాధీనం చేసి ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్లాట్లు పొందారని, ఆ తర్వాత వాటిని అమ్మేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని తెలిపింది. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అసైన్డ్ భూముల బదలాయింపులో భారీ అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అప్పటి మంత్రి పొంగూరు నారాయణలపై కేసు నమోదు చేసింది. సీఐడీ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు, నారాయణలు హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు సీఐడీ తరఫున ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఎ.లక్ష్మీనారాయణ రావు కౌంటర్లు దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నేరపూరిత కుట్రతోనే జీవో 41 2021 ఫ్రిబవరి 24న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అదనపు డీజీ ప్రాథమిక విచారణ జరిపి, అదే ఏడాది మార్చి 12న చంద్రబాబు, నారాయణ తదితరులపై కేసు నమోదు చేశారు. వంచన, మోసపూరిత లావాదేవీలు, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించడం వంటివి ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులో నిందితులు ఏపీసీఆర్డీఏ, ఏపీ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములతో పాటు, ప్రభుత్వ భూములను కూడా చేజిక్కించుకుని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద తమకూ, తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు చట్ట విరుద్ధంగా జీవో 41 (ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్) జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారు. దురుద్దేశంతోనే ఈ జీవో జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. చట్టం నిర్ధేశించిన విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరించేందుకు, ఖజానాకు నష్టం చేకూర్చేందుకు జీవో 41ని ఓ సాధనంగా వాడుకున్నారు. బిజినెస్ రూల్స్‌కు, నిర్ధేశిత విధి విధానాలకు విరుద్ధంగా నేరపూరిత కుట్రతోనే ఈ జీవోను జారీ చేసినట్లు నోట్ ఫైళ్ల ద్వారా తెలిసింది. సీఆర్డీఏ చట్టానికి విరుద్ధం జీవో 41 జారీ చేసిన తర్వాత, అంతకు ముందు దానిని మంత్రి మండలి ముందు ఉంచలేదు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఈ జీవోను తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేటతెల్లమైంది. జీవో విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి, సంబంధిత ఇన్చార్జ్ మంత్రి దానికి ఆమోద ముద్ర వేశారు. ఇలా చేయడం నేరం కాకపోయినా, ఈ జీవో జారీ అయిన సమయం, విధానం, దాని వెనుక ఉద్దేశాలే ప్రశ్నించదగ్గవి. రాజధాని నిర్మాణానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన ల్యాండ్ పూలింగ్ విధానానికి సంబంధించిన జీవో జారీ చేయడం వెనుక విధి విధానాల పరమైన అక్రమాలు, సీఆర్డీఏ చట్ట నిబంధనల ఉల్లంఘనలు ఉండటం గమనార్హం. సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం జీవో 41ని శాసనసభ ఆమోదం కోసం సభ ముందు ఉంచలేదు. 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయింది. అసైన్డ్ భూములను తీసుకోవడం నేరం ► ఏపీ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4, 5 ప్రకారం అసైన్డ్ భూముల సేకరణ, ఇతర లావాదేవీలు నిషిద్ధం. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను తీసుకుంటే, అలా తీసుకున్న వ్యక్తిని చట్టం నిర్ధేశించిన విధానం ప్రకారం ఖాళీ చేయించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంది. ► అసైన్డ్ భూములను సేకరిస్తే పడే శిక్ష గురించి సెక్షన్ 7(1) చెబుతోంది. భూమి లేని వారికి ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధీకృత అధికారిపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా విధి నిర్వహణలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం, అసైన్డ్ భూములను చట్ట విరుద్ధంగా కలిగి ఉన్న వారిని కాపాడటం, ఆ ఆస్తి జప్తు కాకుండా రక్షించడం భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద నేరం. ► చంద్రబాబు, నారాయణలు ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్నారు. వారి ఆమోదం లేకుండా జీవో 41 జారీ అయ్యే అవకాశమే లేదు. అసైన్డ్ భూములను కొనకూడదని తెలిసినా, వీరి మద్దతుతో టీడీపీ పెద్దలు పెద్ద సంఖ్యలో అసైన్డ్ భూములు కొనడం నేరం. దానిని గత ప్రభుత్వం రెగ్యులర్ చేయడం మరో నేరం. ► దర్యాప్తులో భాగంగా అప్పట్లో నిబంధనలను రూపొందించిన ప్రభుత్వాధికారులను సాక్షులుగా విచారించాం. ఆ రూల్, జీవో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధమని స్పష్టంగా చెప్పినట్లు ఆ అధికారులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ► అయినా కూడా చంద్రబాబు, నారాయణలు అధికారుల సిఫారసులను పట్టించుకోకుండా జీవో 41 జారీ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వారు ఎలాంటి రక్షణ కోరజాలరు. పథక రచన ఇట్టే అర్థమవుతోంది.. ► ప్రతిపక్షాలను వేధించేందుకే అధికార పక్షం ఇలాంటి కేసులు పెడుతోందన్న చంద్రబాబు, నారాయణ వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. సీఐడీ ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలిస్తే, ఆ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, నారాయణలు ఇతరులతో కలిసి సాగించిన ‘పథక రచన’ ఏమిటో తెలుస్తుంది. ► ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు, అనర్హులకు చేసిన మేళ్లు, తద్వారా సీఆర్డీఏకు జరిగిన నష్టం తదితరాలను ప్రాథమిక విచారణ నివేదిక స్పష్టంగా చూపుతోంది. ► రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు. పట్టాలు లేకుండా అక్రమంగా భూములను స్వాధీనంలో ఉంచుకుని సాగు చేస్తున్నారు. ఒక్కో అంశంపై లోతైన విచారణ జరపాల్సి ఉంది. అసైన్డ్‌దారులను భయపెట్టారు.. ► ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కేటగిరి 4 (శివాయి జమాదార్లు), కేటగిరి 5, 6ల కింద భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారి వివరాలను ప్రాథమిక విచారణలో సీఆర్డీఏ నుంచి పొందాం. ఈ వివరాలను క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పోల్చి చూశాం. ► కేటగిరి 4 కింద ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు భూములు ఇచ్చి, అందుకు ప్రతిగా ప్లాట్లు పొందిన వారిలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించాం. మంగళరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో అసైన్డ్ భూములను రిజిష్టర్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వారిలో వీరు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ► జీవో 41 ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్ గురించి ముందే తెలిసిన అప్పటి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు, అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంటుందని, అంతిమంగా ఆ భూములకు ఎలాంటి లబ్ధి ఉండదని అసైన్డ్ భూములున్న వారిలో భయాందోళనలు కలిగించారు. ► అంతిమంగా అసైన్డ్‌దారుల నుంచి భూములను అన్ రిజిష్టర్డ్ సేల్ అగ్రిమెంట్ల ద్వారా నామమాత్రపు ధరలకు తీసేసుకున్నారు. ఆ తర్వాత వీరంతా కూడా ఆ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సీఆర్ఏడీకు ఇచ్చి, జీవో 41ని అడ్డం పెట్టుకుని అందుకు ప్రతిగా నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారు. ► కొందరు ఇలా పొందిన నివాస, వాణిజ్య ప్లాట్లకు అధిక ధరలకు అమ్ముకున్నారు. అంతిమంగా కోట్ల రూపాయల మేర వ్యక్తి గతంగా లబ్ధి పొందారు. ఖజానాకు భారీ నష్టం చేకూర్చారు. ఆ రికార్డుల గురించి శ్రీధర్‌కు మాత్రమే తెలుసు ► అప్పటి అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన సలహాలు ఏవీ కూడా నోట్ ఫైళ్లలో లేవు. ఆ సలహాల సర్టిఫైడ్ కాపీలను అడ్వొకేట్ జనరల్ కార్యాలయం నుంచి పొందాం. అసైన్డ్ భూములను అమ్మడానికి వీల్లేదని, కొనుగోలుదారులను ఖాళీ చేయించాలని అడ్వొకేట్ జనరల్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ► అయితే చంద్రబాబు, నారాయణలు అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని కాలరాసి, చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. 2014 సెప్టెంబర్ 29 – 2014 నవంబర్ 5 మధ్య గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తహసీల్దార్‌గా పని చేసిన మాజేటి తిరుపతి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఆ సమయంలో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్ ఉన్నారని వెంకటేశ్వర్లు చెప్పారు. ► శ్రీధర్ మౌఖిక ఆదేశాల ప్రకారం తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలకు చెందిన ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ, అడంగల్స్, 1బీ తదితర ఒరిజినల్ రికార్డులన్నింటినీ ఆయనకు అప్పగించానని, వీటి అప్పగింత విషయంలో అక్నాలజ్డ్మెంట్ తీసుకోలేదని వెంకటేశ్వర్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ► 2014 అక్టోబర్ 31న వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అన్నే సుధీర్‌బాబు తహసీల్దార్‌గా వచ్చారు. ► 2014– 1బీ అడంగల్‌ను పరిశీలిస్తే అసైన్డ్‌దారులు, ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూములు ఇచ్చిన వ్యక్తులు వేర్వేరు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న ఆక్రమణదారులు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూములు ఇచ్చారు. ► రాజధాని గ్రామాలకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులు ఎక్కడ ఉన్నాయో చెరుకూరి శ్రీధర్‌కు మాత్రమే తెలుసు. ఆ రికార్డులను ఆయన సంబంధిత తహసీల్దార్‌కు గానీ, తన తర్వాత వచ్చిన జాయింట్ కలెక్టర్‌కు గానీ అప్పగించలేదు. ఈ అధికారే ఆ తర్వాత సీఆర్డీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. ► ల్యాండ్ పూలింగ్ స్కీం జీవో 41ని అడ్డంపెట్టుకుని ఓ క్రమ పద్ధతిలో అక్రమాలకు తెరలేపి కుట్రకు పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. సీఐడీ ఇప్పటికే అన్నే సుధీర్‌బాబు, బ్రహ్మానందరెడ్డిలపై కేసు నమోదు చేసింది. వారి కార్యాలయాల్లో తనిఖీలు చేయగా, పలు కీలక ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు లభించాయి. వీటిపై కూడా లోతుగా విచారణ జరపాల్సి ఉంది. బాబు, నారాయణల భాగస్వామ్యం ► ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపితే అప్పటి ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తుల పేర్లు, జీవో 41 ద్వారా లబ్ధి పొందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓ వర్గ ప్రజలకు ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకే జీవో 41ని తీసుకొచ్చారని స్పష్టమైంది. ► ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు, మరికొందరు నిందితులతో కలిసి తప్పుడు రిపోర్టులు తయారు చేశారు. వాటిని పబ్లిక్ రిపోర్టుల్లో చేర్చారు. అంతిమంగా సీఆర్డీకు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు. దీని వెనుక లోతైన కుట్ర ఉంది. ఈ దశలో చంద్రబాబు, నారాయణలు ఈ పిటిషన్లు వేసి దర్యాప్తును అడ్డుకోవాలని చూస్తున్నారు. ► ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రస్తుత అధికార ప్రభుత్వంపై పిటిషనర్లు చేస్తున్న నిందారోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నిందారోపణలను సాకుగా చూపి కేసు కొట్టేయాలని కోరుతున్నారు. ప్రాథమిక విచారణలో చంద్రబాబు, నారాయణలకు ఈ నేరంతో భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. భారీ కుట్ర ఉందనడంలో సందేహం లేదు ► రాజధాని ప్రాంత పరిధిలోని మూడు మండలాల తహసీల్డార్లకు కలెక్టర్ కార్యాలయం 2016 జూలై 8న లేఖలు రాసింది. ఈ మూడు మండలాలకు సంబంధించిన రివెన్యూ రికార్డులు అందుబాటులో లేవని, అందువల్ల క్షేత్ర స్థాయిలో సర్వే చేసి అసైన్డ్ భూముల యజమానులు ఎవరో తేల్చాలని వారిని ఆదేశించింది. ► అప్పటి తహసీల్దార్ వాంగ్మూలం, కలెక్టర్ కార్యాలయం రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుట్ర ఉందనే విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదు. ► జాయింట్ కలెక్టరే 2014లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ కలెక్టర్ కార్యాలయమే రికార్డులు అందుబాటులో లేవని 2016లో తహసీల్దారులకు లేఖలు రాస్తుంది. అసైన్మెంట్ వివరాలను రికార్డుల నుంచి తొలగించిన విషయం ప్రాథమిక విచారణలో తేలింది. అసలు వాస్తవంగా తెర వెనుక ఏం జరిగిందనేది లోతుగా దర్యాప్తు జరిపితే తెలుస్తుంది. ఒరిజినల్ రికార్డులు ఎక్కడున్నాయో తేల్చాల్సి ఉంది. దర్యాప్తును అడ్డుకోవడానికే ఈ పిటిషన్లు ► ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడానికే చంద్రబాబు, నారాయణలు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఫిర్యాదులో నేరాన్ని రుజువు చేసే ప్రాథమిక ఆధారాలున్నప్పుడు న్యాయస్థానాలు సాధారణంగా దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవు. ► దర్యాప్తును పూర్తి చేసేందుకు అనుమతినిస్తాయి. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ధిష్టమైన ఆధారాలున్నాయి. కాగ్నిజబుల్ నేరానికి పాల్పడ్డారనేందుకు రుజువులున్నాయి. దర్యాప్తు అన్నది పూర్తిగా పోలీసుల పరిధిలోని వ్యవహారం. ► ఇందులో సీఆర్పీసీ సెక్షన్ 482 కింద న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కాగ్నిజబుల్ నేరంలో దర్యాప్తు జరిపే చట్టబద్ధమైన హక్కు, బాధ్యత పోలీసులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాగ్నిజబుల్ నేరాల్లో న్యాయస్థానాలు దర్యాప్తును అడ్డుకోరాదని కూడా చెప్పింది. ► వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో మార్చి 19న ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయండి. ఇదే సమయంలో చంద్రబాబు, నారాయణలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయండి. ఈ మొత్తం నేరంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణలకు భాగస్వామ్యం ఉంది. వారి పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. వీరిద్దరూ ఇతర నిందితులతో కలిసి ‘పథక రచన’ చేసి కుట్ర పూరితంగా వ్యవహరించారు. లోతుగా విచారణ జరిపితే అనేక కీలక విషయాలు, వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయి. ఇలాంటి దశలో దర్యాప్తును నిలుపుదల చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందువల్ల గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో పాటు చంద్రబాబు, నారాయణలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలి. – హైకోర్టులో సీఐడీ -
భూ యజమానులకు 60% వాటా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేపట్టే ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ కింద భూమిలిచ్చేందుకు ముందుకొచ్చే భూ యజమానులను ప్రోత్సహిం చేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంగా హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కలిగించే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ► ల్యాండ్‌పూలింగ్ పథకం కింద సేకరించిన స్థలాల్లో ఇప్పటివరకు భూయజమానులు, హెచ్ఎండీఏల వాటా 50:50 శాతముండగా, తాజాగా భూయజమానుల వాటాను ప్రభుత్వం 60 శాతానికి పెంచి, హెచ్ఎండీఏ వాటాను 40 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్ఎండీఏకు ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములిచ్చేందుకు వచ్చే వారికి పూర్తి స్థాయి భద్రతతో పాటు ప్రయోజనాలూ పెరగనున్నాయి. ► హెచ్ఎండీఏ వాటాలో 5 శాతాన్ని ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూ ఎస్), 10 శాతాన్ని దిగువ స్థాయి ఆదాయ వర్గాలు (ఎల్ఐజీ), 10 శాతం స్థలాన్ని మధ్య స్థాయి ఆదాయ వర్గాల (ఎంఐఈ) గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తారు. ► హెచ్ఎండీఏతో పాటు స్థలాలు పొందిన ఇతర యజమానులు జోన్ల నిబంధనలు పాటిస్తూ తమ వాటాలను రెసిడెన్షియల్/రెసిడెన్షియల్ కమ్ కమర్షి యల్/ఇన్స్టిట్యూషనల్/ఐటీ/కార్యాలయాలు/ఇతర అవసరాలకు వాడుకు నేలా కేటాయింపులు/ అమ్మకాలు/ వేలం/లీజుకు ఇచ్చుకోవచ్చు. ► నాలా చార్జీలను హెచ్ఎండీఏనే భరించ నుంది. అలాగే హెచ్ఎండీఏకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఫీజులనూ భరిస్తుంది. ► ఇటు భూవినియోగ మార్పిడి చార్జీలను సైతం హెచ్ఎండీఏ భరించనుంది. ► రిజర్వు స్థలాలు/ఓపెన్ స్థలాలకు ప్రహరీ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు ఖర్చులను హెచ్ఎండీఏ భరిస్తుంది. ► హెచ్ఎండీఏ లేఔట్ డ్రాఫ్ట్ అప్రూవల్ అయిన నాటి నుంచి మూడు నెలల్లోపు ల్యాండ్ ఓనర్లకు ప్లాట్లు కేటాయిస్తారు. ► ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. -
డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
-
డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు బుధవారం విజయవాడలోని ఆమె ఇంటివద్ద అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి వీవీఎస్ఎన్ లక్ష్మి ఎదుట హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో మాధురిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రావెల గోపాలకృష్ణతో కుమ్మక్కై 3,880 చదరపు గజాలు కలిగిన పది ప్లాట్లను కేటాయించడంతో పాటు రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు. చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించి మాధురిపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం నెక్కల్లులో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ముఖ్య అనుచరుడైన రావెల గోపాలకృష్ణ ల్యాండ్ పూలింగ్‌కు 3.11 ఎకరాలు ఇచ్చినట్టుగా చూపించారు. అందుకుగాను 3,110 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్డీఏ ద్వారా కేటాయించారు. వాస్తవానికి ఆ భూమి నాగార్జున సాగర్ కాలువ, రెండు రోడ్లకు చెందినది. తప్పులను సరిదిద్దుకునే క్రమంలో మాధురి మరిన్ని తప్పులకు ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయారు. -
టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే..
సాక్షి, తాడేపల్లి: అమరావతి విషయంలో టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడియో ప్రజెంటేషన్ రూపంలో విలేకరుల ముందుకు తీసుకువచ్చింది. గురువారం ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను పార్టీ కార్యాలయంలో ప్రసారం చేసింది. ఆ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం... రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2014 ఏపీ పునర్విభజన చట్టం చేసింది. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిశీలనకై మార్చి 28, 2014 కేంద్రం శివరామకృష్ణన్ కమిటి వేసింది. ఈ కమిటీ ఆగస్టు 27, 2014లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే శివరామకృష్ణన్ నివేదిక ఇవ్వకుండానే చంద్రబాబు రాజధాని విజయవాడలో ఉంటుందని ప్రకటించేశారు. ఈ క్రమంలో డిసెంబరు 30, 2014లో సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించింది. చంద్రబాబు నిర్ణయాన్ని శివరామకృష్ణన్ అనేక సందర్భాల్లో తప్పుపట్టిన పట్టించుకోలేదు. నిజానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే చంద్రబాబు తన మంత్రులు, నాయకులతో ఒక కమిటీ వేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో 4070 ఎకరాల భూములను టీడీపీ నేతలు అమరావతిలో కొన్నారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, పెదకకాని, తాడేపల్లి మండలాల్లో 2279 ఎకరాలు టీడీపీ నేతలు సొంతం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చంద్రళ్ళపాడులో 1790 ఎకరాల భూమి టీడీపీ నేతలు కొన్నారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31 2014 వరకు టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ కొనసాగింది. జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31, 2014 వరకు రాజధానిలో కొన్న భూముల వివరాలు జూన్‌లో 530 ఎకరాలు జూలైలో 685 ఎకరాలు ఆగస్టులో 353 ఎకరాలు సెప్టెంబర్ లో 567 ఎకరాలు అక్టోబర్ లో 564 ఎకరాలు నవంబర్ లో 836 ఎకరాలు డిసెంబరులో 531 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కొన్నారు. హెరిటేజ్ కంపెనీ 14.22 ఎకరాలు పయ్యావుల కుటంబ సభ్యలు పేరు మీద భూములు వేం నరేందర్‌రెడ్డి కుటంబ సభ్యుల పేరు మీద 15.30 ఎకరాలు పల్లె రఘునాథ్ రెడ్డి కుటంబ సభ్యుల పేరుతో 7.50 ఎకరాలు కొమ్మలపాటి శ్రీధర్ 68.6 ఎకరాలు లంక దినకర్, కంభంపాటి మోహన్ రావు వారి కుటంబ సభ్యుల పేరుతో భూములు కొన్నారు. పరిటాల సునీత తన కుమారుడు, అల్లుడు పేరు మీద భూములు కొన్నారు. కోడెల బినామీ పేరుతో 17.31 ఎకరాల భూమి కొన్నారు. పత్తిపాటి పుల్లారావు బినామిల పేరుతో 38.84 ఎకరాలు భూములు కొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కుటంబ సభ్యుల పేరు మీద 13.5 ఎకరాలు నారాయణ తన దగ్గర పని చేసే సబ్బంది పేరుతో 55.27 ఎకరాలు రావెల కిషోర్ బాబు తన కంపెనీ పేరుతో 40.85 జీవీ ఆంజనేయులు 37.84 ఎకరాలు వేమూరి రవి 25 ఎకరాలు.. కంపెనీ పేర మీద 6.2 ఎకరాలు నారా లోకేష్ బినామిలు కొల్లు శివరాం 47.39 ఎకరాలు నారా లోకేష్ బినామీ గుమ్మడి సురేష్ 42.9 ఎకరాలు నారా లోకేష్ బినామీ బలుసు శ్రీనివాస్ 14 ఎకరాలు భూమి కొన్నారు. ఇక నారా లోకేశ్ మామ బాలకృష్ణ వియ్యంకుడు రామారావుకు 498 ఎకరాలు కేటాయించారు. తరువాత ఆ భూమి ఉండే పరిధిని సీఆర్డీఏలోకి తెచ్చారు. హెరిటేజ్ 14 ఎకరాల భూములు, మురళీమోహన్ 53.29 భూములు ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కకు వచ్చేలా అలైన్మెంట్ మార్చారు. లింగమనేనికి చెందిన వందలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌లోకి రాకుండా చక్రం తిప్పారు. లింగమనేని భూమికి 10 మీటర్ల వరకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ఆపేశారు. దీనికి ప్రతిఫలంగా లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు. అంతేకాదు 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారు. తెలంగాణకు చెందిన 60 మంది తెల్ల రేషన్ కార్డుదారులు సైతం రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. అంతేకాదు 2 వేల ఎకరాల అసైన్డ్ భూములను దళితులను బెదిరించి, భయపెట్టి టీడీపీ నాయకులు తక్కువ ధరకు కొన్నారు. -
త్వరలోనే పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ పూలింగ్ చేసిన భూముల్లో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా ప్రారంభం కాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్‌పై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతాల్లో టెండర్లు పిలవలేదు.. టిడ్కోకు కూడా భూమిని కేటాయించలేదని తెలిపారు. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లన్నింటిని పూర్తి చేస్తామని తెలిపారు. యారాడతో పాటు మరో నాలుగైదు పెద్ద ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీకాకుళం, రాజమండ్రి, బొబ్బిలి డెవలప్మెంట్ బోర్డులు ఏర్పడిన తర్వాత వీఎంఆర్డీఏ పరిధి తగ్గిందన్నారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. బీచ్‌రోడ్డు అభివృద్ధిపై గత ప్రభుత్వం హయాంలో ఉన్న ప్రతిపాదనలను సమీక్షిస్తున్నామన్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడే ఎడ్యూకేషన్ హబ్, పరిశ్రమల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, హెల్త్ వంటివి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయం తీసుకున్నామన్నారు. -
బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!
సాక్షి, మచిలీపట్నం: ఇచ్చిన హామీ నెరవేర్చాలని అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు తలంచలేదు.. సరిగ్గా ఎన్నికలకు మరో రెండు నెలలు ఉందనగానే ఒక్కసారిగా గుర్తొచ్చాయి.. ఇంకేముంది ‘పసుపు– కుంకుమ’ మాదిరిగానే ఆర్భాటంగా ఇదిగో బందరు పోర్టు అంటూ ఓ పైలాన్‌ను ఆవిష్కరించేశారు. అందుకోసం టీడీపీ నాయకుల మౌఖిక ఆదేశాలతో రైతుల భూములను మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) అధికారులు అనధికారికంగా స్వాధీనం చేసుకుని నిర్మాణాలు సాగించారు. సీన్ కట్‌చేస్తే.. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ. 40 లక్షల ఊసు లేదు.. తిరిగి భూములిచ్చేయండని అడిగితే చీదరింపులు.. వెరసి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల ఆధీనంలో ఉన్న తమ భూములను విడిపించాలని మండల పరిధిలోని మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయా గ్రామాల సరిహద్దులో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభాప్రాంగణానికి, పైలాన్ నిర్మాణానికి ఇరు గ్రామాల రైతులకు చెందిన 20 ఎకరాలను వినియోగించారు. అప్పట్లో ఎకరం భూమిని రూ. 40 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు, టీడీపీ నాయకులు అట్టహాసంగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా భూమిని ఖాళీ చేయడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిత్తశుద్ధి లేని పనులకు రూ. కోట్లు గడిచిన ఐదేళ్లు టీడీపీ నాయకులు బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు గెలిస్తే ఆరు నెలల్లో బందరుకు ఓడను తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. ఐదేళ్లు భూ సేకరణ, భూ సమీకరణ, మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(మడా), మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ఏర్పాటు అంటూ కాలయాపన చేశారు. అయితే ముడాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఐదేళ్లు హారతికర్పూరం చేశారు. ఇక 2019 ఎన్నికల దగ్గరపడే సమయానికి ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. ఐదేళ్లు ఆడిన నాటకానికి చివరి అంకంలో రక్తికట్టించే ప్రయత్నంలో భాగంగానే మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతుల భూములను వినియోగించుకున్నారు. బందరు పోర్టు పనులు పూర్తి చేయలేమని, అయితే పనులు ప్రారంభం అంటూ నియోజకవర్గ ప్రజలను మరో మారు వంచించేందుకు ఎన్నికల ముందు, ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకొచ్చి హడావుడి చేశారు. సభ నిర్వహణకు, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు, పైలాన్ నిర్మాణానికి 20 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని సభను మమ అనిపించారు. ముడా అధికారుల దౌర్జన్యం భూములను ఖాళీ చేయమంటూ ముడా అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ముందుగా ఎకరం భూమికి రూ. 40 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నగదు చెల్లించకపోవడంతో ఇటీవల కొందరు రైతులు ముడా కార్యాలయానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ముడా అధికారులు తమపై విరుచుకుపడినట్లు కొందరు రైతులు చెబుతున్నారు. భూములకు సంబంధించిన కాగితాలను తీసుకురావాలని, లేదంటే భూములను ఆన్లైన్ అడంగళ్‌లో నుంచి తప్పిస్తామని, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని రైతులు వివరిస్తున్నారు. ఆగిపోయిన సాగు.. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏటా తొలకరి వర్షాలను ఆసరాగా తీసుకుని రైతులు ఈ భూముల్లో వేరుశనగ సాగు ప్రారంభిస్తారు. భూముల్లో కంకర, పైలాన్ ఉండటంతో సాగు చేయలేకపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు రైతులు కంకర లేని ప్రాంతంలో పొలాలను దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ముడా వైస్ చైర్మన్ విల్సన్‌బాబును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలిపారు. భూమిని సాగుకు పనికిరాకుండా చేశారు ముడా అధికారులు ఆక్రమించిన భూమిలో నాకు 2.50 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో భూమి ఇవ్వమని చెప్పాం. టీడీపీ నాయకులు, ముడా అధికారులు బలవంతంగా భూమిని తీసుకున్నారు. పోలీసు కేసులు పెడతామని బెదిరించారు. దీంతో ఎవరికి చెప్పుకోలేకపోయాం. నా భూమిలో కొంత భాగం పైలాన్ కట్టారు. మిగిలిన భూమిలో కంకర పోశారు. ఇప్పుడు సాగు చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది. నా కుటుంబానికి ఈ భూమి జీవనాధారం. భూమిలో ఉన్న కట్టడాలను తీసేయ్యాలని ఇటీవల ముడా అధికారులను కలిసి విన్నవించుకున్నాం. వాళ్లు మమ్మల్ని పలు రకాలుగా బెదిరించారు. – మేకా వెంకటశివ, రైతు, గోపువానిపాలెం -
ల్యాండ్ పూలింగ్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు
-
అడుగడుగునా అణచివేతే!
ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు, అధికారులే టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా మారారు. టీడీపీ నాయకులు తానా అంటే తందానా అన్నట్టు రాజధాని ప్రాంతంలో అధికార వ్యవస్థ తయారైంది. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు లాక్కోవడం దగ్గర నుంచి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న వారిపై పోలీసు బలగాలను ఉపయోగించి అక్రమ కేసులు పెడుతూ ఎక్కడికక్కడ భయాందోళన పరిస్థితులు కల్పిస్తున్నారు. ప్రజా ఉద్యమాలను అడుగడుగునా అణచివేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూమిలో రహదారి నిర్మించడానికి తాజాగా ప్రభుత్వ పెద్దలు పోలీస్ వ్యవస్థని వాడుకున్న తీరుపై రాజధాని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – తుళ్లూరు(తాడికొండ) భూములివ్వని రైతులే టార్గెట్.. రాజధానికి భూములు సేకరించేటప్పుడు టీడీపీ ప్రభుత్వం భూములివ్వని రైతులనే టార్గెట్ చేస్తూ చివరకు పంట పొలాలను తగలబెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఈ విషయంలో లింగాయపాలెం గ్రామానికి చెందిన శ్రీనాథ్ చౌదరిని పోలీసులు కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా రోజుకొక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పది రోజుల పాటు నిర్బంధించి ముప్పుతిప్పలు పెట్టారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నందిగం సురేష్ కూడా రాజధాని ప్రకటన సమయంలో సామాన్య కార్యకర్తగా ఉన్నారు. ఇదే విషయంలో పోలీసులు ఆయన్ని కూడా అక్రమంగా అరెస్టు చేసి వైఎస్ జగన్ ఆదేశాల మేరకే పొలాలకు నిప్పుపెట్టినట్టు ఒప్పుకోవాలని కర్రలు విరిగేలా కొట్టించారు. కుటుంబ సభ్యులను దూషిస్తూ మానసికంగా వేధించారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రైతులను భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలు కోకొల్లలు. దళితులు ప్రశ్నిస్తే అణచివేయడమే! దళిత ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిని అణచివేసేందుకు కూడా పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఒక్క టీడీపీ ప్రభుత్వానికే చెల్లుతుందేమో. రాజధానిలో దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు కూడా పట్టా భూములతో సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని బాధిత రైతులు గళం విప్పి దీక్షలకు కూర్చుంటే రాత్రికి రాత్రే శిబిరాన్ని కూల్చేసి దీక్షను భగ్నం చేసింది. 2018 ఏప్రిల్ 8న శాఖమూరులో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని చూడడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. స్మృతివనంలో ఇటుక కూడా వేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నాడనే విషయం ప్రజలకు తెలుస్తుందని టీడీపీ ప్రభుత్వం గజగజ వణికింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ.. వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెనుక సర్వే నంబరు 214/ఏ లో రైతు గద్దె మీరాప్రసాద్ పొలంలో నిర్మిస్తున్న ఎన్–9 రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినా సీఆర్డీఏ అధికారులు పట్టించుకోలేదు. 2018 ఫిబ్రవరి 25న అర్ధరాత్రి పోలీసులను అడ్డుపెట్టుకుని సీఆర్డీఏ అధికారులు రోడ్డు నిర్మిస్తుండగా.. రైతు తన వద్ద ఉన్న కోర్టు ఉత్తర్వులను చూపి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు సీఆర్డీఏ అధికారులకు భద్రత కల్పించడమే తమ బాధ్యత అంటూ రైతు మీరాప్రసాద్‌ను పొలంలో నుంచి ఈడ్చుకెళ్లారు. సీఆర్డీఏ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో రహదారి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పెద్ద వార్నింగ్ ఇస్తూ.. సచివాలయం వెనుక ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు వేసి తీరాలి.. ఏం చేస్తారో తెలియదు అనడంతో శనివారం 100 మంది పోలీసులను ఏర్పాటు చేసి రైతును అరెస్టు చేయించి రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. రైతుకు మద్దతు తెలిపితే బెదిరిస్తారా? రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల గళం నొక్కడానికి, అధికార పార్టీ కార్యకర్తలకు వత్తాసు పలకడానికి, ప్రతిపక్ష కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేయడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఇక్కడ అధికారులు కేవలం కీలుబొమ్మలే. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదు. రైతుకు మద్దతుగా వెళితే కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించడం దారుణం. – బత్తుల కిషోర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, తుళ్లూరు పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత లేదు. రాజ్యంగం పట్ల విశ్వాసం లేదు. రాజధాని రైతులను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతోంది. టీడీపీ నాయకులు కమీషన్ల కోసం దిగజారి వ్యవహరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ బూచిగా చూపించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా పోలీస్ శాఖ వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. రైతు మీరా ప్రసాద్‌కు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. – ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నా పొలంలో అనుమతి లేకుండా రోడ్డు నా పొలంలో ఎన్–9 రోడ్డు నిర్మించొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులను చూపినా అధికారులు పట్టించుకోలేదు. రోడ్డు వేస్తుండగా.. నా పొలంలోకి వెళ్తే పోలీసులు నన్ను ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం. నా పొలంలో నా అనుమతి లేకుండా ప్రభుత్వం పోలీసుల అండతో నాపై కేసు పెట్టి రోడ్డు నిర్మిస్తుందంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఉండదేమో. – గద్దె మీరా ప్రసాద్, రాజధాని రైతు, వెలగపూడి -
లే అవుట్లు..ఇక్కట్లు
సాక్షి,సిటీబ్యూరో: ల్యాండ్ పూలింగ్తో నగర శివార్లను అభివృద్ధి పుంతలు తొక్కిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఇప్పుడు ఆ ఊసే మరిచినట్టుంది. ఉప్పల్ భగాయత్ లే అవుట్ల తరహాలోనే దుండిగల్‌లో 520 ఎకరాలు, బోడుప్పల్ మేడిపల్లిలో 116 ఎకరాల అసైన్డ్ భూములను అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మరోవైపు ప్రతాపసింగారంలో రైతులు 430 ఎకరాలు భూమిని హెచ్ఎండీఏకి అప్పగిస్తూ అంగీకార పత్రాన్ని ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఆ పనులు ఎంతదూరంలో ఉన్నాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓవైపు భూములు ఇచ్చి ఎదురుచూస్తున్న రైతులు తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమ పరిస్థితి ఏంటని అధికారులను కలుస్తున్నా సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ‘విధానపరమైన ప్రక్రియ’లో ఉందని చెబుతున్నా అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనేదానిపైనా స్పష్టత లేదు. మినీ నగరం కోసం మా భూములు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినా అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘మేడిపల్లి’పై మౌనమేలనో!.. మేడిపల్లిలోని 116 ఎకరాల్లో లేఅవుట్ చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో హెచ్ఎండీఏ ఆ వైపు దృష్టి సారించింది. అంతలోనే 56 ఎకరాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన 60 ఎకరాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేద్దామనుకున్నా ఆగిపోయింది. దాదాపు 35 మంది రైతులు ఏళ్ల నుంచి సాగుచేసుకుంటున్న ఈ భూములపై యజమాన్య హక్కులు తమవేనని, హెచ్ఎండీఏ ఎకరానికి వెయ్యి గజాల భూమిని కేటాయించాలంటూ కోర్టుకెక్కారు. దీంతో హెచ్ఎండీఏ ఆదేశాల ప్రకారం ఆ భూములపై విచారణ చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ 35 మంది కబ్జాలో ఉన్నమాట వాస్తవమేనని, గతంలోనే వీరికి భూ యజమాన్య హక్కులు కల్పించాలని ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోలేదని నివేదికను సమర్పించారు. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అలాగే, దుండిగల్‌లో 520 ఎకరాల అసైన్డ్ భూములను హెచ్ఎండీఏకు అప్పగించాలంటూ రెవెన్యూ విభాగానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం లేఖలు రాసి ఏడాది గడుస్తున్నా అటునుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రైతులు భూములిచ్చినా ఎదురుచూపులే ప్రతాప సింగారంలో 430 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సముఖత వ్యక్తం చేస్తూ అంగీకార పత్రాన్ని హెచ్ఎండీఏ పూర్వ కమిషనర్ టి.చిరంజీవులుకు ఇచ్చి ఏడాది మించిపోయింది. ‘ఈస్ట్‌లుక్’లో భాగంగా ఈ మెగా లే అవుట్ చేయడం వల్ల శివారు ప్రాంతాలు అభివృద్ధి పుంతలు తొక్కి మినీ నగరాలుగా మారుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.అయితే అందులో అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. ఇప్పటి దాకా కనీసం ఈ లేఅవుట్‌కు సంబంధించిన గుత్తేదారును ఎంపిక చేసేందుకు టెండర్లు కూడా పిలవలేదు. దీంలో ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ అని రైతులు వాపోతున్నారు. మహా అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కమిషనర్లు మారుతున్నా ల్యాండ్ పూలింగ్ పనుల్లో అడుగు ముందుకుపడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత హెచ్ఎండీఏ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ దృష్టి సారించాలని కోరుతున్నారు. మూడేళ్లలోపూర్తి చేయకుంటే పరిహారం ‘మాస్టర్ ప్లాన్ 2031’కు అనుగుణంగా సొంత నిధులతోనే అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ లే అవుట్లుగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, గ్రీనరీ తదితర సౌకర్యాలను కల్పించాలి. లేఅవుట్ పూర్తయ్యాక భూములు అప్పగించిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను నష్టపరిహరంగా అందజేస్తారు. రైతులు ఆ ప్లాట్లను అమ్ముకోవచ్చు.. లేదంటే సొంతానికి వినియోగించుకోవచ్చు. యజమానులకు కేటాయించగా మిగిలిన ప్లాట్లను హెచ్ఎండీఏ ఈ–వేలం ద్వారా విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలి. అయితే, 12 ఏళ్ల క్రితమే ఉప్పల్ భగాయత్‌లో ల్యాండ్ పూలింగ్‌కు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టినా ఆ భూమిపై వివాదాలు తలెత్తడంతో రెండేళ్ల క్రితం ప్లాట్ల పత్రాలు రైతులకు పంపిణీ చేశారు. ఆ అనుభవం దృష్ట్యా మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతినెలా ఆ భూమి మూలవిలువ(బేసిక్ వాల్యూ)పై 0.5 శాతం పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే హెచ్ఎండీఏ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే, ప్రతాపసింగారం రైతులు 430 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడి ఏడాది గడస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. -
కోటరీ కోరినట్టే టెండర్లు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల టెండర్లకు ఓ విధానం అంటూ లేకుండా కోటరీ, బినామీ కాంట్రాక్టు సంస్థలు కోరినట్లుగా ప్రభుత్వ పెద్దలు కట్టబెడుతున్నారు. ఏ విధానంలో తమకు ఎక్కువ లాభదాయకమో అదే విధానాన్ని ఎంచుకుంటున్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి సమీకరించిన భూముల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఇప్పటికే రెండు విధానాల్లో టెండర్లను ఆహ్వానించిన పెద్దలు కోటరీ సంస్థలు ఎంపిక కాకపోవడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. కోటరీ, బినామీ సంస్థలు కోరిన విధానంలో లంప్సమ్ పర్సెంటేజ్ విధానంలో టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఎస్కలేషన్ క్లాజు విధించారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించిన టెండర్లలో ఎస్కలేషన్ క్లాజు విధించరు. ఈపీసీ విధానంలో కూడా ఎస్కలేషన్ క్లాజు ఉండదు. అయితే లంప్సమ్ విధానంలో ల్యాండ్ పూలింగ్ స్కీములో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో సీఆర్డీఏ ఎస్కలేషన్ క్లాజును విధించడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. అదనపు పని... అదనంగా బిల్లులు ల్యాండ్ పూలింగ్ స్కీములోని ఐదు జోన్లలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. లంప్సమ్ పర్సంటేజ్ విధానం అంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత మేర అదనంగా నిధులను చెల్లించడం. ఒప్పందంలో పేర్కొన్న దానికంటే అదనంగా పనులను చేపడితే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కోటరీ కాంట్రాక్టర్లకు భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించి కమీషన్లు కాజేసేందుకే ఎస్కలేషన్ క్లాజు తెరపైకి తెచ్చారనే విషయం స్పష్టం అవుతోందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు ల్యాండ్ పూలింగ్ స్కీముల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.5,784.20 కోట్ల విలువైన పనులకు లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈనెల 22వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాంకేతిక బిడ్ తెరుస్తారు. ఆర్థిక బిడ్ ఈ నెల 28వ తేదీన తెరుస్తారు. హైబ్రీడ్ యాన్యుటీ అంటే... హైబ్రీడ్ యాన్యుటీ విధానం కింద ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం సొమ్మును నిర్మాణ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 60 శాతం వ్యయం ప్రైవేట్ డెవలపర్ భరించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం సొమ్ము చెల్లించేందుకు అంగీకరించింది. 51 శాతం డెవలపర్ భరిస్తాడని పేర్కొంది. ఇది హైబ్రీడ్ యాన్యుటీ విధానానికి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రైవేట్ డెవలపర్ పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు ఏటా రెండు వాయిదాల్లో చెల్లించాలి. అప్పటివరకు ఉన్న వడ్డీకి అదనంగా మూడు శాతం కలిపి ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంది. అయితే తదుపరి ప్రభుత్వం ఈ టెండర్లను రద్దుచేస్తే తమ పరిస్థితి ఏమిటని కోటరీ సంస్థలు ప్రశ్నించడంతో సీఆర్డీఏ ఆ టెండర్లను రద్దు చేసింది. కోటరీ కోరికపై ఈపీసీ రద్దు! ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించినా కోటరీ సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందులో ఎస్కలేషన్ క్లాజు ఉండదు. అంతేకాకుండా టెండర్లలో పేర్కొన్న అంతర్గత అంచనా వ్యయంపై ఐదు శాతం కన్నా ఎక్కువగా కోట్ చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో కోటరీ సంస్థలు మనసు మార్చుకుని ఈపీసీ విధానంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరాయి. దీంతో సీఆర్డీఏ వీటిని రద్దు చేసి కోటరీ కోరిక మేరకు మూడోసారి లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో ఎస్కలేషన్ క్లాజుతో టెండర్లను ఆహ్వానించింది. ఐదేళ్ల పాటు నిర్వహణ... - జోన్–4 కింద పిచ్చుకలంక, తుళ్లూరు, అనంతవరంలోని 843.66 ఎకరాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ స్కీములో రహదారులు, వంతెనలు, డ్రైన్స్ తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.563.16 కోట్లతో లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. రెండేళ్లలో మౌలిక వసతులను కల్పించి ఐదేళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. - జోన్–12 కింద కురగల్లు, నవులూరు, నిడమానూరులో 2,748.68 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,600.15 కోట్లతో టెండర్లను పిలిచారు. - జోన్–12 ఏ కింద కురగల్లు, నిడమానూరులో 2,155.79 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,154.35 కోట్లతో టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది. - జోన్ 9, 9 ఏ కింద ఐనవోలు, నేలపాడు, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం పరిధిలోని 1,811.39 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.2,466.54 కోట్లతో టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది. కొత్త సర్కారు వస్తే? రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీము జోన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు తొలుత హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందులో అక్రమాలను ‘సాక్షి’ బట్టబయలు చేయడం, పలువురు విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయడంతో కోటరీ సంస్థలు ఈ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి వెనకడుగు వేశాయి. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో లొసుగులు, లోపాలను తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వం తప్పుబట్టి దర్యాప్తునకు ఆదేశిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాయి. దీనికి సీఆర్డీఏ, ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పలేకపోయారు. -
దేవుడి భూములకు పంగనామాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో దేవుడి భూములకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పులతో పాటు తాను చేసిన చట్టాలను, జారీచేసిన మెమోలను సైతం లెక్క చేయడంలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న దేవాలయాల భూములకు ఎటువంటి రైతువారీ పట్టాలు చెల్లబోవని, గతంలో రైతు వారీ పట్టాలు ఇచ్చినప్పటికీ అవి పనికిరావని స్పష్టం చేస్తూ సీఆర్డీఏ 2015 సంవత్సరంలో మెమో జారీ చేసింది. ఆ భూమలన్నీ కూడా ధార్మిక సంస్థలకే చెందుతాయని ఆ మెమోలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ఆలయాల భూములకు కేవలం పరిహారం మాత్రమే సదరు ధార్మిక సంస్థలకు చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు మాత్రం ఆక్రమణదారుల పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో దేవుడి భూములపై గతంలో హైకోర్టుకు సీఆర్డీఏ ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి చట్టానికి విరుద్ధంగా రైతు వారీ పట్టాల సాకుతో ఈనాం భూముల ఆక్రమణదారులకు కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కట్టబెడుతుండటంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్లాట్లు, పరిహారం కూడా ఆలయాలకే రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా వివిధ దేవాలయాలకు చెందిన 843.87 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. మరో 173.22 ఎకరాలకు సంబంధించి దేవాదాయ శాఖతో పాటు రైతులు కూడా ఆ భూములు తమవంటూ క్లెయిమ్ చేయడంతో ఆ భూములపై సీఆర్డీఏ నిర్ణయం తీసుకోలేదు. రాజధానిలోని ఆలయాలకు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములన్నీ ఆయా సంస్థలకే చెందాలని, ఎటువంటి రైతు వారీ పట్టాదారులకు ఆ భూములపై హక్కు లేదని దేవాదాయ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులతో ఆ భూములను సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలకు చెందిన భూములకు సంబంధించి పూర్తి పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఆయా ఆలయాల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు జమ చేయాల్సిందిగా ఆ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టుకు సీఆర్డీఏ లిఖితపూర్వక అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగానే సీఆర్డీఏ మెమో జారీ చేసింది. ఆ మెమోలో.. ఎటువంటి రైతు వారీ పట్టాలు జారీ చేయడానికి వీల్లేదని, ఇప్పటికే జారీ చేసి ఉంటే అవి చెల్లుబాటు కావని, ఆ భూములపై పూర్తి హక్కులు ఆయా సంస్థలకే చెందుతాయని మెమోలో స్పష్టం చేసింది. రైతువారీ పట్టాలు చెల్లవు.. ఈనాం భూములకు ఇచ్చిన పట్టాలపై 2015లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వింజమూరి రాజగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసుల్లో హైకోర్టు గతంలో స్పష్టంగా పేర్కొంది. ఈనాం భూములకు సంబంధించి 1956 చట్టం ప్రకారం రైతు వారీ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదని, ఒక వేళ రైతు వారీ పట్టాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావని, ఈనాం భూములన్నీ కూడా ఆయా ఆలయాలకు మాత్రమే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రైతువారీ పట్టాలు జారీ చెల్లబోవని 2013లో చేసిన చట్టసవరణను ఈ తీర్పు ద్వారా హైకోర్టు సమర్థించినట్లు అయిందని న్యాయశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈనాం భూములను ఆక్రమించుకున్న రైతులు తమకే పరిహారం చెల్లించాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దేవుని భూములకు పరిహారాన్ని ఆయా ఆలయాలకు చెల్లించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మాత్రం ఆక్రమణదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడించిందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమరావతి : రాజధాని ‘చిత్రాల్లో’ ఇదో ‘సిత్రం’..!
సాక్షి, అమరావతిబ్యూరో : రికార్డులు చూడలేదు.. సర్వే చేయలేదు.. భూమికి సంబంధించిన పత్రాలున్నాయో లేదో అసలే పట్టించుకోలేదు.. అయినా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయించేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాజధానిలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సాధారణ రైతులకు ప్లాట్లు కేటాయించేటప్పుడు సవాలక్ష నిబంధనలను పాటించే అధికారులు.. అధికార పార్టీ నాయకుల బినామీలకు మాత్రం ఆగమేఘాల మీద.. పత్రాలు ఏవీ పరిశీలించకుండానే ప్లాట్లు కేటాయించారు. అంతేకాకుండా నాలుగేళ్లుగా కౌలు చెక్కులు కూడా చెల్లిస్తున్నారు. 9.14 అగ్రిమెంట్ చేసుకోకుండానే ప్లాట్లు గుంటూరు జిల్లా రాజధాని గ్రామమైన మందడానికి చెందిన బేతపూడి సురేష్‌బాబు అనే వ్యక్తి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో తనకు భూమి లేకపోయినా ఉందని పేర్కొంటూ, ఎకరం భూమిని సీఆర్డీఏకు ఇస్తున్నట్లు అంగీకార పత్రం అందజేశారు. భూములు తీసుకునే సమయంలో రైతుల నుంచి సీఆర్డీఏ అధికారులు తప్పనిసరిగా 9.14 కింద అగ్రిమెంట్ చేసుకుంటారు. రైతుకు సంబంధించిన భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సర్వే చేసిన అనంతరం అవి నిజమని నిర్ధారించుకున్న తర్వాత 9.18ఏ కింద ప్లాట్లను ఎంచుకోవాలని సంబంధిత రైతులకు సూచించిన అనంతరం సదరు రైతుకు పరిహారం కింద వచ్చే ప్లాట్లను కేటాయిస్తారు. ఇక్కడ సురేష్ బాబుతో 9.14 అగ్రిమెంట్ చేయించుకోకుండానే అధికారులు అతనికి ప్లాట్లు కేటాయించారు. భూమి సర్వే చేయకుండానే అఫిడవిట్ ఆధారంగా ప్లాట్లు కేటాయించడం వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అఫిడవిట్‌ను ఆధారంగా చేసుకుని సురేష్‌బాబుకు 27–797–3779–3–బి1, 27–797–3779– 23– బి1 నంబర్లలో 250 గజాల నివాస, 24–762–3766– 39– సి2 నంబర్లో 500 గజాల విల్లా, 24–764–3777– 19– ఐ2 నంబర్లో 250 గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించారు. నాలుగేళ్లుగా అతనికి కౌలు చెక్కులు చెల్లిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనే... ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మందడం గ్రామ రెవెన్యూ పరిధిలో 207/1లో ఎకరం 70 సెంట్ల భూమి కృష్ణా నదిలో కలిసిపోయింది. అయితే ఈ సర్వే నంబర్లో గుంటూరు జిల్లాకు చెందిన పఠాన్ గౌస్‌కు భూమి ఉందని సీఆర్డీఏ అధికారులు డాక్యుమెంట్లు పుట్టించారు. భూమి లేకుండానే అతనికి 1,450 గజాల ప్లాట్లు కేటాయించారు. అందులో 250 గజాల ప్లాట్‌ను కూడా నిందితుడు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. రెండో ప్లాట్‌ను విక్రయించే సమయంలో కొనుగోలుదారులకు అనుమానం వచ్చి డాక్యుమెంట్లను పరిశీలించగా పత్రాలన్నీ నకిలీవని తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అధికార పార్టీ నాయకులు గౌస్‌ను ఇరికించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నేతలకు బినామీయేనా? సాధారణంగా సీఆర్డీఏ అధికారులు 9.14 అగ్రిమెంట్ చేసుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ప్లాట్లు కేటాయించరు. అలాంటిది భూమి పత్రాలు కూడా ఇవ్వకుండా కేవలం అంగీకార పత్రంతో ప్లాట్లు కేటాయించడం వెనక అధికార పార్టీకి చెందిన బడా నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్‌బాబుకు కేటాయించిన 1,250 గజాల స్థలం విలువ దాదాపు రూ. మూడు కోట్లు పలుకుతోంది. అధికార పార్టీ నేతలు సీఆర్డీఏ అధికారులతో కుమ్మక్కై బినామీ పేర్లతో ప్లాట్లను కేటాయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి ఇచ్చిన రైతుల వివరాలను సర్వే నంబర్లతో సహా సీఆర్డీఏ అధికారులు వెబ్సైట్లో ఉంచుతారు. సీఆర్డీఏ వెబ్సెట్లో బేతపూడి సురేష్‌బాబు.. ప్రభుత్వానికి భూమి ఇచ్చినట్లు ఎక్కడా చూపించడం లేదు. -
భూసేకరణ జీవో చెల్లదు
తాటిచెట్లపాలెం (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని, ఇది సరైన పద్ధతిలో జరగట్లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో విడుదల చేసిన జీవో నంబర్ 118, పార్లమెంట్ చట్టం 113కు పూర్తి వ్యతిరేకమన్నారు. విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం ‘భూసేకరణ– పరిష్కారం’ అనే అంశంపై జరిగిన సెమినార్లో జస్టిస్ గోపాలగౌడ మాట్లాడారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన విమర్శలుగుప్పించారు. ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి వస్తే ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలని, ప్రజల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని, ఆ తర్వాత వారికి తగు నష్టపరిహారం, ప్రతిగా స్థలం ఇవ్వాలని, అలాగే బాధితులకు జీవనాధారం చూపించాల్సి ఉందని వివరించారు. భూసేకరణ అనేది హౌసింగ్ స్కీం కోసమైతే అక్కడి పరిస్థితులు నివాసయోగ్యతకు అనుకూలంగా ఉండాలని, పర్యావరణ అనుమతులు ఉండాలని పార్లమెంట్లో చేసిన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ఆమెదం పొందాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని, కానీ ఇష్టానుసారంగా చేసిన ఆ జీవో చెల్లదని, అలాంటి జీవో బంగాళాఖాతంలో కలిపేయడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే అది రాష్ట్రపతి ఆమోదం పొందాలని కాని ఇక్కడ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవేమీ పాటించకుండా పారిశ్రామిక కారిడార్ల, విశ్వవిద్యాలయాలు, రహదారుల పేరిట పేద, మధ్య తరగతుల రైతుల నుంచి బలవంతంగా లక్షల, వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని జస్టిస్ గోపాలగౌడ దుయ్యబట్టారు. రైతుల్ని వేధిస్తూ భూసేకరణ రాష్ట్రంలో పెట్రో యూనివర్సిటీకి 250 ఎకరాలు అవసరమైతే దీని పేరిట 750 ఎకరాలు సేకరించేందుకు కుట్రపన్నుతున్నారని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. అయితే దీని కోసం ఇంతవరకు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని కాపాడాలని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ప్రజల్ని, రైతుల్ని వేధిస్తూ భూసేకరణ చేస్తోందన్నారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, కానీ అభివృద్ధి పేరిట సంవృద్ధిగా పంటలు పండే వేల, లక్షల ఎకరాలు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రైతులంతా ఏకమై పోరాడితే అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కొందరు రైతులకు పట్టాలు లేనందున వారికి తక్కువ నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే వారు దశాబ్దాలుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి సందర్భంలో ఆ భూములకు వారే హక్కుదారులని చట్టం చెబుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానికి ఉండాలిగాని వారిని బిచ్చగాళ్లను చేయడానికి కాదని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పనిచేసేది కేవలం పట్టణ ప్రజల కోసమేనా? గ్రామీణులు, రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. సమావేశంలో íసీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, సీపీఐ నేతలు గంగారాం, కె.లోకనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు. ఓటుతో బుద్ధి చెప్పాలి! పారిశ్రామిక ప్రాంతం కోసం భూసేకరణ చేయదలిస్తే ఆ ప్రాంతంలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది.. లాభనష్టాలు, ప్రాజెక్టు రిపోర్టులు తదితర అంశాలతో, వివిధ శాఖల అనుమతులతో మాత్రమే చేయాల్సి ఉంటుందని జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. మన దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణులేనని, వీరి జీవనాధారం పాడి పంటలు, ఫలసాయమేనని వివరించారు. మరి అలాంటి సాగు భూముల్ని బలవంతంగా ప్రభుత్వాలు తీసేసుకుంటే ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై అలాంటి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. -
నాకు అన్యాయం జరిగితే బాధ్యత చంద్రబాబుదే
-
వలస బాట పట్టిన రాజధాని రైతులు
-
పూలింగ్ పితలాటకం
సాక్షి, విశాఖపట్నం : పెరుగుతున్న జనాభాకనుగుణంగా భవిష్యత్‌లో విశాఖ పరిసరాల్లో కనీసం 30 వేల ఇళ్లు అవసరమవుతాయని అంచనా. దీనికి తోడు ప్రతిపాదనల్లో ఉన్న పలు ప్రాజెక్టులకు అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ఈ కారణంతో అమరావతి తరహాలోనే ఇక్కడా ల్యాండ్ పూలింగ్ అమలు చేయాలని నిర్ణయించారు. భూముల కొరత కారణంగా భారీ టౌన్‌షిప్‌లు నిర్మించాలని తలపోశారు. ’సరసమైన గృహ నిర్మా ణం’ పేరిట అమలు చేస్తున్న ఈ పథకానికి విశాఖ జిల్లానే ప్రయోగా త్మకంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం గత ఏడాదిగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న కసరత్తులు కొలిక్కి వచ్చాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసర మైన అనుమతులను సత్వరమే మంజూరు చేస్తారు. తాగునీరు, విద్యుత్, రోడ్డు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రాయితీలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. సరసమైన గృహ నిర్మాణ పథకం కింద ఆర్థికంగా వెనుకబడినవర్గాల లబ్దిదారుల ఎంపిక, రాయితీ చెల్లింపు రుణ కల్పన, ఈఎంఐ ఖరారు తదితర ప్రక్రియలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇక్కడే ప్రైవేట్ జోక్యం ఈ టౌన్‌షిప్‌ల్లో 70 శాతం స్థలంలో వాణిజ్య అవసరాలకు, 30 శాతం స్థలంలో బహుళ అంతస్తుల ఇల్లు నిర్మించి ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక్కడే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చోటు కల్పించాలన్నది ప్రభుత్వ పన్నాగం. ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణాల బాధ్యతను తమకు అనుకూలమైన ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా వారికి ప్రయోజనం చేకూర్చాలన్న ది పెద్దల పన్నాగంగా కనిపిస్తోంది. కాగా ఇప్పుడున్న జీవో ప్రకారం అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో అర్హులైన డీ పట్టాదారులకు 1200 చదరపు గజా లు, ఆక్రమణదారులకు 500 గజాలు చొప్పున స్థలాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంత పెద్ద స్థలాలు కాకుండా డీ పట్టాదారులకు 900 గజాలు, ఆక్రమణదారులకు 250 గజాలు చొప్పున మాత్రమే ఇచ్చేలా కొత్త జీవో జారీ కానుంది. ట్రై జంక్షన్లో పూలింగ్ గాజువాక–సబ్బవరం–పరవాడల మధ్య ట్రై జంక్షన్లో ఉన్న 1600 ఎకరాలను మెగా టౌన్‌షిప్‌ల కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పరదేశీపాలెం, మధురవాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఓక్కో చోట 60 నుంచి 80ఎకరాల చొప్పున సుమారు 400 ఎకరాలు గు ర్తించారు. ట్రై జంక్షన్‌లోని 1600 ఎకరాల్లో 700 ఎకరాల వరకు కొండ ప్రాంతాలున్నాయి. 900 ఎకరాల్లో డి పట్టాదారులు, ఆక్రమణదారులున్నా రు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తున్నామన్న విషయాన్ని తెలియనీయకుండా ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి అనుభవదారులు, ఆక్రమణదారులు 300 మందికి పైగా ఉన్నారని ఇప్పటికే గుర్తించారు. కాగా ల్యాండ్ పూలింగ్ గైడ్‌లైన్స్ రూపొందించిన రెవెన్యూ, ఫైనాన్స్, లా సెక్రటరీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక డిప్యూటీ సీఎం వద్ద ఉంది. ఎవరెవరికి ఎంత భూమి ఇవ్వాలనేది కేబినెట్లో చర్చించిన నిర్ణయం తీసుకుంటారు. నెలాఖరులోగా జీవో వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ వెంటనే భూ సమీకరణ ప్రారంభమవుతుంది. ట్రై జంక్షన్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ట్రై జంక్షన్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించే భూముల్లో 150 ఎకరాలు అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు కేటాయించనున్నారు. తొలుత స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 250 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని భావించారు. కానీ భూములిచ్చేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఇచ్చినా అందుకు రెట్టింపు విస్తీర్ణంలో భూములు తమకు ఇవ్వాలని మెలిక పెట్టింది. దీంతో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే భూముల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి వీలుగా ఆనందపురం మండలం వేములవలస వద్ద వందెకరాలు, పాలవలసలో 83 ఎకరాలు, మునగపాక మండలం పంచదార్లలో 90 ఎకరాలు, అచ్యుతాపురం మండలం రాజుకోడూ రు, వేల్చేరు, కృష్ణపాలెం గ్రామాల్లోని 70 ఎకరాలు, అచ్యుతాపురంలో 150 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించారు. వీటిలో ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ తదితర కేటగిరీల్లో టౌన్‌షిప్‌లు ని ర్మిస్తారు. ల్యాండ్ పూలింగ్‌ద్వారా సమీకరించనున్న భూములతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో మెగా టౌన్ షిప్‌ల నిర్మాణ బాధ్యతలను ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) సంస్థకు అప్పగించనుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా టెండర్లు ఖరారు చేయనున్నారు. -
ఆభరణాల గురించి టీడీపీ నాయకులకు తెలుసు : పవన్
సాక్షి, హైదరాబాద్ : భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ కబ్జాలకు అండగా నిలుస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గురువారం వరుస ట్వీట్లలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటివరకూ సేకరించిన భూములు చాలని, ఇకపై రైతుల నుంచి భూములను సేకరించొద్దని ప్రభుత్వానికి సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరుగుతున్న పరిణమాలపై కూడా పవన్ స్పందించారు. రమణ దీక్షితులు ప్రస్తావిస్తున్న అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పింక్ డైమండ్‌తో పాటు ఇతర ఆభరణాల అదృశ్యంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ సరిగా లేదని అన్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో తనను కలిసిన ఓ వ్యక్తి టీటీడీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారని ట్వీట్లో పవన్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ప్రకారం వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు ఓ మిడిల్ ఈస్టర్న్ దేశానికి తరలిపోయాయని రాసుకొచ్చారు. ఈ విషయం కొంతమంది టీడీపీ నాయకులకు తెలుసని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అందుకే రమణ దీక్షితుల ఆరోపణలు తనకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదని చెప్పారు. ఆభరణాలను దొంగిలించిన వారు బాలాజీ మాట్లాడలేరని, ఆయన్ను దోచుకుంటే ఏం కాదని అనుకుంటున్నారని అన్నారు. AP Govt should act as protectors not as Land Grabbers. — Pawan Kalyan (@PawanKalyan) 21 June 2018 I request GOVT of AP not to use Land acquisition act on Amaravati Farmers. Govt has pooled enough land for capital & should stop acquiring further.I will be meeting farmers in Amaravati regarding this issue. — Pawan Kalyan (@PawanKalyan) 21 June 2018 According to AP Govt’s ‘Lord Balaji’s Pink Diamond missing theory’; any robber in the country can relieve jewellery from idols throwing a handful of coins at them while the procession is going on.ok, then what about other missing jewels stored in the Vaults. — Pawan Kalyan (@PawanKalyan) 21 June 2018 #TTDPINKDIAMOND #RamanadeekshithuluTTD pic.twitter.com/PRk1dkktHD — Pawan Kalyan (@PawanKalyan) 21 June 2018 #TTDPINKDIAMOND pic.twitter.com/SRsmpFrSb8 — Pawan Kalyan (@PawanKalyan) 21 June 2018 -
రైతుల వాదన నిజమే
రాజధాని అన్నదాతల వేదనతో ఏకీభవించిన ప్రపంచ బ్యాంకు - అందువల్లే తనిఖీ, విచారణకు ఆదేశిస్తున్నామని వెల్లడి - రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు పూలింగ్, సేకరణ చేస్తోంది.. - జీవనోపాధి, ఆహార భద్రతకు ముప్పు.. సామాజిక సర్వే లోపభూయిష్టం - 1,27,505 మంది ప్రభావితం.. 150 మంది అభిప్రాయాలే సేకరిస్తారా? - రెతుల విన్నపాలను లోతుగా అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం - వచ్చే నెల 13లోగా తనిఖీ, విచారణ పూర్తి చేయాలంటూ తలంటిన వైనం సాక్షి, అమరావతి : ‘అయ్యా.. అన్యాయం చేయమాకండయ్యా.. ఆ భూములమీదే ఆధారపడి బతుకుతున్నాం.. మూడు కార్లు పండే పచ్చటి పొలాలను లాగేసి మా కడుపు కొట్టొద్దు’ అని నవ్యావంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఎంతగా నెత్తీనోరు కొట్టుకున్నా స్పందించని రాష్ట్ర సర్కారు తీరును ప్రపంచ బ్యాంకు తప్పు పట్టింది. బలవంతంగా రైతుల నుంచి భూములు సేకరిస్తూ వారి జీవనోపాధికి భంగం కలిగిస్తున్నారని, తద్వారా పర్యావరణం, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎత్తి చూపింది. సామాజిక ఆర్థిక సర్వే అంతా లోపభూయిష్టంగా సాగిస్తూ.. కొంత మంది అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ చైర్మన్ గోంజలో కాస్ట్రోడెలా మాటా సంతకంతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. అన్ని అంశాలపై తనిఖీ, విచారణ పూర్తి చేసి, వచ్చే నెల 13వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు రుణం కోరిన నేపథ్యంలో రూ.3,334 కోట్లు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ ప్రాంతంతో సామాజిక స్థితిగతులు, పర్యావరణం తదితర అంశాలను ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకుంటుంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తోందని పెద్దఎత్తున రైతులు ఫిర్యాదు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను గమనించిన తనిఖీ ప్యానల్ ప్రభుత్వానికి తలంటింది. మాకే లోపభూయిష్టమైన సమాచారం ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని, పారదర్శకత పాటించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాచారాన్ని తాము విశ్వసించడం లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతుల ఆవేదనలో న్యాయం ఉందని తేల్చి చెప్పింది. రైతులకు జరుగుతున్న అన్యాయానికి ఆధారాలున్నాయని వెల్లడించింది. ఆకాశ రామన్నలు చెబితే విచారించడం లేదు.. రైతుల విన్నపాలపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే విచారణకు ఆదేశించామని ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ వెలువరించిన డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. ఆకాశ రామన్న లేదా పస లేని ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఆదేశించలేదని వివరించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేకపోవడంతోపాటు అమరావతి ప్రాజెక్టు తొలి దశలోనే ఉన్నందున రైతుల విన్నపాలపై విచారణ, తనిఖీలకు ఆదేశించలేదని పేర్కొంది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులు కోర్టు డాక్యుమెంట్లతో సహా మొత్తం 22 ఆధారాలు సమర్పిస్తూ.. న్యాయం చేయాల్సిందిగా తమకు విన్నవించుకున్నారని వెల్లడించింది. రైతులు లేవనెత్తిన అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే తనిఖీలు, విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ప్రపంచ బ్యాంకు ప్యానెల్ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఇంకా చెప్పారంటే... అభిప్రాయాలు చెప్పకుండా నిరోధించారు.. ‘రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) విధానం ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సహాయ, పునరావాసంపై ప్రభుత్వం తమను సంప్రదించలేదని వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని మా(ప్రపంచ బ్యాంకు) దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూములను లాగేసుకుంటోందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తగినంత పరిహారం చెల్లించడం లేదని, తాము జీవనోపాధి కోల్పోతామని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ భూములు కోల్పోతున్న వారికి అంతే మొత్తంలో మరోచోట భూములు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. సహాయ, పునరావాస ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకు అమలు చేయడం లేదని అంటున్నారు. రాజధాని ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారిపై ప్రభావ తీవ్రతను సరిగా అంచనా వేయడం లేదని బ్యాంకు దృష్టికి రైతులు తీసుకెళ్లారు. సామాజిక ఆర్థిక సర్వే లోపభూయిష్టంగా నిర్వహించారని, ఒక కన్సల్టెంట్ ద్వారా నిర్వహించిన సర్వేలో వాస్తవాలు ప్రతిబింబించలేదని రైతులు పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు వల్ల 1,27,505 మంది ప్రభావితం అవుతుంటే కేవలం 150 మందిని మాత్రమే సర్వేలో సంప్రదించారని, మరో ఐదు ఆన్లైన్ అభిప్రాయాలు మాత్రమే వచ్చాయని రైతులు పేర్కొన్నారు. సెక్యూరిటీని పెట్టి అభిప్రాయాలు చెప్పడానికి రాకుండా చాలా మందిని నిరోధించారని రైతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘనలను నిరోధించడంతో పాటు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకును కోరారు. గతంలో పలుసార్లు వినతులు చేసినప్పటికీ బ్యాంకు మేనేజ్మెంట్ వాటిపై చర్యలను తీసుకోవడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్‌పై అనేక అభ్యంతరాలు రైతుల వినతులపై ప్రపంచ బ్యాంకు ప్యానల్ గత నెల 24వ తేదీన ప్రపంచ బ్యాంకు మేనేజ్మెంట్తో సమావేశమై పలు అంశాలపై సమాచారం, వివరణ కోరింది. రైతులు ప్రస్తావించిన అంశాలు బ్యాంకు మేనేజ్మెంట్ దృష్టిలో ఉన్నాయని, అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్యానల్‌కు సమర్పించామన్నారు. సహాయ పునరావాస ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ఉప ప్రాజెక్టుల పరిధిలో మాత్రమే అమలయ్యే చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్ దృష్టికి తీసుకువచ్చింది. ప్రపంచ బ్యాంకు సాయం అందించే మొత్తం ప్రాజెక్టులో ప్రస్తుతం 30 శాతం మాత్రమే అంటే పది రహదారులకు సంబంధించి సహాయ పునరావాస కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ రహదారుల ప్రాజెక్టుకు 400 కుటుంబాలు ప్రభావితం అవుతాయని, కన్సల్టేషన్ సమావేశంలో కేవలం 150 మంది మాత్రమే పాల్గొన్నారని, ల్యాండ్ పూలింగ్‌పై అనేక అభ్యంతరాలు, అభిప్రాయాలు వచ్చాయని బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్‌కు వివరించింది. ల్యాండ్ పూలింగ్‌పై మూడవ పార్టీ అంచనా కొనసాగుతోందని, త్వరలోనే ఆ నివేదికను ప్యానల్‌కు సమర్పిస్తామని బ్యాంకు మేనేజ్మెంట్ పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తనిఖీ, విచారణకు ఆదేశించాము’ అని డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. -
మరో రెండు గ్రామాల్లో భూసేకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో రెండు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. తుళ్ళూరు మండలం లింగాయపాలెం, మంగళగిరి మండలం నవులూరులో రైతుల నుంచి భూమి సేకరించటానికి నోటిఫికేషన్ ఇచ్చింది. లింగాయపాలెంలో 110.60కు నోటిఫికేషన్ ఇచ్చినందున 81 మంది భూ యజమానులు ప్రభావితం అవుతారని అధికారులు తెలిపారు. నవులూరులో 183.56 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనివల్ల 106 మంది ప్రభావితం కావడంతో పాటు 1,101 మంది నిర్వాసితులవుతారని పేర్కొన్నారు. ఈ భూ సేకరణ నోటిఫికేషన్‌పై మంళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కోర్టు తీర్పులను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కచేయకుండా రాజధానిలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వటం దారుణం అని అన్నారు. రైతులు, కూలీలు వ్యవసాయం చేసుకుంటూ బతకటం ఆయనకు ఇష్టం లేదన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్ కళ్యాణ్ వెంటనే రాజధాని రైతులకు అండగా నిలవాలని ఆర్కే డిమాండ్ చేశారు. -
‘భూసేకరణ ద్వారానే తీసుకుంటాం’
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న స్టార్టప్ ఏరియా నిర్మాణానికి అవసరమైన భూముల్ని భూసేకరణ ద్వారానే తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రైతుల భూముల్ని ల్యాండ్‌పూలింగ్ ద్వారా గానీ లేదా భూసేకరణ చట్టం కింద గానీ తీసుకోకుండా టెండర్ నోటిఫికేషన్లో చేర్చడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ అసెంబ్లీలో సాక్షి కథనాలు
అమరావతి: విశాఖపట్టణంలో అసైన్డ్ భూముల కుంభకోణాన్ని సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చిందని బీజేపీ శానససభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇందుకు సంబంధించిన వార్త కథనాన్ని ఆయన సభలో చూపించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభలో సోమవారం స్వల్ప వ్యవధి ప్రశ్నపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్టణంలో కొంతమంది వ్యక్తులు రైతులను బెదిరించి, బలవంతంగా అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని, వారికి రాజకీయ నాయకులతో పాటు, ఐపీఎస్, ఐఏఎస్, కోర్టు అధికారుల అండదండలూ ఉన్నాయన్నారు. కేవలం రూ. లక్ష రైతులకు ఇచ్చి రూ. 10 లక్షలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని, భూములకు సంబంధించిన పట్టాలు, ఇతర డాక్యుమెంట్లన్నీ వారి గుప్పిట్లో పెట్టుకున్నారని సభ దృష్టికి తెచ్చారు. ల్యాండ్‌పూలింగ్ జీవో రాకముందే ఇదంతా చేశారని, కోట్లాది రూపాయల భూమిని కారుచౌకగా హస్తగతం చేసుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి చేసిన లే అవుట్లు, రోడ్లుతో కూడిన గూగుల్ మ్యాప్‌లను ఆయన సభలో ప్రదర్శించారు. దీనిపై చర్యలు చేపట్టి, అనైన్డ్ రైతులకు న్యాయం చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. ఈ విషయంపై 2016 అక్టోబర్‌లో మడపాక గ్రామ అసైన్డ్ రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని మంత్రి నారాయణ అంగీకరించారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. అసలు అసైనీలకు మాత్రమే భూ సమీకరణ యాజమాన్య ధృవపత్రాలను జారీ చేశామని బదులిచ్చారు. -
అమరావతిలో మరో భారీ భూ కుంభకోణం
-
తెగిపడిన ఆ గ్రామకంఠాలు.. దళారీలకు దక్షిణలు
అమరావతిలో మరో భారీ భూ కుంభకోణం ⇒ రాజధాని గ్రామాల్లో ‘పెద్దల’ ముందుచూపు ‘పథకం’ ⇒ నాడు పూలింగ్ నుంచి గ్రామ కంఠాల మినహాయింపు ⇒ ఇపుడు అవన్నీ యథేచ్ఛగా అప్పగింతలు ⇒ కొత్తగా తెరపైకి ‘విస్తరించిన గ్రామకంఠం’ నిబంధన ⇒ గ్రామానికి దూరంగా ఉన్న పట్టా భూములు కూడా పచ్చ తమ్ముళ్లపరం సాక్షి, అమరావతి బ్యూరో రాజధాని భూముల్లో మరో అక్రమాల బాగోతం బయటపడింది. ‘గ్రామకంఠాల’ ముసుగులో సాగుతున్న భూముల కుంభకోణం ఇది. ఊరిలో ఉమ్మడి అవసరాల కోసం కేటాయించే భూములను గ్రామకంఠాలుగా పిలుస్తారన్న సంగతి తెల్సిందే. అయితే అవి ఊరికి 50 మీటర్లలోపు మాత్రమే ఉండాలి. అవసరాన్ని బట్టి వాటిని పేదలకు ఇళ్ల కోసం కూడా కేటాయిస్తుంటారు. ఈ గ్రామ కంఠం భూములను అప్పట్లో ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించారు. ఎంతో ముందుచూపుతో ఒక పథకం ప్రకారం వారు ఇచ్చుకున్న ఆ మినహాయింపును ఇపుడు చక్కగా వాడుకుంటున్నారు. కోట్ల విలువైన గ్రామకంఠం భూములను గుట్టుచప్పుడు కాకుండా హాంఫట్ చేసేస్తున్నారు. ‘పెద్ద’ తమ్ముళ్లంతా తీరిగ్గా వీటిని ఆరగించేస్తున్నారు. అదే సమయంలో గ్రామకంఠం మినహాయింపును ఊరికి దూరంగా ఉన్న పట్టా భూములకు కూడా వర్తింపజేసుకుంటున్నారు. ‘విస్తరించిన గ్రామకంఠాలు’ పేరుతో పూలింగ్ నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఒకవేళ పూలింగ్‌కు ఇచ్చినా వాటిని ఈ ‘విస్తరించిన గ్రామకంఠాలు’ కింద చూపించి తిరిగి తీసేసుకుంటున్నారు.. గ్రామకంఠాల ముసుగులో రాజధాని గ్రామాల్లో సాగుతున్న భారీ భూకుంభకోణం ఇది...దీని గురించి తెలియని స్థానికులు గ్రామ కంఠాలను పంచిపెట్టాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఒక పథకం ప్రకారం సాగుతున్న ఈ అక్రమాల బాగోతానికి సంబంధించి సాక్షి పక్కా ఆధారాలు సంపాదించింది. ఆ వివరాలు.... పూలింగ్ నుంచి గ్రామకంఠాలకు మినహాయింపు రాజధాని అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో సుమారు 54వేల ఎకరాలను సమీకరించాలని తలపెట్టింది. అందులో ఇప్పటి వరకు 32వేల ఎకరాలను భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. భూములు ఇవ్వటానికి ఇష్టపడని వారిని భయపెట్టారు. పచ్చని పంటలకు నిప్పుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. తిరిగి రైతులపైనే అక్రమ కేసులు బనాయించి భూములు లాక్కున్నారు. అదే సమయంలో స్థానికులంతా ‘గ్రామ కంఠాల’ విషయం తేల్చాలని పట్టుబట్టారు. దాంతో పూలింగ్ నుంచి గ్రామకంఠాలను మినహాయించారు. ప్లాట్లు కేటాయించక ముందే గ్రామ కంఠాల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు హామీ ఇచ్చారు. తమ్ముళ్లకు బహుమతిగా గ్రామ కంఠాలు ప్లాట్ల కేటాయింపునకు ముందే గ్రామ కంఠాల సంగతి తేల్చేస్తారని, అనుభవంలో ఉన్న వారికే వాటిని కట్టబెడతారని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘పెద్దలు’ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు సమయంలో స్థానికులు గ్రామ కంఠాల సమస్యలను పరిష్కరించకుండా పంపిణీ ఏమిటని ప్రశ్నించినా పట్టించుకోలేదు. ఆ సమయంలో గ్రామ కంఠాల గురించి ప్రశ్నించిన వారిని పోలీసుల చేత బయటకు గెంటివేయించారు. రాజధానిలో 27 గ్రామాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయినా ఒక్క గ్రామంలోనూ గ్రామ కంఠాలను స్థానికులకు కేటాయించలేదు. రాజధాని నిర్మాణం కోసం స్థానికులను భయపెట్టి, ఒప్పించి భూములు ఇప్పించేందుకు కృషి చేసిన స్థానిక టీడీపీ నాయకులకు ఈ గ్రామ కంఠాల భూములను బహుమతిగా కట్టబెడుతున్నారు. 50 సెంట్లు, ఆ పైన ఉన్న విస్తీర్ణం మొత్తం స్థానికంగా ఉన్న తమ్ముళ్ల పరం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ విస్తీర్ణం పక్కన వారి పేర్లు నమోదు చేయడంలేదు. ఎవరెవరికి? ఎంతెంత? ఎక్కడ కేటాయించాలనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నట్లు సీఆర్డీఏలోని అధికారి ఒకరు వెల్లడించారు. (ఇది సీఆర్డీఏ తీసిన తుళ్లూరు గ్రామం గూగుల్ మ్యాప్. ఎర్రని వృత్తాకారంలో ఉన్న భూములన్నీ పట్టా భూములే. వీటన్నింటినీ మినహాయించిన, విస్తరించిన గ్రామ కంఠాలుగా మార్చి కట్టబెట్టారు) ‘విస్తరించిన గ్రామ కంఠం’ పేరుతో... గ్రామకంఠం భూములకు ఇచ్చిన మినహాయింపు ఎంతో ‘ముందుచూపు’తో ఇచ్చిందని ఇపుడు అర్ధమౌతున్నది. ఆ భూములను యధేచ్ఛగా తమ్ముళ్లు కైంకర్యం చేస్తున్నారు. అంతేకాదు ‘విస్తరించిన గ్రామకంఠం’ అనే నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన పట్టాభూములను ఈ విస్తరించిన గ్రామకంఠాల పేరుతో ‘పెద్దలు’ సూచించిన వారికి కేటాయిస్తున్నారు. రాజధానిలో ప్రధాన నగరమైన తుళ్లూరులో సర్వే నంబర్ 22/3లో 1.28 ఎకరాలను టీడీపీ నేత దామినేని శ్రీనివాసరావు సతీమణి కృష్ణవేణి పేరుతో విస్తరించిన గ్రామ కంఠం పేరుతో కేటాయించారు. ఇదే భూమిని గతంలో రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌పూలింగ్‌కి ఇచ్చారు. ఈ భూమి కోసం రాజధాని ప్రకటించిన ప్రారంభంలోనే దామినేని నానా రభస చేశారు. ఆ భూమిలో పొగాకు బేరన్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. రాజధాని ప్రకటించాక ఆ భూమి మొత్తాన్ని గ్రామ కంఠంగా చేయాలని అధికారులపై తిరుగుబాటు చేశారు. ఒకానొక సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఆ సమయంలో సీఆర్డీఏ అధికారులు సగం భూమిని గ్రామ కంఠం మార్చి ఇస్తామని, మరో సగం భూమిని ల్యాండ్‌పూలింగ్‌కి తీసుకుంటామని చెప్పారు. సీఆర్డీఏ అధికారుల నిర్ణయం పై రాజధాని ప్రాంతంలోని మిగిలిన వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో ఆ భూమి మొత్తాన్ని ల్యాండ్‌పూలింగ్ కింద తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ వివాదం అంతటితో సద్దుమణిగింది. తాజాగా అదే భూమిని ‘పెద్దల’ ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ‘విస్తరించిన గ్రామ కంఠం’ పేరుతో కట్టబెట్టేశారు. అదే సర్వే నంబర్ 22/3, 4, 6, 7లో ఉన్న 2.22 ఎకరాలను సైతం జమ్ముల నగేష్, ఉమామహేశ్వరరావు తదితరులకు కేటాయించారు. తుళ్లూరులోనే సర్వే నంబర్ 23/సీ, 24/3లో ఎకరం పైగా భూమిని జమ్ముల శంకర్రావు, దామినేని శ్రీనివాసరావుకు రాసిచ్చారు. విలువైన భూములన్నీ తమ్ముళ్ల సొంతం సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం గ్రామంలో సర్వే నంబర్ 155లో 1.56 ఎకరాలు రెవిన్యూ అడంగల్‌లో సుబ్బారావు పేరున ఉంది. ప్రస్తుతం అదే భూమిని విస్తరించిన గ్రామం కంఠం పేరుతో విడిచిపెట్టారు. అదే విధంగా సర్వే నంబర్ 325లో 3 ఎకరాలు, సర్వేనంబర్ 271లో 1.18 ఎకరాలు, సర్వేనంబర్ 281లో 1.26 ఎకరాలు విస్తరించిన గ్రామ కంఠం పేరుతో టీడీపీ నేతలకు కేటాయించారు. వెలగపూడిలో సర్వే నంబర్ 92లో ఉన్న 1.19 ఎకరాలు, 92–బీ2లోని 1.12 ఎకరాలు, సర్వే నంబర్ 177లోని 1.10 ఎకరాలను విస్తరించిన గ్రామ కంఠం కింద రికార్డుల్లో నమోదు చేశారు. ఈ సర్వే నంబర్ల ఎదురుగా ఇంకా ఎవరి పేర్లు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటపాలెంలో సర్వే నంబర్ 133/2, 140/1, 147/2, 117/1ఏ, 1బీ, 1సీ, 118/3తో పాటు పలు సర్వే నంబర్లలోని పట్టా భూములను విస్తరించిన గ్రామ కంఠాల పేరుతో టీడీపీ నాయకులకు కేటాయించారు. ఒక్క వెంకటపాలెం గ్రామంలో ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చిన సుమారు 20 ఎకరాల పట్టా భూములు టీడీపీ ముఖ్యనేతలకు విస్తరించిన గ్రామ కంఠాల పేరుతో కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేశారు. రాజధానిలో మిగిలిన గ్రామాల్లో సైతం ఇదే తరహాలో పట్టా భూములను గ్రామ కంఠాల పేరుతో ఆక్రమించుకుంటున్నారు. ఇలా రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో ఊరికి దూరంగా ఉన్న పట్టా భూములను స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ 30 సెంట్ల నుంచి ఎకరం, రెండు, మూడెకరాల చొప్పున పంచిపెడుతుండటం గమనార్హం. -
గ్రీన్ గన్!
- ‘గ్రీన్ బెల్ట్’ పేరుతో సర్కారు బెదిరింపులు - భూములు ఇవ్వనివారికి నష్టం కలిగించేలా నిర్ణయం - గ్రీన్ బెల్ట్ ప్రకటిస్తే అభివృద్ధికి విఘాతం - భూములు ఇచ్చినవారిపైనా తీవ్ర ప్రభావం - సీఎం ప్రకటనపై రాజధాని రైతుల ఆగ్రహం సర్కారు భూ దాహం తారస్థాయికి చేరింది. తనను నమ్మి రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని గొప్పగా చెబుతున్న సీఎం చంద్రబాబు... తనను నమ్మని వారి భూములను గుంజుకునేందుకు ‘గ్రీన్’ గన్ ఎక్కు పెట్టారు. ల్యాండ్ పూలింగ్, సమీకరణకు భూములు ఇవ్వని ప్రాంతాల్లో ‘గ్రీన్ బెల్ట్’ ప్రకటిస్తామని బెదిరిస్తు న్నారు. ఈ విధంగా చేస్తే రాజధాని పరిధిలో అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తద్వారా సీఎం ‘గ్రీన్’ గన్ తూటాకు ఆయన్ను నమ్మి భూములు ఇచ్చినవారు.. పెట్టుబడి పెట్టినవారు బలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరి పరిస్థితి ‘ఇంటి కూటికి.. బంతి కూటికి చెడిన’ చందంగా మారుతుందని చెబుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి ఇవ్వని భూములను గ్రీన్‌బెల్ట్ కింద పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం ఇందుకు నిదర్శనం. సీఎం ప్రకటనపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం భూములు ఇవ్వనందుకే కక్షగట్టి... భవిష్యత్‌లో ఆ రైతులు ఆర్థికంగా ఎదగకూడదనే ఉద్దేశంతో సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు గ్రీన్‌బెల్ట్ సాధ్యాసాధ్యాలపైనా రాజధానిలో చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తే ఇప్పటికీ భూములు ఇవ్వకుండా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పెద్దగా నష్టం ఉండదని, ఎప్పటికీ సాగు చేసుకుని సంతోషంగా జీవిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చినవారి పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రైతులను భయపెట్టాలని... గ్రీన్‌బెల్ట్ ప్రకటన సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం సమావేశంలో తొలుత చర్చ సాగినట్లు సమాచారం. నిబంధలను తరువాత చూసుకోవచ్చు.. ముందు ప్రకటిస్తే.. భయపడి రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొస్తారని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆ భూములను గ్రీన్‌బెల్ట్ కింద చూపిస్తామని ప్రకటించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే గ్రీన్‌బెల్ట్ కింద ప్రకటిస్తే ప్రభుత్వం మరోసారి కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీఆర్డీఏ యాక్ట్–7లో సెక్షన్ 41 ప్రకారం మాస్టర్ ప్లాన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏరియా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్‌ను మార్చుకునే అధికారాలు ఉన్నాయి. అయితే అలా మార్చుకోవాలంటే స్థానిక సంస్థలు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజాభిప్రాయ వెల్లడికి కొంత సమయం ఇవ్వాలి. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఆ వివరాలన్నింటినీ గెజిట్‌లో పెట్టి అందరికీ తెలియజేయాలి. ఆ తరువాతే గ్రీన్‌బెల్ట్ ప్రాంతంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేయడం పాలకులకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అయితే ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామ పంచాయతీలు భూములు ఇవ్వబోమని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఆ తీర్మాన కాపీలను కూడా సీఆర్డీఏకు అందజేశాయి. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్ కింద ప్రకటించే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. గ్రీన్ బెల్ట్ వల్ల ఇవీ సమస్యలు.. ► ప్రభుత్వం అడ్డగోలుగా తమకు భూ ములు ఇవ్వని పొలాలను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ► గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించిన భూములలో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి. ► గ్రీన్‌బెల్ట్‌కు పరిసర ప్రాంతాల్లో పర్యావరణానికి హాని కలిగే పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదు. ► రాజధాని పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇద్దరు రైతులకు చెందిన భూములు ఒకే సర్వే నంబర్లో ఉంటాయి. అందులో ఓ రైతు తన భూమిని ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చినా.. మరోరైతు భూమి ఇవ్వకుండా సాగు చేసుకుంటున్నారు.పూలింగ్‌లో ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఏదో ఒక సంస్థకు కేటాయిస్తుంది. పూలింగ్‌కు ఇవ్వని పొలాన్ని గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తామని బెదిరిస్తోంది. ఇలా చేస్తే పలు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో అభివృద్ధికి అవకాశం ఉండదు. ► సమీపంలో గ్రీన్‌బెల్ట్ ఉండడం వల్ల పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం ఉండదు. గ్రీన్‌బెల్ట్ అనేది సదుద్దేశంతో ఏర్పాటు చేయాల్సినదని, బెదిరింపులకు వాడుకునే ఆయుధం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దూకుడు పెంచిన సర్కారు రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా బలవంతంగా వ్యవసాయ భూములను లాక్కున్న విషయం తెలిసిందే. వ్యవసాయమే జీవనా«ధారంగా బతికే అనేక మంది రైతులు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో టీడీపీ పెద్దలు రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆ భూములన్నీ సేకరణ ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అంతటితో ఆగని ప్రభుత్వ పెద్దలు ఆ భూములను ఎలాగైనా లాక్కునేందుకు దూకుడు పెంచారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతుల గురించి సుధీర్ఘంగా చర్చించారు. ఆ రైతులు భూములు ఇవ్వని కారణంగా సీడ్‌యాక్సెస్ రోడ్డు పనులు పూర్తి చేయలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే విధంగా అనేక ప్రాంతాల్లో భూములు ఇవ్వకపోవడంతో రాజధాని నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. -
‘రాజధానిలో ఇల్లు ఉండాలనే స్థలం కొన్నాం'
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ప్లాట్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రాజధానిలో ఇల్లు ఉండాలనే ఉద్ధేశంతోనే తాము స్థలం కొన్నామన్నారు. లాటరీలో ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని మంత్రి పల్లె పేర్కొన్నారు. కాగా మంత్రి కుమారుడు పల్లె వెంకటకృష్ణారెడ్డి పేరున నేలపాడు గ్రామంలో 2,520 చదరపు గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటు పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రభుత్వ షాపింగ్ క్లాంప్లెక్స్‌ల జోన్ ఉంది. అలాగే లాటరీ విధానంపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ లే అవుట్ ప్రకారం పెద్ద ప్లాట్లన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధానం అంతా పారదర్శకంగానే జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో అధికార టీడీపీ పెద్దలు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో భూములను కారు చౌకగా కొట్టేసి రైతులను నిలువునా ముంచిన టీడీపీ నేతలు.. ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం రూపంలో అతి విలువైన ప్లాట్లను కొట్టేసిన విషయం విదితమే. -
రాజధానిలో పచ్చనేతల చేతివాటం
మాదారి.. రహదారి రోడ్ల పక్కన ప్లాట్లను అక్రమంగా చేజిక్కించుకున్న టీడీపీ పెద్దలు... ⇒ అమరావతిలో ముఖ్యమైన వాణిజ్య, నివాస ప్లాట్లన్నీ ముందుగానే బ్లాక్ ⇒ రహదారుల పక్కన, కార్నర్లో, పార్కులు, ఖాళీ స్థలాలున్న చోట ప్లాట్లు కొట్టేసిన వైనం ⇒ ఆపై ఆన్లైన్లో పెట్టి.. ఊరికి దూరంగా సామాన్య రైతులకు కేటాయింపు ⇒ ఇదేంటని ప్రశ్నిస్తే.. అదంతా ఆన్లైన్ కేటాయింపులంటూ దాటవేత ⇒ రాజధాని రైతులను అడుగడుగునా దగా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ⇒ ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసిన మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో అధికార టీడీపీ పెద్దలు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్నారు. ఆ ప్రాంతంలో భూములను కారు చౌకగా కొట్టేసి రైతులను నిలువునా ముంచిన టీడీపీ నేతలు.. ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం రూపంలో అతి విలువైన ప్లాట్లను కొట్టేశారు. ఆన్లైన్ లాటరీ అంటూ ఎవరికీ అనుమానం రాకుండా, కావాల్సిన చోట.. కోరుకున్న ప్లాట్లను దక్కించుకున్నారు. రాజధాని కోసం భూములు వదులుకున్న సామాన్య రైతులకు మాత్రం ఊరికి దూరంగా.. వాస్తులోపం ఉన్న ప్లాట్లు ఎక్కడ పడితే అక్కడ కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ప్లాట్లు కేటాయించారేంటని రైతులు ప్రశ్నిస్తే... అదంతా తమ చేతుల్లో పనికాదని, ఆన్లైన్ ద్వారా చేసిందని చిలక పలుకులు పలుకుతున్నారు. రాజధాని పేరుతో అధికార పార్టీ నేతల హైటెక్ మోసాన్ని ‘సాక్షి’ పక్కా ఆధారాలతో పట్టుకుంది. అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన ప్లాట్ల కుంభకోణం వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాలను ఎంపిక చేసింది. ఆ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో కొందరు రైతులను భయపెట్టి, మరి కొందరికి రకరకాల హామీలు ఇచ్చి బలవంతంగా లాక్కుంది. భూములు లాక్కునే సమయంలో రైతులకు కోరుకున్న చోట, కోరిన విధంగా ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇలా సమీకరించిన భూముల్లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు.. రైతులను మోసం చేసి కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన యజమానులకు ప్రభుత్వం పరిహారం కింద ఏటా కౌలు చెల్లించటంతో పాటు భూములు వదులుకున్న ప్రాంతంలోనే నివాస యోగ్యమైన, వాణిజ్య అవసరాల కోసం ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎకరం జరీబు భూమిని తీసుకుంటే 1450 చదరపు గజాల ప్లాటు కేటాయించారు. ఇందులో 1200 చదరపు గజాల్లో నివాసం, 250 చదరపు గజాల్లో వాణిజ్య ప్లాటు ఉంటుంది. ఎకరం మెట్ట భూమి ఇచ్చిన వారికి 1200 చదరపు గజాలు ఇచ్చారు. ఇందులో 1000 చదరపు గజాల్లో నివాసం, 200 చదరపు గజాల్లో వాణిజ్య ప్లాటు కేటాయించారు. ఈ కేటాయింపు ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లాటరీ విధానంలో చేపట్టారు. చీటీల పద్ధతిన ప్లాట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేసినా, ఆన్లైన్ ద్వారా అయితే మోసం జరగదని రైతులను నమ్మించారు. ప్లాట్లు కేటాయించక ముందే టీడీపీ పెద్దలు ఆన్లైన్లో వారు కోరుకున్న చోట, కోరిన ప్లాట్లను బ్లాక్ చేయించుకున్నారు. మిగిలిన ప్లాట్లను మాత్రమే ఆన్లైన్లో పెట్టి ప్లాట్లు కేటాయించారు. పెద్దోళ్లకు పెద్ద పీట రాజధానిలో భూములు వదులుకున్న వారందరికీ సీఆర్డీఏ 2016 జూన్ 25న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నేటి వరకు 27 గ్రామాల వారికి ప్లాట్లు కేటాయించారు. పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్లాట్ల కేటాయింపుపై ఎక్కడికక్కడ స్థానికులు అభ్యంతరం చెబుతూ వచ్చారు. ఊరికి దూరంగా.. పక్క గ్రామం పొలిమేరల్లో కేటాయించారని కొందరు, కాలువ గట్టుపై, వాస్తు సరిగా లేని ప్లాట్లు కట్టబెట్టారని మరి కొందరు అభ్యంతరాలు తెలియజేశారు. వీటిని సీఆర్డీఏ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. వాస్తవంగా ఆయా గ్రామాల్లో విలువైన ప్లాట్లన్నీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, «ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్.ఆంజనేయులు, పయ్యావుల కేశవ్ తదితరులు తమ బంధువులు, అనుచరుల పేర్లతో కొనుగోలు చేసిన భూములకు పరిహారం కింద దక్కించుకున్నారు. వీరు దక్కించుకున్న ప్లాట్లన్నీ అత్యంత విలువైనవి కావటం గమనార్హం. ప్రతి ప్లాటుకు ఇరువైపులా రహదారులు ఉన్నవే. కొన్ని ప్లాట్ల ముందు, వెనుక పార్క్‌లు ఉంటే, మరి కొన్ని ప్లాట్ల ముందు, పక్కన ఖాళీ స్థలాలు ఉన్న వాటినే కొట్టేశారు. ఇందులో చాలా వరకు కార్నర్ ప్లాట్లు కావడం గమనార్హం. ఆన్లైన్లో ఇదెలా సాధ్యం? ఏపీ సచివాలయానికి అతి సమీపంలోని వెలగపూడిలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పీఏ బంధువుల పేరున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములకు పరిహారం కింద వెలగపూడిలో నాలుగు విలువైన ప్లాట్లు దక్కించుకున్నారు. అందులో లలితకుమారి పేరున 352 కాలనీ, బ్లాక్ నంబర్ 2556లో 2,280 చదరపు గజాల వాణిజ్య ప్లాటు ఉంది. ఈ ప్లాటుకు తూర్పు వైపున సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండటం గమనార్హం. అదే విధంగా మరో నాలుగు ప్లాట్లు ఇదే వెలగపూడిలోనే ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో కీలక పాత్రధారి, సూత్రధారి అయిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. బంధువులు, సన్నిహితులైన రాపూరు సాంబశివరావు, ఆవులు మునిశంకర్, పోతూరి పరిమళ, వరుణ్‌కుమార్ కొత్తప పేర్లతో రాజధాని గ్రామాలైన మందడం, లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములకు సంబంధించి కేటాయించుకున్న ప్లాట్లను పరిశీలిస్తే.. ఆన్లైన్ లాటరీ విధానంలో ఇది సాధ్యమేనా? అనే అనుమానాలు రాక మానవు. సచివాలయానికి ముందు గ్రామమైన మందడంలో 25 వేల చదరపు గజాల ఒకటే ప్లాటును దక్కించుకున్నారు. తూర్పు, ఉత్తరం, దక్షిణం 100 అడుగుల రహదారి ఉంది. కమర్షియల్ జోన్‌కు అతి సమీపంలో... రెండవ యాక్సెస్ రహదారికి మధ్యలో కార్నర్ ప్లాటు కావడం గమనార్హం. అదే గ్రామంలో 6,750, 2,190 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి. లింగాయపాలెంలో 8,880, 4,000 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లు, రాయపూడిలో 7,625, 3,750 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో 3,450 చదరపు గజాల ప్లాటు, 930 చదరపు గజాల ప్లాటు ఉన్నాయి. కొండమరాజు పాలెంలో 2,910, 720 చదరపు గజాల ప్లాట్లు దక్కించుకున్నారు. వీటిలో ఎక్కువ ప్లాట్లకు ఇరువైపులా రహదారులు ఉన్నాయి. మరి కొన్ని మూడు వైపులా రహదారులున్న కార్నర్ ప్లాట్లు కావటం గమనార్హం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణారెడ్డి పేరున నేలపాడు గ్రామంలో 2,520 చదరపు గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటు పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రభుత్వ షాపింగ్ క్లాంప్లెక్స్‌ల జోన్ ఉంది. అగ్ర భాగంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు రాజధాని పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్.ఆంజనేయులు.. భార్య గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య, కొత్తా వెంకట ఆంజనేయులు, కొత్తా శివరామకృష్ణ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వెలగపూడి, మందడం, నేలపాడు, కృష్ణాయిపాలెం, ఐనవోలు, కొండమరాజుపాలెంలో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి కేటాయించిన ప్లాట్లన్నీ కూడా విలువైనవే. అన్ని ప్లాట్లకు ఇరువైపులా 100, 200 అడుగుల రహదారులు, కమర్షియల్ జోన్, పార్కులు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఒక్క మందడం గ్రామంలోనే ఐదు ప్లాట్లు ఉంటే, మిగిలిన ఐనవోలు, వెలగపూడి, కృష్ణాయిపాలెం, నేలపాడులో ఉన్న మరో 8 ప్లాట్లు కూడా అత్యంత విలువైనవి కావటం గమనార్హం. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఇద్దరూ కలసి కొండమరాజుపాలెంలో 12 వేల చదరపు గజాల ఒక ప్లాటు, 3 వేల చదరపు గజాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. 12 వేల చదరపు గజాల ప్లాటుకు నాలుగు వైపులా రహదారులు ఉన్నాయి. ఇది అతిపెద్ద పార్క్, కమర్షియల్ జోన్లకు మధ్యలో ఉంది. మరో ప్లాటుకు ఇరువైపుల రహదారులు ఉన్నాయి. -
ఎయిర్‌పోర్టుకు శరవేగంగా భూసేకరణ
► వచ్చే నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో సర్వే ► ఇంకా సేకరించాల్సినది 345ఎకరాలు మాత్రమే ► పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న రెవెన్యూ అధికారులు భోగాపురం : గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు దాదా పు భూములు సిద్ధమయ్యాయి. సర్వే పనుల్లో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చినెలలో పూర్తి స్థాయిలో భూసేకరణ చేసేందుకు అవసరమైన పనులు ముమ్మరం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తుది నోటిఫికేషన్ ప్రకారం 2545 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఒప్పటికి 2200 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా సేకరించాల్సింది కేవలం 345ఎకరాలే. దానికి సంబంధించిన రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కావాలని కోరుతూ హైకోర్టులో స్టే తెచ్చుకోవడంవల్ల ఈ జాప్యం ఏర్పడింది, అయితే వారిని కూడా అంగీకరింపజేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. చేతులు మారిన డి–పట్టా భూముల స్వాధీనం: ఎయిర్‌పోర్టు ప్లానులో గతంలో ఇచ్చిన డి–పట్టాభూములు ఎక్కువగా చేతులు మారిన విషయాన్ని రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ప్లానులో ఇలా 215 ఎకరాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. దానిలో 175ఎకరాలకు సంబంధించిన రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు 3నెలల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా ఆర్డీఓ ఎదుట అప్పీలు చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకూ 50ఎకరాలకు సంబంధించిన రైతులు అప్పీలు చేసుకున్నారు. ఇంకా 40 ఎకరాలకు సంబంధించి నోటీసులు ఇవ్వాల్సి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కవులవాడ రెవెన్యూలో 120 ఎకరాలు, కంచేరు రెవెన్యూలో 8, గూడెపువలస రెవెన్యూలో 50, రావాడ రెవెన్యూలో 30 ఎకరాలు డి పట్టా భూములు చేతులు మారాయని తహసీల్దారు అధికారికంగా తెలిపా రు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. పునరావాస స్థల అభివృద్ధి బాధ్యత వుడాకు: ఎయిర్‌పోర్టు ప్లానులో మరడపాలెం, బొల్లింకలపాలెం, రెల్లిపేట, ముడసర్లపేట గ్రామాలను తరలించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో 376 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. వీరందరికీ చెరుకుపల్లి వద్ద నివాస యోగ్యమైన స్థలాన్ని అధికారులు గుర్తించి దానిని అభివృద్ధి చేసే బాధ్యత వుడాకు అప్పగించారు. త్వరలో పునరావాస పనులను చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆక్రమిత భూముల సర్వే: ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూముల్లో డి పట్టాలు లేకుండా సాగుచేస్తున్న భూమి 40 ఎకరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ భూముల్ని ఎవరు సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా పక్కాగా సర్వే చేపట్టే పనిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే తహసీల్దారు డి.లక్ష్మారెడ్డి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు తలొంచినా వారిపై వేటు తప్పదని గట్టిగా హెచ్చరించారు. -
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి ఏపీ రాజధాని రైతులకు మినహాయింపు
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు పరిహారం కింద సీఆర్డీఏ ఇచ్చే స్థలాలను (ప్లాట్లను) విక్రయించగా వచ్చే సొమ్ముకు క్యాపిటల్ గెయిన్స్ (మూలధన) పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. 2014 జూన్ 2నాటికి భూములు కలిగి ఉన్నవారికే ఈ ప్రయోజనం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే దీనితో రైతులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆదాయ పన్ను నిపుణులంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి భారీ ప్రయోజనమంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సాగు భూముల అమ్మకపు మొత్తానికి క్యాపిటల్ గెయిన్స్ పన్నుండదు. వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించడం వల్ల ఇప్పుడు పన్ను పడుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం భూమి ఇచ్చినందున కేంద్రం మినహాయింపు ఇచ్చినా, దీనివల్ల రైతులకు లాభముండదు. ఎందుకంటే వారు ఎకరా భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే సీఆర్డీఏ 800–1,450 గజాల చొప్పున ప్లాట్లిచ్చింది. ఇప్పుడు ఎకరా భూమిని అమ్మితే వచ్చే ఆదాయం కంటే సీఆర్డీఏ ఇచ్చిన ప్లాట్లు విక్రయిస్తే ఎక్కువేమీ రాదు. -
వుడా గడబిడ!
విశాఖపట్నం : దాదాపు పదేళ్ల క్రితం పరదేశిపాలెంలో ల్యాండ్ పూలింగ్ చేపట్టినప్పుడు భారీ కుంభకోణం చోటు చేసుకుంది. అప్పట్లో వుడాలో పనిచేసిన జగదీష్ అనే అధికారి సూత్రధారిగా ఆయన బినామీలు, కొంతమంది ఉద్యోగులు, మరికొందరు ఉన్నత స్థానంలో ఉన్న వారితో పాటు వ్యాపారులు కలిసి అక్రమాలు, అవకతవకలకు తెరలేపారు. పరదేశిపాలెం, కొమ్మాది, మధురవాడ, రుషికొండ తదితర ప్రాంతాల్లోని అసైన్డ్ భూములను గుర్తించి ల్యాండ్ పూలింగ్‌లో సేకరించేందుకు పథకం పన్నారు. సంబంధిత రైతుల నుంచి డి–ఫారం పట్టా భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి బినామీల పేరిట జీపీఏ (జనరల్ పవరాఫ్ అటార్నీ) రాయించుకున్నారు. ఈ జీపీఏలతో ఆ భూములను వుడాకు అమ్మకాలు చేసి కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. ఈ వ్యవహారంలో దాదాపు రూ.500 కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పెను దుమారం రేపిన ఈ వ్యవహారంపై అప్పట్లో అరెస్టులు, సీఐడీ దర్యాప్తులు నడిచాయి. ఇంకా దానిపై కేసులు నడుస్తున్నాయి. బినామీల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. పదేళ్ల తర్వాత వుడా మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమయింది. సేకరించిన భూమిని అభివృద్ధి చేయడం ద్వారా వుడా నిధులు సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. గత నవంబర్‌లో జారీ అయిన జీవోతో ల్యాండ్ పూలింగ్‌కు వుడా అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల బంధువులు, అనుచరులు, దళారులు రంగంలోకి దిగి అసైన్డ్ భూములను దక్కించుకునే పనిలో పడ్డారు. ఈ భూముల యజమానుల నుంచి తీసుకునే భూమికి కొంత అడ్వాన్సుగా ఇచ్చి వాటిని తమ పేరిట మార్చుకోవడం ప్రారంభించారు. పదేళ్ల క్రితం మాదిరిగానే రూ.కోట్లు కొల్లగొట్టేయాలన్న పథకం బట్టబయలయింది. ఈ వ్యవహారంలో వుడాలో కొంతమంది అధికారుల పాత్రపైనా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వుడా ల్యాండ్ పూలింగ్‌లో జరుగుతున్న అక్రమాలను సాక్షి దినపత్రికలో కళ్లకు కట్టినట్టు ప్రచురితమవడంతో ఒక్కసారిగా ఇటు అధికార పార్టీలోనూ, అటు వుడా వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేగుతోంది. గతంలో పరదేశిపాలెం ల్యాండ్ పూలింగ్ కుంభకోణం నుంచి గుణపాఠం నేర్చుకోని వుడా అధికారులు మళ్లీ అక్రమాలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో తమ పాత్రేమీ లేదని, ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని వుడా అధికారులు చెబుతున్నా తెర వెనక కొంతమంది ముదిరిపోయిన అధికారులు ఇందులో తెరవెనక పాత్ర పోషిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ల్యాండ్‌పూలింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ వరకు వెళ్లివచ్చిన అధికారే ఇప్పటికీ అదే స్థానంలో పదిలంగా ఉండటం వీరి వాదనకు బలం చేకూరుతోంది. ల్యాండ్ పూలింగ్‌లో సుమారు రెండు వేల ఎకరాలను సేకరించాలన్న లక్ష్యంగా పెట్టుకున్న వుడాకు ఆ దిశగా పయనిస్తున్న తరుణంలో ఆదిలోనే హంసపాదులా తాజా వివాదం అడ్డుకట్ట వేసింది. అవినీతి, అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ ఎంతవరకు ముందుకెళ్తుందో? తమ ప్రమేయం ఎక్కడ బయటకు వస్తుందోనని ఇందులో పాత్ర పోషిస్తున్న అధికారుల్లో అలజడి రేగుతోంది. -
సాక్షి ఎఫెక్ట్ : ల్యాండ్ పూలింగ్‌కు బ్రేక్!
-
ల్యాండ్ పూలింగ్‌కు బ్రేక్!
వివాదాస్పద గ్రామాల్లో ప్రక్రియ నిలుపుదల పునర్విచారణ చేయిస్తామన్న వుడా వీసీ విచారణకు సిద్ధమన్న మంత్రి గంటా సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రూ. వందల కోట్ల విలువైన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా అక్రమంగా కొట్టేయాలనుకున్న ఓ మంత్రి, అధికార పార్టీ నాయకుల పన్నాగానికి బ్రేకు పడింది. వివాదాస్పద గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటివరకు సేకరించిన భూములపై పునర్విచారణకు వుడా అంగీకరించింది. ‘విశాఖ శివారు భూముల్లో సర్కారీ దోపిడీ.. రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఓ మంత్రి వ్యూహం’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) వర్గాల్లో కలకలం రేపింది. వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావునాయుడు మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లా డుతూ.. ‘సాక్షి’లో వచ్చిన కథనం నేపథ్యంలో పెందుర్తి మండలం ముదపాక సహా భీమిలి నియోజకవర్గంలోని ఇతర వివాదాస్పద గ్రామా ల్లో ల్యాండ్ పూలింగ్ను తాత్కాలికంగా నిలుపు దల చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు సేకరించిన భూములపై పునర్విచారణ జరిపిస్తా మని, మీడియా సమక్షంలోనే గ్రామసభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అక్కడ నుంచి వచ్చే తదుపరి ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ శివారులోని 15 గ్రామా ల్లో వుడా చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఇప్పటివరకు 3 (సౌభాగ్యరాయపురం, దబ్బంద, కొమ్మాది) గ్రామాలకు సంబంధించిన భూముల వివరాలే కలెక్టర్‌కు నివేదించామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో సంబంధిత అసైన్డ్ భూముల రైతులు.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూముల పరిహారాన్ని నేరుగా రైతులకే చెల్లిస్తామన్నారు. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇతరత్రా ఇచ్చే ప్రయోజనాలన్నీ భూ యజమానులకే తప్ప ఇతరులకు ఇవ్వబోమని స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా.. ‘సాక్షి’లో కథనం చూసిన వెంటనే మంత్రి అనుచరులు ఆయా ఊళ్లపై పడిపో యారు. స్వచ్ఛందంగా భూములను అప్పగించా మని చెప్పాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చారు. విచారణకు ఆదేశించాం: మంత్రి గంటా ల్యాండ్ పూలింగ్ అక్రమాలు జరిగాయనే విషయమై విచారణకు సిద్ధమేనని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సాక్షిలో వచ్చిన కథనంపై మంత్రి స్పందిస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్లో మంగళ వారం మీడియాతో మాట్లాడారు. ‘వుడా ల్యాండ్ ఫూలింగ్‌లో జరుగుతున్న అవినీతి, అవకతవక లపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తున్నాను. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. తప్పు చేస్తే ఎవరినైనా ప్రభుత్వం వదిలిపెట్టదు’ అని పేర్కొన్నారు. ఓ మంత్రి హస్తం ఉందన్న విషయమై.. ‘ఎవరైనా సరే విచారణలోనే అన్నీ తేలుతాయి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు సర్కార్‌పై జనం మండిపాటు
-
చంద్రబాబు మా భూములు లాక్కుంటున్నాడు
-
ఏపీ రాజధానిలో పచ్చని గ్రామాలు గుల్ల
-
ల్యాండ్ పూలింగ్‌లో రూ.కోట్ల అక్రమాలు
సీతంపేట (విశాఖ): విశాఖ జిల్లాలో అనందపురం, భీమిలి మండలాల్లో ఉడా సేకరించిన ల్యాండ్‌పూలింగ్ వ్యవహారంలో రూ.600 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పత్రికల్లో అనేక కథనాలొచ్చాయని, దీనిపై లోక్‌సత్తా పార్టీ కీలక అంశాలను పరిశీలించి అక్రమాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చిందన్నారు. సీఎం బాబు తక్షణమే ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పూలింగ్ అక్రమాల వల్ల పెద్ద ఎత్తున పేద రైతులు నష్టపోతారన్నారు. పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం, ఆనందపురం మండలం దబ్బంద, గండిగుండం, కొమ్మాది, భీమిలి మండలంలో నేరెâýæ్ళవలస గ్రామాల్లో కొన్ని నెలలుగా రాజకీయ దళారీలు పక్కా ప్రణాళికలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఉన్నట్టు స్పష్టమైందని తెలిపారు. తొలిదశలో ఉడా సేకరించిన 359 ఎకరాలు, రెండో దశలో 183 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ల్యాండ్‌పూలింగ్ కోసం మూడు జీవోలు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. భూమి సేకరించనున్న రైతుల పేర్లు, సర్వే నంబర్లతో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.ఎస్.ఎ¯ŒS.మూర్తి, వడ్డిహరి గణేష్, చంద్రమౌళి, చిరంజీవి, హర్ష, పక్కి శంకర్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ, లెఫ్ట్ ఉమ్మడి పోరుబాట!
సాక్షి, అమరావతి బ్యూరో: బందరుపోర్టు నిర్మాణం ముసుగులో ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల కడుపు కొట్టి సాగు భూములు లాగేసుకుంటున్న సీఎం చంద్రబాబు వైఖరికి నిరసనగా ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటానికి వామపక్ష పార్టీలనేతలు జతకలిశారు. కృష్ణా జిల్లాలోని మచిలిపట్నం మండలం బుద్దాలపాలెం, కోన గ్రామాల్లో గురువారం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు మోదుమోడి రామారావు, సీపీఎం మచిలీపట్నం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మలు పాల్గొన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైఎస్సార్సీపీ, వామపక్షాలు జెండాలు పక్కన పెట్టి సమైక్యంగా పోరాటాలకు కలసిరావడంపై ప్రజల్లోనూ, పోర్టు బాధిత రైతాంగంలోనూ హర్షం వ్యక్తమౌతోంది. -
‘ఫార్మాసిటీ భూసేకరణను అడ్డుకోవద్దు’
కడ్తాల్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం జరుగుతున్న భూసేకరణ సర్వేకు రైతులు సహకరించాలని, మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ సూచించారు. కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి, గానుగుమార్ల తండా, పోచమ్మగడ్డ తండా, పుల్లేరుబోడ్, జమ్ములాబావి తండా రైతులు భూసేకరణ సర్వేను అడ్డుకోవడంతో గురువారం వారితో జేసీ మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకునే హక్కు రైతులకు లేదని, అయితే రైతుల అంగీకారం లేకుండా ఆ భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. పట్టా భూముల జోలికి తాము వెళ్లడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం భూముల ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే భూసేకరణ సర్వే జరుపాలని డిమాండ్ చేశారు. -
లింగాయపాలెంలో ఉద్యాన పంటల సాగు
తుళ్లూరు: మండలంలోని లింగాయపాలెంలో ఉద్యాన , కూరగాయల పంటలు సాగవుతున్నాయి. ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతులు తమ పొలాలను సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది గతంలో మాదిరిగానే 365 రోజులు తమ పొలాల్లో పంటలు సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. పూలింగ్ భూములు ఇవ్వనందుకు ఏమాత్రం బాధపడటం లేదని, తమకు వ్యవసాయమే ముఖ్యమని రైతులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఈ రోజు వరకూ తమకు కలగకపోవడం వల్లే తాము ప్రభుత్వానికి భూములు ఇవ్వలేక పోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రీన్ ట్రిబ్యునల్‌లో నడుస్తున్న కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
'3 నెలల్లో భూ సమీకరణ పూర్తిచేస్తాం'
మచిలీపట్నం: పోర్టులు, టూరిజం ద్వారానే సింగపూర్ అభివృద్ధి చెందిందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయాన్ని శనివారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి తరహాలోనే మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభించిన రోజే భూసమీకరణ 1370 ఎకరాలను రైతులను ప్రభుత్వానికి అప్పగించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 14 పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. మొదటి ప్రాధాన్యత మచిలీపట్నం పోర్టుకు ఇస్తున్నారన్నారు. సింగపూర్ 720 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉందన్నారు. పోర్టుల ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేస్తూ అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిందన్నారు. జపాన్ జనభా 13 కోట్లు ఉండగా అక్కడ 1020 పోర్టులు ఉన్నాయన్నారు. వీటిలో 106 మేజర్ పోర్టులు, 22 స్పెషల్ మేజర్ పోర్టులు, చైనాలో 2వేల పోర్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణంతోనే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పట్టిసీమను నిర్మిస్తుంటే కొందరు అడ్డుకున్నారని, పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణ చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అడ్డుకుంటున్నారని అయినా పోర్టు నిర్మించి తీరుతామని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణాన్ని అడ్డుకోకుండా తమకు సహకరించాలని కోరారు. శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, ఎమ్మెల్సీ పీతా రవిచంద్ర, ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ వేగవంతం
రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే పనులు ముమ్మరం సుమోటోగా విరాసత్‌ల స్వీకరణ పౌరసరఫరాలపై సీసీ కెమెరాలతో నిఘా కేజీబీవీల్లో డిజిటల్ తరగతులు సామాజిక చైతన్యం కోసం కృషి మౌలిక సౌకర్యాల కల్పనకు కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం వివాహం అయ్యాక ఉద్యోగం వచ్చింది జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సిరిసిల్ల : జిల్లాలో వారసత్వపు భూముల పేరు మార్పిడి (విరాసత్)ను సుమోటగా స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని, రైల్వేలైన్ కోసం భూసేకరణను వేగవంతం చేస్తామని జిల్లా జారుుంట్ కలెక్టర్(జేసీ) షేక్ యూస్మిన్‌బాషా తెలిపారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తామన్నారు. జేసీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె శుక్రవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సర్వే పనులు ముమ్మరం.. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. సిద్దిపేట జిల్లా వరకు భూసేకరణ పూర్తరుుంది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో రైల్వేలైన్ నిర్మాణం కోసం జిల్లా పరిధిలో సర్వే, భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మధ్యమానేరు జలాశయం, సిరిసిల్ల ఔటర్ రింగురోడ్డు, వేములవాడ ఆలయ అభివృద్ధికి సైతం భూములు సేకరించాల్సి ఉంది. కలెక్టరేట్ కోసం.. కలెక్టరేట్ నిర్మాణం కోసం అనువైన స్థలం ఎంపిక చేస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సూచన మేరకు అన్ని హంగులతో భవనం నిర్మిస్తాం. ఇందుకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. మా ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణపై పరిశీలన చేస్తాం. సుమోటోగా విరాసత్‌లు.. తండ్రి, తల్లి పేరిట ఉన్న భూములను వారి వారసులు మార్పిడి చేసుకునే పనిని సుమోటగా స్వీకరించి ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. రికార్డులు లేకే చాలా సమస్యలు తలెత్తుతున్నారుు. ఈవిధానాన్ని సమూలంగా మార్చేందుకు క్షేత్రస్తాయిలోనే విరాసత్‌లు చేస్తాం. ఆన్‌లైన్‌లోనూ లోపాలు లేకుండా రికార్డులు సరిచేస్తాం. వీటితోపాటు 2016 పహణిలు మ్యాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలకు శిక్షణ.. జిల్లాలోని విలేజీ రెవెన్యూ అధికారుల(వీఆర్వోల)కు రెవెన్యూ రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇప్పిస్తాం. రిటైర్డు తహసీల్దార్లు, వీఆర్వోలతో మెలకువలు నేర్పించేందుకు కలెక్టర్ సూచనల ద్వారా చర్యలు తీసుకుంటాం. తద్వారా వారిలో వృత్తి నైపుణ్యం పెంచుతాం. పౌరసరఫరాలపై కెమెరాలతో నిఘా.. పౌరసరఫరాల గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సరుకులు పక్కదారి పట్టకుండా నిఘా పెంచుతాం. తూకంలో వ్యత్యాసం వస్తోందని ఫిర్యాదులు అందాయి. తూకం కచ్చితంగా వేసి రేషన్ డీలర్లు, పాఠశాలలు, వసతి గృహాలకు బియ్యం అందిస్తాం. ఇందుకోసం గోదాముల వద్దే వేరుుంగ్ మిషన్లు ఏర్పాటు చేస్తాం. ఆర్డీవో ద్వారా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను నియమిస్తాం. కేజీబీవీ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు.. జిల్లాలోని కేజీబీవీ స్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రవేశపెడుతాం. సీఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ కంపెనీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. సామాజిక అంశాలపై దృష్టిసారించి ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. మూస విధానంలో కాకుండా కొత్తతరహాలో పాలన అందిస్తాం వివాహమయ్యూక ఉద్యోగంలో చేరా.. మా సొంత ఊరు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మా నాన్న ఆర్మీలో పని చేయడంతో కేంద్రీయ విద్యాలయంలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదివా. మా ఆయన షేక్ ఇమామ్ హుస్సేన్ వ్యాపారం చేస్తారు. మాకు పాప, బాబు. వివాహం అయ్యాక నాకు ఉద్యోగం వచ్చింది. 2009లో గ్రూప్-1 ద్వారా డెప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరా. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఆర్డీవోగా, సంగారెడ్డిలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీస్‌గా పని చేశా. అక్కడి నుంచి జేసీగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వచ్చా. -
ఇరుపక్షాలు వ్యూహాత్మకంగా..
భూసమీకరణ ప్రక్రియపై ఉత్కంఠ భూమి సేకరిస్తామంటున్న పాలకపక్షం రైతుల తరుఫున పోరాటం చేస్తామంటున్న ప్రతిపక్షం మచిలీపట్నం : మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. పాలకపక్షం అధికారాన్ని ఉపయోగించి రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షాల నాయకులు భూపరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి రైతుల తరఫున పోరాటం చేస్తున్నారు. సెప్టెంబరు 19వ తేదీ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో 33,177 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అప్పటి నుంచి రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పోటా, పోటీగా సమావేశాలు.. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం సెప్టెంబరు 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల్లో ఆయా గ్రామాల రైతులు ఏకగ్రీవంగా భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని తీర్మానాలు చేసి ఎంఏడీఏ అధికారులకు అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ భూపరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూములు ఇస్తున్నట్లు ఫారం–3 అందజేస్తే రైతుల నుంచి ప్రభుత్వం భూమి గుంజేసుకుంటుందని మంగళగిరి ఎమ్మెల్యే రామకష్ణారెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, వామపక్షాల నాయకులు వివరించారు. సమావేశంలో రాజధాని ప్రాంతంలో రైతులు ప్రభుత్వంపై పోరాడి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఎలా కాపాడుకున్నారో మంగళగిరి నియోజకవర్గ రైతులతో అవగాహన కల్పించారు. న్యాయనిపుణులతో రైతులకు సలహాలు ఇప్పించారు. దీనికి ధీటుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో పాటు తుళ్లూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులను, రైతులను ఆదివారం మచిలీపట్నం తీసుకువచ్చి భూసమీకరణ ద్వారా రైతులకు చేకూరిన మేలును వివరించే ప్రయత్నం చేశారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం టీడీపీ నిర్వహించిన సమావేశంలో జరగలేదని రైతులే చెబుతున్నారు. తుళ్లూరుకు చెందిన రైతులు వచ్చి భూములు ఇచ్చేయమంటే ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇటీవల ఎంఏడీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భూసమీకరణను ఎలాగైనా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్రను భూసమీకరణను అడ్డుకునే వారిని తరమికి కొడతామని ప్రకటన చేశారు. భూసమీకరణను అడ్డుకునే వారిపై పీడీ యాక్ట్ ద్వారా కేసులు బనాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోదని సమాచారం. తాజాగా పీడీ యాక్ట్ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. దసరా సెలవుల అనంతరం భూసమీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధతం చేస్తామని భూపరిరక్షణ పోరాట కమిటీ నాయకులు చెబుతున్నారు. భూసమీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని రైతులు అంటున్నారు. -
'ల్యాండ్ మాఫియా రారాజు చంద్రబాబే'
హైదరాబాద్: ల్యాండ్ మాఫియాకు రారాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో అమాయక రైతుల నుంచి ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో లక్షల కోట్ల దోపిడిక తెరతీశారని అన్నారు. 10లక్షల ఎకరాలకు పైగా రైతుల నుంచి భూములు లాక్కున్నారని, రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని మండిపడ్డారు. ల్యాండ్ మాఫియాకు చంద్రబాబు భూబకాసురుడిగా మారారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు రైతుల భూములు తీసుకుంటున్నారని, భూములకు రైతులకు విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. చంద్రబాబు తన తాబేదార్లకు అక్రమంగా భూములు కట్టబెట్టేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడని మండిపడ్డారు. -
'ల్యాండ్ మాఫియా రారాజు చంద్రబాబే'
-
అవకతవకలు నిజమే!
ఫార్మాసిటీ భూసేకరణలో పొరపాట్లు అర్హులుగా మారిన అనర్హులు నిర్ధారించిన విచారణ అధికారి కలెక్టర్‌కు నివేదిక అందజేత..! ముచ్చర్ల సర్వే నంబర్ 288 (1ఎం)లో వాస్తవ ప్రకారం ఉండాల్సిన 5.33 ఎకరాల భూమికి 1982-83లో అదనంగా రెండు ఎకరాలు పెంచి సదరు పట్టాదారు విక్రరుుంచి నట్లు నిర్ధారించారు. దీంతో కబ్జాలోలేని అనర్హులకు పరిహారం అందిందని, అర్హుడైన రైతు నాగయ్యకు పరిహారం ఇవ్వాలని విచారణాధికారి నివేదిక ఇచ్చారు. సర్వే నంబర్ 288(16)లో తమ్ముడు వద్ద సాదా కాగితంపై కొనుగోలు చేసిన వారికి అన్న భూమిలోని సర్వే నంబర్ 288(11)లో నుంచి 5 ఎకరాలకు పరిహారం అందినట్లు నిర్ధారించారు. సదరు రూ.62.50 లక్షలు పరిహారం పొందిన వారి రికార్డులపై విచారణాధికారి అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా/ కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలు చోటుచేసుకున్నారుు. క్షేత్రస్థారుులో భూమి లేనప్పటికీ.. పరిహార జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లు వచ్చారుు. ఈ అంశంపై వాస్తవ పట్టాదారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో కలెక్టర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఆయన.. ఫిర్యాదుపై నిజనిర్ధారణకు ప్రత్యేకంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్‌ను విచారణాధికారిగా నియమించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన పీఓ ఆర్వీఎం.. ఫార్మాసిటీ కోసం జరిగిన భూసేకరణకు సంబంధించి పట్టాదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా పొజిషన్లో ఉన్న పట్టాదారులు, రికార్డుల్లో ఉన్న వారి పేర్లను పరిశీలించి అర్హుల జాబితాపై స్పష్టత ఇచ్చారు. ఈమేరకు నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందజేశారు. భూసేకరణకు సంబంధించిన జాబితాలో పేర్లు తారుమారైనట్లు విచారణాధికారి నిర్ధారించినట్లు తెలిసింది. కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో పూర్తిస్థారుు వివరాల్ని పేర్కొన్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నివేదిక సారాంశమిది.. సర్వే నంబర్ 288(1టీ)లో వాస్తవంగా 5 ఎకరాలు ఉండాల్సి ఉండగా 2004-05లో 4.20 ఎకరాలను పహణీల్లో పెంచి చూపారు. అధికారులు అవార్డు జారీచేయగా రైతుల ఫిర్యాదు మేరకు వారికి పరిహారం నిలిపివేశారు. వాస్తవంగా పొజిషన్లో భూమి లేనట్లు తేలింది. సర్వే నంబర్ 288(1జే)లో అసలు రైతుకు రూ.4.20 ఎకరాలు ఉంది. కాగా 288(1పీ)లో రికార్డులో లేని భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులకు 1జేలోని భూమిపై పరిహారం ఇచ్చేలా ప్రొసీడింగ్ ఇచ్చారు. దీంతో తనకు పరిహారం అందకుండా వేరే వారికి అందనుండటంతో సదరు రైతు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం పరిహారం నిలిచిపోరుుంది. సర్వే నంబర్ 288(4)లో 5 ఎకరాల అసైన్డ భూమి కొన్న వారు కబ్జాలో ఉండగా వారికి కబ్జాదారుల కింద కాకుండా అసైన్డ కిందనే పరిహారం అందినట్లు అదనంగా చెల్లించిన మొత్తం రికవరీ చేయాలంటూ నిర్ధారించారు. సర్వే నంబర్ 288లో ఎకరం 14 గుంటలపై కబ్జాలో ఉన్నా తనకు పరిహారం అందలేదని సదరు రైతు రాములమ్మ చేసిన పిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం ఆమె 30 గుంటల్లో సాగు చేసుకుంటుందని, అంత మేర పరిహారం ఇవ్వొచ్చని తేల్చారు. -
పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి, ఎంపీ రహస్య భేటీ
భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులు వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వని అధికారులు టీడీపీ ముఖ్యనాయకులతో మంత్రి, ఎంపీ రహస్య సమావేశం అధికారపార్టీ నాయకులతో నాలుగు కమిటీలు భూసమీకరణను వ్యతిరేకిస్తే తరిమికొడతామన్న మంత్రి కొల్లు పోతేపల్లి, కోన గ్రామాల్లో ఎంఏడీఏ అధికారుల నిర్భందం మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణకు అనుకూలంగా టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. నయానో, భయానో రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతర, అంగీకార పత్రాలు తీసుకుంటున్న ఎంఏడీఏ (మడా) అధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులకు అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. కోన గ్రామంలో భూసమీకరణకు తమ భూములు ఇచ్చేది లేదని అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతులు ఆ మేరకు ధ్రవీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వమంటే అధికారులు నిరాకరిస్తున్నారు. ఫారం-2 ఇచ్చిన రైతులకు ఆ పత్రం అందినట్లు సంతకం చేసి ఇవ్వాలని ఎక్కడా లేదని, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని కోన డెప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన గ్రామానికి వెళ్లి ఎంఏడీఏ అధికారులతో మాట్లాడారు. ఫారం-2 ఇచ్చినట్లుగా సంతకం చేయాలని కోరగా తన వద్ద స్టాంపు లేదని మంగళవారం సంతకాలు చేస్తానని సుబ్బరాజు బదులిచ్చారు. అయితే సంతకాలు చేసిన తరువాతే గ్రామం నుంచి కదలాలని పంచాయతీ కార్యాలయం వద్ద సుబ్బరాజు, ఇతర సిబ్బందిని రైతులు నిర్భందించినంత పనిచేశారు. పోతేపల్లిలో రైతులు ఇచ్చిన అభ్యంతర ఫారాలు అందినట్లు డెప్యూటీ కలెక్టర్ బదులుగా తాను సంతకం చేస్తానని వీఆర్వో ప్రసాద్ చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఆయన్ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పేర్ని నాని అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడి వీఆర్వోను బయటకు తీసుకువచ్చారు. వెలువడని గడువుపెంపు ఉత్తర్వులు భూసమీకరణకు సంబంధించి అభ్యంతరాలు, అంగీకార పత్రాలు తీసుకునే గడువును నవంబర్ 4వ తేదీ వరకు పెంచినట్లు ప్రకటించినా సోమవారం సాయంత్రానికి కూడా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. డీఆర్డీఏ కార్యాలయంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు అధికారులు, పాలకులు ప్రకటించారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయం కాదు, జిల్లా వ్యవసాయశాఖ కోసం నూతనంగా నిర్మించిన భవనంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులకు సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తాం టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. తాను, ఎంపీ కొనకళ్ల నారాయణరావు నెల రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులను ఒప్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భూసమీకరణకు అడ్డుపడే వారిని తరిమికొడతామన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. భూసమీకరణ ద్వారా భూములను ఇచ్చిన రైతులకు మెగా టౌన్షిప్లో ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క ప్లాట్ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. రైతులు భూసమీకరణకు సిద్ధంగానే ఉన్నారని ఎంపీ చెప్పారు. టీడీపీ నేతలతో రహస్య భేటీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు సోమవారం మచిలీపట్నం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులతో ఆర్అండ్బీ అతిథిగృహంలో రహస్య సమావేశం నిర్వహించారు. భూసమీకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించే బాధ్యతను కీలకమైన నాయకులకు అప్పగించారు. ఇందుకు మండలంలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్‌తో కమిటీలను ఏర్పాటు చేసి వారికి కొంత మంది నాయకులను అప్పగించారు. ఈ కమిటీల ద్వారా ఆయా సామాజిక వర్గాలు ఉండే గ్రామాలను ఎంపిక చేసుకుని రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. రైతులు భూసమీకరణకు అంగీకరించడం లేదని, భూమి కోల్పోతే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భావిస్తున్నారని, అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ సక్రమంగా లేదని ఎంపీ, మంత్రి దృష్టికి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు టీడీపీ నాయకులు తీసుకెళ్లారని సమాచారం. -
అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు
ఏ తరహా పరిశ్రమలు నిర్మిస్తారో చెప్పండి రైతులకు వెన్నుదన్నుగా ఉంటా..: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మచిలీపట్నం(కృష్ణా జిల్లా): భూసమీకరణ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మచిలీపట్నంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉన్న సమయంలోనే మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో భూసమీకరణను ప్రభుత్వం తెరపైకి తేవడం రైతులను మోసగించడమేనన్నారు. భూసేకరణ అమలులో ఉన్నప్పుడు రైతులు తమ భూములను విక్రయించేందుకు అవకాశం లేకుండా చేశారన్నారు. భూసమీకరణను తెరపైకి తెచ్చి కొందరు మంత్రులు తమ అనుచరులతో మచిలీపట్నంలో భూములు కొనుగోలు చేయించారని, ఆ భూములను పారిశ్రామిక క్యారిడార్‌కు ఇస్తామని ప్రకటించి రైతులను మోసగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం : 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. రైతు సంఘాలు ఏళ్ల తరబడిన చేసిన పోరాటం కారణంగా పార్లమెంటులో 2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ విరమించుకున్నారని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రే వెనుకంజ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేమీకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించడం రైతాంగ వ్యతిరేఖ చర్యేనన్నారు. ప్రస్తుతం జారీ చేసిన భూసమీకరణ నోటిఫికేషన్లో రైతులు 60 రోజుల్లో తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు వెసులుబాటు ఇవ్వాల్సి ఉండగా 15 రోజులకే కుదించటం దుర్మార్గమైన చర్య అన్నారు. తెలంగాణాలో భూసేకరణ నిమిత్తం 123వ నెంబరు జీవోను జారీ చేస్తే అక్కడి రైతులు కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. రైతులను ముంచి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనమా : బందరు పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాల భూమి అవసరమని చెబుతున్నారు. పారిశ్రామిక క్యారిడార్ కోసం 28వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయటం రైతులను ఇబ్బంది పెట్టడమేనన్నారు. ఏ పరిశ్రమలు నిర్మిస్తారో వాటికి ఎంత భూమి కావాలో వివరాలు చెప్పకుండా భూములు ఎలా సమీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు తీసుకుని బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగిస్తారా అన్నారు. పారిశ్రామిక క్యారిడార్ పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులు సైతం అభివృద్ధి చేయలేకపోయారన్నారు. గిలకలదిండి హార్బర్ వద్ద ముఖద్వారం పూడిక తీయలేదని, హార్భర్‌లో తాగునీటి వసతి కల్పించలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రైతులు చేసే పోరాటానికి రైతు సమాఖ్య ప్రతినిధిగా తనవంతుగా అండదండగా ఉంటానని ఆయన చెప్పారు. పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న భూదందాపై ముద్రించిన కరపత్రాలను అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు అందజేసి వారిని చైతన్యవంతం చేస్తామన్నారు. -
రాష్ట్రంలోనూ భూసేకరణ చట్టం
ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు సమీకరించేందుకు రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముసాయిదా రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ను కమిటీ చైర్మన్‌గా, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్, న్యాయశాఖ కార్యదర్శిని సభ్యులుగా, అడ్వకేట్ జనరల్‌ను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించింది. గోవా, కేరళ, రాజస్థాన్‌ల్లోని కొత్త చట్టాలను పరిశీలన, అవసరమైతే ఆయా రాష్ట్రాల అధికారులను ఆహ్వానించేందుకు కమిటీకి ప్రభుత్వం అధికారం కల్పించింది. -
బందరుపై పూలింగ్ పంజా
-
మచిలీపట్నం పోర్టు ల్యాండ్ పూలింగ్‌కు జీవో జారీ
విజయవాడ: మచిలీపట్నం పోర్ట్ ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్‌కు నిబంధనలు ఖరారు చేసింది. పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. భూములు లేని కుటుంబాలకు నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. 426 చదరపు కిలో మీటర్ల పరిధిలో ఎంఏడీఏ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంఏడీఏ పరిధిలో 28 గ్రామాలు ఉన్నాయి. మెట్ట భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం, గరీబ్ భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. -
మరోసారి భూసమీకరణకు సర్కార్ సిద్ధం
-
‘భూ సేకరణ వేగవంతానికి కృషి’
ఎచ్చెర్ల: పొన్నాడ వంతెనకు ఆనుకొని రోడ్డు నిర్మించేందుకు త్వరితగతిన భూ సేకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. పొన్నాడ సమీపంలోని సేకరణకు అవసరమైన భూములను ఆయన బుధవారం పరిశీలించారు. సేకరణకు మూడు ఎకరాలు అవసరం కాగా, ప్రభుత్వ భూమి ఎకరా నలభై సెంట్లు, ప్రైవేట్ వ్యక్తుల భూమి ఎకరా అరవై సెంట్లు అవసరంగా గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులకు నష్ట పరిహారం చెల్లింపు, ప్రభుత్వ భూమి లెవలింగ్‌లపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. రైతులు భూ సేకరణకు సహకరించాలని కోరారు. పరిశీలనలో ఇన్చార్జి తహశీల్దార్ బందర వెంకటరావు, డీటీ బలివాడ శ్రీహరిబాబు పాల్గొన్నారు. -
రాజధానిలో కొత్త మోసాలు
► ఎకరాకు పది సెంట్లుఇస్తేనే పూలింగ్‌లో ► చేరుస్తామంటున్న అధికారులు ► లేదంటే పూలింగ్ నిలిపేస్తామని బెదిరింపు ► ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు నీరుకొండ (తాడేపల్లి రూరల్): కంచె చేను మేస్తే..అన్న చందం గా ఉంది రాజధాని ప్రాంతంలో అధికారుల తీరు. కన్నతల్లిలాంటి భూములు వదులుకోవడానికి సిద్ధపడిన రైతులకు చేతనైనంత చేయూతనివ్వాల్సిన అధికా రులు దీనికి విరుద్ధంగా వ్యవహరి స్తున్నారు. రాజధాని అవసరం కోసం ప్రభుత్వం 25 వేల మంది రైతుల వద్ద నుంచి వేల ఎకరాలను తీసుకుని, వారి బాగోగులను మాత్రం పట్టించుకోవడం మాత్రం మానేసింది. గతంలో ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామని ఏడాది క్రితం సీఆర్డీఏ అధికారులకు రాసిచ్చినా, ఇప్పటి వరకు స్పందన లేదని మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరం పొలం పూలింగ్‌కు ఇస్తే పది సెంట్లు నజరానాగా ఇవ్వాలని ఓ అధికారి అల్టిమేటం జారీ చేశారని, అదేమంటే జిల్లా అధికారుల ఒత్తిళ్లు అంటూ సదరు అధికారిణి సెలవిస్తున్నారని వాపోతున్నారు. స్వచ్ఛందంగా భూము లు అప్పగించేందుకు సిద్ధమై సర్వే నిర్వహించాలని అడిగితే తనకున్న 1.5 ఎకరాల్లో పది సెంట్లు వేరే సర్వే నంబర్లో కేటాయించారని నీరుకొండకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ పది సెంట్ల భూమిని వారికి అమ్మినట్టు దస్తావేజులు రాయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నాడు. తాడేపల్లికి చెందిన ఓ మహిళకు సర్వే నంబర్ 86(సీ)లో 1.5 ఎకరాల భూమి ఉంది. 86 సర్వే నంబర్‌లోనే ఓ జిల్లా అధికారి సన్నిహితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నాలుగు నెలల క్రితం అర ఎకరం పొలం కొనుగోలు చేశారు. ఆ భూమిని ఆఘమేఘాల మీద ల్యాండ్ పూలింగ్‌లో చేర్చారు. కానీ 86 (సీ)లో ఉన్న ఎకరన్నర పొలం ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామన్నా తీసుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మీ పొలం ల్యాండ్ పూలింగ్‌కు తీసుకోవాలంటే పది సెంట్లు కేటాయించాలని, లేదంటే భూసేకరణ కింద భూమి పోతుందని, చాలా నష్టపోతార’ని అధికారులు బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. సదరు వ్యక్తి భయపడి పది సెంట్లు ఇవ్వగా, మిగతా ఎకరం 40 సెంట్లు 86(ఈ)లో ఉన్నట్టు చెబుతున్నారని, మాకు చెందిన పది సెంట్ల భూమిని ఓ మహిళ అధికారి తమ కుటుంబ సభ్యుల పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. నిడమర్రులో తమలా మోసపోయిన వారు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. కొందరు సీఆర్డీఏ అధికారులు బినామీ పేర్ల మీద ఇలా బెదిరించి భూములు రాయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. వాస్తవమని తేలితే క్రిమినల్ కేసులు నిజంగా అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా పెడతాం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు నేరుగా సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. - చెన్నకేశవులు, సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ డెరైక్టర్ -
భూ సేకరణకు ఒప్పుకోం...
► భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన ఉండవల్లి రైతులు ► అధికారులపై విరుచుకుపడిన వైనం ► ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన రైతులు ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ‘మీ సూచనలు, సలహాలు మాకు అవసరం లేదు... చట్టాల్లో ఏముందో మాకు తెలుసు... సభలో మేమొకటి మాట్లాడితే... మీరొకటి రాసుకుంటారు... ఎవరో కొందరు స్వార్థపరులు చెప్పింది విని... మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు..’ అంటూ ఉండవల్లి గ్రామంలోని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గ్రామంలో సోమవారం నిర్వహించిన భూ సేకరణ సదస్సులో రైతులు అధికారులను నిలదీశారు. లాండ్ పూలింగ్ డెరైక్టర్ మోహనరావు మాట్లాడుతుండగా రైతులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణ కింద భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ‘సామాజిక సర్వేలు వద్దు, ఏమీ వద్దు మేము వ్యతిరేకిస్తున్నాం, అదే రాసుకోండి, వెళ్లండి’ అంటూ రైతులు అధికారులపై విరుచుకుపడ్డారు. భూములు ఇచ్చేది లేదంటూ 9.2 ఫారాలు అందజేసినా ఇంతవరకు వాటిపై సమాధానాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రైతులు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. చివరకు ల్యాండ్ పూలింగ్ డెరైక్టర్ మోహనరావు సమావేశాన్ని ముగిస్తున్నామంటూ పేర్కొన్నారు. మినిట్‌బుక్ చూపించాలి... రైతులు అధికారులను వదిలిపెట్టకుండా మీరు మినిట్స్ బుక్‌లో ఏం రాశారో మాకు చూపించాలంటూ పట్టుబట్టారు. భూ సేకరణకు వేసే కమిటీలో రైతులను కూడా సభ్యులను చేయాలంటూ సూచించామని, అది ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రభుత్వం భూసేకరణకు వెళితే, ముఖ్యమంత్రి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సర్పంచ్ మన్నెం సుజాత సైతం రాజధాని నుంచి మా ఊరును తొలగించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీలోనూ, మండల పరిషత్ కార్యాలయంలోనూ ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
కుటుంబంలో ఒకరికే ఫీజు రియింబర్స్‌మెంట్
-ల్యాండ్‌పూలింగ్‌కు భూములిచ్చిన రైతుల పిల్లలకు -భూములు లేని నిరుపేదల కుటుంబాల నుంచి ఒకరికి ఉచిత విద్య -ఉత్తర్వులు జారీచేసిన సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ హైదరాబాద్ : ఏపీ నూతన రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు, అమరావతి ప్రాంతంలో ఉన్న భూములు లేని పేదల కుటుంబాల్లో ఒకరికి ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నట్టుగానే ల్యాండ్‌పూలింగ్‌కు భూములిచ్చిన రైతుల కుటుంబం నుంచి ఒకరికి అలాగే పేదల కుటుంబాల్లో ఒకరికి ఉచిత విద్యను అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌తో పాటు ఇంజనీరింగ్, యూనివర్శిటీ కళాశాలల్లో ఈ ఉచిత విద్య వర్తిస్తుందన్నారు. ఈ ఉచిత విద్యకు 2014 డిసెంబర్ 8 నాటికి అమరావతిలో నివాసం ఉన్న విద్యార్థులకే వర్తిస్తుందన్నారు. ఈ పథకం పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని, గత ఏడాది అంటే 2015-16లో చదివిన విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తారన్నారు. ఈ పథకం అమలు బాధ్యత జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి చూస్తారన్నారు. ఇప్పటికే కళాశాలల జాబితా రాష్ట్ర ప్రభుత్వ డేటాబేస్‌లో ఉందన్నారు. అర్హులైన అభ్యర్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్కు గానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికోసం ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన డాక్యుమెంట్లు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, అర్హత పరీక్ష పాసైన సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తదితరం సమర్పించాల్సి ఉంటుంది. అమరావతి ప్రాంత విద్యార్థులకు అందించే ఈ ఉచిత విద్యకు అయ్యే నిధులను సంబంధిత బీసీ సంక్షేమశాఖకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ చెల్లిస్తుందన్నారు. ఈ పథకం పర్యవేక్షణ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు వ్యవహరిస్తారు. -
‘మాడా’కు భారీ ల్యాండ్‌పూలింగ్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(మాడా)కి పెద్దమొత్తంలో భూమిని పూలింగ్ విధానం ద్వారా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంత భూమిని సమీకరిస్తారు? దీనిని ఎందుకోసం వినియోగిస్తారు? అనే అంశాలను రహస్యంగా ఉంచింది. అసలు భూసమీకరణ ప్రక్రియ గురించి ప్రకటన కూడా జారీ చేయలేదు. ల్యాండ్ పూలింగ్ పనుల పర్యవేక్షణకోసం 15 మంది డిప్యూటీ కలెక్టర్లను హఠాత్తుగా మాడాకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో భారీ ల్యాండ్ పూలింగ్‌కు సర్కారు తెరలేపుతున్నట్లు తేటతెల్లమవుతోంది. ‘15 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించడమంటే సాదాసీదా వ్యవహారం కాదు. దీనిని బట్టే ప్రభుత్వం భారీ స్థాయిలో భూసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తక్కువ భూమి సమీకరించడానికైతే ఇద్దరు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను మించి నియమించరు...’ అని భూసమీకరణ, సేకరణలో అనుభవం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.ఈ విషయమై పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సంప్రదించగా మాడాకు భూమి సమీకరించాలని నిర్ణయించిన విషయం వాస్తవమేగానీ, ఎన్ని ఎకరాలు అనే అంశంపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మచిలీపట్నంలో భూమి విలువ చాలా ఎక్కువని, ఇక్కడ పూలింగ్ కింద భూమి ఇచ్చేందుకు రైతులనుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. -
'టెట్రాప్యాక్ల ద్వారా మద్యం విక్రయించం'
విజయవాడ : బందరు పోర్టు నిర్మాణానికి మరో 10 రోజుల్లో భూ సమీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని మచిలీపట్నం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ బీసీ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బుధవారం విజయవాడలో కొల్లు రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పటికే మచిలీపట్నం పోర్టు అథారటీ, మున్సిపల్ పరిపాలన, న్యాయ విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకుందని ఆయన వివరించారు. పోర్టు, పరిశ్రమల నిర్మాణానికి కూడా భూమిని వేర్వేరుగా కేటాయిస్తామన్నారు. రైతులతో చర్చించి అమరావతి తరహాలోనే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. త్వరలోనే ఆధరణ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆధరణ పథకం అధ్యాయన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన విశదీకరించారు. చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. అయితే రాష్ట్రంలో టెట్రా ప్యాక్‌ల ద్వారా మద్యాన్ని విక్రయించే ఆలోచన మాత్రం లేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. -
‘ఈనాం’ వేదన ఇంకెన్నాళ్లు?
► భూములు తీసుకున్నారు.. ► కౌలు చెక్కులు ఇవ్వనంటున్నారు ► తీవ్ర ఆవేదనలో ఈనాం భూముల రైతులు ► సమస్యను నాన్చుతున్న పాలకులు ► సీఎం నిర్ణయం కోసం రాజధాని రైతుల ఎదురుచూపులు రాజధాని కోసం అందరు రైతుల్లా భూములిచ్చారు.. కౌలు చెక్కులు అందుతాయని.. పరిహారంతో బతుకు బండి సాఫీగా సాగుతుందని ఆశపడ్డారు. కాలం గిర్రునా తిరుగుతున్నా.. కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులరుగుతున్నా.. భూయాజమాన్య హక్కు పత్రాలు చూపుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. నేటికీ కౌలు చెక్కులు అందలేదు. ఆ బాధితులే రాజధాని ప్రాంతంలోని ఈనాం భూముల రైతులు. అభ్యంతరాలున్నాయని అధికారులు చెప్పేమాటలు.. భూమి కోల్పోయి ఉపాధి కరువై ఇళ్లు గడవని పరిస్థితులు.. ప్రశ్నగా మారుతున్న భవిష్యత్తు.. ఈనాం భూముల రైతులను కన్నీరు పెట్టిస్తోంది. తుళ్ళూరు రూరల్ : రాజధాని ప్రాంతంలో ఈనాం భూముల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈనాం భూములకు సంబంధించిన పంచాయితీ ముఖ్యమంత్రి వద్దకు చేరినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రాజధాని గ్రామాల్లో సుమారు 150 ఎకరాలు ఈనాం భూములు ఉన్నట్లు సమాచారం. ఈ భూములను రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ప్రభుత్వం నేటికీ కౌలు చెక్కులు పంపిణీ చేయలేదు. రాజధాని గ్రామం నెక్కల్లులో 158 సర్వే నంబరులో 14 ఎకరాల 7 సెంట్లు, 59లో 11 ఎకరాల 40 సెంట్లు భూమికి సంబంధించి 20 మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌లో 9.3 ఫారం ద్వారా భూములిచ్చినప్పటికీ ఇప్పటి వరకు కౌలు చెక్కుల పంపిణీ జరగలేదు. దొండపాడు గ్రామంలో సర్వే నంబరు 36లో 24 మంది రైతులు 9 ఎకరాల 98 సెంట్లను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చారు. వీరికి ఇప్పటివరకు కౌలు చెక్కుల ఊసేలేదు. తాము 1925వ సంవత్సరం నుంచి సదరు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, భూయాజమాన్య హక్కు పత్రాలు ఉన్నాయని, తమకు కౌలు చెక్కులు ఇవ్వాలంటూ వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్టర్ డాక్యుమెంట్లు, పాత పట్టాదారు పాసు పుస్తకాలు, రైత్వారీ పట్టాగా మార్పు చేసిన ఫారం-8 నకళ్లను అధికారులకు అందజేశామని, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తోందంటూ వాపోతున్నారు. దేవాదాయశాఖాధికారులు ఈనాం భూములంటూ అభ్యం తరం చెప్పడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గత ఏడాది సెప్టెంబరులో తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయంలో రైతులు, దేవాదాయ శాఖాధికారులతో చర్చించారని రైతులు గుర్తుచేస్తున్నారు. భూములిచ్చి ఏడాది దాటినా మాటలు చెప్పడం తప్ప ప్రభుత్వం చేసిందేమీలేదని మండిపడుతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం అనంతవరంలో సమావేశమైన రాజధాని గ్రామాల రైతులు ప్రభుత్వ వైఖరిని తూర్పార బట్టారు. సీఆర్డీఏ అధికారులు ఈ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని, సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయం ఏవిధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బలవంతపు భూసేకరణపై శ్రమజీవుల గర్జన
వందలాది మంది రైతు, రైతుకూలీల అరెస్ట్ విజయవాడ (భవానీపురం) : రాష్ట్ర ప్రభుత్వ బలవంతపు భూసేకరణ, భూసమీకరణకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు గర్జించారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. బలవంతపు భూసేరణను తక్షణమే ఆపాలని, ల్యాండ్ పూలింగ్ రద్దు చేయాలని, 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చలో విజయవాడ పిలుపునిచ్చింది. 13 జిల్లాల నుంచి వచ్చిన రైతులు, రైతు కూలీలు చంద్రబాబు మోసపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, పాత బస్టాండ్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ప్రదర్శనకారులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఆందోళనకారులను నగర పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులందరినీ ఒక వాహనంలో ఎక్కించి ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు, మిగిలిన వారిని ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే.. ప్రదర్శనకు ముందు కళాక్షేత్రం ప్రాంగణంలో జరిగిన సభకు అధ్యక్షత వహించిన కమిటీ కన్వీనర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని, చంద్రబాబు అనుసరిస్తున్న రైతాంగ, గ్రామీణ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. పచ్చని భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేంధ్రనాథ్ ఓఝూ, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ టి. గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్ ప్రసంగించారు. అరెస్ట్ అయి ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఉన్న నేతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ పరామర్శించారు. 62మంది వామపక్ష నేతలు తరలింపు ఇబ్రహీంపట్నం : రాష్ట్ర భూ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు, వామపక్ష నేతలు 62మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను పలువురు తీవ్రంగా ఖండించారు. -
'భూములివ్వని రైతులను ఇప్పటికీ వేధిస్తున్నారు'
హైదరాబాద్: ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అడిగితే, తమ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సభలో సమయం లేదనడం దారుణమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని రైతులను వరుసగా టార్గెట్ చేసిందన్నారు. రైతుల పంట పొలాలను తగులబెడుతున్నారని, అక్రమంగా దున్నెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ద్వారా నియంతల్లా వ్యవహిస్తున్నారని మండిపడ్డారు. భూములు ఇవ్వని రైతులను ఇప్పటికీ వేధిస్తున్నారన్నారు. రైతును రాజుగా చూడాలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయంతో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. -
రాసేవాడిపైనే విచారణ
అప్పుడే భయం ఉంటుంది.. రాసేవాడికి, క్రిమినల్‌కి ఒకటే చట్టం: సీఎం చంద్రబాబు * మీరేదో రాస్తే.. ప్రభుత్వం విచారణ చేయించాలా? * రాతలు నిరూపించాల్సిన బాధ్యత విలేకరులదే * లింగమనేని పూలింగ్‌లో భూములు ఇస్తానంటే వద్దన్నా * మా నేతలు సొంత డబ్బుతో కొంటే తప్పేంటి? * హాయ్‌ల్యాండ్ ప్రస్తుతం సీబీసీఐడీ జప్తులో ఉంది * లోకేశ్ భూములు కొట్టేశారనడంలో వాస్తవం లేదు * అమరావతికి రావొద్దంటూ విదేశీ ప్రతినిధులకు * విపక్ష నేత జగన్ ఈ-మెయిల్స్ పంపారు సాక్షి, హైదరాబాద్ వార్తలు రాసే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తామని, రాసేవాడికి.. నేరం చేసిన వాడికి చట్టం ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సమాచారం తెచ్చివ్వమంటేనే మీడియాకు భయం ఉంటుందని, అప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుని రాస్తారని విలేకరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి బయటపెట్టిన ‘రాజధానిలో భూ దురాక్రమణ’పై విచారణ కమిషన్ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆదివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూదందాపై వార్తలు రాసిన విలేకరులే వాటిని నిరూపించాలని, ఇష్టప్రకారం వార్తలు రాస్తే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. బ్రాండ్ ఇమేజిని దెబ్బతినే విధంగా రాస్తూ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. కడిగిన ముత్యంలాగా బయటకు రావడానికి భూదందాపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీరేదో చేసేసి.. కడిగిన ముత్యం లాగా రావాలని ఎవరు చెప్పారయ్యా? నీదగ్గర సమాచారం ఉంటే ఇవ్వు. లేదంటే నిన్ను ప్రాసిక్యూట్ చేస్తాం. రాస్తున్న వారికి ఒకటే చట్టం.. నేరం చేసిన వాడికీ ఒకటే చట్టం. రాసేవాడు ప్రివిలేజ్డ్ కాదు. నువ్వు ఒకటి రాశావు కాబట్టి.. రాసిన వారి మీద విచారణ చేపట్టాలి అంటే.. నిరూపించమని అడుగుతాం. మొత్తం సమాచారం తెచ్చివ్వమని అడగాలి. అప్పుడు మీడియాకు భయం ఉంటుంది. ఒళ్లు దగ్గరపెట్టుకొని రాస్తారు. మీరు రాశారని అందరినీ విచారించాలా? కడిగిన ముత్యంలాగా, ఆణిముత్యంలాగా ప్రభుత్వం రావాలా? ప్రభుత్వానికి ఇదే పనా? ప్రభుత్వం పనిచేయాలా? వద్దా? ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని పని చేస్తుంటే.. ప్రజలకు నష్టం. ప్రభుత్వం పరిపాలన చేయాలా? లేక విచారణలు చేస్తూ కూర్చోవాలా? ఎవరైనా బాధ్యతగా రాయాలి. రాసినప్పుడు నిరూపించాలి. బాధ్యత లేకుండా రాస్తుంటాం.. టీవీల్లో వేస్తుంటాం.. అంటే కరెక్ట్ కాదు. ఒక పత్రిక స్వార్థంతో కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. భూమితో రైతులకు అటాచ్మెంట్ ఉంటుంది. రాష్ట్రం బాగుపడుతుందని పూలింగ్‌లో భూములు ఇచ్చారు. వారికి ఇప్పుడు బాధ కలుగుతోంది** అంటూ మండిపడ్డారు. సాక్షి ప్రస్తుతం ఈడీ అటాచ్మెంట్లో ఉందని, అది ప్రభుత్వ ఆస్తి అని పునరుద్ఘాటించారు. అవును.. కొన్నారు.. నిజమే రాజధాని ప్రాంతంలో వేమూరి రవికుమార్, సుజనా చౌదరి, మురళీమోహన్, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర భూములు కొనడం వాస్తవమేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. వారి సొంత డబ్బుతో భూములు కొనుగోలు చేశారని చెప్పారు. భూముల క్రయవిక్రయాల మీద నిషేధం లేనప్పుడు, డబ్బున్నవాళ్లు భూములు కొనుక్కోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వ ఆస్తిగా పేర్కొన్నారు. ఆ గెస్ట్‌హౌస్ ల్యాండ్‌పూలింగ్‌లో వచ్చిందని, అందువల్లే తాను అందులో ఉంటున్నానన్నారు. మంత్రులు నారాయణ, పుల్లారావు భూములు కొన్నట్లు నిరూపిస్తే.. తిరిగి ఇచ్చేస్తామని సవాల్ చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. హాయ్‌ల్యాండ్ తన కుమారుడు లోకేశ్ భూములు కొట్టేశారని ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రస్తుతం అది సీబీసీఐడీ జప్తులో ఉందని తెలిపారు. రాజధానిలో భూ అక్రమాలు జరగలేదన్నారు. బెదిరించి భూములు లాక్కున్నారన్న ఆరోపణలు ఖండించారు. గుంటూరు-విజయవాడ మధ్యలో ఉన్న వారిని బెదిరించగలమా? అంటూ ఎదురు ప్రశ్నించారు. బెదిరించి తమ భూమిని లాక్కున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తక్షణం స్పందిస్తామని, తగిన భద్రత కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ దందాపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్న ఆయన.. ప్రభుత్వానికి అగ్నిపరీక్ష అక్కర్లేదని తేల్చేశారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి వార్తలు రాస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాలేదని.. పైగా అమరావతికి రావద్దంటూ చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల ప్రతినిధులకు టెలిగ్రామ్‌లు, ఈ-మెయిల్స్ పంపించారని ఆరోపించారు. ఇడుపులపాయలో 610 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వానికి అప్పగించడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చట్టాన్ని మార్చారని, శిక్ష పడకుండా తప్పించుకున్నారని విమర్శలు చేశారు. అసైన్డ్ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ అప్పటి శాసనసభలో దివంగత సీఎం వైఎస్ఆర్ చేసిన ప్రకటనను చదివి వినిపించారు. సొంతవారిని వెనకేసుకొచ్చిన సీఎం రాజధాని భూ దురాక్రమణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనవారిని ముఖ్యమంత్రి వెనకేసుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి సీఎం ఏమన్నారంటే.. - రాజధాని ప్రకటన చేయకముందే అమరావతి మండలంలో వేమూరు రవికుమార్ కొన్నమాట వాస్తవమే. ఆయన ఎన్నారై. కుటుంబ సభ్యులందరి పేర్లతో భూములు కొన్నారు. మాకు సంబంధం లేదు. - నేను కొనుక్కున్నాని పయ్యావుల కేశవ్ ధైర్యంగా చెప్పారు. - తాను కూడా కొనుక్కున్నానని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. - 2002, 2003లోనే లింగమనేని రమేశ్ భూములు కొన్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో భూములు తీసుకోమని రమేశ్ అడిగారు. తీసుకోనని నేనే స్పష్టంగా చెప్పాను. నేను గ్యాస్ టర్మినల్ ఇచ్చాను కాబట్టి లింగమనేని ఇల్లు ఇచ్చారని ఆరోపణ. ఇల్లు ఇవ్వడం ఏమిటి? అది ప్రభుత్వ ఆస్తే. ఇస్తే భూసమీకరణలో, ఇవ్వకుంటే భూసేకరణలో తీసుకొనే వాడిని. లింగమనేని గెస్ట్‌హౌస్ ప్రభుత్వ ఇల్లు కాబట్టే, తాత్కాలికంగా నేను ఉంటున్నాను. - సుజనా చౌదరి ఎక్కడో దూరంగా కొన్నారు. - ఎన్నికలు జరగకముందే డెవలెప్మెంట్ ఒప్పందం చేసుకున్నామని మురళీమోహన్ చెబుతున్నారు. - సాక్షి బయటపెట్టిన భూ దందా కథనాల వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. భూముల ధరలు పెరుగుతాయని సీఎంను నమ్మి ఇస్తే, ధరలు పెరగడం లేదని రైతులు అడుగుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇలాంటి రాతలు రాసి రాజధాని అభివృద్ధి చేయడానికి ఎవరూ రాకుండా చేయడం కుట్ర కాదా? అసైన్డ్ భూముల అసలు యజమానులకే ప్యాకేజీ 1954కు పూర్వం అసైన్డ్ భూములు చాలా చేతులు మారాయి. రిజిస్ట్రేషన్లూ జరిగాయి. ఆ భూములకు ప్రస్తుత యజమానికే ప్యాకేజీ ఇస్తాం. 1954 తర్వాత అసైన్డ్ భూములు పొందినవారికి విక్రయ అధికారం లేదు. రిజిస్ట్రేషన్లు చేయడం కూడా చట్ట విరుద్ధం. ఈ భూముల అసలు యజమానుల (అసైనీల)కే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందుతుంది. ‘జర్నలిస్టులను వేధించడం సరికాదు’ హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతిలో భూదందాపై మంత్రులు, అధికార పార్టీ నేతలు తమ నిజాయతీని చిత్తశుద్ధితో నిరూపించుకోవాలని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆర్ వెంకటేశ్ గౌడ్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కోశాధికారి అస్కాని మారుతి అన్నారు. అంతేకాని నిష్పక్షపాతంగా వార్తలు రాసే జర్నలిస్టులను వేధించడం సబబు కాదని పేర్కొన్నారు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని, అందుకు సీఎం కూడా అతీతుడు కాదన్నారు. భూదందాలో తన ప్రమేయం లేనపుడు ప్రజలకు సరైన ఆధారాలు చూపాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. -
టీడీపీ నేతల గురించి అలా అనలేదు: మంత్రి నారాయణ
విజయవాడ: టీడీపీలోని అందరు నేతలతోనూ తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తాను చెప్పలేదని మంత్రి అన్నారు. రోడ్ల విస్తరణ కారణంగా 1000 ఇళ్లను తొలగించాల్సి ఉందని.. ఈ నెల 15వ తేదీలోగా మాస్టర్ల ప్లాన్ పూర్తి అవుతుందని తెలిపారు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్ కు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు 13 గ్రామాల్లో పర్యటించి ఇళ్లు కోల్పోతున్నవారిలో 90 శాతం మందికి నచ్చజెప్పినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ ఖారారయిన తర్వాతే ఇళ్ల తొలగింపు చేపడతామని నారాయణ పేర్కొన్నారు. ఇళ్లను తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆర్కే ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చెప్పని మాటలు ప్రచారం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఒక వర్గానికి తనను దూరం చేసేందుకే తనపై దుష్రచారం చేస్తున్నారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు. -
ఎక్స్‌ప్రెస్ హైవేలపై హైరానా!
రోడ్ల నిర్మాణానికి ఊళ్లను ఖాళీ చేయం తేల్చిచెబుతున్న రాజధాని ప్రాంత ప్రజలు రెట్టింపు పరిహారం ఇస్తామంటూ మంత్రుల హామీ రాజధాని ప్రాంత ప్రజలతో భేటీ కావాలని సీఎం నిర్ణయం! విజయవాడ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే వరకు గ్రామాల జోలికి వెళ్లేది లేదని నమ్మించారు. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవేల పేరిట ఇళ్లను పెకలించి గ్రామాలనే ఖాళీ చేయించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచిన రాష్ట్ర సర్కారు తీరుపై రాజధాని గ్రామాల ప్రజలు రగిలిపోతున్నారు. వారిని మభ్యపెట్టేందుకు మంత్రులు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ప్రభుత్వమే రాజధాని ప్రాంత గ్రామాల ప్రజల బతుకులను రోడ్డుపాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, రహదారుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూములివ్వని గ్రామాల మధ్య నుంచి హైవేలను ప్రతిపాదించడంతో ఊళ్లకు ఊళ్లే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 200 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేతోపాటు 165 అడుగుల వెడల్పుతో డౌన్‌టౌన్, రహదారులు, 80 అడుగుల వెడల్పుతో రోడ్లను ప్రతిపాదించారు. రాజధానిలోని ఎక్స్‌ప్రెస్ హైవేకు మిగిలిన రోడ్లను అనుసంధానం చేస్తారు. నిరాశ్రయులను చేస్తారా? ప్రతీ గ్రామంలో కనీసం మూడు నుంచి నాలుగు రోడ్లను ప్రతిపాదించడంతో ఊళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ల్యాండ్ పూలింగ్ను ప్రతిఘటించిన ఉండవల్లి, కృష్ణాయపాలెం, నౌలూరు, నిడమర్రు గ్రామాలతోపాటు అసలు రాజధాని ప్రాంతంలో లేని తాడేపల్లి గ్రామానికి కూడా నష్టం వాటిల్లనుంది. కృష్ణాయపాలెం గ్రామకంఠం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. యర్రబాలెం, ఐనవోలు, వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి గ్రామాలకు రోడ్ల దెబ్బ తప్పదు. ఇప్పటికే భూములు లాగేసుకున్న ప్రభుత్వ రోడ్ల నిర్మాణం పేరిట తమను నిరాశ్రయులను చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. డిజైన్ల మార్పునకు సీఎం ససేమిరా రాజధానిలో ప్రతిపాదిత రోడ్ల పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కొన్ని రోడ్ల డిజైన్లు మారిస్తే బాగుంటుందనే మంత్రుల సూచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అన్నారు. రోడ్ల ప్రతిపాదనలపై రాజధాని ప్రాంత ప్రజలతో త్వరలో భేటీ కావాలని ఆయన నిర్ణయంచినట్లు సమాచారం. మంత్రుల బుజ్జగింపులు రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఇళ్ల తొలగింపు, స్థల సేకరణ విషయంలో ప్రజలను బుజ్జగించేందుకు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఐనవోలు గ్రామాల్లో పర్యటించిన మంత్రులు ప్రజల నిరసనలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కంటే రెట్టింపు ప్యాకేజీ ఇస్తామని, ఇల్లుకు ఇల్లు, స్థలానికి స్థలం ఇచ్చేలా చూస్తామని మంత్రులు హామీలిస్తున్నారు. ఇప్పటికే సాగు భూములు వదులుకున్నామని, ఇళ్లను కూడా వదులుకోవాలంటే అందుకు సిద్ధంగాలేమని రాజధాని ప్రాంత వాసులు తెగేసి చెబుతున్నారు. -
సింగపూర్ సంస్థలు కోరినట్టే..!
-
సింగపూర్ సంస్థలు కోరినట్టే..!
♦ ఏపీ రాజధాని భూములపై పూర్తి హక్కులు వాటికే! ♦ లీజు హక్కులు 99 ఏళ్లకు పెంపు ♦ నేడు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన కోట్ల రూపాయల విలువైన భూములను సింగపూర్ ప్రైవేట్ సంస్థలు కోరినట్లుగా అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కన్సార్టియంను ఎంపిక చేయాలని ప్రభుత్వ పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. తొలిదశలో మూడు వేల ఎకరాలను ఇస్తే అభివృద్ధి చేస్తామని, ఆ భూమిపై పూర్తి హక్కులు కల్పించాలని అసెండాస్ సంస్థ ప్రభుత్వ పెద్దలను కోరింది. దీనిపై వారు అసెండాస్ ప్రతినిధులతో బేరసారాలు జరిపారు. సింగపూర్ సంస్థ కోరినట్లు భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు వీలుగా ఏపీ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించారు. వీటిని ఇప్పటికే ఆర్డినెన్స్ ద్వారా తె చ్చారు. ఇప్పుడు ఆర్డినెన్స్ స్థానే చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును శనివారం ప్రవేశపెట్టారు. ఆ బిల్లును సోమవారం ఆమోదించనున్నారు. 2001లో చేసిన చట్టంలో పరిశ్రమలకు, ఇతర ప్రాజెక్టులకు కేటాయించే భూములను 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలనే నిబంధన మాత్రమే ఉంది. ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు వీల్లేదు. అయితే ఇప్పుడు పూర్తి హక్కులు సింగపూర్ ప్రైవేట్ సంస్థలకు కల్పించడంతో పాటు లీజు కాలాన్ని 99 ఏళ్లకు పొడిగిస్తూ సవరణలు చేస్తున్నారు. అలాగే లీజుకాకుండా మొత్తానికి విక్రయించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలను కల్పించారు. మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక కానున్న అసెండాస్ సంస్థ ఐదు దశల్లో రాజధాని అభివృద్ధిని 25 -30 ఏళ్లలో పూర్తి చేస్తామని, ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించాలని, మధ్యలో మరో సంస్థలు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు చట్టంలో సవరణలు తెస్తున్నారు. -
రింగ్‌రోడ్ కోసం త్వరలో భూసేకరణ: మంత్రి నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని చుట్టూ నిర్మించతలపెట్టిన రింగ్‌రోడ్ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం వెల్లడించారు. రాజధాని చుట్టు 210 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రింగ్‌రోడ్డు కోసం 7,784 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29 లోగా రాజధాని డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వస్తుందని చెప్పిన ఆయన జనవరి 30 నాటికి రైతులకు ఫ్లాట్లను కెటాయించనున్నట్లు తెలిపారు. -
సో్లార్ ప్రాజెక్టులో అక్రమాలు
-
భూములు ఇవ్వలేదనే అరటి తోటలు ధ్వంసం
‘సీఆర్డీఏ’ బాధిత రైతులు రాజేష్, చంద్రశేఖర్ ఆవేదన విజయవాడ (గాంధీనగర్): ల్యాండ్‌పూలింగ్‌లో భూమి ఇవ్వనందుకే సీఆర్డీఏ అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అందుకే అరటితోటను నేలమట్టం చేశారని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు గుండపు రాజేష్, చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సామాజికవేత్త పండలనేని శ్రీమన్నారాయణతో కలసి బాధిత రైతులు మీడియాతో మాట్లాడారు. అరటితోట ధ్వంసం పై తహసీల్దార్, జేసీ, యూనిట్-16 డిప్యూటీ కలెక్టర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని.. పరిహారం రూ.20 లక్ష లివ్వాలని కోరామన్నారు. ఘటనపై స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. కోర్టు ధిక్కారమే.. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పనులు చేపట్టరాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నప్పటికీ శంకుస్థాపన పేరుతో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమ ణ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పండలనేని శ్రీమన్నారాయణ ఆరోపించారు. ఎన్జీటీ స్టే ఆర్డర్ ఉండగా పూలింగ్‌కు ఇచ్చిన భూములతోపాటు, ఇవ్వని భూముల్లో పనులు చేయడానికి వీల్లేదన్నారు. అరటి తోటల ధ్వంసం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. -
రైతులపై రౌడీయిజం
♦ భూములివ్వని వారిపై దౌర్జన్యం ♦ కక్ష సాధింపు చర్యలకు దిగిన ప్రభుత్వం ♦ రాజధాని ప్రాంతంలో అరటి తోటలు ధ్వంసం ♦ బుల్డోజర్లతో పూర్తిగా దున్నించిన సీఆర్డీఏ ♦ 7.30 ఎకరాల్లోని పంట నేలమట్టం.. ♦ ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపణలు ♦ భూ సమీకరణకు సహకరించనందునే ధ్వంసమని ఆవేదన ♦ రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ ♦ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు సర్కారు వికృత స్వరూపం బట్టబయలైంది. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, ఆదర్శవంతంగా భూసమీకరణ జరిపామనీ చెబుతున్న మాటలన్నీ బూటకమేనని... రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని, లాక్కుంటున్నారని స్పష్టమవుతోంది. భూముల స్వాధీనానికి ఎంతకైనా తెగిస్తామని, పచ్చని పంటపొలాలను నిలువునా నాశనం చేసేస్తామని చంద్రబాబు సర్కారు నిరూపించుకుంది. రాజధాని భూసమీకరణకు సహకరించని రైతుల పాలిట రౌడీగా మారుతోంది. ఇదివరకు దొంగచాటుగా పంటలకు నిప్పుపెట్టి రైతులను అష్టకష్టాల పాల్జేసిన సర్కారు ఇప్పుడు నేరుగానే దౌర్జన్యానికి పాల్పడింది. భూసమీకరణకు సహకరించని రైతులకు చెందిన అరటి తోటను నిర్దయగా నాశనం చేసి తన కపట రూపాన్ని చూపింది. ప్రభుత్వ దాష్టీకంతో నివ్వెరపోయిన రైతులు బోరుమంటున్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఇది వరకూ పంట పొలాలను తగులబెట్టించడ ం, వ్యవసాయ పంప్సెట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడిన వ్యవహారాలు వెలుగులోకి రాగా ఇప్పుడు భూ సమీకరణకు సహకరించని రైతుల పంట పొలాలను అన్యాయంగా నేలమట్టం చేయించే పనులకు పూనుకున్నారు సీఆర్డీఏ అధికారులు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో చోటు చేసుకున్న తాజా సంఘటనే ఇందుకు నిదర్శనం. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు సహకరించని గుండపు రాజేష్ సోదరుల అరటి తోటలను మంగళవారం సాయంత్రం సీఆర్డీఏ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేయించారు. సీఆర్డీఏ యూనిట్ 16 డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పర్యవేక్షణలో సీఆర్డీఏకు చెందిన మూడు బుల్డోజర్లు పొలాల్లోకి ప్రవేశించి గెలలతో ఉన్న అరటి చెట్లను గంట వ్యవధిలోనే నేలమట్టం చేసి గుట్టగా నాలుగైదు చోట్ల పోశాయి. సమాచారం అందుకున్న పొలాల యజమానులు పొలం దగ్గరకు చేరుకునే లోగానే 7.30 ఎకరాల పంట నేలమట్టమైంది. కోర్ కేపిటల్ పరిధిలోని లింగాయపాలెం వాసులు గుండపు రాజేష్‌కుమార్, చంద్రశేఖర్‌లు అన్నదమ్ములు, వీరి తల్లి రమణమ్మతో కలిపి వీరికి 139/ఏ1, 139/ఏ3, 140, 141/1 సర్వే నంబర్లలో మొత్తం 7.30 ఎకరాల జరీబు భూములున్నాయి. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి ఫర్లాంగు దూరంలోనే ఈ భూములున్నాయి. రాజధాని కోసం భూ సమీకరణ జరిగే సమయంలో రాజేష్ సోదరులిద్దరూ ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించలేదు. తమ భూముల్లో పాలీ హౌస్‌ల నిర్మాణం చేపట్టనున్నామనీ, భూములను ఇచ్చే ఉద్దేశం లేదని వీరు సర్కారుకు తేల్చి చెప్పారు. అంతేకాకుండా భూ సమీకరణకు తాము సిద్ధంగా లేమంటూ అభ్యంతర పత్రాలను సమర్పించారు. తమ పొలంలో అరటి పంట సాగు చేశారు. గెలలతో ఉన్న పంట రెండు నెలల్లో చేతికందుతుందని, నాలుగు లక్షల రూపాయల వరకూ వస్తుందని వారు భావించారు. అయితే ఉన్నట్టుండి సీఆర్డీఏ అధికారులు పచ్చని పంటను నాశనం చేశారు. మిత్రుడు రామ్మోహన్ ద్వారా సమాచారం అందుకున్న రాజేష్ సోదరులు హుటాహుటిన పొలానికి చేరుకునే సరికి పంట మొత్తం నేలమట్టమైంది. విస్మయానికి గురైన భూ యజమానులు తమకు జరిగిన అన్యాయం గురించి తహసీల్దార్ సుధీర్‌బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌లకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే తుళ్లూరులో ఉండే సీఆర్డీఏ భూ వ్యవహారాల డెరైక్టర్ బీఎల్ చెన్నకేశవరావుకు కూడా విషయాన్ని వివరించారు. రూ.20 లక్షలకు పైగా నష్టం... కాపుకొచ్చిన పంట విలువతో పాటు పెట్టుబడులన్నీ కలిపి రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. పొలాల్లో వేసిన మూడు బోర్లు పూర్తిగా పూడిపోయాయి, రూ.6 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైందన్నారు. గట్లు చెదిరిపోయాయి పొలం రూపమే మారిపోయిందని వారు గగ్గోలు పెడుతున్నారు. పొరపాటున జరిగిందంతే... చేతికందిన ఏడెకరాల అరటి పంటను ప్రభుత్వం నాశనం చేయించిందని రైతులు లబోదిబోమంటుంటే, దీన్ని చిన్న పొరపాటుగా అభివర్ణించారు యూనిట్ 16 డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి. గుండపు రాజేష్ సోదరుల భూములు రాజధాని భూ సమీకరణ కిందకు రావని, వారు అభ్యంతర పత్రాలిచ్చిన విషయం వాస్తమేనని చెప్పిన ఆయన జరిగిన నాశనం సమాచార లోపం ఫలితమేనన్నారు. దీనిపై విచారణ చేయిస్తున్నామని చెప్పారు. స్టే ఉన్నా... పొలాలను చదును చేయడమేమిటి? రాజధాని నిర్మాణ పనులపై స్టే ఉన్నప్పటికీ ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి పొలాలను చదును చేయడం దారుణమని పర్యావరణవేత్త, గ్రీన్ ట్రిబ్యునల్ పిటీషనర్ శ్రీమన్నారాయణ అన్నారు. అరటి తోటలను ఇలా నాశనం చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వీరు తుళ్లూరు పోలిస్‌స్టేషన్‌కు చేరుకుని పంట పొలం చదును చేసిన విషయంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చేశారు తమ అరటి తోటలను సీఆర్డీఏ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేయించినట్లు రాజేష్, చంద్ర శేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమీకరణకు తాము సహకరించకపోవడంతో మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో ప్రభుత్వం పంటకు నష్టం కలిగించిందన్నారు. భూ సమీకరణ కింద ప్రభుత్వం సొంతం చేసుకున్న భూములు పక్కనే ఉన్నా, వాటిని చదును చేయడం మాని మధ్యలో ఉన్న తమ పంట చేలను మాత్రమే చదును చేయడం చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే యూనిట్-16కు చెందిన డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పొరపాటున జరిగినట్లుందని చెప్పడం విడ్డూరమన్నారు. తమకు జరిగిన నష్టానికి పరిహారం కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయం కోసం చట్టబద్ధంగా పోరాడతామన్నారు. -
ఏపీ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు
* చెప్పిందేంటి... మీరు చేస్తున్నదేంటి...? సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో హడావిడి చేసి... భూ సమీకరణ వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్న మంత్రులు ఇప్పుడు అటువైపు కనిపించకపోవడం ప్రజలే కాదు తెలుగు తమ్ముళ్లలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అడపాదడపా అటుగా వచ్చే మంత్రులను నిలదీస్తూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. రాజధానికి భూములివ్వమంటే ఇచ్చాం... ఏడాదిన్నర దాటుతున్నా మాకెక్కడ భూములిస్తారో చెప్పడం లేదు. జాబిస్తామన్నారు.. కనీసం ఉపాధి లేని పరిస్థితులు కల్పిస్తున్నారు... అంటూ నిలదీయడంతో ఏం చేయాలో అర్థంకాక మంత్రులు బిత్తరపోతున్నారు. రాజధాని కోసం ఏడాది కిందట భూములివ్వడానికి ముందుకొచ్చిన వారే ఇప్పుడు మంత్రుల తీరుపై మండిపడుతున్నారు. తమ్ముళ్లు నిలదీస్తుండటంతో మంత్రులు అటువైపు వెళ్లడానికే వెనుకాడుతున్నారు. పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు తాజాగా చేపట్టిన జన చైతన్య యాత్రలంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో.. చూస్తామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవలే తుళ్లూరు పర్యటనకు వెళ్లిన మంత్రి పుల్లారావుకు టీడీపీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది. ఉద్యోగాలు, పింఛన్లు, ఉపాధి కార్యక్రమాలు కల్పిస్తామని ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించామని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరగడం లేదని మంత్రి పుల్లారావును నిలదీశారు. ‘కాంగ్రెన్ ముఖ్య నేత రామచంద్రయ్య, వామపక్ష నేతల్ని మీటింగ్‌లు పెట్టకుండా అడ్డుకున్నాం.. ఇప్పుడు మాకు జరుగుతున్నదేమిటి?’ అని ప్రశ్నల వర్షం కురిపించడంతో మంత్రి పుల్లారావు ఉక్కిరిబిక్కిరయ్యారు. తుళ్లూరు మండలంలో తండ్రి లేని ఓ నిరుద్యోగి ఏడాది కాలంగా మీ సేవ కేంద్రం కోసం కాళ్లరిగేలా తిరిగితే కనీసం మంజూరు చేయించలేకపోయాం... చంద్రబాబు మీద నమ్మకంతో మాకు జీవనాధరమైన భూముల్ని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చాం.. మీ సేవ కేంద్రం విషయంలోనే ఇలా జరిగితే ఇక మాకు రేపు ప్లాట్లు ఏం ఇస్తారని నిలదీశారు. మీ సేవ కేంద్రానికి.. ఫ్లాట్లు కేటాయించడానికి సంబంధం లేదని మంత్రి పుల్లారావు సమాధానమివ్వగా, ఒక్కసారిగా తుళ్లూరు టీడీపీ నేతలంతా ‘మీరు మా నమ్మకం కోల్పోయారని’ ధ్వజమెత్తారు. మంత్రి నారాయణకు నిరసనల సెగ భూ సమీకరణ కోసం నెలల పాటు రాజధాని మకాం వేసి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ ఇప్పుడు అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. భూ సమీకరణ విషయంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారాయణకు ఇప్పుడు నిరసనల సెగ పెరిగింది. జన చైతన్య యాత్రల్లో భాగంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణను ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు. నయా పైసా పెట్టుబడి లేకుండా భూములు సమీకరించినప్పుడు హామీలెన్నో ఇచ్చి.. ఒట్లు వేసి.. అమలు విషయానికొచ్చే సరికి ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్లు నారాయణ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంత్రి నారాయణ ఇచ్చిన వాగ్ధానాలకు ఆయన్ను గుర్రమెక్కించి గ్రామాల్లో తిప్పి అభిమానాన్ని చాటుకుంటే.. ఇప్పుడు మొండిచెయ్యి చూపడమేంటని ఆవేదన చెందుతున్నారు. భూ సమీకరణ పూర్తి చేసిన ఒక్కో గ్రామానికి రూ.30 లక్షలను ప్రభుత్వం నుంచి నజరానాగా ఇప్పిస్తానని అప్పుడు చెప్పి ఇప్పుడు మొహం చాటేశారని టీడీపీ నేతలే భగ్గుమంటున్నారు. మంత్రి రావెలకు సొంతింట్లో తీవ్ర అసమ్మతి ఇక రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు సొంతింట్లో అసమ్మతి సెగ రోజురోజుకు తీవ్రంగా రాజుకుంటుంది. గుంటూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలు తోట లక్ష్మికుమారి మంత్రి రావెల తీరును బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. గత నెలలో జరిగిన జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో తన భర్తను సమావేశం నుంచి ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రి పంపించారనే కోపంతో మంత్రిపై ఆమె తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర రభస ఏర్పడి ఎంపీపీ, మంత్రివర్గీయులు ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. దీంతో మంత్రి రావెల సమావేశం నుంచి వెళ్లిపోయారు. తమను తీవ్రంగా అవమానించిన మంత్రి త్వరలో జరుగనున్న జనచైతన్య యాత్రలకు మండలంలో ఎలా తిరుగుతారో చూస్తానంటూ మంత్రికి నేరుగా సవాల్ విసిరారు. దీంతో తీవ్ర అవమానికి గురైన మంత్రి రావెల మండలంలో ఎంపీపీ లక్ష్మీకుమారి చెప్పే ఏ పనిని చేయవద్దంటూ ఆమెను అసలు ఎంపీపీగా పరిగణించాల్సిన అవసరం లేదని మండలంలోని అధికారులందరికి ఆదేశాలు ఇచ్చారు. ఈవిషయం తెలుసుకున్న ఎంపీపీ లక్ష్మికుమారి తీవ్ర మనస్థాపానికి గురై నవంబర్ 24వ తేదీన రాత్రి లాల్పురం గ్రామంలోని తన స్వగృహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వందల మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని మంత్రి రావెలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరాహార దీక్షకు మద్దతు పలికారు. -
చెప్పిందేంటి... మీరు చేస్తున్నదేంటి...?