'ప్రజల భూములతో వ్యాపారం చేస్తున్నారు' | yuva jana congress dharna at CRDA vijayawada | Sakshi
Sakshi News home page

'ప్రజల భూములతో వ్యాపారం చేస్తున్నారు'

Published Sat, Aug 22 2015 12:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

yuva jana congress dharna at CRDA vijayawada

విజయవాడ: రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వెంటనే ఆపి వేయాలంటూ విజయవాడలో యువజన కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. నగరంలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ వేష ధారణలతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

ప్రజల భూములతో టీడీపీ నాయకులు వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని నిలువరించారు. దీంతో రెండు వర్గాలు తోపులాడుకున్నాయి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement