విజయవాడ: విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట శుక్రవారం రాజధాని ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు ధర్నాకు దిగారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని, గ్రీన్ బెల్టు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లే అవుట్లు, ఇళ్ల ప్లాన్లకు అనుమతులు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు. రాజధాని కోసం 33 గ్రామాల ప్రజలను బలిపెట్టవద్దని కోరారు.