రాజధాని భూముల్లో మరో అక్రమాల బాగోతం బయటపడింది. ‘గ్రామకంఠాల’ ముసుగులో సాగుతున్న భూముల కుంభకోణం ఇది. ఊరిలో ఉమ్మడి అవసరాల కోసం కేటాయించే భూములను గ్రామకంఠాలుగా పిలుస్తారన్న సంగతి తెల్సిందే. అయితే అవి ఊరికి 50 మీటర్లలోపు మాత్రమే ఉండాలి. అవసరాన్ని బట్టి వాటిని పేదలకు ఇళ్ల కోసం కూడా కేటాయిస్తుంటారు. ఈ గ్రామ కంఠం భూములను అప్పట్లో ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించారు.