భూసేకరణ వేగవంతం
Published Sat, Oct 15 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే పనులు ముమ్మరం
సుమోటోగా విరాసత్‌ల స్వీకరణ
పౌరసరఫరాలపై సీసీ కెమెరాలతో నిఘా
కేజీబీవీల్లో డిజిటల్ తరగతులు
సామాజిక చైతన్యం కోసం కృషి
మౌలిక సౌకర్యాల కల్పనకు కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం
వివాహం అయ్యాక ఉద్యోగం వచ్చింది
జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా
సిరిసిల్ల : జిల్లాలో వారసత్వపు భూముల పేరు మార్పిడి (విరాసత్)ను సుమోటగా స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని, రైల్వేలైన్ కోసం భూసేకరణను వేగవంతం చేస్తామని జిల్లా జారుుంట్ కలెక్టర్(జేసీ) షేక్ యూస్మిన్‌బాషా తెలిపారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తామన్నారు. జేసీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె శుక్రవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
సర్వే పనులు ముమ్మరం..
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. సిద్దిపేట జిల్లా వరకు భూసేకరణ పూర్తరుుంది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో రైల్వేలైన్ నిర్మాణం కోసం జిల్లా పరిధిలో సర్వే, భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మధ్యమానేరు జలాశయం, సిరిసిల్ల ఔటర్ రింగురోడ్డు, వేములవాడ ఆలయ అభివృద్ధికి సైతం భూములు సేకరించాల్సి ఉంది.
కలెక్టరేట్ కోసం..
కలెక్టరేట్ నిర్మాణం కోసం అనువైన స్థలం ఎంపిక చేస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సూచన మేరకు అన్ని హంగులతో భవనం నిర్మిస్తాం. ఇందుకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. మా ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణపై పరిశీలన చేస్తాం.
సుమోటోగా విరాసత్‌లు..
తండ్రి, తల్లి పేరిట ఉన్న భూములను వారి వారసులు మార్పిడి చేసుకునే పనిని సుమోటగా స్వీకరించి ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. రికార్డులు లేకే చాలా సమస్యలు తలెత్తుతున్నారుు. ఈవిధానాన్ని సమూలంగా మార్చేందుకు క్షేత్రస్తాయిలోనే విరాసత్‌లు చేస్తాం. ఆన్‌లైన్‌లోనూ లోపాలు లేకుండా రికార్డులు సరిచేస్తాం. వీటితోపాటు 2016 పహణిలు మ్యాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
వీఆర్వోలకు శిక్షణ..
జిల్లాలోని విలేజీ రెవెన్యూ అధికారుల(వీఆర్వోల)కు రెవెన్యూ రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇప్పిస్తాం. రిటైర్డు తహసీల్దార్లు, వీఆర్వోలతో మెలకువలు నేర్పించేందుకు కలెక్టర్ సూచనల ద్వారా చర్యలు తీసుకుంటాం. తద్వారా వారిలో వృత్తి నైపుణ్యం పెంచుతాం.
పౌరసరఫరాలపై కెమెరాలతో నిఘా..
పౌరసరఫరాల గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సరుకులు పక్కదారి పట్టకుండా నిఘా పెంచుతాం. తూకంలో వ్యత్యాసం వస్తోందని ఫిర్యాదులు అందాయి. తూకం కచ్చితంగా వేసి రేషన్ డీలర్లు, పాఠశాలలు, వసతి గృహాలకు బియ్యం అందిస్తాం. ఇందుకోసం గోదాముల వద్దే వేరుుంగ్ మిషన్లు ఏర్పాటు చేస్తాం. ఆర్డీవో ద్వారా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను నియమిస్తాం.
కేజీబీవీ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు..
జిల్లాలోని కేజీబీవీ స్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రవేశపెడుతాం. సీఎస్‌ఆర్‌లో భాగంగా కార్పొరేట్ కంపెనీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. సామాజిక అంశాలపై దృష్టిసారించి ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. మూస విధానంలో కాకుండా కొత్తతరహాలో పాలన అందిస్తాం
వివాహమయ్యూక ఉద్యోగంలో చేరా..
మా సొంత ఊరు రంగారెడ్డి జిల్లా షేర్‌లింగంపల్లి. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మా నాన్న ఆర్మీలో పని చేయడంతో కేంద్రీయ విద్యాలయంలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదివా. మా ఆయన షేక్ ఇమామ్ హుస్సేన్ వ్యాపారం చేస్తారు. మాకు పాప, బాబు. వివాహం అయ్యాక నాకు ఉద్యోగం వచ్చింది. 2009లో గ్రూప్-1 ద్వారా డెప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరా. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఆర్డీవోగా, సంగారెడ్డిలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీస్‌గా పని చేశా. అక్కడి నుంచి జేసీగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వచ్చా.
Advertisement
Advertisement