విజయనగరం జిల్లా భోగాపురం మండలం పెదకవులవాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పెదకవులవాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూములను సర్వే చేయడానికి వచ్చిన అధికారులను స్థానికి ప్రజలు అడ్డుకున్నారు. భూ సేకరణకు సంబంధించిన విషయంపై కోర్టులో స్టే ఉండగా సర్వే ఎలా చేస్తారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.