ఎయిర్‌పోర్టు ప్లాన్ కోసం భోగాపురంలో ఓ కీలక నేత తెగ ప్రయత్నిస్తున్నారు. సీఎం ఆమోదించిన ప్లాన్‌ను తనకిచ్చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్లాన్‌ను పట్టుకుని దండుకునేందుకు ఆరాటపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవ హారాన్ని తనకు అనుకూలంగా మలచుకొని పెద్ద ఎత్తున వెనకేసుకునేందుకు ఆ మండ లా నికి చెందిన ఓ నేత పరితపిస్తున్నారు. ప్రభుత్వ పెద్ద అం డతో భోగాపురంలో ఆ నేత చక్రం తిప్పుతున్నారు. ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌లోకి భూములు కలపాలా, కలపొద్దా అన్నది తన చేతు ల్లో ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. తన ప్రమేయంతోనే కొందరి రియల్టర్లు, డెవలపర్ల( సన్‌రే, మిరాకిల్)భూముల్ని మినహాయించారని చెప్పుకుంటున్నారు. ఎయిర్‌పోర్టు బూచి చూపించి మిగతా రియలర్టర్ల వద్ద నుంచి సొమ్ము దండుకునేందుకు తీవ్రంగా య త్నిస్తున్నారు. దానికోసం సీఎం ఆమోదించిన ప్లాన్‌ను తన చేతుల్లోకి తెచ్చుకునేం దుకు ప్రయత్నిస్తున్నాడు.
ఆ ప్లాన్ తనకివ్వాలని సంబంధిత అధికారులపై తీవ్రం గా ఒత్తిడి చేస్తున్నారు. ప్లాన్ చేతికొచ్చాక ఎవరి భూములు మినహాయింపునకు గురవుతాయో తెలుసుకుని వారి వద్దకెళ్లి డబ్బులు గుంజేందుకు యోచిస్తున్నారు. దారికి రాకపోతే భయపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పెద్ద వాళ్ల తో ఒత్తిళ్లు కూడా చేయిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న అధికారి సైతం ప్లాన్‌ను ఆ వ్యక్తికి ఇవ్వమని ఆదేశించేలా చేశారు. ఆ పెద్దలకు కూడా వాటాలందనుండమే దీనికి కారణమని తెలుస్తోంది. కానీ, ఆ నాయకుని గురించి తెలిసిన అధికారులు ప్లాన్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే కొందరి వద్ద నుంచి వసూళ్లు చేశాడని, ఇప్పుడా ప్లాన్ ఇస్తే మరింతగా దండుకుంటాడని భావిస్తున్నారు.
నిఘావర్గాల ఆరా: ఎయిర్‌పోర్టు ప్లాన్ నుంచి భూముల్ని మినహాయిస్తానని నమ్మబలికి రూ.లక్షలు వెనకేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇప్పటికే అధికారులు పసిగట్టారు. దీంతో అతగాడి ఆటలు సాగనివ్వరాదని అధికారులు సైతం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే, దండుకోవడం మరిగిన ఆ ఘనుడు ప్లాన్ ఇవ్వకపోతే హైదరాబాద్ వెళ్తానని, అక్కడ నుంచి గట్టిగా చెప్పిస్తానని బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఎలా ఇవ్వరో చూస్తానని సవాల్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. కాగా, భూములు మినహాయింపు ముసుగులో వసూళ్లకు తెగబడ్డ వైనంపై నిఘా వర్గాలు ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ఆ నేతపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.
దండుకునేందుకు ప్లాన్!
Published Wed, Aug 19 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement
Advertisement